తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజనపూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్షసాక్ష్యం.
రచయిత వివరాలు
పూర్తిపేరు: కల్లూరి భాస్కరంఇతరపేర్లు: Kalluri Bhaskaram
సొంత ఊరు: ప్రక్కిలంక, ప. గో. జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాదు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరుకు దగ్గరలోని ప్రక్కిలంక. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. పత్రికారచయితగా వివిధ దినపత్రికలలో పనిచేశారు. కాలికస్పృహ, మరికొన్ని సాహిత్యవ్యాసాలు, కౌంటర్‌వ్యూ (ఆంధ్రప్రభలో రాసిన కాలమ్), అవతల (వార్తలో రాసిన రాజకీయ, సామాజిక వ్యాసాలు), గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం, లోపలి మనిషి (మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆంగ్లరచన ది ఇన్ సైడర్ తెలుగు అనువాదం), మోహన్ దాస్ (గాంధీ గురించిన రాజ్ మోహన్ గాంధీ ఆంగ్లరచనకు తెలుగు అనువాదం) వీరి ముద్రిత రచనలు. సారంగ వెబ్ మ్యాగజైన్‌లో ధారావాహికంగా రచించిన మహాభారత ఆధారిత వ్యాసాలు, ట్రాయ్‌లో తవ్వకాలు జరిపిన హైన్‌రిక్ ష్లీమన్ జీవితకథ, కౌంటర్‌వ్యూ రెండో భాగం, కథలు, మరికొన్ని రాజకీయ, సాహిత్యవ్యాసాలు అచ్చులో ఉన్నాయి.
కల్లూరి భాస్కరం రచనలు
భర్త క్షేమం కోసం భారతీయ గృహిణులు చేసే ఉపవాసాలు, వ్రతాలతో ఇక్కడ పోలిక సరే; ఆశ్చర్యం గొలిపే ఒక తేడా కూడా ఉంది. ఉపవాసాలు, వ్రతాల వెనుక వ్యక్తమయ్యే ఒక యాంత్రిక విశ్వాసానికి భిన్నంగా తనిక్కడ ఒక అన్నార్తుడికి అన్నం పెడితే, దయగల ఏ తల్లో తన భర్తకూ ఇలాగే అన్నం పెడుతుందన్న ఒక సరళమైన తర్కము, లౌకికంగా మన బుద్ధికి అందే ఒక హేతుబద్ధత మెలనీ మాటల్లో ఉన్నాయి.
ఆష్‌లీ, ధర్మారావుల మధ్య ఇక్కడ కనిపించే మరో పోలిక ఏమిటంటే, ఇద్దరికీ ‘అందరినీ సమానుల్ని’ చేసే పరిణామస్వభావం పట్ల సానుకూల అవగాహన లేదు. అంతవరకూ తను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కొద్దిమంది మిత్రులతో తనదైన భావనాత్మక ప్రపంచంలో జీవించిన ఆష్‌లీ, యుద్ధం వల్ల తనతో ఎలాంటి సారూప్యత లేని మనుషుల మధ్య గడపవలసి వచ్చినందుకు బాధపడతాడు. ధర్మారావులోనూ అడుగడుగునా శిష్టత-సామాన్యతల వివేచన వ్యక్తమవుతూనే ఉంటుంది.
విశ్వనాథవారి వేయిపడగలు నవలను, మార్గరెట్ మిచల్ నవల గాన్ విత్ ద విండ్ రెండూ ఇంచుమించు ఏక కాలంలో వెలువడినవే కాని, రెండింటి భౌగోళిక తాత్విక నేపథ్యాలు వేరు. ఒకదానిది భారతీయ నేపథ్యం, ఇంకోదానిది అమెరికన్ నేపథ్యం. అలాంటిది, వాటి మధ్య పోలికలు ఒక ఆశ్చర్యమైతే, ఆ పోలికలలో కొన్ని తేడాలూ అంతే ఆశ్చర్యం.