ఈమాట పాఠక లోకానికి స్వాగతం!
సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు, ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.
కొలిచాల సురేశ్
చామర్తి మానస
సత్తెనపల్లి సుధామయి
అవినేని భాస్కర్
విజయ జ్యోతి
ఇంద్రగంటి పద్మ
(సంపాదకులు)
ప్రశాంతి చోప్రా
(ఆడియో, వీడియో విభాగం,
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా)
మాౘవరం మాధవ్
(ఈమాట నుండి స్వల్ప విరామం)
[విశ్రాంత సంపాదకులు: కె. వి. ఎస్. రామారావు, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న, వేలూరి వేంకటేశ్వర రావు, శంకగిరి నారాయణస్వామి, శంఖవరం పాణిని, గాలి త్రివిక్రమ్, భైరవభట్ల కామేశ్వరరావు]