1.
“మాటకు కట్టుబడుంటావా?”
అడిగాను, ఒక మాటకున్న అర్థాన్ని.
“ఎలా?
ఏమాటకు?
చాలా మాటలకు నేనే అర్థాన్ని.”
ఏమాటకు?
చాలా మాటలకు నేనే అర్థాన్ని.”
ఆహా!
పతివ్రతా శిరోమణి ద్రౌపది గుర్తుకొచ్చింది.
పతివ్రతా శిరోమణి ద్రౌపది గుర్తుకొచ్చింది.
-2-
“ఒక మాటకు ఒకే అర్థంగా కట్టుబడి ఉంటాయా?”
అని – అడగ బోయాను ఒక సివిల్ జడ్జీ గారిని.
అని – అడగ బోయాను ఒక సివిల్ జడ్జీ గారిని.
పోలీసువాడొకడొచ్చి లాఠీ ఝళిపిస్తూ
“మీరిక్కడికి రాకూడదెళ్ళిపోండి!”
“మీరిక్కడికి రాకూడదెళ్ళిపోండి!”
ఐదో తరగతిలో ఆయన అనుమతి తీసుకోకుండా
ముందు రోజు క్లాసులో ఒంటేలుకు వెళ్లినందుకు
ఆ మర్నాటి క్లాసులో నన్నూ, రాయన్న గాణ్ణీ
ఇంటి పేర్లతో సహా పూర్తి పేర్లు పెట్టి పిలిచి
పేము బెత్తంతో పిఱ్ఱల మీద వడ్డించిన
తెలుగు పంతులుగారు గుర్తొచ్చారు.
ముందు రోజు క్లాసులో ఒంటేలుకు వెళ్లినందుకు
ఆ మర్నాటి క్లాసులో నన్నూ, రాయన్న గాణ్ణీ
ఇంటి పేర్లతో సహా పూర్తి పేర్లు పెట్టి పిలిచి
పేము బెత్తంతో పిఱ్ఱల మీద వడ్డించిన
తెలుగు పంతులుగారు గుర్తొచ్చారు.
-3-
మరొక రకంగా ప్రయత్నిద్దామని …………
ఎప్పుడో పాతికేళ్ళ క్రితం —
“మా అవిడ చేస్తుంది కూర –
దాని అసలుపేరు క్రూర”
అని రాసి ఆమె తమ్ముడికి వినిపించానని
ఇప్పటికీ గాస్ సిలిండర్ మార్చటానికైనా
నన్ను వంటింట్లోకి రానీయనావిణ్ణి
నా ఆవిణ్ణి
ఆ రోజు ఆదివారం ముందు గదిలో నుంచుని
“ఒకసారిటొస్తావా?”
ఎప్పుడో పాతికేళ్ళ క్రితం —
“మా అవిడ చేస్తుంది కూర –
దాని అసలుపేరు క్రూర”
అని రాసి ఆమె తమ్ముడికి వినిపించానని
ఇప్పటికీ గాస్ సిలిండర్ మార్చటానికైనా
నన్ను వంటింట్లోకి రానీయనావిణ్ణి
నా ఆవిణ్ణి
ఆ రోజు ఆదివారం ముందు గదిలో నుంచుని
“ఒకసారిటొస్తావా?”
ఆవిడ వంటగదిలో
నాకు అందులో ప్రతి మాటా బూతుగానే వినపడే
కొత్త తెలుగు సినిమా పాట పాడుకుంటూ
పులుసునో పులిహోరనో కలియబెడుతున్న గరిటతో వచ్చి
“దేనికి?”
నాకు అందులో ప్రతి మాటా బూతుగానే వినపడే
కొత్త తెలుగు సినిమా పాట పాడుకుంటూ
పులుసునో పులిహోరనో కలియబెడుతున్న గరిటతో వచ్చి
“దేనికి?”
“ఈ వేళ ఆదివారం కదా
ఒకటడుగుతాను, చెబుతావా?”
ఒకటడుగుతాను, చెబుతావా?”
ఆవిడ
చీమలబారు లాంటి చిరునవ్వొకటి నవ్వి –
“నీకిష్టమైన ‘చపాతీ కూర్మా చేస్తున్నానా?’ అనేనా?”
“అహ! కాదు!”
“మరి?”
“కాదంటే ఔననేనా?”
ఆవిడ చేతి గరిట నాకిచ్చి
చీర కొంగుని పైకి దోపుకుని
“మిగతా వాళ్ళ సంగతి
నాకు తెలీదు గానీ
మీ లెక్కలవాళ్ళకు మాత్రం —
చాలా సందర్భాల్లో–
కాదంటే ఔననే!
ఉండనే ఉన్నది గదా!
రిడక్టిఓ ఎడ్ అబ్సర్డియం [reductio ad absurdum]”.
చీర కొంగుని పైకి దోపుకుని
“మిగతా వాళ్ళ సంగతి
నాకు తెలీదు గానీ
మీ లెక్కలవాళ్ళకు మాత్రం —
చాలా సందర్భాల్లో–
కాదంటే ఔననే!
ఉండనే ఉన్నది గదా!
రిడక్టిఓ ఎడ్ అబ్సర్డియం [reductio ad absurdum]”.
మా కాలేజీలోనే
ఇద్దరు విద్యార్థినులు
మాత్రమే ఉన్న
ఫిలాసఫీ డిపార్ట్మెంటులో
ఈవిడ విజిటింగ్ లెక్చరర్ అని
గుర్తొచ్చేసింది.
జ్ఞాపికలు
1. Reductio ad absurdum:
G. H. Hardy described proof by contradiction as “one of a mathematician’s finest weapons”, saying “It is a far finer gambit than any chess gambit: a chess player may offer the sacrifice of a pawn or even a piece, but a mathematician offers the game.”
Hardy, G. H. (1992). A Mathematician’s Apology. Cambridge University Press. p. 19
2. “ఔనంటే కాదనిలే -కాదంటే అవుననిలే ” పింగళి పాట విజయావారి ‘మిస్సమ్మ’ లో