అలారం ముళ్ళు గుచ్చుకున్న
మెత్తని నురగలాంటి గతం
సొరుగులోంచి జారిన జ్ఞాపకాలతో
జీవితం పునశ్చరణ
అప్పుడెప్పుడో ఆవిరైన అత్తరు
కురుస్తోందిపుడు ఆటవిడుపుగా
కడలి అంచున నించున్నా
ఉప్పగా, నీటి శ్లోకంలా
కంటిదొన్నె కంపనంతో
పోటెత్తిన పతనాశ్రువులు
హృదయస్థమైన దృశ్యాల్లో
ఉంటారందరూ పదిలంగా
నిన్న, నేడు, రేపేగా
కాల వ్యాకరణమంటే