తోటి విద్యార్థుల
స్నేహితుల ఫోటోలు కనిపిస్తే
ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు,
ఎవరున్నారు, ఎవరు లేరు
అన్నీ ప్రశ్నలే!
అయినా
ఫోటోలు లేని
ఆల్బమ్‌లో చేరని ఎందరో
ఎదురెదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఈదిన చేపలు
కాస్త దూరానికే ఒకదాన్నొకటి కోల్పోయినట్టు
జీవితంలో ఎప్పటికప్పుడు
ఎందరిని కోల్పోయామో
కోల్పోతూనే ఉన్నామో