అద్దాల మేడ కాదు
చెట్టుకింద నీడ.
బంగారు గంగాళమేం కాదు
చిన్న మట్టి కుండ.
సంవత్సరాలు కుళ్ళబెట్టిన
ఖరీదైన మందూ కాదు
బాటిల్లో దాచితెచ్చిన
హిమాలయాల నీరూ కాదు.
మున్సిపాలిటీ కుళాయి నీరు.
నిండు ఎండలో
నీరు కుండే ఆస్తి
కుండ పెట్టినోడే
కుబేరుడు.
గ్రీష్మ ఋతువులో
అమృతం గొంతులో
వాడి దయే.
అతని గొంతులో
అసలైన అమృతం
కోరిక నాకదే.