కనురెప్పలు మూతపడి
మళ్ళీ తెరుచుకున్నట్టుగా
స్టార్‌బక్స్ తలుపులు
మంచు తుఫాను దాడులకు అడ్డుగోడలై
గెట్ ఇన్ గెట్ ఇన్!
థాంక్ యూ!
బ్రూటల్ ఔట్ దేర్ హాఁ?!
ఓహ్ యా. డెడ్లీ స్టార్మ్.
స్టే వార్మ్!
ఎన్ని అర్థాలు
ఒక్క మాటలో
ఇదిగో వెచ్చదనం
అదిగో ప్రపంచం
ట్రైన్ స్టేషన్ రివాల్వింగ్ డోర్
క్షణానికొక మనిషిని పుట్టిస్తూ
హార్వర్డ్ నెక్స్ట్ స్టాప్!
బోస్టన్ చలి దాడులు
జీవితపు లోతుల్ని తీసి
మొహాల మీద
నిస్సహాయపు నవ్వులు పులిమి పోతాయ్.
గడ్డకట్టిన జీవితాలు
మాటలు మర్చిపోయి
ప్రేమలు కరువై
అరచేతులు రుద్దుకుంటూ
గొంగళ్ళు కప్పుకున్న
మానవాళి ఆనవాళ్ళు.
ట్రైన్ స్టేషన్ బయటకొచ్చి చూస్తే
ఎలక్ట్రానిక్ బిల్‍బోర్డుపై
బోర్లా పడుకుని
నవ్వులు చిందిస్తూ
నెలల పిల్లాడు.
నెలల పిల్లాడి పిర్రలు
మనుష్యుల మనస్సులు.
డైపర్స్ అండ్ మెమొరీస్
మరొక్క దానికి చోటు ఎపుడు ఉంటూనే ఉంటుంది.