[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఇంకోరకం శిరచ్ఛేదం. రూపొందే పువ్వు
సమాధానం: కోరకం
- మనిషికి కాకుంటే మానుకా?
సమాధానం: అగచాట్లు
- పాశ్చాత్యులకి అరిష్ట సూచకం
సమాధానం: పదమూడు
- నడుంలేని నాణెం
సమాధానం: పాలా
- మరో హిరణ్యాక్షుడి చిరునామం
సమాధానం: మహి
- నామాలతో దస్తావేజాలు
సమాధానం: వీలు
- తినగ తినగ తీయన
సమాధానం: వేపాకు
- దీనికి లేనిది ఇంకోదానికా?
సమాధానం: కంద
- అహింసావాదులకు అక్కరలేనిది
సమాధానం: చాకు
- ఉదాహరణకు తిక్కన
సమాధానం: మఖి
- అతిశయం
సమాధానం: లీవ
- ఉండడానికి చోటు
సమాధానం: వసతి
- ఆరు నిలువు
సమాధానం: కడు
- మద్యం (దేవతలకా?)
సమాధానం: సుర
- ఆఫ్రికాలో ఒకదేశం
సమాధానం: కెన్యా
- తెనాలి రామన్న వెక్కిరించిన పెద్దన ప్రయోగం
సమాధానం: అమవసి
- అవతార పురుషుని ఆయుధం
సమాధానం: పరశువు
- మణివిశేషం
సమాధానం: మసారం
నిలువు
- పరమేశ్వరునితో పార్వతి
సమాధానం: సగపాలు
- కోటాను కలిపి లెక్కకు మిక్కిలి
సమాధానం: కోట్లు
- అనుబంధంతో జాలి
సమాధానం: కంప
- గుంపుతో సంబంధించినది
సమాధానం: సామూహికం
- లేక, ఇంకా కావాలా?
సమాధానం: చాలా
- రెండు సంగీత స్వరాలు
సమాధానం: దమ
- కట్టడం అంటే మరణం
సమాధానం: టపా
- గాలి
సమాధానం: వీషలీ
- అనుదినం నవోదయం
సమాధానం: వేకువ
- సుమతి శతకం ఇతడు చదవకూడదా?
సమాధానం: కుమతి
- తీస్తే పరుగు చేస్తే దాడి
సమాధానం: దవుడు
- రత్నగర్భ
సమాధానం: వసుమతి
- జవాబడిగేది
సమాధానం: సవా
- అంతమించిన దురాచారం
సమాధానం: కన్యాశుల్కం
- ఆమ్రేడితంలో పోటీ
సమాధానం: రవ
- మద్దితో ఒక వూరు
సమాధానం: కెర
- ఏడాది
సమాధానం: సిమ
- ఇకమీద రెండులేని మూడోయుగం
సమాధానం: పరం