రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

రత్తి పాటలు

రచన: మంచెం బి జనార్దనరావు
డిసెంబర్ 2021

రత్తి:
సలి మంటకాడ
పదిమందిలోన
కనుగీటినావేటిరో
మావ పరువేటి కావాలిరో
మావ పరువేటి కావాలిరో

ఊరంటే ఏటిరా – నోరెట్టి పడతాది
ఇంతంటె అంతని – ఇంతగా సెపుతాది

పేమంటె ఏటో – పేమ జంటెరుగురా
ఎరగలేనోళ్ళకి – పేమంటె పిచ్చిరా

పెళ్ళయ్యే దాక కొంత గుట్టుగా ఉండరా
పెళ్ళయ్యిపోతే మనకడ్డేటి ఉందిరా

రత్తి:
ఏకటాకీ చూడకు
ఎర్రోడి వవ్వకు
నాపేరే పాడకు
ఎల్లడిరా, వాడకు

నిన్నంటి వుందునే ఏసేనం
నీకంటి ఇంటనే కాపరం
నీ ఊసులే నాకు ఊపిరి
నీతీపి తలపులే రేతిరి

కూడు తినేటేల, కూలి చేసేటేల
కూకున్న ఏల, నిలుసున్న ఏల
నాగుండెల్లో నీవెపుడు నిలిసేవురా
గుండెల్లో గొంతెత్తి పిలిసేవురా!

మావ:
కునుకు రాదేరత్తి కూడదంటేను
కోక కొంటానే ఒప్పుకుంటేను
రత్తి:
కొన్నాన కోకను? కట్టేన కోకను?
పెట్టావు లేవోయి మా గొప్ప లంచము
మావ:
తిరము లేదే రత్తి తిప్పి కొడతేను
తిలకాన్ని కొంటాను ఒప్పుకుంటేను
రత్తి:
కొన్నాన తిలకాన్ని? దుద్దేన నా నుదుట?
పెట్టావు లేవోయి మా గొప్ప లంచము
మావ:
పగలు రాదె రత్తి పట్టనీకుంటేను
పట్టీలు కొంటాను ఒప్పుకుంటేను
రత్తి:
ఏ ఇంటిగోడకు ఏసావు కన్నము
నాకొద్దు బాబోయి నీ దొంగనగలు
మావ:
దొంగోడి నైతేను దోచి పారేత్తాను
దిక్కెవ్వరే నీకు మొక్కెవ్వరే నీకు
దిక్కెవ్వరే నీకు మొక్కెవ్వరే నీకు
రత్తి:
దిక్కు మొక్కులు రెండు ఎదురున్న నీవు
ముట్ట కూడదు నన్ను తెలిసింద మావ

[పూర్తి పుస్తకం గ్రంథాలయంలో చదవండి. పిడిఎఫ్ ప్రతి ఇక్కడ లభిస్తుంది.]

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    మంచెం విజయలక్శ్మి - రచయిత కుమార్తె December 4, 2021 3:01 pm

    రచయిత : కీ.శే. మంచెం బి జనార్దన రావు(1955-2021)
    రచనా కాలం: 1974
    స్వస్థలం: కాకినాడ
    ఇతర రచనలు: ప్రత్యూష, హిమసుమాలు, సిరిమువ్వల చిరుసవ్వడి

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రత్తి పాటలు (ఈ-పుస్తకం)
  • రత్తి పాటలు
  • రత్తి పాటలు

ఇటువంటివే…

  1. రత్తి పాటలు
  2. రత్తి పాటలు (ఈ-పుస్తకం)
  3. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు
  4. గింగిర్లు తిరుగుతున్న పాటలు
  5. ఉగాది పాటలు

డిసెంబర్ 2021 సంచికలో ...

  • Humoreske
  • WhatsApp: నాలుగు కవితలు
  • అడవిలో లేడిపిల్ల
  • ఆమెకు దయలేదు
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 2
  • ఉత్తర మొరాకో శోధనలు 1
  • ఊహల ఊట 7
  • ఏనుగు డాక్టర్
  • గడినుడి – 62
  • డిసెంబర్ 2021
  • తీరనిది
  • పునరపి కుసుమం
  • బీబీ తోరీ కల
  • రత్తి పాటలు
  • విశ్వమహిళానవల 13: జార్జ్‌ సాండ్
  • శ్రీపాద వారి నవలలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 62
  • హియర్ అండ్ దేర్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రత్తి పాటలు
శ్రీపాద వారి నవలలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.