రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఒణుకు

రచన: స్వాతి శ్రీపాద
సెప్టెంబర్ 2021

ఇప్పుడు ఈ పాలపుంత దారుల్లో
కాలూనక ముందు
ఉనికిని పంచరంగుల పతాకంలా మార్చి
ఎవరిని వారు అంబరాన రెపరెపలుగా మార్చుకుందుకు
ఎన్ని సముద్రాలు గుక్క తిప్పుకోకుండా
ఆసాంతం తాగేసి ఉండవచ్చు!
ఎన్ని బాధలు
సొదలుసొదలుగా గుసగుసలుపోయి ఉండవచ్చు!

నిద్రలో నడుస్తున్న జీవితాలు
గుండె గుప్పిట్లో దాచుకు
నవ్వుల మధ్య ఉక్కిరిబిక్కిరయే శ్వాసను
అదలిస్తూ, కదిలిస్తూ ఒకరినొకరు తొక్కేస్తూ
పల్లకీల్లో ఊరేగిన గతాన్నీ గతవైభవాన్నీ నిజాయితీనీ
అవినీతి ఉక్కు పాదాల కింద
కర్కశత్వం మట్టిపొరల మధ్య
సజీవ సమాధి చేసి చిద్విలాసాల మధ్య
ఊరేగుతున్న తరం

నమ్మలేం కదూ
ఎవరిలో వారు గజగజలాడూతూ
సమయానికి ఎదురీదడం
ఎవరికి వారు మౌనంగా
గతం మరోసారి పునశ్చరణ గావించడం
నమ్మలేరు తీసిపారేసిన గడ్డిపరక నమ్మకం
సంభవామి యుగేయుగే అంటూ
కుత్తుకల మీద కత్తినుంచి
అదలించే రోజు వస్తుందని
అధికారదర్పం పీడించి పాలించి
గాదెల్లో నింపుకున్న పీడిత ధనం
ఒక నిమిషం ఆయువునూ
ఒక గాలితెమ్మెరనూ అందించలేదని
స్వయంకృతాపరాధం ఒకటి
అదృశ్యంగా యావత్ పంచాన్ని ఒకతాటిపైకి
లాగేస్తుందని
నమ్మలేం
అయినా చేసుకున్న వారికి చేసుకున్నంత!

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కలల మైకంలో
  • నువ్వే నేననీ…
  • ఒణుకు
  • మాటల అక్షరాలు
  • ఎప్పటికి తెలుస్తుంది?

ఇటువంటివే…

  1. ఎవరిలో ఎవరో
  2. మలిసంధ్యవేళ
  3. రంగులు
  4. బండిసున్నా
  5. వ‌ల‌పు వ‌ల‌

సెప్టెంబర్ 2021 సంచికలో ...

  • ఊహల ఊట 4
  • ఒణుకు
  • కేతన ఆంధ్ర భాషాభూషణము-8
  • గడినుడి – 59
  • టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్
  • తొలిపువ్వును నేనే అనుకొని
  • నలుగురు యాత్రికులు: ఒకే పిపాస
  • బండిసున్నా
  • మలిసంధ్యవేళ
  • యమునలో మునక
  • విశ్వమహిళా నవల: 11. రష్యన్ బ్రాంటీలు
  • విషాద నగరం
  • వ‌ల‌పు వ‌ల‌
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 59
  • సంకల్పం-సంభవం
  • సెప్టెంబర్ 2021
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

సంకల్పం-సంభవం
విషాద నగరం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.