రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కూడికకు రొండుపక్కల

రచన: బండారి రాజ్ కుమార్
అక్టోబర్ 2019

1.

బైలెల్లుడుకే తీర్మానం జేసుకున్నంక వత్తవత్త ఇంటిని కాలబెట్టి అడుగు బైటపెడుతం. తిరిగి వచ్చేదన్క ఇంటి కుంపటిల కుతకుత ఉడికిపోతయి లోపలి పానాలన్నీ! మంటపెట్టందే సందు దొరకదు. ఆత్మీయంగ అల్లుకున్న ప్రేమపాశం తీగలన్నీ కాళ్ళకు అడ్డంబడుతయి. బెల్లంగొట్టిన రాయిలెక్క ఒక్కకాన్నే వుండలేనితనం. కాలు నిలువదు. తెగదెంపులు జేసుకున్నంత పనైతది.

2.

తొవ్వపొడుగూత బోతాంటె కలవబోయే ఆరాటాలను మంచానికి నులకనల్లినట్టు వొడుపుగ ఇగురంతోటి మ్యానిఫెస్టో తయారై మెడకోలు బరువైతది. గున్నగున్న నడ్శి బిన్నబోయినా సుత భారీ బహిరంగసభల రాజకీయ నాయకుడి ఆగమనం తీరైతది. వాడిపోవడానికి తయారుగున్న పువ్వుల్లా సోపతిగాళ్ళు ఎదుర్కోల్ల మతాబులు పేల్చి అలాయ్ బలాయ్ దీసుకుంటరు. మందలిచ్చె తీరుగ మందలిచ్చి ఇంకోపాలి తీరుబడి యవ్వారం కూడదని మాట దీసుకుంటరు.

3.

ఎప్పుడు మాటల బుడుగులో దిగబడిపోతమో అస్సలు పెయి మీద సోయి వుండదు. మొగలి పొట్టెల కమ్మటి వాసనల్ని గుండెల నిండుగ నింపుకుంట కాలపరీక్షకు హాజరై ఎదురు నిలబడతం. పొంటెలు పొంటెలు ముచ్చట్లల్ల మునిగి బతుకు గొప్పదనం మీద దీర్ఘకావ్యాలల్లి పాడుకుంట సాగిపోతనే వుంటం. గిందుకే గద గంటలు గంటలు తీరుబడిగొచ్చే దోస్తుకోసం ఆగమాగమై సందులు గొందులు కలెదిరిగింది! బీరపువ్వు నవ్వులకోసం పెయ్యంత కండ్లేసుకుని కొత్త సాలుకు ఎదురుసూశినట్టు ఎంత సంబురం! ఎంత ఉత్కంఠ!

4.

ఇంటిబెల్లు గొట్టిన సూరన్న ముసుగుదన్ని పన్నంక సుత ఒడ్వని ముచ్చట్లే కాపలాగాత్తంటయి. పిట్టలు రాయబారం మోసుకొచ్చే యాల్లయితాంటది. ఆడిబిడ్డను అత్తగారింటికి సాగదోలినట్టు మనసంతా ఒకటే బుగులైతాంటది. ఒక్కొక్కలుగ తలో తొవ్వబట్టుకుని బోతాంటె బడిల వీడ్కోలు సమావేశం యాదికొత్తది. కండ్లనీళ్ళొత్తుకునుడే దక్కువ.

5.

ఇల్లుజేరేటాల్లకు ఏ నడిజాము రాతిరైతదో దెల్వదు. అప్పటికే కర్ఫ్యూ కొనసాగుతున్న ప్రాంతమది. అల్లర్లు జరిగే అవకాశమున్నందున పైలంగుండమని ఆకాశరామన్న సంకేతాలు అందుతయి.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • Replica
  • దందెడ
  • కూడికకు రొండుపక్కల
  • హోమ్ సిక్
  • పాయిరం

ఇటువంటివే…

  1. ఒక్కసారి నాకోసం
  2. మళ్ళీ కొత్తగా…
  3. శాన్ డియేగో కొండల్లో…
  4. భరోసా
  5. వంతెన

అక్టోబర్ 2019 సంచికలో ...

  • అక్టోబర్ 2019
  • ఆడియో రూపకం: మాట మౌనం
  • ఆత్మకథలు: 3. తోచనాట
  • ఒక్కసారి నాకోసం
  • కూడికకు రొండుపక్కల
  • గడినుడి – 36
  • చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3
  • థాయ్‌లాండ్ యాత్రాగాథ – 3
  • ప్రాణంతో చెలగాటం
  • బార్న్ టు ఫ్లయ్
  • భరోసా
  • మంటో కథలు: సియా హాషియే 3
  • మళ్ళీ కొత్తగా…
  • వంతెన
  • శాన్ డియేగో కొండల్లో…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  • స్టకాటో
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ప్రాణంతో చెలగాటం
స్టకాటో

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.