రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కాళీ పదములు

రచన: పాలపర్తి ఇంద్రాణి
జులై 2018

1.

నల్లని గంగ
గొంతుకలో ఊగే
నాలిక

పంచవటి శిఖలో
రెప్ప వేయని
కన్ను

సుదూర నిశిలో
పరుచుకున్న
కురులు

బేలూరు మఠం
మెట్ల మీద
కూర్చున్న
ఛాయ

దక్షిణేశ్వర్
గర్భగుడి వైపు
చీకటి ముసురులో
ఉండి ఉండి
వినిపించే
గజ్జెల చప్పుడు

కాళి.

2.

నీడ నీడలో
కరిగిపోయి
చీకటి రేగుతున్న
రాత్రి

దొడ్డి దోవ
దొంగల్ని తరిమి
తల్లో
తుమ్మెదలకు
మత్తు మందు తాగించి

లోకపు పచ్చి వాసనలను
కప్పి పెడుతున్న
రాత్రి

కన్ను పొడుచుకున్నా
కానరాని చీకట్లలో
కరుకు గొంతుకతో
గాలి హూంకరిస్తున్న
రాత్రి

వేయి చేతులతో
ఆద్యా శక్తిని
ఆవహించుకుని
వేయి రేకులుగా
విచ్చుకుంటున్న
రాత్రి

మనో యవనికపై
కాళీ నర్తనకై
నాల్క సాచిన
రాత్రి

నీడ నీడలో
కరిగిపోయి
చీకటి రేగుతున్న
ఈ రాత్రి.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Subrahmanyam July 1, 2018 6:40 am

    అద్భుతం!!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మణికర్ణిక
  • దైవం
  • ఇంట్లో ఎవరూ లేరు
  • రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది
  • మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి

ఇటువంటివే…

  1. కాళీ పదములు 5
  2. కాళీ పదములు 3
  3. కాళీ పదములు-6
  4. కాళీ పదములు 2
  5. కాళీ పదములు 4

జులై 2018 సంచికలో ...

  • 1 + 1
  • ఒక ఆషాఢపు రాత్రి
  • ఒక ప్రయాణం
  • ఒక శిల్పి అంతిమ యాత్ర
  • కథ
  • కథలు చెప్పే అతను
  • కాళీ పదములు
  • కొత్తనేలపాట
  • గడినుడి – 21
  • జీవితానందం ఎక్కడున్నది?
  • జులై 2018
  • నటనకు గీటురాయి
  • నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు
  • పది నిముషాలు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 2
  • విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 21
  • సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు
  • సిలబస్: 5. బొమ్మ ఎందుకు?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పది నిముషాలు
బేతాళ కథలు: కథన కుతూహలం – 2

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.