గడినుడి – 41 సమాధానాలు

అడ్డం

  1. ఇది వారి పని. కానీ, అచ్చును కోల్పోయి అతలాకుతలమైంది కనుక, వాద్యపరికర రూపమెత్తింది (5)
    సమాధానం: పరివాదిని
  2. చేపలు పట్టే ఉపకరణాన్ని లోపల దాచుకున్న జంతువు (3)
    సమాధానం: సృగాలం
  3. ఇటువంటి జీతాలు పూర్తిగా సరిపోవు కనుక, చాచా! లీలని మార్చాలి (5)
    సమాధానం: చాలీచాలని
  4. కక్ష యావత్తు చేరితే వచ్చే ఈ ప్రయాణమార్గం రోదసిలో ఉంటుంది (2)
    సమాధానం: కక్ష్య
  5. కుడినుండి ఎడమకు అసంపూర్ణమైన లావా హక్కు ఓ స్కాము లాంటిది (3)
    సమాధానం: హవాలా
  6. ఈ మొత్తం లేఖినితో కూడుకున్నదా? (3)
    సమాధానం: సకలం
  7. అనుస్వారసహితమైన వేణి చైతన్యము లేనిది (2)
    సమాధానం: జడం
  8. తీరిక లేనితనాన్ని సూచించే మాట కోసం తన కలము పరిణామం చెందాలి (5)
    సమాధానం: తలమునక
  9. గజిబిజి కతల వైక్లబ్యము (3)
    సమాధానం: కలత
  10. సరిగ్గా గిల్లం, కూరము. ఫలితంగా వచ్చేది ఒక వ్యంజనం (5)
    సమాధానం: ముల్లంగికూర
  11. అస్తవ్యస్తంగా కరిచే దీన్ని సంగీతకళాకారులు చేస్తారు (3)
    సమాధానం: కచేరి
  12. పుష్పానివి కనుక, ఎటు చూసినా పుష్కలమే! (3)
    సమాధానం: విరివి
  13. పరిష్కారం చెప్పు (2, 3)
    సమాధానం: తీర్పునుడువు
  14. ఆనందం అసంపూర్ణమై తుట్టితో కలిస్తే, తిట్టుకు పనికొచ్చే పదం దర్శనమిస్తుంది (5)
    సమాధానం: ముదనష్టము
  15. కత్తులను తిప్పితే కన్నులకు పెట్టుకునేది ప్రత్యక్షం! (3)
    సమాధానం: లత్తుక
  16. అచ్చు తర్వాత వదనం ముందుమాట లాంటిది (3)
    సమాధానం: ఆముఖం
  17. సాఫుగా ఉన్న లుక్కులే చిల్లర కాని చివరల నడుమ కుదురుకున్నాయి (3, 2)
    సమాధానం: చిక్కులులేని
  18. అద్దం కోసం సోది లేని సోముకు రంది (3)
    సమాధానం: ముకురం
  19. పతకం మలిచి, ఇలా పని చేయిస్తారు కొందరు! (3, 2)
    సమాధానం: మెడలువంచి
  20. తెలుగులో కాంక్షించం కాబట్టి, ఇంగ్లీషులో ఇది లేకుంటే సమావేశం జరగదు బహుశా! (2)
    సమాధానం: కోరం
  21. పురస్కారం నగరపాలక ప్రాంతవిభాగం కానిదా? (3)
    సమాధానం: అవార్డు
  22. గానం చేయుట చెడ్డ అట! (3)
    సమాధానం: పాడుట
  23. సురుడు చేరితే అసురునికి జన్మనిచ్చే అనంతమైన అప్పు (2)
    సమాధానం: బకా
  24. నిశ్చలంగా వుండు. కచ్చితమైన ప్రారంభానికి ముందు సరిదిద్దాల్సింది మాల కద! (5)
    సమాధానం: కదలమాక
  25. అనుకూలతను సూచించే మంచి వదనం (3)
    సమాధానం: సుముఖం
  26. పోపు యిచ్చిన సవరణతో ఏర్పడేది కొన్ని ఫలాల విశేషణం కావచ్చు (5)
    సమాధానం: పుచ్చిపోయిన

నిలువు

  1. పరామర్శ లాంటిది లయతో తరింపక తోయలేదు. కాని, సరైన క్రమంలో దర్శనమిచ్చింది (5)
    సమాధానం: పలకరింత
  2. వర్షం అప్పుభాగం పోయిన నవారుణ తిరుగుబాటు (2)
    సమాధానం: వాన
  3. ప్రబంధంలోని బొట్టువర్ణన కోసం వాలిని కడు మార్పునకు గురి చెయ్యాలి (5)
    సమాధానం: నిడువాలిక
  4. పాటల రాణి అనగా కోలకి శీర్షరహితంగా సర్దుబాటు (5)
    సమాధానం: గానకోకిల
  5. మిస్టర్ చారి గారి పెన్ను చూపించే దాసీలం (5)
    సమాధానం: చారికలము
  6. ఇంగ్లీషువారి నోరు హిందీవారికి తెలుగులో ఏమిటి? (2)
    సమాధానం: చావు
  7. సాదాసీదాగా వున్న బరడం రాని పునస్సంయోజనం (5)
    సమాధానం: నిరాడంబర
  8. చెల్లాచెదరైన రాముని మనుమలు దౌహిత్రి కూతురును ప్రత్యక్షం చేయిస్తారు (7)
    సమాధానం: మునిమనుమరాలు
  9. మొదట అంగీకరిస్తూ షర్టును తీసెయ్యాలి. తర్వాత మిగిలినదాన్ని తారుమారు చేసి ఒక మృగాన్ని తీసుకురావాలి (3)
    సమాధానం: కస్తూరి
  10. వినత చేసిన తిరుగుబాటు ఫలితంగా ఏర్పడేవి మనవి కావు, ఆమెవే (3)
    సమాధానం: తనవి
  11. తగిలిన కిరాతకాలు కాతను పోగొట్టుకుని కకావికలయినయ్. ఫలితంగా వచ్చిన ఇవి గంభీర రచనలులు కావు (4, 3)
    సమాధానం: గిలికినరాతలు
  12. ప్రతీ కవిగారు ఇందులో ఉన్నదాన్ని ఒక్కసారైనా వాడుతారు బహుశా (3)
    సమాధానం: ప్రతీక
  13. కైతగాళ్ళ కోసం ఉన్నావు తికమకగా (3)
    సమాధానం: కవుల
  14. తల మారిన 42 అడ్డం వైరుధ్యాన్ని సూచిస్తుంది (3)
    సమాధానం: విముఖం
  15. సీతాపతి పాము తోకకు ఇరువైపులా రాడు! (3)
    సమాధానం: రాముడు
  16. చూడు. తల లేని 13 అడ్డంకు మధ్యలో కొమ్ము మొలిచి ఎదురొచ్చింది (3)
    సమాధానం: కనుము
  17. ఆ దప్పి కరం కప్పిపోయింది. అయినా మిగిలింది గౌరవం (3)
    సమాధానం: ఆదరం
  18. ఇది చిరంజీవి కాంక్ష కాబట్టి, బయట రివర్సులో కరిచి మధ్యన అటుదిటుగా కోరు (5)
    సమాధానం: చిరుకోరిక
  19. కటికవాని జత కతను కోల్పోయి కకావికలైంది. ఇది సొంత ఉద్యానమే (5)
    సమాధానం: నిజవాటిక
  20. ఈ సర్కిలు మంచిది కాదు. కాని, ఈ పువ్వు మంచిదే! (5)
    సమాధానం: కువలయము
  21. అనంతమైన వాదమె పుట్టి అతలాకుతలమైంది. మధ్యలో తలలేని వాడు వచ్చి చేరాడు. పర్యవసానం బహు ప్రమాదకరం (5)
    సమాధానం: మెదడువాపు
  22. మెగాస్టార్ కోరిక చిన్నదే! (5)
    సమాధానం: చిరుకామన
  23. కార్నర్ వేరుకు కొస లేదు (2)
    సమాధానం: మూల
  24. వాహనాల స్థావరం కోసం చూర్ణం మొదట సాగి తలక్రిందులైంది (2)
    సమాధానం: డిపో