పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం! గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    11/30/2012 11:16 pm

    Sreenivas garu,
    I am sorry that for what you have expressed is valid.
    My remark fails to distinguish between the indifference meted out an erudite scholar on his attiring the ripe age of one hundred years and the apathy that was accorded to two distinguished cultural genii, whose demise took place in the same period of time. And the loss incurred by the demise of Rohiniprasad garu and Dr Bhadriraju garu and the loss caused by the cessation of intellectual contribution by Dr Pinakapani garu, as a result of his confinement to bed could have been kept apart. I should have been more specific as to making the dissimilarity conspicuous. I should not have been so casual as to cause the ambiguity, resulting in anguish. I tender my sincere
    I should have kept the difference apart and split the sentence. I feel ashamed for adding my own contribution to the disrespect meted out to the music genius by being flaccid in my syntax. I tender my sincere apology to Dr Pinakapani garu and his family.
    Siddineni Bhava Narayana

  2. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    11/30/2012 3:57 pm

    లైలా గారన్నది నిజం. అది ఎర్ర గురివింద. నా పొరపాటు.

  3. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి lyla yerneni అభిప్రాయం:

    11/30/2012 1:54 pm

    “నల్ల గురివింద తన నలుపెరుగనట్లు” -K.V.S. Ramarao

    Pardon me, is that your own coinage?

    Even though the plant -Abrus Precatorius- can produce different colored seeds, the most eye catching and popular are the red seed with black bottoms. ( I have to review basic botany to recall, if the part of seed that is attached to the inside of the pod – if it is the bottom or top or what exactly is its botanical technical term.)

    The usage in common practice in Telugu is “ఎర్ర గురివింద తన నలుపెరుగనట్లు” – like in the movie LavaKusa:

    ఎర్ర గురివింద తన నలుపెరుగనట్లు
    చెప్పుచున్నావు మీ రాము గొప్పలెల్ల
    చాలు చాలింక ధర్మ పన్నాలు మాని
    చేవ గలదేని యుద్ధంబు చేయవయ్య.

    My ancestral ladies in my Indian homes, sportive, 🙂 never calling a truce, used often – ఎర్ర గురివింజకి తన ముడ్డి కింద నలుపు తెలియదు – to harangue their men. They had the right body language to go with it too.

    లైలా

    PS: I am learning not only Telugu words, but also botany, birds and other things from ఆంధ్రభారతి నిఘంటువు. It’s fun.

  4. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/30/2012 12:46 am

    సామెతల ఆమెతల ప్రస్తావనలు మీకే కాదు కేవీయెస్ రామారావు గారూ!! అది మీలాగానే తెలుగు భాష వచ్చిన వారికందరికీ తెలుసు. మీ నోటి జోరు చెబుతున్నది మీకు వచ్చిన అసహనం వెనక మీరు చేసిన హేళన ఎంతగా మీకు స్వాభావికమో !! అలాంటివి మీకు బహుశా సహజం కావొచ్చును. మీ వ్యాసం మీద ప్రతిస్పందించేందుకు కుదరదని ఈమాట వారు ఏమీ చెప్పలేదు గనక పాఠకురాలిగా నేను నాకు అనిపించిన సంగతులని రాసేను. మీవ్యాసం ప్రచురించేరూ అంటేనే దాని మీద మిగిలిన వారికి కలిగిన భావాలని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని. అయితే అవి మీకు నచ్చినట్టో… లేదా మీకు కావలసినట్టో ఉండvu కద? మీరు విమర్శని తీసుకోలేని అతి సున్నితమైన వారైతే అందుకు పాఠకులు ఏమి చేయగలరూ?? నా విమర్శ నా మాటలూ మీకు ఎలాగ అర్ధం అయ్యేయో అది మీ భావనలకి మీ సంయమనానికీ సంబంధించినది. ప్రతీ వ్యాఖ్యకీ ఒక సందర్భం ఉంటుంది. మీ వ్యాసమూ అక్కడే ఉంది. నా అభిప్రాయమూ అక్కడే ఉంది. కదా? “ఉలుకు” అంతగా మీరు పడనవసరము లేదు. నేను ఉన్న మాటే అన్నాను.

    ఇంక నేను- కవిత్వమూ వగైరాలు అందరికీ నేర్చుకుంటేనే పట్టుబడతాయని విష్ణుభొట్ల లక్స్మన్న గారన్న మాట మీద నా అభిప్రాయంగా నా జవాబు లో స్పష్టం గానే చెప్పాను. లక్ష్మన్న గారి వ్యాఖ్య మీద అది నా అభిప్రాయం. దాని పట్ల మీ “ట..” లతో మీరు ఏవేవో వదిరితే అది మీ స్వభావాన్ని చెబుతుందే తప్ప మరింకేం కాదు. అటువంటి నీరసమైన జవాబుని నేను లక్ష్య పెట్టను. నాకు విషయం ముఖ్యం. అన్ని “విద్యలూ అందరికీ అబ్బవు.” ఇది వాదనతో తేలే సంగతి కాదు. మీరు దీన్ని నిరూపించదలుచుకుంటే వ్యాసాలు రాయడం మాని ముందు దాన్ని నిరూపించడానికి ఆ అవధానాలేవో చేసి చూపండి. అప్పుడు కదా తెలిసేది అది అందరూ చేయగలరో లేక అది కూడా కొందరు మాత్రమే చెయ్యగలరో!! ఇందుకు ఈ మిగిలిన మాటలెందుకూ? నేను నమ్మడం లేదు అన్ని కళల్నీ లేదా అన్ని “విద్యల్నీ” అందరూ చేయగలరూ “నేర్చుకుని” అని. కాని దాన్ని మీరు నమ్ముతున్నారు కదా? అందుకే కద ఆ వ్యాసం రాశారు. మరి మీరు వెనకాడ్డం దేనికీ మీ మాటల్ని నిరూపించుకోవడానికీ?? మేము కూడా ఎదురు చూస్తాం అమెరికాలో ఉన్న ఆ ఒక చిన్న తెలుగుదేశాన తయారు కాగల ఒక మేలైన అవధాని కోసం!! ఆయన చతురతా ఇంకా అందులో తొణికే ఆ సమయస్పూర్తిల కోసం! ఆయన నోట చిందబోయే ఆ భాషా పాటవం కోసమూను. కానివ్వండి మరి.

    ఇంక, ఆ గురివింద సామెత అదేదో అది ఈ సందర్భంలో మీకే ఎక్కువ అతికినట్టు ఎక్కడా మీకు తెలియకపోవడం ఇంకా హాస్యాస్పదం కాదూ! మాటలు విలువైనవి. ఎప్పుడైనా వాటిని జాగ్రత్తగా వాడండి.

    రమ.

  5. ఆగవే రజనీ! విభావరి! గురించి Mallaiah Anchoori అభిప్రాయం:

    11/29/2012 10:02 pm

    Wonderful Mohan Rao Garu!!! How exactly you authored it Sir!! Meeku Naa Namo Vaakulu!! Anthakante Yeami Cheayaleanu Neanu!!!

  6. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    11/29/2012 7:05 pm

    “నల్ల గురివింద తన నలుపెరుగనట్లు” రమ గారు రంధ్రాన్షేషణ గురించి మాట్టాడ్డం హాస్యాస్పదం. ఈ వ్యాసాల గురించి ఆవిడ మాటలే ఇందుకు కొట్టొచ్చే ఉదాహరణలు.
    వ్యాసం మొదల్లో స్పష్టం గానే ఏ ప్రయోజనాన్నుద్దేశించి ఇది రాశానో చెప్పాను. అది ఆవిడకి కనిపించలేదు. ఆవిడకి వినిపించిందల్లా ఒక ” హేళనా” స్వరం అట. ఆ ” హేళన” “అవధాన విద్య” గురించని ఆవిడ ఊహట. అందుకు ఈ వ్యాసంలో ఉన్న ఆధారాలేవిటో ఆవిడకే తెలియాలి. అలాగే, ఒకవంక అవధానం సాహిత్యం కింద లెక్కవెయ్యకూడదంటూనే మరోవంక రెంటినీ ఒకటిగా చేస్తూ అది అందరికీ పట్టుబడేది కాదని వాదనెందుకో! అసలు “విద్య” అనే పదానికి అర్థం తెలుసునా? తెలిస్తే, అవధానం ఒక విద్యని నిజంగా నమ్మితే దాన్ని నేర్చుకోవచ్చని, నేర్చుకోవటం సాధ్యం అయితీరాలని తెలిసుండేది, ఇంత వాదనా అప్రస్తుతమయేది.
    మధ్యలో తిరుపతివెంకటకవుల పద్యాన్ని తీసుకొచ్చి తప్పుల్తో రాయటం ఎందుకో? ఆ పద్యం మొత్తం ఇది –
    “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ
    మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా
    రోసము కల్గినన్ కవివరుల్ మముగెల్వుడు గెల్చిరేని ఈ
    మీసము దీసి మీ పదసమీపములన్ తలలుంచి మ్రొక్కమే”

    ఐతే ఇది కేవలం అవధానాల గురించని వాళ్లెప్పుడూ అనలేదు. రమ గారి ఊహల్లో ఇదీ ఒకటి.

    ఇదివరకు ఒక సందర్భంలో “విమర్శ” “తిట్టు” సమానార్థకాలని ఆవిడ ప్రతిపాదించిన గుర్తు. ఇప్పుడు “విశ్లేషణ” “హేళన” సమానార్థకాలనుకుంటున్నట్టున్నారు. ఇలాటి భావాలున్న వాళ్ల సలహాలు – లేని పెద్దరికం నెత్తిన వేసుకుని ఇవ్వటానికి వారికి సిగ్గు లేకపోవచ్చు గాని – తీసుకోవటానికి నేను సిద్ధంగా లేను. వ్యాసంలో నేను అవధాన విద్య నేర్చుకునేవారికి సలహాలిచ్చానని మండిపడ్డారే, వారు నాకేకాదు మరెవరికీ అనుచిత సలహాలివ్వటం మానేస్తారని ఆశిస్తాను.

  7. తెలుగు భాష వయస్సెంత? గురించి Ravisankar అభిప్రాయం:

    11/29/2012 5:05 pm

    ఈ వ్యాసాన్ని ప్రచురించి మీరు చేసిన మేలు మరువలేనిది. ఎందరో మహనీయులకు ఒక చర్చావేదిక అయ్యింది. తెలుగు భాష ప్రాధాన్యతను తెలుసుకునెడి ప్రయత్నం ప్రతియొక్కరు చేయడానికిది నాంది అవుతుందేమో. జరగబోయే ప్రపంచ తెలుగు మహా సభలో ఇది ప్రస్తావిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొందరు పెద్దలు తమ వ్యాఖ్యానాల్లో తెలుగు type చేయలేక ఆంగ్లములో ప్రయత్నించడము కూడ గమనించవలసిన విషయము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పందించి, తెలుగు true type fonts సాధారణ keyboard తో అచ్చువేయ గలిగితే బాగుంటుంది. ఈ web page లో తెలుగు భాషను ముద్రించడము సులభంగా వున్నా మొదటి అక్షరం వత్తులు రెండవ అక్షరంపైన పడుతున్నది. దీనిని సవరించలేరా? ఆంగ్లములో అచ్చువేసుకున్నంత సులభంగా తెలుగులో అచ్చువేయగలిగితే బాగుంటుందని ఆశ.

  8. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/29/2012 1:28 pm

    నాకు స్పష్టంగా అర్ధం కాని అనేక అంశాలలో ఇదీ ఒకటి లక్ష్మన్న గారూ!! “అమెరికా సందర్శన భాగ్యం”?? నాకు తిరుపతి వేంకట కవులన్న మాట “నానా రాజ సందర్శనం” గుర్తుకొస్తోంది. ఆ నానారాజ సందర్శన “భాగ్యాన్ని” ఇవాళ్టి ఈ యెన్ ఆర్ ఐ సంస్థలూ వ్యక్తులూ కాని ఆక్రమించలలేదు కదా ?? 🙂 రామారావు గారి గొంతు ఆ వ్యాసంలో ఒక హేళన ధ్వనితోనే ఉన్నదని ఒక పాఠకురాలిగా నేను చెప్పగలను. అదే నాకు అభ్యంతరకరం. ఇంక ఎవరో ఒకానొక అవధాని చేతల మీదా దాని పర్యవసానం మీదా మనం దానిని అవధాన విద్యకి అనుసంధానంగా చూడకూడదని అనుకుంటాను. మనం ఒక కళని ఒక కళగా మాత్రమే చూడాలి. అంతవరకే విమర్శకుని బాధ్యత. వ్యక్తుల మీద కలిగిన కోపాన్ని లేదా ఏహ్యతనీ ఆ కళారూపం మీద చూపడం సరి అయినది కాదు.

    ఇంక “సంగీత సాహిత్యాలు కొందరికి మాత్రమే పట్టుబడతాయి అన్న వాదనను ఖండించడానికి” ఈ మీ మాట సైతం కేవీయెస్ రామారావు వ్యాసం లోని గొంతు లాగానే ఉంది. 🙂

    నేను సంగీత సాహిత్యాలు అందరికీ పట్టుబడేవి కావని నమ్ముతాను. అవి నేర్చుకుంటేనే అబ్బేవి కావు కూడాను. పూర్వ జన్మ సుకృతమో కాదో నాకు తెలియదు గానీ 🙂 అందరూ ప్రయత్నం చేసేస్తేనే కవులూ గాయకులూ మాత్రం అయిపోలేరు. అలాగే విమర్శకులు కూడా! అది వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న ప్రజ్ణ, లేదా ప్రతిభకి సంబంధించిన విషయమే!! మనం ఒప్పినా మానినా ఇది నిజం!! మనకి నచ్చినా నచ్చకున్నా కూడా ఇది నిజం!! అందరూ పోటీపడితేనే అబ్బేవి కావు కళలూ కవిత్వాలూ సంగీతాలూను. అలా ఎవరన్నా భావిస్తే దానిని ఒక ఉడుకుమోతుతనం గానూ ఒక అసూయాపరత్వం గానూ మాత్రమే అనుకోవాలి తప్ప యదార్ధంగా నిరూపించలేము. అదే నిజమైతే తెలుగు దేశానా ఈ పాటికి అల్లసాని పెద్దనలూ కృష్ణ శాస్త్రిలూ పుంఖాను పుంఖంగా తిరుగుతూ ఉండేవారే 🙂 యుగానికి ఒక మహా కవి ఉదయిస్తాడు. సూర్యుని లాగే!! మిగిలిన వారు ఆ చాయాపహారులు మాత్రమే!!

    ఇంక అవధానుల మీద కలిగిన కోపాన్ని అవధాన విద్య మీదికి మళ్ళించుకోవడం అర్ధం లేని పని. “రోషము కల్గినన్ మమ్ము గెల్వుడు” అన్న చెళ్లపిళ్ల కవుల పద్యమే అవధాన విద్యా గరిడీలో విసిరిన సవాల్! అలాంటి సవాల్ విసరకల్గిన అవధానులు ఇవాళ లేకపోతే అది అవధానుల సమస్య కానీ ఆ విద్యది కాదు. ఇంక అమెరికాకి ఆహ్వానాలూ వారికి “అబ్బిన” లక్ష్మీ కటాక్షాలూ వారిని పిలిచిన వారికి తెలిసిన విషయాలే!! అదేమన్నా సంభావనలా?? వారు [అవి ఎలా చేసినా సరే :)] అవధానాలు చేయించుకుని మెచ్చి ఇచ్చిన కానుకలే కదా?? అంత సునాయాసమైనదే అయితే ఆటాలూ తానాలూ ఆయా అవధాన్లని పిలవడం దేనికీ?? వారిలో ఎవరో ఒకరు అవధానాలు మొదలెట్టి అందరూ సునాయాసంగా అవధానం చేయవచ్చును అని నిరూపించి ఉండవచ్చును కాదా?

    రమ.

  9. నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి Siddineni Bhava narayana అభిప్రాయం:

    11/29/2012 1:15 pm

    I had skimmed the essay and some missed the points. It is quite interesting to know this piece of information as to Herbert Read buying two works by Rama Rao garu. Against the background of the views of Sir Read on British Romantics [Form in Poetry, Icon and Idea], and the attention they drew; his views on human societies and culture [’ To Hell with Culture”] ; and his reputation as an art critic and his reputation and notoriety as an anarchist, it is interesting what Read arrives at as to the work of our own S.V.Rama Rao garu.

    My thanks are due to Veluri Venkateshawara Rao garu. Did sir read review any of the paintings/ etchings by S.V.Rama Rao garu? Could you please give me the link to the material?
    Regards
    Siddineni Bhava narayana

  10. ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం! గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    11/28/2012 11:55 pm

    భావనారాయణ గారికి,
    మీ వ్యాఖ్య చదివితే పినాకపాణి గారు స్వర్గస్థులైనట్లు మీరు పొరబడ్డారనిపిస్తోంది. . ఆయనింకా సజీవులే కదా. బ్రహ్మానందం గారి వ్యాసం పినాకపాణి గారి నూరవ పుట్టినరోజు సందర్భంగా రాసినది.
    శ్రీనివాస్