పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి okAnokaDu అభిప్రాయం:

    11/04/2014 11:54 am

    వేవెరా గారు “నడ్డి విరగొట్టుట” అనే పదం వాడేరుకాబట్టీ, ఆయనకి తాటాకులు కట్టే ప్రయత్నం లైలాగారు చేసినట్టు “కనబడుతోంది” కాబట్టీ నేనూ కూడా సర్దాగా అనేస్తున్నాను, నడ్డి నిజంగా విరగ్గొడుతూ.

    నలి అంటే రోగము.
    జార అంటే రంకుమొగుడు
    ముఖము అంటే మొహం ఉన్నవాడు

    ఇవన్నీ కలిపితే తెలియట్లే? ఎవరో ఒకావిడ (ఒకత్తె అందామనుకుని మానేసాను) 🙂 మొగుణ్ణి “రోగం వచ్చిన రంకుమొగడా” అని తిడుతోంది. ఇప్పుడు విశ్వనాథ వారి డైలాగు వాడుతున్నాను కాచుకోండి – “ఈ మాత్రానికే లైలాగారో నడ్డి విరగ్గొట్టడం, వేవెరా గారు సమాధానం ఇవ్వడమూనా, దీనెమ్మ కడుపుకాల!” ఈ డైలాగు నిఝంగా విశ్వనాధ గారు రాసినదే (చిన్న కధలు పుస్తకం చూడండి – కధ పేరు సరిగ్గా గుర్తులేదు, ధర్ముడు రాజు, మనవడుకూడా ధర్ముడే – కావలిస్తే). మరో సారి చెప్తున్నాను – ఇది సరదాగా రాసేను నవ్వుకోటానికి. మీకు నవ్వురాకపోతే నా తప్పు లేదు.

  2. ప్లూటో గ్రహచారం గురించి vijaya అభిప్రాయం:

    11/04/2014 10:42 am

    ఈ వ్యాసం నాకు ఎంత నచ్చిందో చెప్పలేను. మా అబ్బాయి సోషల్ పుస్తకంలో ఫ్లూటో కనపడకపోయే సరికి, ఎటు పోయిందబ్బా? నా చిన్నపుడు ఉంది కదా అని ఆశ్చర్యపోయాను. ఇదన్న మాట విషయం! మీరు చెప్పిన విధానం ఎంత ఆశక్తిగా ఉందో అంతే వినోదంగా ఉంది.

  3. విశాఖ వృక్షయాగం అక్టోబరు 2014 గురించి క్లుప్తః క్లుప్తః అభిప్రాయం:

    11/03/2014 11:04 pm

    బాగుంది. చాలా బాగుంది.

    కత్తిరిస్తే ఇంకా చాలా బాగుండేదేమో! క్లుప్తత కవితకి అందం అంటారుకదూ!
    @

    పికిలిపిట్ట పేరు పెట్టుకుని
    సముద్రాన్ని దాటి వచ్చిన
    చక్రవాత వర్షపాతం
    మా ఊళ్ళో
    వృక్షయాగం చేసింది.

    చెట్టులన్నీ కట్టెలు చేసి
    పచ్చదనాన్ని
    మున్నీట ముంచేసింది.

    అటూ ఇటూ చెట్లు
    చెట్టు చెట్టునూ తాకుతూ కొమ్మలు
    కొమ్మ కొమ్మనీ పలకరిస్తూ ఆకులు
    పగలు పందిరి
    రాత్రి వెన్నెల
    పచ్చల చాందిని
    చక్కదనాన్ని ముక్కలు
    ముక్కలు చేసి విసిరేసింది.

    ఆంధ్ర విశ్వకళాపరిషత్
    విద్యారణ్యం
    అడితిగా మారిపోయింది.
    అక్కడి ఱంపపు కోత మోత
    ఇక్కడ వినిపిస్తోంది.

    @

    మిత్రుడు,

    క్లుప్తః క్లుప్తః

  4. రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    11/03/2014 10:56 pm

    మన్నించాలి , సవరణల పిదప పద్య మీ విధముగా నుండాలనుకుంటాను.

    దర, భుజ, గైణ, సింహములు త్వ ద్గళ, వే, ణ్యవలోకనద్వ, యో
    దరముల కోడి – వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
    తరములఁ – బూన, నిక్కఁ, దిన, దాఁగ; స్రవింపగ, నూర్పు లూర్ప, స
    త్వరముగ నేఁగ, నీడఁ గని తత్తరమందఁగఁ జేసి తౌఁ జెలీ!

  5. నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    11/03/2014 9:20 pm

    లైలా గారూ:

    ఛందస్సులోను, ఛందస్సు నడ్డి విరగ్గొట్టి ఎడాపెడా కవితలు రాస్తున్న మీకు
    జార + నలినముఖులు అన్న పదానికి అర్థం చెప్పాలా?

    ఎంతశృంగారకవికయినా మొగపురుగులని, నలినముఖులు, అని వర్ణించే మూర్ఖత్వం ఉంటుందంటారా?

    తామరపువ్వులవంటి ముఖాలున్న మొగ సన్నాసులు ఏమిటండీ విడ్డూరం కాకపోతే!(ఒకవేళ మొగవాళ్ళే ఆడవాళ్ళలాగా వేషంవేసుకున్నా, తిమ్మన గారు, వాళ్ళ Max Factor ముఖాలని, తామరపువ్వులతో పోలుస్తాడా?)

    అయినా కారా గారు మీ (మన)సందేహం తీర్చగల సమర్థుడు!

    నాతెలివికి తాటాకులు కడదామని కోరికుంటే, నే రాసిన కథలనో, వ్యాసాలనో చీల్చి చెండాడండి!
    By the way, we might drop in suddenly at Naples! Best wishes, — వేవేరా

  6. రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    11/03/2014 7:09 pm

    శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు ఓ రెండు తెనాలి రామలింగ కవి పద్యాల నెంచుకొని చక్కని పరిశీలనా దక్షతతో ముద్రారాక్షసములను సవరించి వాటికి అందమైన అన్వయమును సమకూర్చారు. వారి ప్రయత్నము వలన పాఠకులకు రెండు చక్కని పద్యాలు సుందరతర విశ్లేషణా భాగ్యముతో లభించాయి.

    కందర్ప కేతు విలాసములో “మౌనిఁ గెంజడల జొంపము ఫాలపట్టికఁ దీండ్రించు భసితత్రిపుండకంబు” అనే పద్యానికి ఆధారముగా శ్రీ వామన భట్టబాణుని “పాణౌ వేత్రం పవిత్రం భసిత విరచితం పుణ్డ్రకం ఫాలదేశే” అనే సిధ్ధపురుషుని వర్ణన నుదహరించి తమ సవరణలను చక్కగా నిరూపించారు.

    ఓడ్డియాణమునకు ఒడ్డాణ మనే అర్ధము ఆంధ్ర భారతి వారి తెలుగు నిఘంటువులో లభ్యమే ! ఆంధ్ర వాచస్పత్యము ,వావిళ్ళవారి నిఘంటువు , ఆంధ్ర శబ్ద రత్నాకరముల నుంచి వారా అర్ధమును గ్రహించారు. శ్రీ ఏల్చూరి వారెంచుకొనిన

    దర, భజ, గేణ, సింహములు తద్గళ, వే, ణ్యవలోకనద్వయో
    దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం గుహాం
    తరముల పూన నిక్కఁ, దిన, దాఁగ, స్రవింప, నిటూర్పులూర్చ స
    త్వరముగ నేఁగ, నీడఁగని తత్తరమందఁగఁ జేసి తౌ చెలీ.”

    అనే పద్య మెంత బాగున్నదో! ఈ పద్యములో కూడా వారు సూచించిన సవరణలు సమంజసమే! కాని నా అభిప్రాయములో శంఖము భ్రమించడము కంటె స్రవించడమే సరి యని పిస్తున్నది. నా చిన్నతనమంతా సముద్ర తీరములో గడిచింది. ప్రతిదినము సముద్ర తీరానికి పోయి గవ్వలు, చందమామలు, శంఖములు సేకరించి యింటికి కొనిపోయేవాడిని. లవణ సంగత మవడముచే అవి మరునాడు కూడా తేమ నూరుతూ జిడ్డు జిడ్డుగా నుండేవి. పలు సారులు మంచి నీటితో కడిగి పొడి చేశాకే వాటికా తేమ పోయేది. వారిధి పదంబుల నుండుట చేతను, లవణ సాంగత్యము కలుగుట చేతను శంఖములు (గాలిలో తేమను గ్రహించి ) స్రవిస్తాయి. అంతెందుకు ? సముద్ర తీరములో నుండే మనుజులు కూడా తక్కువ శ్రమకే అధిక ఘర్మజలాన్ని స్రవిస్తారు. అందుచేతనే మా శ్రీశ్రీ సముద్ర తీరానుభవముతో ఘర్మజలానికి, ధర్మ జలానికి, కర్మజలానికి ఖరీదు గట్టే షరాబు లేడొయ్! అని కవిత చెప్పగలిగారు!

    ఏమైనా శ్రీ ఏల్చూరి వారి విశ్లేషణ ఉత్సాహకరముగా, నాకర్షణీయముగా సాగింది.వారికి కృతజ్ఞతాభివందనములు!

  7. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    11/03/2014 4:28 pm

    వ్యంగ్యం పాళ్ళు ఎక్కువై వ్యాసం యొక్క మంచి విషయాలు మరుగునపడిపోయాయనిపించింది. చక్కని ఉదాహరణలు, సూచనలు ఉన్నాయీ వ్యాసంలో. దప్పళంలో కాకరకాయ ముక్కలు వేసినట్లు వ్యంగ్యం మొత్తం రుచిని పాడుచేసింది.

    పి.ఎస్. మీరు నా కొన్ని కవితలను ఈమాట లో వేసుకొనేముందు ఎడిట్ చేసి సరిచేసిన విషయంపై నాకింకా మంచి అభిప్రాయమే ఉంది.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  8. నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి okAnokaDu అభిప్రాయం:

    11/03/2014 4:05 pm

    కారా గారూ
    నాకున్న తెలుగు పరిజ్ఞానం అంతంతే అనేది ముందు చెప్పుకోవాల్సిన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకునే అంటున్నాను ఇక్కడ.

    తిరిగిరాని పద్యం నెగటివ్ గా ఉంటే తిరిగొచ్చిన పద్యం పాజిటివ్ గా ఉంది అనిపించింది. ఎందుకని అడక్కండేం? అది తెలిస్తే చెప్పి ఉండే వాణ్ణి కదా? 🙂

  9. ప్లూటో గ్రహచారం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    11/03/2014 1:45 pm

    మంగళ / కుజ శబ్దాలు పర్యాయ పదాలే ( కుజ దోషం / మాంగలిక్ , వివాహ సమయాల్లో వినిపించే పదాలే ); నా చిన్న నాడు నేను మరొక్క వ్యాసం చదివాను
    వసంత రావు వెంకట రావు గారి రచన , అందులోని విశేషాలు :

    ఆది వారం (0),సోమవారం ( 1) సూర్య చంద్రులను సూచిస్తాయి;

    మిగిలిన గ్రహాలు :
    మంగళ వారం (2), బుధ వారం ( 3)
    గురువారం (4), శుక్రవారం ( 5)
    శని వారం (6)

    –సౌర పటాన్ని దగ్గర పెట్టుకుని చూస్తే -సరి సంఖ్యలు కుజాదిగా దూర గ్రహాలను (సూర్యుడినుండి వాటి సాపేక్ష దూరం ప్రాతిపదికగా ) సూచిస్తాయి. అదే పంపిణి మీద బేసి సంఖ్యలు సమీప గ్రహాలను సూచిస్తాయి.

    తాత్పర్యం ఏమిటయ్యా అంటే అన్నీ వేదాల్లోనే వున్నాయిష ( అగ్నిహోత్రావధానులను తక్కువ అంచనా వెయ్యకండి మరి ) – భారతీయులకు నిజంగానే ప్రాచీన కాలంలోనే గ్రహాదుల వివరాలు (సూర్యుని నుండి వాటి దూరాలు వగైరాలు ) తెలుసు.

  10. ప్లూటో గ్రహచారం గురించి Rao Vemuri అభిప్రాయం:

    11/03/2014 12:03 pm

    నాగమురళి గారు

    “మంగళవారం” ప్రవర తెలిపినందుకు ధన్యవాదాలు. అలాగే “గ్రహం” అన్న మాటకి వివరణ ఇచ్చినందుకు కూడా. గ్రహశకలాలని, గిడసగ్రహాలని కూడ పాశ్చాత్యులు జాతకాలలో వాడుతున్నారన్న విషయం కూడ నేను ఇదే మొదటిసారి వినడం.

    స్పందించే పాఠకుల నుండి వ్యాసకర్త నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో ఉంటాయని మరొకసారి రుజువయింది!
    – వేమూరి