>>”మన్మథ” నామ సంవత్సరం అనగానే ఆంతరంగ సౌదర్యం అంటే తెలియని వాళ్ళకు నువ్వు మన్మథ లో పుట్టావు అంటే నవ్వొస్తుందేమో అంటూ విశ్వనాథ కు అరవై సంవత్సరాలు నిండిన సందర్భాన , రాసింది నాయని సుబ్బారావు గారని లీలగా జ్ణాపకం
అన్న షష్టిపూర్తియట నీకు, మన్మథ
వత్సరమ్ము నిన్ను బడసి వెలుగ,
నదియు గొంత హాస్యమై సాగె నాత్మసౌం
దర్య మెఱుక లేని నరులయందు
ఈరోజు ఉగాది. శ్రీ మన్మథ ఉగాది. తెలుగు వాళ్ళు తెలుగులో(?) నడుపుతున్నా ” పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు” అని అనటానికి నోరు రాని ‘ ఈ మాట’ కు ఉగాది శుభాకాంక్షలు!
‘ ఈ మాట’ మిత్రులకు: ‘ మన్మథ’ నామ సంవత్సరం అనగానే ఆంతరంగ సౌదర్యం అంటే తెలియని వాళ్ళకు నువ్వు మన్మథ లో పుట్టావు అంటే నవ్వొస్తుందేమో అంటూ విశ్వనాథ కు అరవై సంవత్సరాలు నిండిన సందర్భాన , రాసింది నాయని సుబ్బారావు గారని లీలగా జ్ణాపకం,ఆతర్వాత చాలా కాలానికి చదివిన ఒక అభినందన పద్యం గుర్తొస్తోంది.
ఆ సందర్భం లోనే , ‘ తల ప్రాణంబులు తోకకొచ్చినవి ‘ అంటూ మొదలై . “పాపరాజు” ‘ఉత్తర ‘ (తోక) రామాయణాన్ని మాత్రమే రాస్తే నువ్వు పూర్తిగా రాసి మళ్ళీ ప్రాణాలను తలకు తీసుకొచ్చావు ‘మంత్రవాక్కువు ‘ సత్యనారాయణా అంటూ కాటూరి చెప్పిన ఒక పరమాద్భుతమైన పద్యం గూడా చదివాను . ఈ పద్యాలను దయతో యెవరైనా సంపాయించి ఈమాట ద్వారా అందించ వలెనని వేడుకోలు.
తఃతః
రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ – హమ్మయ్య, ఖంగారు పడ్డాను కానీ, ఉత్తిదే అని తేలిపోయింది. ఇహ పూర్తిగా అర్థమైపోయింది, నా వ్యాసానికి, అందులోని వాక్యాలకు, రాసిన కామెంటుకు నేను పూర్తి న్యాయం చేసాననిన్నీ… దీనికి ఇంతకన్నా ఎక్కువ చెప్పనక్కరలా. 😉
పోతే, మీ భాషలో చెప్పాలంటే, మీరన్న మాటలే, మీ వచనంలోని, మీ కవిత్వంలోని మాటలే వాడి చెప్పాలనిపించి, అసలు సంగతి వదిలేసిన మీరు, ఆ చవటలతో, కారిపోతూ ఏవిటి రాసుకోవాలన్నా రాసుకోవచ్చు..నానుంచి ఉపేక్ష్యోలక్ష్యమే! చివరిసారిగా మరొక్కసారి స్వస్తి…
ధన్యవాదాలతో !
భవదీయుడు
వంశీ
శిక్ష ఖరీదు
గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
03/19/2015
1:40 am
బాగున్న ఈ తమాషా కథ మూల రచయిత పేరు కూడా ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది.
మీరు స్కర్టు, పేంటీ దగ్గరే నిలబడిపోయినా, వచనం, పధ్యం దగ్గరకొచ్చినా, అది మీ ఇష్టం. “చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు” అర్థవైన వారికి ఇక చెప్పేదేవుంది. మీరు కాస్త ఆ లోదుస్తుల నించి బయటకు వచ్చుంటే బాగుండేది. మీరు మరీ వాటిని మక్కీకి మక్కీగా తీసుకుని అక్కడే నిలబడిపొయ్యారు.
నాకు పద్యం రాదు, నా తెలుగు చదువు పన్నెండో క్లాసు దాకే, నాకు తెలుగు తెలుసు, మామూలు తెలుగు, అందరికి అర్థవయ్యే తెలుగు, మంది మాట్లాడే తెలుగు. కాలం తోపాటూ తనూ మారే తెలుగు. నాకు తెలిసిన తెలుగే మెజారిటీకి తెలిసిన తెలుగు. మాకు కష్టం, సుఖం, నవ్వు, ఏడుపు, సరసం, విరసం అన్నీ ఈ తెలుగులోనే మోహన్ గారు, ఈ చిన్న వాక్యాల్లోనే. మాకు మీరు వ్రాసిన చిన్న వాక్యాలే అర్థమవుతాయి. మాకు పద్యం కంటే పాట మనసుకి పడ్తుంది , గుండెని కదిలిస్తుంది. మాకు మాట్లాడటవే తెలుసు, ఏడుపొచ్చినప్పుడు ఎప్పుడో పొల్లుకొచ్చిన పాట తప్ప, మాకు మాటలే అర్థం అవుతాయి. మాకు మీ కష్టతరవైన పద్యాలతో పనేవుంది చెప్పండి. కాదనటం లేదు మీకవి నచ్చుతాయి, మిమ్మలని అవి కదిలిస్తాయి, మీకా పద్యం చదివినప్పుడో, విన్నప్పుడో మీరు ఒక నిర్వాణ అవస్తలోకి పోతారు. అది మీకు తెలుసు, మీరు ఆ వ్యవస్తలో సబ్యులు, కానీ దురదృష్టం కొద్ది నూటికి తొంభై తొమ్మిది తెలుగు వాళ్ళవి మేవా బావిలో లో భాగం కాదు .
అనుమానం ఏవీ లేదు నేను రసిక హృదయుడ్నే, కానీ మీరు అప్పుడు కూడా ఆ స్కర్టు దగ్గరే నిలబడి పొయ్యారు మరి, నాకు తెలియదు ఏవనాలో. ఇంకా నయం మీరు సంధ్య లోనూ, ఉషలోనూ కూడా లోదుస్తులని చూడలేదు. ధన్యవాదాలు.
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:
03/22/2015 12:52 pm
కామేశ్వర రావు గారూ !
ధన్యవాదాలండీ మీకు . ఊగాది శుభాకాంక్షలూనూ.
తఃతః
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి కామేశ్వరావు అభిప్రాయం:
03/22/2015 8:41 am
>>”మన్మథ” నామ సంవత్సరం అనగానే ఆంతరంగ సౌదర్యం అంటే తెలియని వాళ్ళకు నువ్వు మన్మథ లో పుట్టావు అంటే నవ్వొస్తుందేమో అంటూ విశ్వనాథ కు అరవై సంవత్సరాలు నిండిన సందర్భాన , రాసింది నాయని సుబ్బారావు గారని లీలగా జ్ణాపకం
అన్న షష్టిపూర్తియట నీకు, మన్మథ
వత్సరమ్ము నిన్ను బడసి వెలుగ,
నదియు గొంత హాస్యమై సాగె నాత్మసౌం
దర్య మెఱుక లేని నరులయందు
విశ్వనాథ షష్టిపూర్తికి నాయని సుబ్బారావుగారిచ్చిన “కానుక” పద్యం.
మన్మథ ఉగాది శుభాకాంక్షలు!
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:
03/21/2015 11:48 pm
శ్రి వాడపల్లి:
ధన్యవాదాలు మీకు.
నమస్కారాలతో ,నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తఃతః
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి VSTSayee అభిప్రాయం:
03/21/2015 5:51 pm
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి గజారోహణోత్సవ సందర్భమున శ్రీ కాటూరివారు చెప్పినవి …
పాయక నీపయిం గవులు పద్యము లల్లెడి వేళ ‘సత్యనా
రాయణ’ యంచు బ్రాసమున యందిడి మీదులు చూడకుండ నీ
వే యొక ప్రాసదాన మిడ నెంచికదా రచియించుచుంటి రా
మాయణ! మెంత నేర్పరివిరా! స్తుతిలోభము నీకె చెల్లురా!
అల కంకంటి కులుండు పాపకవిరా జల్లంత జేముట్టినన్
దల ప్రాణమ్ములు తోకకుం డిగిన తద్రామాయణం బీవు గీ
ర్బలముం జేసి పునఃప్రతిష్ఠిత సుధాప్రాయాఖిలాంగమ్ముగా
నిలుపం జూచెదవోయి మంత్రమయవాణీ! సత్యనారాయణా!
—
నమస్తే,
వాడపల్లి శేషతల్పశాయి.
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:
03/21/2015 2:34 pm
ఈరోజు ఉగాది. శ్రీ మన్మథ ఉగాది. తెలుగు వాళ్ళు తెలుగులో(?) నడుపుతున్నా ” పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు” అని అనటానికి నోరు రాని ‘ ఈ మాట’ కు ఉగాది శుభాకాంక్షలు!
‘ ఈ మాట’ మిత్రులకు: ‘ మన్మథ’ నామ సంవత్సరం అనగానే ఆంతరంగ సౌదర్యం అంటే తెలియని వాళ్ళకు నువ్వు మన్మథ లో పుట్టావు అంటే నవ్వొస్తుందేమో అంటూ విశ్వనాథ కు అరవై సంవత్సరాలు నిండిన సందర్భాన , రాసింది నాయని సుబ్బారావు గారని లీలగా జ్ణాపకం,ఆతర్వాత చాలా కాలానికి చదివిన ఒక అభినందన పద్యం గుర్తొస్తోంది.
ఆ సందర్భం లోనే , ‘ తల ప్రాణంబులు తోకకొచ్చినవి ‘ అంటూ మొదలై . “పాపరాజు” ‘ఉత్తర ‘ (తోక) రామాయణాన్ని మాత్రమే రాస్తే నువ్వు పూర్తిగా రాసి మళ్ళీ ప్రాణాలను తలకు తీసుకొచ్చావు ‘మంత్రవాక్కువు ‘ సత్యనారాయణా అంటూ కాటూరి చెప్పిన ఒక పరమాద్భుతమైన పద్యం గూడా చదివాను . ఈ పద్యాలను దయతో యెవరైనా సంపాయించి ఈమాట ద్వారా అందించ వలెనని వేడుకోలు.
తఃతః
సముద్రం గురించి lyla yerneni అభిప్రాయం:
03/21/2015 1:54 pm
ఎంతో బాగుంది కథ. ‘సముద్రం’ అన్న టైటిల్ ఆకర్షిస్తే క్లిక్ చేసి చదివాను. బ్యూటిఫుల్.
మేగజీన్ టెక్నికల్ క్రూ, పాఠకులకు ప్రేమతో ప్రొవైడ్ చేసిన ?రాండమ్ ప్లే ఫీచర్ వల్ల, ఇక్కడ, ఈ మధ్యన ఎన్నో మంచి రచనలను చదివాను. లవ్ ఇట్. లవ్ టెక్నాలజీ.
లైలా
శిక్ష ఖరీదు గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
03/20/2015 2:21 am
క్షమించాలి. ఇంతకుముందు కథ చదివినప్పుడు (నా PC లో ఎందుకో) శీర్షభాగం కనిపించలేదు. ఈరోజు శీర్షిక, మూల రచయిత పేరు కనబడ్డాయి.
[తప్పు మీది కాదు, మాదే. చిన్న పొరపాటు జరిగి మూల రచయిత పేరు కనపడలేదు. సరిదిద్దాము – సం.]
వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:
03/19/2015 1:12 pm
రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ – హమ్మయ్య, ఖంగారు పడ్డాను కానీ, ఉత్తిదే అని తేలిపోయింది. ఇహ పూర్తిగా అర్థమైపోయింది, నా వ్యాసానికి, అందులోని వాక్యాలకు, రాసిన కామెంటుకు నేను పూర్తి న్యాయం చేసాననిన్నీ… దీనికి ఇంతకన్నా ఎక్కువ చెప్పనక్కరలా. 😉
పోతే, మీ భాషలో చెప్పాలంటే, మీరన్న మాటలే, మీ వచనంలోని, మీ కవిత్వంలోని మాటలే వాడి చెప్పాలనిపించి, అసలు సంగతి వదిలేసిన మీరు, ఆ చవటలతో, కారిపోతూ ఏవిటి రాసుకోవాలన్నా రాసుకోవచ్చు..నానుంచి ఉపేక్ష్యోలక్ష్యమే! చివరిసారిగా మరొక్కసారి స్వస్తి…
ధన్యవాదాలతో !
భవదీయుడు
వంశీ
శిక్ష ఖరీదు గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
03/19/2015 1:40 am
బాగున్న ఈ తమాషా కథ మూల రచయిత పేరు కూడా ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది.
వచనానికి ఒక జాబు గురించి ravikiran timmireddy అభిప్రాయం:
03/18/2015 2:25 pm
శ్రీ వంశీ మోహన్ గారు,
మీరు స్కర్టు, పేంటీ దగ్గరే నిలబడిపోయినా, వచనం, పధ్యం దగ్గరకొచ్చినా, అది మీ ఇష్టం. “చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు” అర్థవైన వారికి ఇక చెప్పేదేవుంది. మీరు కాస్త ఆ లోదుస్తుల నించి బయటకు వచ్చుంటే బాగుండేది. మీరు మరీ వాటిని మక్కీకి మక్కీగా తీసుకుని అక్కడే నిలబడిపొయ్యారు.
నాకు పద్యం రాదు, నా తెలుగు చదువు పన్నెండో క్లాసు దాకే, నాకు తెలుగు తెలుసు, మామూలు తెలుగు, అందరికి అర్థవయ్యే తెలుగు, మంది మాట్లాడే తెలుగు. కాలం తోపాటూ తనూ మారే తెలుగు. నాకు తెలిసిన తెలుగే మెజారిటీకి తెలిసిన తెలుగు. మాకు కష్టం, సుఖం, నవ్వు, ఏడుపు, సరసం, విరసం అన్నీ ఈ తెలుగులోనే మోహన్ గారు, ఈ చిన్న వాక్యాల్లోనే. మాకు మీరు వ్రాసిన చిన్న వాక్యాలే అర్థమవుతాయి. మాకు పద్యం కంటే పాట మనసుకి పడ్తుంది , గుండెని కదిలిస్తుంది. మాకు మాట్లాడటవే తెలుసు, ఏడుపొచ్చినప్పుడు ఎప్పుడో పొల్లుకొచ్చిన పాట తప్ప, మాకు మాటలే అర్థం అవుతాయి. మాకు మీ కష్టతరవైన పద్యాలతో పనేవుంది చెప్పండి. కాదనటం లేదు మీకవి నచ్చుతాయి, మిమ్మలని అవి కదిలిస్తాయి, మీకా పద్యం చదివినప్పుడో, విన్నప్పుడో మీరు ఒక నిర్వాణ అవస్తలోకి పోతారు. అది మీకు తెలుసు, మీరు ఆ వ్యవస్తలో సబ్యులు, కానీ దురదృష్టం కొద్ది నూటికి తొంభై తొమ్మిది తెలుగు వాళ్ళవి మేవా బావిలో లో భాగం కాదు .
అనుమానం ఏవీ లేదు నేను రసిక హృదయుడ్నే, కానీ మీరు అప్పుడు కూడా ఆ స్కర్టు దగ్గరే నిలబడి పొయ్యారు మరి, నాకు తెలియదు ఏవనాలో. ఇంకా నయం మీరు సంధ్య లోనూ, ఉషలోనూ కూడా లోదుస్తులని చూడలేదు. ధన్యవాదాలు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి