పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:

    05/03/2015 1:43 pm

    శ్రీ వెల్చేరు నారాయణరావు గారు కొన్ని మాసములు నాకు ఏలురులో కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలలో తెలుగు ఉపాన్యాసకులు.తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తెలుగుభాషా పరిశోధకులుగా తరలారు .అందుచే వారు నాకు గురువులు. వారికి నా నమస్సులు. వారికి , శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి అభినందనలు. నేను తెలుగు భాషాభిమానిని. తెలుగు ప్రజలు వివిధ దేశాలేగి తెలుగు మాట్లాడుటచే తెలుగు అంతర్జాతీయ భాష అవునో కాదో అనే చర్చ నాకు అనవసరము . తెలుగు ప్రపంచ భాష అవాలనే ఆశ కూడా నాకు లేదు . విద్యార్థి దశలో ఉన్నత పాఠశాల వఱకు ఆంగ్లము ,హిందీ తప్ప మిగిలిన విద్య అంతా తెలుగు మాధ్యమములో చదువుకున్నాను . గణితశాస్త్రము , భౌతికశాస్త్రము , రసాయనశాస్త్రము ,జీవశాస్త్రము తెలుగులో సునాయాసముగా నేర్చుకొన్నాను . కళాశాలలో ఆంగ్లమాధ్యమమవడముచే క్రొత్తలో కొంచెము యిబ్బంది అయినా త్వరలోనే సర్దుకుపోయాము . వైద్యకళాశాలలో విద్యంతా ఆంగ్లములో జరిగినా రోగులతో సంభాషణలు తెలుగులో జరిగేవి. వారి రోగ చరిత్రను ఆంగ్లములో అనువదించి వ్రాసుకొని , వారి రోగము గురించి ,అవసరమయ్యే పరిశోధనల గురించి , చికిత్స గురించి ఆంగ్లములో వ్రాసుకొన్నా వారికి తిరిగి తెలుగులో వివరించి బోధ చేసేవారము .ఆంగ్లభాష పై వ్యతిరేక భావము లేకపోయినా వైద్యశాస్త్ర గ్రంధాలన్నీ తెలుగు భాషలో మనము అనువదించుకుంటే బాగుంటుందనే ఆశ ఎప్పుడూ ఉండేది . ఇప్పుడు వైజ్ఞానిక గ్రంధాలు , న్యాయశాస్త్ర గ్రంధాలు సకలము తెలుగులో అందుబాటులో ఉండాలనే ఆశ ఉంది .
    తెలుగు ఎనిమిది కోట్ల ప్రజానీకానికి మాతృభాష . సంఖ్యాపరముగా ఇటాలియన్ , ఫెంచ్ , జపనీస్, గ్రీక్ , జర్మను ,పోర్చుగీస్ , భాషలకు తీసిపోదు. సంస్కృత భాషా పదజాలము కూడా మిళితమగుటచే విశేషపదజాలము గల భాష .మరి పై భాషలతో సమానముగా తెలుగు ఆధునిక పరిజ్ఞానముతో ఎదగ పోవడానికి అనేక కారణాలున్నాయి. ఫ్రాన్సు ,ఇటలీ , జర్మను ,జపాన్ ల వలె తెలుగు దేశము ( అలాగే వంగదేశము , కర్ణాటక ,తమిళనాడు ) ప్రత్యేక దేశమయితే తెలుగులోనే పరిపాలన పూర్తిగా సాగడమే కాక తెలుగు భాష వికాసము చెంది తెలుగులో వైజ్ఞానిక గ్రంధాలు అనువదించబడి ఉండేవేమో !భారతదేశము విఛ్ఛిన్న మవడము నా ఉద్దేశ్యము కాదు, గాని హిందీతో సమానముగా భారతీయ భాష లన్నిటికీ సమాన ప్రతిపత్తి కలిపించి మాతృభాష లన్నిటినీ అభివృధ్ధి చేసుకో వాలని నా అభిలాష .
    తెలివితేటలు నైపుణ్యములు వ్యక్తులలో విభిన్నముగా గోచరిస్తాయి . కొందఱికి గణిత మలవడుతే కొందఱికి భౌతిక శాస్త్రము, కొందఱికి తెలుగు , కొందఱికి సంగీతము , కొందఱికి నటన సులభముగా అలవడుతాయి . అష్టావధానము చేసే కవులకు గణితశాస్త్రము కొఱకరాని కొయ్య అవవచ్చు. పాండిత్యమున్నా కవిత్వము రాకపోవచ్చును . అందుచే తెలుగు నభ్యసించే వారికి తెలివి లేదని చెప్ప రాదు. తెలుగులో వివిధ గ్రంధాలు ప్రచురించుకోవాలనుకుంటే ప్రభుత్వ పరముగాను , స్వఛ్ఛంద సంస్థల పరముగాను , తెలుగు సంస్కృత పండితులు , తెలుగుపై అభిమానము గల శాస్రజ్ఞులు, వైద్యులు ,న్యాయశాస్త్రా కోవిదులు ,అందఱూ సమిష్టిగా కృషి చెయ్యాలి. దానికి తగిన ప్రణాళిక, నాయకత్వము కూడా అవసరము. ఉగ్గుపాలతో ఆంగ్లమును పోసి ,పాఠశాలలలో తెలుగు బోధనను కుంటుపరుస్తే మనము ఉట్టికెగురలేని అమ్మలమే అవుతాము. పోషణ అన్నిటి కంటే ముఖ్యము. ఒకప్పుడు మనదేశము పేదదేశమే గాని యిప్పుడు మనకు తగిన వనరు లుండడమే గాక సాంకేతికాభివృధ్ధి మాతృభాషల నభివృధ్ధి చేసుకొనుటకు సహకరిస్తుంది.తెలుగు నిఘంటువులు అంతర్జాలములో అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ వారు గొప్పా , శ్రీశ్రీ గొప్పా వంటి చర్చల వలన ప్రయోజనము శూన్యము. సకల సాహిత్య ప్రక్రియలు తెలుగు భాష విస్తృతికి ప్రమాణములు. శ్రీ యెల్లాప్రెగడ సుబ్బారావు గారు తమ ఫోలికామ్లపు పరిశోధనలు తెలుగులో ప్రచురించ లేదు. రవీంద్రనాథ టాగూరు గీతాంజలిని ఆంగ్లములో అనువదించక పోతే ఆయనకు నోబెల్ బహుమానము దక్కేది కాదు. నాకే అధికారముంటే రాచకొండ విశ్వనాథశాస్త్రికి , విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ బహుమానాలు ప్రదానము చేసే వాడిని. తెలుగు ప్రపంచభాష కానవసరము లేదు గాని స్వంత గడ్డలలో వికాసము చెందవలసిన అవసరావకాశము లున్నాయి. అందఱికీ వందనములు.

  2. శేషు మావయ్య గురించి Radha అభిప్రాయం:

    05/03/2015 12:33 pm

    దమయంతి గారూ, కథ చాలా బావుంది. బెహరా గారు షేర్ చేసుకోవడం వల్ల చూడగలిగాను. అభినందనలు. థాంక్్స బెహరా గారూ!

  3. శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/03/2015 9:35 am

    ‘కథ,కథనం అద్భుతంగా సాగాయి, మొదలు పెట్టాకా ఎక్కడా ఆగలేం’
    – థాంక్స్ వసంత. ఎంత పొంగిపోకూడదనుకున్నా, ఏవిటో.. సంతోషమేసిపోతుంది ప్రశంసలకి. :-)చాలా చాలా థాంక్సండి వసంత లక్ష్మి.

    * ‘ఇంతకీ శేషు మావయ్య అలా ఎందుకు చేసేడంటారు?’
    చాలా కారణాలు ఊహించాను. నేననుకున్నట్టు ఆయన అలానే మరణించారు. కొంత వరకు పాఠకుల ఊహకే వదిలేయడం జరిగింది జగధ్ధాత్రి గారు. మీ హృదయ స్పందన తెలియచేసినందుకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి.
    నమస్సులతో..

    * సురేష్ నా కథలపై మీ వ్యాఖ్యలు, ప్రశంసలు నాకు మంచి స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తూ వుంటాయి. మరొక మంచి కథ రాసి మీ వంటి గొప్ప పాఠనాసక్తి గల సాహీతీ పరుని ప్రశంసను పొందాలనే తహతహ కలుగుతూ వుంటుంది.
    మీకు నా హృదయపూర్వక కృతజ్నతలు తెలియచేసుకుంటూ, శుభాకాంక్షలతో..

    * ‘మనసు పొరల్లో దాగిన ఊసులు ఉబికి ఉబికి వచ్చే సందర్భాలను వర్ణించిన విధానం భేష్….’ – మీరు భేష్ అన్నారంటే గొప్ప గానే వుంటుంది మరి బెహరా గారు. 🙂 చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  4. వాన కడిగిన మధ్యాహ్నం … గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    05/03/2015 7:22 am

    చిత్రాన్ని కళ్లముందు నిలబెట్టాసారండీ. అభినందనలు.

  5. శేషు మావయ్య గురించి బెహరా వెంకట లక్ష్మీ నారాయణ అభిప్రాయం:

    05/03/2015 4:36 am

    కథ చెప్పిన తీరు చాలా చాలా బాగుంది. మనసు పొరల్లో దాగిన ఊసులు ఉబికి ఉబికి వచ్చే సందర్భాలను వర్ణించిన విధానం భేష్… మొత్తం మీద ఆసక్తిగా కథను చదివించేలా (ఏకబిగిన) వ్రాసిన దమయంతి గారికి అభినందనలు.

  6. శేషు మావయ్య గురించి suresh అభిప్రాయం:

    05/03/2015 3:20 am

    చాలా ఆసక్తికరంగా సాగిన కథ, అత్తయ్య మరణం, మామయ్య పెళ్ళి, ఆ ఫొటొ, గుండెలని పిండెసినట్లు అనిపించింది. ఈ అత్తయ్యని మర్చిపొలెము.

  7. శేషు మావయ్య గురించి జగద్ధాత్రి అభిప్రాయం:

    05/03/2015 2:37 am

    దమయంతి గారూ మీ కధన శైలి చాలా బాగుంది. మానవ స్వభావాలెంత చిత్రమైనావో బాగా చిత్రించారు. ఇంతకీ శేషు మావయ్య అలా ఎందుకు చేసేడంటారు? ….ప్రేమతో జగతి

  8. శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/03/2015 1:09 am

    * థాంక్స్ రా సుమ! చాలా చాలా థాంక్స్. కథ మీద చక్కని అభిప్రాయాన్ని అందించినందుకు.

    *’ చాల సేపు ఏదో ఆలోచనలో ఉండి పోయాను నేనయితే…ఈ లోకం తో ఏ సంబంధమూ లేనట్లుగా ‘ – ఎంత గొప్ప ప్రశంస! కథ పై మీ విలువైన అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు చాలా సంతోషం గా వుంది. మీకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    *ayyavaru గారు ధన్యవాదాలండి.

  9. శేషు మావయ్య గురించి వసంత లక్ష్మి ,ఫి. అభిప్రాయం:

    05/03/2015 12:25 am

    దమయంతి గారూ !

    కథ,కథనం అద్భుతంగా సాగాయి, మొదలు పెట్టాకా ఎక్కడా ఆగలేం, మావయ్యలతో ఉండే చనువూ, ఆ ఆప్యాయత, మేన కోడలుకే సొంతం.

    సముద్రంతో పోలుస్తూ, అత్త – మావయ్యల మధ్య కుదిరిన ప్రేమ బంధంలో పిల్లలు లేని విసాదాన్ని, అనారోగ్యాన్ని అధిగమిస్తూ ప్రేమా బంధం పెనవేసుకు పోవడం ..అన్నీ అందంగా వర్ణించారు, ఈ కథలో.

    ప్రతాప్ కుమార్ గారు చెప్పినట్టు, చక్కటి వ్యాఖ్యలు కథనాన్నికి వన్నె తెచ్చాయి .మీదైన శైలిలో కథనం హృద్యంగా సాగి, విషాదంగా ముగిసినా, శేషు మావయ్య జీవితం ఇలాగే అంతమవుతుంది అనే ఊహని చివరికి నిజం చేసారు. మంచి కథ చదివిన అనుభూతి. మాకు ఇచ్చారు..

    వసంత లక్ష్మి .

  10. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    05/02/2015 7:25 pm

    ఈ వ్యాసం మొత్తం చదివితే ఇందులో కొత్తగా ప్రతిపాదించిన వేమీ లేవు. ప్రతిపాదనలూ అంటూ చెప్పినవి కూడా పాతవే. వ్యాస రచయితలకి తెలుగు రాష్ట్రాలూ, అక్కడి రాజకీయ పరిస్థితులూ తెలుసు. యూనివర్శిటీల్లో ఉద్యోగాలు కావాలన్నా, నిధులు కావాలన్నా ప్రభుత్వాల చేతల్లోనే ఉంటాయి. వాళ్ళు విదిల్చి పారేసిన గ్రాంటులతో ఏ విశ్వవిద్యాలయమూ నడవ లేదు. ఇహ పరిశోధన అంటారా? సాహిత్యమే అవసరం లేదు. మిగతా ఏ విభాగాలు అంటే సైన్సూ వగైరా, ఏవి తీసుకున్నా ఇంతకంటే దారుణమైన పరిస్థితి. ఎక్కడా ఉద్యోగం రాని వాళ్ళు తెలుగు ఎం.ఏ కానీ, పి.హెచ్.డీ కానీ చేస్తారన్న చిన్న విషయం పసి పిల్లాడిక్కూడా తెలుసు. ఒకవేళ ఈ వ్యాసరచయితలు ప్రతిపాదించినట్లు ఒక సంస్థ చేసినా, మరలా అదే మనుషులూ, ఇవే రాజకీయాలూను. ప్రైవేటు సంస్థలూ అనగానే రకరకాల సమీకరణాలు ముందుకొచ్చేస్తాయి. అంతెందుకు? తానా, ఆటా తీసుకోండి. కనీసం పాతికేళ్ళుగా ఉన్నాయి కదా? వాళ్ళంతా తెలుగుకీ, సాహిత్యానికి చేసింది ఎంతో అందరికీ తెలుసు. ఇలా చెప్పడం వలన ఆ సంస్థలని తక్కువ చేయడం కాదు. మనకా దృక్పథం లేదు. మీరు ప్రస్తావించినట్లు ఇండియాలో తెలుగు చదువుకొచ్చి, అమెరికాలో ఉంటూ తెలుగు మీద అభిమానంతో రచయితలుగా మారిన వాళ్ళు ఉండచ్చు. ఇంటర్నెట్ వచ్చాక కాలక్షేపానికి రాస్తున్న వాళ్ళే ఎక్కువ, నాతో సహా! ఇంటర్నెట్ రాక మునుపు ఎంత మంది తెలుగు రాసేవాళ్ళు కనబడతారు? ఇదంతా ఎందుకంటే ప్రవైటు సంస్థలూ, అకాడమీల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.

    మోహన గారు చెప్పినది అక్షర సత్యం. నాలాంటి వాళ్ళు రచయితలుగా ఎప్పుడు మారామ. మా కడుపులో చల్ల రెండు పూటలా హాయిగా పారినప్పుడే కదా? ఇండియాలో ఉంటూ, రోజూ వారీ ఉద్యోగం చేస్తుకుంటూ, దిన దినగండం నూరేళ్ళ ఆయుష్షులా గడిపుతూ ఉంటే సాహిత్యం ఎక్కడ ఎక్కుతుంది. ఈ విషయమ్లో మోహన గారితో నూటికి నూరు పాళ్ళూ నేనూ ఏకీభవిస్తాను.

    చివరగా – వేలూరి గారూ ఇదే విషయమ్మీద చాలా కాలం క్రితం సంపాదకీయం రాసారు కూడా. తాటాకు చప్పుళ్ళలా కామెంట్లు వచ్చి పడిపోయాయి. అంతే! అక్కడితో అందరూ మర్చి పోయారు. మరలా ఇప్పుడు మరోసారి వచ్చింది కాబట్టి అందరూ ఆవేశంగా తీర్మానాలూ, సలహాలూ ఇచ్చేస్తారు. అక్కడితో చల్లారి పోతుంది. కానీ ఇదంతా గొంగళీ వ్యవహారం.

    ఇంకో సంపాదకీయంలో కూడా ఇలాంటి విషయాలే ప్రస్తావించారు. ఓపికా, ఆసక్తీ ఉన్న వారి కోసం – తెలుగు భాషకి భవిష్యత్తులేదా?

    మరలా విన్నవే వింటున్నాం; కొంత విరామ తరువాత. అంతే!

    -బ్రహ్మానందం గొర్తి