పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి indrakanti pinakapani అభిప్రాయం:

    09/17/2015 8:14 am

    Sir here I want to add some (not so much but still) pidakala veta. There is one story in Ramayana that rama met so many muni s including agasthya bhratha., meaning he has no individual name or not so recognised because his bhratha agasthya over shadowed him with his achievement s. What I want to add is even agasthya’s earlier name was not known befor his achievement that is stopping a mountain from further growing And avoiding people’s problems. T’hey aga! Thishtha’ some thing like that agasthya spoke and as the mountain could not but obey . so the sage was named agasthya thus goes the etymology.

  2. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    09/17/2015 7:33 am

    సారాలంకార విలక్షణత ను నిరూపిస్తూ సాగిన ఈ వ్యాసం పోతన గారి పద్యం వలెనే ఆకర్షిస్తున్నది.

    జయరథుని వ్యాఖ్యలో ఉదహరించబడిన ఆ సంస్కృత శ్లోకం ఎక్కడి నుంచి తీసుకోబడి ఉంటుంది? లేక వ్యాఖ్య కూర్చినవారే వ్రాసి ఉండవచ్చునా?

    జయరథుడు వర్ధమానం సారాలంకారంలోనే ఇమిడిపోతుందని అనడం, ఆ సంస్కృత శ్లోకంలో వర్ధమానః అనే పదాన్ని వాడడం చూసినపుడు నాకనిపించిందది.

    పద్యంలోని ముఖ్యవస్తువు మహావిష్ణువు యొక్క ఉత్తరోత్తర వృద్ధియే కాని, రవిబింబం యొక్క వివిధ రూపత్వసిద్ధికాదన్నది తెలిసినవిషయమే కాన పద్యంలోని సారాలంకార నిరూపణ అర్థవంతంగా ఉంది.

    వ్యాసకర్త అన్నట్టు పోతన గారి ప్రసిద్ధ పద్యంలో ఔచిత్యం నిండుగా ఉంది.

    భాగవతగణానాధ్యాయి గారన్నట్టు ఇటువంటి వ్యాఖ్యానాలు మా వంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.

  3. నాటికి నేడు – రేడియో నాటిక గురించి Saride Nag అభిప్రాయం:

    09/16/2015 12:10 pm

    అద్భుతం సుమండీ..
    ఇద్దరికిద్దరే..
    చక్కని సంభాషణలు..
    కడుపుబ్బ నవ్వించే హాస్యమే కాదు.
    చక్కని ట్విస్టు కూడానూ..
    అందించిన మీకు ధన్యవాదాలు

  4. రక్తకన్నీరు గురించి Saride Nag అభిప్రాయం:

    09/16/2015 10:03 am

    అద్భుతః

  5. చెలియలికట్ట: విశ్వనాథ గురించి Saride Nag అభిప్రాయం:

    09/16/2015 8:00 am

    శరీరాన్ని కాదు ఆత్మను చూడు
    ప్రేమను కాదు.. ధర్మాన్ని చూడు
    సుఖాన్ని కాదు సంప్రదాయాన్ని చూడు

  6. ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/16/2015 7:38 am

    పదిహేను నెలల తర్వాత ఈ వ్యాసాన్ని మళ్ళీ ఈరోజు చదువుతున్నప్పుడు – ఇంత అన్వయక్లేశం కలిగిన పద్యం కాకపోయినా, 1893లో గురజాడ శ్రీరామమూర్తిగారు “తెనాలి రామకృష్ణుని చాటువులని వాడుక గల పద్యములు” అని తమ ‘కవిజీవితములు’లో చూపిన వేరొకటి గుర్తుకు వచ్చింది. విద్యార్థులు కొద్దిసేపు ఆలోచిస్తే అర్థస్ఫురణ కలుగుతుంది కాని, దీనికీ పూర్వోత్తరాలలోని పద్యాలు దొరకనందువల్ల – తొలిచూపులో ప్రతిపాద్యాంశం, ప్రతిపదార్థం, తాత్పర్యం బోధపడటం కష్టమే:

    శైవాలంబును సైకతంబు లెదురై చంద్రప్రవాళాంబుజ
    గ్రావాకాశభుజంగకూపములు దూరం బైన నేతత్పరీ
    క్షావిద్యావిభవం బొనర్పఁగ దశాబ్జజ్యోత్స్నలో నర్ధచం
    ద్రావిర్భావముఁ జూపినం గలిసెఁ దా నాత్మేశు భావజ్ఞయై.

    అని.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  7. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Akkiraju అభిప్రాయం:

    09/15/2015 1:14 pm

    చాలా బాగుంది. రేపో మాపో నా పుస్తకం రాబోతున్న సందర్భంలో ఈ వ్యాసం రావడం అదనపు కష్టాలనే తెచ్చిపెట్టినట్టుంది. ఇన్ని తెలిసినా, నా బోటి వాడికి ఎవరి దగ్గరికి వెళ్ళితే రాబోయే పుస్తకం చక్కగా తయారవుతుందో ఇంకా తెలీదు. ప్రతివాడూ అన్నీ తెలుసుకోలేడు కదా.

    అక్కిరాజు

  8. చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    09/13/2015 11:25 am

    బ్రహ్మానందం గారూ,

    బాపు గారి గురించి చక్కని వ్యాసం. మీరు ఆయన గీతల్లో పొదుపు గురించి ప్రస్తావించినట్టు లేదు. అన్ని తక్కువ రేఖల్లో అంత అద్భుతమైన భావాన్ని తీసుకురాగలగడం ఎంతమందికి సాధ్యం? రాముడి ఠీవీ సీత సొగసూ హనుమంతుడి దారుఢ్యం, వాగ్గేయకారుల భక్తి తన్మయత్వం, బాపుకన్న బాగా ఇంకెవరైనా చూపించగలిగేరా?

    1970 లలో సంక్రాంతి మొదలైన పండుగలకి బాపు వేసిన గ్రీటింగ్ కార్డులకి దీటైనవి తెలుగువారికి మరెక్కడైనా దొరికేనా? వంటిల్లూ కత్తిపీటా, గయ్యాళి భార్యా బక్కభర్తా, బుడుగులాంటి గడుగ్గాయిలూ రెండుజెళ్ళ సీతలూ, మామిడిపిందెలూ రామచిలుకలూ, ఇవి తెలుగుదనం ఉట్టిపడేటట్లు చూపించిన విషయం కేవలం తెలుగువాడికే తెలుస్తుంది.

    చెప్పొచ్చేదేమిటంటే బాపు తెలుగువాడు. ఒక ప్రాంతీయతకే పరిమితమైపోయినవాడు. ముళ్ళపూడీ బాపూ కొంటెదనం పేరుతో సినిమాలలో కక్కుర్తి పడకుండా ఉంటే వాల్ట్ డిస్నీ / డెన్నిస్ ద మెనేస్ స్థాయికి బుడుగునీ, మరికొన్ని పాత్రల్నీ కూడా తీసికెళ్ళే వాళ్ళేమో.

    – ఇం. అ. ప్ర. స. మూర్తి.

  9. ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం గురించి Chandra అభిప్రాయం:

    09/13/2015 6:51 am

    కటకటా గారు, గూగుల్ శోధన ద్వారా దొరికీన లంకె
    http://www.sacred-texts.com/hin/rigveda/rv10173.htm

  10. జననం గురించి గుడిపూడి గోపాలకృష్ణ అభిప్రాయం:

    09/13/2015 2:32 am

    చాలా బాగుందండీ. మంచి విజ్ఞానం అందిస్తున్నారు. నిజంగా మీకు ధన్యవాదాలు. గుడిపూడి గోపాలకృష్ణ. రాజమండ్రి.