పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. తెలుగు భాషా ప్రాచీనత గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    05/25/2017 5:58 am

    Dear editors,
    I guess the title of this essay has been slightly altered. Not that Late Parabrahma Shastri is not a well-known historian, but a brief account of his contribution would have been apt. Especially, in connection with his assertion as to the characters found on Satavahana coins. It may be mentioned that it is he, who did find the one hundred and odd coins belonging to that period. Apart from being an original researcher and a versatile interpreter of pre-Chalukyan edicts, he was responsible for carrying out excavations at Kotilingala. These excavations were carried out in association with Late V. V. Krishna Shastry are said to have been left inconclusively. The environs of the site where excavations were carried out by Late V.V.Krishna Shastry and Late P.V Parabrahma Shastry are on the verge of being submerged in the back waters of Yallampally Irrigation Project

  2. నాతి చరామి గురించి Chandranaga srinivasa Rao Desu అభిప్రాయం:

    05/23/2017 11:16 pm

    ఈ కవిత చాలా బాగుంది

  3. రామరసాయనము గురించి lyla yerneni అభిప్రాయం:

    05/23/2017 11:32 am

    “రసాల క్రమం ఇది – శృంగార(శివధనుర్భంగం ముందు సీతాలోకన ఘట్టం)”

    శ్రీరామనాథ్ గారికి ప్రశ్న about the first poem in the String of ten poems of రామరసాయనము.

    పద్యం లోని విషయం వాల్మీకి రామాయణం నుండి తీసుకోబడలేదు. బాలకాండలో canto 67 లో శివధనుర్భంగం వర్ణించబడింది. (168 -170 పేజీలు. Shrimad Valmiki – Ramayana with Sanskrit text and English Translation, Gita press, Gorakhpur, India) మిథిలలో జనకుని కడకు విశ్వామిత్రుడు తీసుకువచ్చిన రామలక్ష్మణులు 12, 13 ఏళ్ల వయసు వారు. జనకుడి సభలో, రాముడు శివుని విల్లు విరిచినప్పటికి, సీతా రాములకు ఒకరికొకరు తెలియదు. సీత గాని సభాస్థలిలో ఉంటే, ఆమె రాముని చూచి ఉంటే, అంత ముఖ్యవిషయం వాల్మీకి మనకు చెప్పడా?

    ఎంతో హృద్యంగా – “రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖముల నొసగే సీతా రామ కథను వినరయ్యా!” అంటూ లవకుశ సినిమా పాటగా వినిపించినప్పడు కూడా,

    “హరుని విల్లు రఘునాథుడు చేకొని
    ఎక్కిడ ఫెళఫెళ విరిగినదీ
    తళతళ లాడే సీతారాముల
    కన్నులు కరములు కలిసినవీ!” అని విన్నాము.

    సీత కరము రాముడు పరిగ్రహించినది, వారి వివాహ సమయంలో, జనకుడు ఆదేశించిన పిమ్మట. సరిగా అదే సమయంలో -లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వారి వధువులు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ల పాణిగ్రహణం జరుగుతుంది. (pages 182-185, Canto 73.)

    మీరు మీ పద్యంలోని ఈ వృత్తాంతము కల్పించినారా? లేక ఇంకెవరి రామాయణమైనా ఆధారంగా తీసుకున్నారా? మీకు చెప్పవలెననిపిస్తే, సమయం ఉన్నప్పుడు కరుణించి చెప్పగలరు.

    Have a nice day All!
    Lyla

  4. రామరసాయనము గురించి పరిమి శ్రీరామనాథ్ అభిప్రాయం:

    05/23/2017 5:47 am

    శ్రీ చంద్రనాగ శ్రీనివాసరావు గారికి,

    మీకు ఈ కవిత నచ్చినందుకు, సమయం తీసుకుని అభివ్యక్తీకరించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    శ్రీ లక్ష్మీదేవి గారికి,

    ఇక్కడ రసాలని ఆయా పద్యాల పక్కన ఉటంకించకపోవడం చదువరులకి పరీక్ష కలిగించాలనే ఉద్దేశంతో చేసిన పని కానే కాదని, నాకు నేనే స్వయంలేఖనాసామార్ధ్యాన్ని, శుద్ధరసప్రకటనాఫణితి ని, రసోచితస్థితిపోషణాపటిమ ని బేరీజు వేసుకునే క్రమంలో పాఠకుల ఆమోదముద్ర పొండటం ద్వారా పెట్టుకున్న పరీక్ష అని తెలియజేసుకుంటున్నాను.

    కొన్ని పద్యాలలో సందర్భం ద్వారా, కొన్నింటిలో రసాన్ని ఉటంకించడం ద్వారా వాటికి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశాను.

    రసాల క్రమం ఇది – శృంగార(శివధనుర్భంగం ముందు సీతాలోకన ఘట్టం) , శాంత(వనవాసోద్యుక్త ఘట్టం) , అద్భుత(అహల్యాశాప విమోచన ఘట్టం) , కరుణ (విభీషణ లంకాధిప వరణ ఘట్టం), భీభత్స(సర్వ రాక్షస సంహార సంబంధము) , రౌద్ర (రావణ శిరచ్ఛేదన ఘట్టం), హాస్య(సీతా హాస్యాలాప ఘట్టం) , భయానక(మాయామృగ మారీచ సంహార ఘట్టం), వీర(సాధారణ వీరత్వ స్తుతి) రసముల వరుస.

    ఈ కవిత చదివినందుకు, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించినందుకు, మీ సహాయానికి నా నుండి శతాధిక ధన్యవాదాలు.

    శ్రీ కె.వి.ఎస్. రామారావు గారికి,

    మీ స్పందన నాకు విశేషతోషాన్నిచ్చింది. కవిత మీకు నచ్చినందుకు, స్పందించినందుకు శతధా ధన్యవాదాలు.

    పదబంధాల విషయమై రసోచితంగా వాడటానికే చాలా ప్రయత్నించాను. వీర రౌద్ర భీభత్స రసవర్ణనాసమయాల్లో ఔచిత్యాన్ని అనుసరించి పదబంధాలు, సున్నితరసాలైన కరుణ, హాస్య, శాంతాది రసాలలో సులభమైన పదోపయోగానికే చూశాను.

    మీ సూచనని మున్ముందు మనస్సులో ఉంచుకుని, మరింత పరిపక్వతకి ప్రయత్నిస్తాను.

    ఇతి శివమ్
    పరిమి శ్రీరామనాథ్.

  5. వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ! గురించి manjari. lakshmi అభిప్రాయం:

    05/22/2017 4:16 am

    మెలనీ వ్యక్తిత్వం గురించి చాలా బాగా రాసారు.

  6. ఒక పాట – రెండు బాణీలు గురించి Gorusu అభిప్రాయం:

    05/20/2017 7:02 am

    నేను విన్న మరో రెండు పాటల గురించి :
    1. రావు బాల సరస్వతిదేవి గారే “వినవే చెలి పిలుపు అల్లదిగో ” (బహుషా భుజంగరాయ శర్మ రచన కాబోలు ) అనే పాటని కొంత తేడాతో రెండు బాణీల్లో పాడారు. ఎందుకలా అని నేను ఎప్పుడో ఆమెను అడిగా – ఒకటి తెలుగు వారి ఆకాశవాణి కోసమని, మరొకటి బొంబాయి రేడియో కోసమని చెప్పిన గుర్తు. మీరు గమనిస్తే ఆ పాట రెండు బాణీలుగా ఉంటుంది.

    2. శ్రీ శ్రీ గారి “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములూ” పాట రేడియోలో ఒక బాణీతో, దూరదర్శన్ లో ఒక బాణీతో విన్నాను. శ్రీశ్రీ అభిమానులు కొందరు కట్టిన బాణీ కంటే నాకు దూరదర్శన్ లో వచ్చిందే నచ్చింది – వినడానికి శ్రావ్యంగా ఉంటుంది కూడా.

  7. రామచంద్ర పుత్ర! రామభద్ర! గురించి వాసుదేవరావు ఎరికలపూడి అభిప్రాయం:

    05/20/2017 2:03 am

    Thank you Madhu: The ‘dosham’ spread itself over more than one area that include Chando-dosham too. Nice of you.

    vasu

    eemATa friends: Professor of Physics Dr. D. N. Madhusudana Rao, a writer in Telugu and English, is down the line Sri Dasu Sreeramulu.

  8. రామచంద్ర పుత్ర! రామభద్ర! గురించి దాసు మధుసూదన రావు అభిప్రాయం:

    05/19/2017 8:30 pm

    ’ఎరిక’ గలవానికి జెల్లును
    మరి స్థితులు గతులీపగిది వర్ణింపంగా
    మాకొలది మతులు సేయగలవె కుమతుల
    సుమతులీరీతి దాసు సహ’వాసా.
    (వాసుతో సావాస (దోషం!) వలన అబ్బిన కవన వాసనే. దయచేసి ఛందస్సు కోసం వెతకకండి)

  9. రామరసాయనము గురించి తెలుగువాడు అభిప్రాయం:

    05/19/2017 7:29 am

    అదీ కాక, సాహిత్యం చక్కగా అర్థం అయ్యేవారికి, ప్రతి సారీ అర్థాలిస్తే, అట్టి పాఠకులకు రసభంగమవుతుంది. చేయరాదు. పైగా, ప్రతిసారీ రచయితను ప్రశ్నించితే వారికి ధ్యానభంగమవుతుంది. అది మహాపరాధం. ససేమిరా చేయరాదు.

    చూశారుగదా, నేను ఇక్కడ ప్రశ్నలు వేసిప్పుడు, పత్రిక మూలపురుషులు వచ్చి, రచయితలను వారి టైమ్ నాలాటి వారి మీద వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. రచయితల సమయం విలువైనదట! మరి నా సమయం? మరి కొందరు, ఆ రచయితలేదో తపస్సులో ఉన్నారనీ, వారు తలదించుకుని ఎత్తిన ఘంటం దించకుండా సాహిత్యం రాసేస్తుంటే నేనేదో వారి ధ్యానం భంగం చేసే …చలో జానే దో.

    కాని, మళ్లీ ఈ రచయితలే దేవుడో! నా రచనలు ఎవరూ చదవటల్లేదు అని కుములుతుంటారు. వారికి మళ్లీ కళ్లూ ముక్కూ తుడిచి, ధైర్యం చెప్పటానికి కొందరొస్తారు.

    ఇది అక్షరాలా నిజమండి. ఆ మధ్యన నేను కామెంటు పెడితే ఒకాయన అన్నారు “ఇలాంటి కామెంట్లకి సమాధానం చెప్పడం ఎందుకండీ, వాటి మొహం మీదే ‘నన్ను పట్టించుకోవద్దు’ అని రాసి ఉంటే?” ఆయనకి, ఆయన్ని కలిసిన, తెలిసిన వారికీ ధ్యాన భంగమైంది పాపం. ధ్యాన భంగం అయి ఏడిచినది ఒకరూ ఆయన కళ్ళూ ముక్కూ తుడిచేది మరొకరూ! డబ్బా కొట్టేవాళ్ళు “మా-త్ర-మే” కావాలనుకుంటే సరే. వేమూరి వారు ఓ సారి ఎక్కడో రాసినట్టు గుర్తు – నీ రాతల్ని చీల్చి చెండాడే వాడే నీ నిజమైన స్నేహితుడు అని వాళ్ళ గ్రాడ్యుయేట్ స్కూల్ ప్రొఫెసర్ గారు అన్నారుట. అవి వీళ్ళకి అఖ్ఖర్లేదు. ధ్యాన భంగం అయితే వారు మహా పురుషులు కనక విశ్వామిత్రుడిలా శపించనూ గలరు లేకపోతే వశిష్టుడిలా దిగమింగుకుని క్షమించనూ గలరు. లేకపోతే జాన్ గ్రిషాం రాసిన పెలికాన్ బ్రీఫ్ నవలకీ తెలుగులో మిస్సమ్మ సినిమాకీ పోలికలతో మరో ఖంఢకావ్యం రాసి సాహిత్యలోకం మీద వదలనూ గలరు. శెభాషు.

    ఏది ఏమైనా మీరు నిర్భయంగా చెప్పినందుకు మిమ్మల్ని అభినందించవల్సిందే.

  10. రామరసాయనము గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    05/18/2017 6:58 pm

    శ్రీరామనాథ్ గారి పద్యాలు ఇదివరకు చూసిన గుర్తు లేదు. ధారాశుద్ధి చక్కగా వుంది. కొత్త భావచిత్రాలు కూడ బావున్నాయి. ఐతే ఒక్కో పద్యం ఒక్కో రసాన్ని ప్రతిఫలిస్తుందన్నారు కనుక ఆయా రసాలకు ఉచితమైన పదబంధాలు, పద్యాల నడక ఉంటే ఇంకా బాగుండేదేమోనని అనుకుంటాను. అలాటి ప్రయత్నం కొంతవరకు జరగలేదని కాదుగాని అక్కడక్కడ పదాడంబరం రసానికి ముసుగేసిందేమో?

    ఏమైనా, చక్కటి పద్యాలు రాసిన కవిగారికి అభినందనలు.

    రామారావు