తమ్మినేని యదుకుల భూషణ్ గారు “హిందీలో ప్రేంచంద్ నవలలు తేలిపోవడానికి, జయశంకర్ ప్రసాద్ కథలు వెలిగిపోవడానికి కారణం ఇదే” అన్నారు. మరి ప్రేంచంద్ కథల విషయమో? “ఈద్గాహ్”, “రక్షా మే హత్యా” వంటి కథలు ఎన్నేన్నో – ఆబాలగోపాలం చదివి ఆనందించగలిగినవి. ఎన్నటికీ మరువలేనివి కూడా.
నీవు బ్రతికున్నావు అన్నదానికి దాఖలా:కథ,కవిత లేదా మరే కళాకృతైనా. కథ అనాది నుండి ఉంది.కథ అంటే పిల్లలు ఎందుకు చెవి కోసుకుంటారు?? కలతచెందిన మనసుకు-వెచ్చని ఊహాలోకాల్లో విహరింపజేసి హాయిగొల్పేదికథే కదా.బుద్ధిమార్గం ప్రతి ఒక్కరికీ అనాయాసంగా సిద్ధిస్తుంది.ప్రొద్దున లేచింది మొదలు పక్కలోచేరే దాకా మనం చేసే పనుల్లో బుద్ధి ప్రాబల్యం ఎక్కువ.దాన్నుండి రక్షించేదే కథైనా,కవితైనా.మనందరం అన్నీ మరచి చిన్నపిల్లల్లా కల్పనాజగత్తులో తేలిపోవాలనుకుంటాము.స్థాయీభేదాలతో ఆ అవసరాన్ని తీర్చేవి కథ, నవల.ఈ ప్రాథమిక విషయాన్ని మరచి కథారచన పేరిట మనం చేసే కసరత్తులన్నీ వికటిస్తాయి.కవిత ఒక రూపం ద్వారా, కథ ఒక వాతావరణం ద్వారా వ్యక్తమవుతుంది.
వాతావరణం లేని కథ నీలోని కల్పనాశక్తిని తట్టిలేపదు.నానా వాదాలు (కమ్యూనిజం,ఫెమినిజం,వల్లకాడిజం) తాకేది బుద్ధిని.కథలో ఏ పాత్రకైనా పూనకం వచ్చినట్టు నానా వాదాలను ఏకరువు పెడితే రసాభాసయిపోతుంది.గొప్ప కథను ,మామూలు కథను విడదీసేది, ఈ వాతావరణ కల్పనే.పా.ప,కొ.కు ల కథలను విడదీసేది ఈ లక్షణమే.పా.ప కథలు మనలోతులని తడుముతాయి.కొ.కు కథలు పైపైనే తారాట్లాడుతాయి.ఇద్దరు వారి వారి ఫాయాలో గొప్ప రచయితలే. కొ.కు మంచినీళ్ళ ప్రాయంగా కథారచన చేసినా, ఒక గొప్ప పాత్రను మన కళ్ళముందు నిలపలేక పోయాడు.వేలాది పుటల్లో విస్తరించిన ఆయన కథలు చదివి, పుస్తకం మూసి,కనులు మూసుకుంటే బలంగా మనసు పొరల్లో చొచ్చుకుపోయే పాత్రలు తక్కువ.
గురజాడ కథల్లో వాతావరణ కల్పన ఎంతో ఉజ్వలంగా ఉండి పాత్రలు బలంగా మనసులో దిగబడిపోతాయి.హిందీలో ప్రేంచంద్ నవలలు తేలిపోవడానికి, జయశంకర్ ప్రసాద్ కథలు వెలిగిపోవడానికి కారణం ఇదే.(వాతావరణ కల్పనలో మన గురజాడకు సరిజోడు,దాదాపు ఆయనకు సమకాలికుడు చంద్రధర శర్మ గులేరి ఉస్నే కహా థా (1911)కు సాటి రాగల కథలు హిందీలో నాకు తెలిసి లేవు.ఈయన గురజాడలాగే అనేక భాషల్లో మహా పండితుడు.ఈ కథను ఇదే పేరుతో సినిమా కూడా తీశారు(1961).ఈయన తన జీవిత కాలంలో రాసినవి ముచ్చటగా మూడు కథలే.)
కేవలం వస్తువుంటే చాలు కథయిపోతుంది ,కవితైపోతుంది, అన్న ధోరణి అసలుకే ఎసరు పెడుతుంది.ఈ ధోరణి వల్లే మన భాషలో కల్పనా శక్తిని మెలకువగా కాపాడుకోవలసిన కవులు/రచయితలు కరపత్రాలు రాసే స్తాయికి దిగజారిపోయారు.గతం గతః రాగల కాలంలోనైనా కథా రచయితలు వాతావరణ కల్పన మీద దృష్టి నిలిపితే బుద్ధిబులపాటాలు తగ్గి కథ యథాస్థానానికి చేరి హుందాగా మనగలుగుతుంది.
ఈ దిశలో ఆరి.సీతారామయ్య గారి వ్యాసం మంచి ముందడుగు. క్లుప్తంగా చెప్పవలసింది చెప్పి ముగించడం చాలా గొప్ప విషయం.
“ఇది కొంచెం సమంజసరహితంగా కనిపిస్తున్నది. నాటకంలో క్రమక్రమంగా నటి ముఖ చంద్రుడు కనిపించినట్లు ఒకే రోజున చంద్రరెఖ, అర్ధచంద్రుడు, పూర్ణ చంద్రుడు కనపడరు. సమర్ధించగలరు.” -M.S.Prasad
అంటే -ఆ రాత్రి, నల్ల మబ్బు తెరచాటు నుండి కొంచెం కొంచెంగా , పూర్ణచంద్రుడు బైటికి వచ్చినట్లు అనుకోండి. తిరగబడిన నెలవంక ఏమైనా కంగారు కలిగిస్తున్నదా? 🙂
What about this recurrent natural event, which time and again causes lot of anticipation, concern, pain and joy that Kevin Young penned in “The New Yorker” (Feb,23,2009) under the heading ‘Crowning’ (which is an obstetrical term, indicating a certain stage of labor. )
The poet writes about how a father sees first a little bit of his son’s hair, then the top of his head , then his face, and then his whole body. The father sees the emergence of the baby as:
“she squeezing my hand, her face
full of fire, then groaning your face
out like a blood bloom,
crocussed into the air…
He closes the poem with:
“..now opening
your eyes midnight
blue in the blue-black dawn.”
This too is a beautiful poem. Ancient traditional telugu poetry might not have permitted the description of such a birthing room scene.
వసుచరిత్రములోని ఈ అందమైన పద్యము సంగతికి వస్తే – ‘రాత్రి’ ఆకర్షించినంతగా, ‘పగలు’ మనిషిని ఎప్పుడూ ఆకర్షించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకన్నా ముందు “It often seems to me that the night is much more alive and richly colored than the day” – అని Vincent Van Goghకూ, అతనికన్నా ముందు భట్టుమూర్తికీ, ఎర్రనకూ, నన్నయకూ, ఎన్నోసార్లు ఎప్పుడో అప్పుడు సౌందర్య ప్రియులు అందరికీ అనిపిస్తుంది. అనిపించదూ? 🙂
మీరు చెప్పిన – “కథనం ద్వారానో, పాత్ర నోటినుంచో తను చెప్పదల్చుకున్న విషయం చెప్పలేకపోతే ఇక రచయితకు ఉన్న ఆఖరి మార్గం స్వయంగా వ్యాఖ్యానం చెయ్యటం. ప్రధమ పురుషలో రాసే కథల్లో ఇది సులభంగా వీలవుతుంది. వ్యాఖ్యానం కథకుడి మాటల్లోనో, లేక ఒక పాత్ర ఇలా ఆలోచిస్తుందంటూనో చెయ్యవచ్చు.” అనే పద్దతిని ఉత్తమ పురుషలో చెప్పే కధావిధానం లోకి వస్తుంది కదండీ? ఇక్కడ ప్రధమ పురుష కాదనీ నా అభిప్రాయం. ఏమంటారు?
ఇది కొంచెం సమంజసరహితంగా కనిపిస్తున్నది. నాటకంలో క్రమక్రమంగా నటి ముఖ చంద్రుడు కనిపించినట్లు ఒకే రోజున చంద్రరెఖ, అర్ధచంద్రుడు, పూర్ణ చంద్రుడు కనపడరు. సమర్ధించగలరు.
నేను చంద్రికా పరిణయం అనేకసార్లు చదివి ఆ పై వసు చరిత్ర కొన్ని సార్లు చదివాను. ఇతర పిల్ల వసు చరిత్రలు చదవలేదు కానీ నాకు సురభి మాధవ రాయుల కృతి తల్లి వసు చరిత్ర అనిపిస్తుంది. సమకాలీనులైన మాధవ రాయలు భట్టు మూర్తులలో మాధవరాయులు కవితా సౌరభంలో వినూత్న ప్రయోగాలలో పాండిత్యంలో అధికులనిపిస్తూంది. మీ విశ్లేషణ వ్యాసరూపంగా వీలైతే వెలువరించగలరు.
కామేశ్వర రావు గారూ, “క్లాసికల్” (ప్రాచీన కాదు) సాహిత్యాన్ని మీరు పరిచయం చేస్తే , తొందరగా నేస్తం కట్టెయ్యొచ్చు. ప్రాచీన సాహిత్యాన్ని సత్యనారాయణ వ్రత కథలాగానో, వినాయక వ్రత కథ లాగానో చెప్పెస్తారు సాధారణంగా. ఏదైనా ధర్మసందేహంలాటిది ధైర్యం చేసి అడిగితే, నాలుగు అక్షింతలు నెత్తి మీద వేసేసి దీవించెస్తారు కూడా. దండాలండీ.
ఈ మాట లోనే విశ్వనాధ వారి వ్యాసంలో “కాకువు” గురించి మొదటి సారిగా చదివేను. మళ్ళీ మీరూ అన్నారు. కాకువు అంటే కొంచెం వివరిస్తారూ దయచేసి.
నన్నె చోడుని కాల నిర్ణయాత్మకమైన ఈ వ్యాసం తప్పకుండా, తెలుగు సాహిత్య పరిశోధనా జగత్తుని కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఇంత లోతు పరిశోధన, నిశితమైన తార్కిక స్పూర్తి నిండీ తెలుగు సాహిత్య జగత్తు కే కొత్త వెలుగులు నింపుతుంది. తెలుగు సాహిత్య ప్రాచీనతను చాటుతూనే ఉంటుంది.
ఈమాట లాంటి వెబ్ పత్రికకి సంపాదకులయి ఉండీ మీరు, అయ్యో! గుర్తుగా పేజీ మడతపెట్టుకోవడంలో ఉన్న ఆనందం ఈ ఎలెక్ట్రానిక్ పుస్తకాలతో లేదుగదా, అని వాపోవడం వింతగా ఉంది.
ఎర్ర గుర్తు పెట్టుకున్న మీ సొంత పుస్తకాలన్నీ మీ ఇంట్లో ఉంటే, మీరు డెట్రాయిట్ వెళ్ళి సాహితీ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా అవసరమైతే ఎలా?
“Consider a future device for individual use, which is a sort of mechanized private file and library. It needs a name, and, to coin one at random, “memex” will do. A memex is a device in which an individual stores all his books, records, and communications, and which is mechanized so that it may be consulted with exceeding speed and flexibility. It is an enlarged intimate supplement to his memory.”
అని The Atlantic పత్రికలో Vannevar Bush ఓ ప్రఖ్యాత వ్యాసం, “As We May Think,” లో రాశాడు. రాసి కూడా అరవై ఏళ్ళకి పైనే అయింది. అది ఒక desk లా ఉంటుందనుకున్నాడు. అంతకన్నా సౌకర్యంగా, సంచీలో పుస్తకంలా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటే ఆనందించాల్సిన విషయమే కదా.
మీ సంపాదకీయం చదివే, NYRB లో Darnton వ్యాసమూ దానిపై జరిగిన చర్చా చదివాను. నాకర్థమైనంతవరకు గూగుల్ చేస్తున్నది మంచి పనేననిపిస్తుంది. మీరు మీ nostalgia ని కాస్త పక్కనబెట్టి, తెలుగు ప్రజలు, ప్రచురణ కర్తలు, రచయితలు, వారి వారసులు – వీళ్ళలో ఎవరికి నష్టమో ఇంకాస్త లోతుగా కాకపోయినా స్పష్టంగా వివరిస్తే బావుండేది.
కథ దేని గురించి? గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
03/10/2009 6:26 am
తమ్మినేని యదుకుల భూషణ్ గారు “హిందీలో ప్రేంచంద్ నవలలు తేలిపోవడానికి, జయశంకర్ ప్రసాద్ కథలు వెలిగిపోవడానికి కారణం ఇదే” అన్నారు. మరి ప్రేంచంద్ కథల విషయమో? “ఈద్గాహ్”, “రక్షా మే హత్యా” వంటి కథలు ఎన్నేన్నో – ఆబాలగోపాలం చదివి ఆనందించగలిగినవి. ఎన్నటికీ మరువలేనివి కూడా.
రాజాశంకర్
క్రీడాభిరామము:1 వ భాగం గురించి prakash అభిప్రాయం:
03/10/2009 2:56 am
చాలా మంచి సేకరణ ఇది. మీకు వందనాలు.
అయితే, సరళమైన తెలుగు భావం ఇస్తే బాగుంటుంది
నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి M.S.Prasad అభిప్రాయం:
03/09/2009 11:25 pm
సమర్ధన చాలా సమంజసంగా వున్నది. కృతజ్ఞుడిని.
కథ దేని గురించి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
03/09/2009 6:41 pm
నీవు బ్రతికున్నావు అన్నదానికి దాఖలా:కథ,కవిత లేదా మరే కళాకృతైనా. కథ అనాది నుండి ఉంది.కథ అంటే పిల్లలు ఎందుకు చెవి కోసుకుంటారు?? కలతచెందిన మనసుకు-వెచ్చని ఊహాలోకాల్లో విహరింపజేసి హాయిగొల్పేదికథే కదా.బుద్ధిమార్గం ప్రతి ఒక్కరికీ అనాయాసంగా సిద్ధిస్తుంది.ప్రొద్దున లేచింది మొదలు పక్కలోచేరే దాకా మనం చేసే పనుల్లో బుద్ధి ప్రాబల్యం ఎక్కువ.దాన్నుండి రక్షించేదే కథైనా,కవితైనా.మనందరం అన్నీ మరచి చిన్నపిల్లల్లా కల్పనాజగత్తులో తేలిపోవాలనుకుంటాము.స్థాయీభేదాలతో ఆ అవసరాన్ని తీర్చేవి కథ, నవల.ఈ ప్రాథమిక విషయాన్ని మరచి కథారచన పేరిట మనం చేసే కసరత్తులన్నీ వికటిస్తాయి.కవిత ఒక రూపం ద్వారా, కథ ఒక వాతావరణం ద్వారా వ్యక్తమవుతుంది.
వాతావరణం లేని కథ నీలోని కల్పనాశక్తిని తట్టిలేపదు.నానా వాదాలు (కమ్యూనిజం,ఫెమినిజం,వల్లకాడిజం) తాకేది బుద్ధిని.కథలో ఏ పాత్రకైనా పూనకం వచ్చినట్టు నానా వాదాలను ఏకరువు పెడితే రసాభాసయిపోతుంది.గొప్ప కథను ,మామూలు కథను విడదీసేది, ఈ వాతావరణ కల్పనే.పా.ప,కొ.కు ల కథలను విడదీసేది ఈ లక్షణమే.పా.ప కథలు మనలోతులని తడుముతాయి.కొ.కు కథలు పైపైనే తారాట్లాడుతాయి.ఇద్దరు వారి వారి ఫాయాలో గొప్ప రచయితలే. కొ.కు మంచినీళ్ళ ప్రాయంగా కథారచన చేసినా, ఒక గొప్ప పాత్రను మన కళ్ళముందు నిలపలేక పోయాడు.వేలాది పుటల్లో విస్తరించిన ఆయన కథలు చదివి, పుస్తకం మూసి,కనులు మూసుకుంటే బలంగా మనసు పొరల్లో చొచ్చుకుపోయే పాత్రలు తక్కువ.
గురజాడ కథల్లో వాతావరణ కల్పన ఎంతో ఉజ్వలంగా ఉండి పాత్రలు బలంగా మనసులో దిగబడిపోతాయి.హిందీలో ప్రేంచంద్ నవలలు తేలిపోవడానికి, జయశంకర్ ప్రసాద్ కథలు వెలిగిపోవడానికి కారణం ఇదే.(వాతావరణ కల్పనలో మన గురజాడకు సరిజోడు,దాదాపు ఆయనకు సమకాలికుడు చంద్రధర శర్మ గులేరి ఉస్నే కహా థా (1911)కు సాటి రాగల కథలు హిందీలో నాకు తెలిసి లేవు.ఈయన గురజాడలాగే అనేక భాషల్లో మహా పండితుడు.ఈ కథను ఇదే పేరుతో సినిమా కూడా తీశారు(1961).ఈయన తన జీవిత కాలంలో రాసినవి ముచ్చటగా మూడు కథలే.)
కేవలం వస్తువుంటే చాలు కథయిపోతుంది ,కవితైపోతుంది, అన్న ధోరణి అసలుకే ఎసరు పెడుతుంది.ఈ ధోరణి వల్లే మన భాషలో కల్పనా శక్తిని మెలకువగా కాపాడుకోవలసిన కవులు/రచయితలు కరపత్రాలు రాసే స్తాయికి దిగజారిపోయారు.గతం గతః రాగల కాలంలోనైనా కథా రచయితలు వాతావరణ కల్పన మీద దృష్టి నిలిపితే బుద్ధిబులపాటాలు తగ్గి కథ యథాస్థానానికి చేరి హుందాగా మనగలుగుతుంది.
ఈ దిశలో ఆరి.సీతారామయ్య గారి వ్యాసం మంచి ముందడుగు. క్లుప్తంగా చెప్పవలసింది చెప్పి ముగించడం చాలా గొప్ప విషయం.
తమ్మినేని యదుకుల భూషణ్.
నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి lyla yerneni అభిప్రాయం:
03/09/2009 11:29 am
అంటే -ఆ రాత్రి, నల్ల మబ్బు తెరచాటు నుండి కొంచెం కొంచెంగా , పూర్ణచంద్రుడు బైటికి వచ్చినట్లు అనుకోండి. తిరగబడిన నెలవంక ఏమైనా కంగారు కలిగిస్తున్నదా? 🙂
What about this recurrent natural event, which time and again causes lot of anticipation, concern, pain and joy that Kevin Young penned in “The New Yorker” (Feb,23,2009) under the heading ‘Crowning’ (which is an obstetrical term, indicating a certain stage of labor. )
The poet writes about how a father sees first a little bit of his son’s hair, then the top of his head , then his face, and then his whole body. The father sees the emergence of the baby as:
“she squeezing my hand, her face
full of fire, then groaning your face
out like a blood bloom,
crocussed into the air…
He closes the poem with:
“..now opening
your eyes midnight
blue in the blue-black dawn.”
This too is a beautiful poem. Ancient traditional telugu poetry might not have permitted the description of such a birthing room scene.
వసుచరిత్రములోని ఈ అందమైన పద్యము సంగతికి వస్తే – ‘రాత్రి’ ఆకర్షించినంతగా, ‘పగలు’ మనిషిని ఎప్పుడూ ఆకర్షించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకన్నా ముందు “It often seems to me that the night is much more alive and richly colored than the day” – అని Vincent Van Goghకూ, అతనికన్నా ముందు భట్టుమూర్తికీ, ఎర్రనకూ, నన్నయకూ, ఎన్నోసార్లు ఎప్పుడో అప్పుడు సౌందర్య ప్రియులు అందరికీ అనిపిస్తుంది. అనిపించదూ? 🙂
లైలా.
కథ దేని గురించి? గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/09/2009 7:31 am
సీతారామయ్య గారూ,
మీరు చెప్పిన – “కథనం ద్వారానో, పాత్ర నోటినుంచో తను చెప్పదల్చుకున్న విషయం చెప్పలేకపోతే ఇక రచయితకు ఉన్న ఆఖరి మార్గం స్వయంగా వ్యాఖ్యానం చెయ్యటం. ప్రధమ పురుషలో రాసే కథల్లో ఇది సులభంగా వీలవుతుంది. వ్యాఖ్యానం కథకుడి మాటల్లోనో, లేక ఒక పాత్ర ఇలా ఆలోచిస్తుందంటూనో చెయ్యవచ్చు.” అనే పద్దతిని ఉత్తమ పురుషలో చెప్పే కధావిధానం లోకి వస్తుంది కదండీ? ఇక్కడ ప్రధమ పురుష కాదనీ నా అభిప్రాయం. ఏమంటారు?
నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి M.S.Prasad అభిప్రాయం:
03/09/2009 3:01 am
ఇది కొంచెం సమంజసరహితంగా కనిపిస్తున్నది. నాటకంలో క్రమక్రమంగా నటి ముఖ చంద్రుడు కనిపించినట్లు ఒకే రోజున చంద్రరెఖ, అర్ధచంద్రుడు, పూర్ణ చంద్రుడు కనపడరు. సమర్ధించగలరు.
నేను చంద్రికా పరిణయం అనేకసార్లు చదివి ఆ పై వసు చరిత్ర కొన్ని సార్లు చదివాను. ఇతర పిల్ల వసు చరిత్రలు చదవలేదు కానీ నాకు సురభి మాధవ రాయుల కృతి తల్లి వసు చరిత్ర అనిపిస్తుంది. సమకాలీనులైన మాధవ రాయలు భట్టు మూర్తులలో మాధవరాయులు కవితా సౌరభంలో వినూత్న ప్రయోగాలలో పాండిత్యంలో అధికులనిపిస్తూంది. మీ విశ్లేషణ వ్యాసరూపంగా వీలైతే వెలువరించగలరు.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి baabjeelu అభిప్రాయం:
03/08/2009 9:12 pm
కామేశ్వర రావు గారూ, “క్లాసికల్” (ప్రాచీన కాదు) సాహిత్యాన్ని మీరు పరిచయం చేస్తే , తొందరగా నేస్తం కట్టెయ్యొచ్చు. ప్రాచీన సాహిత్యాన్ని సత్యనారాయణ వ్రత కథలాగానో, వినాయక వ్రత కథ లాగానో చెప్పెస్తారు సాధారణంగా. ఏదైనా ధర్మసందేహంలాటిది ధైర్యం చేసి అడిగితే, నాలుగు అక్షింతలు నెత్తి మీద వేసేసి దీవించెస్తారు కూడా. దండాలండీ.
ఈ మాట లోనే విశ్వనాధ వారి వ్యాసంలో “కాకువు” గురించి మొదటి సారిగా చదివేను. మళ్ళీ మీరూ అన్నారు. కాకువు అంటే కొంచెం వివరిస్తారూ దయచేసి.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి పవన్ కుమార్ గరికపాటి అభిప్రాయం:
03/08/2009 6:29 pm
నన్నె చోడుని కాల నిర్ణయాత్మకమైన ఈ వ్యాసం తప్పకుండా, తెలుగు సాహిత్య పరిశోధనా జగత్తుని కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఇంత లోతు పరిశోధన, నిశితమైన తార్కిక స్పూర్తి నిండీ తెలుగు సాహిత్య జగత్తు కే కొత్త వెలుగులు నింపుతుంది. తెలుగు సాహిత్య ప్రాచీనతను చాటుతూనే ఉంటుంది.
పవన్ కుమార్ గరికపాటి
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/08/2009 10:55 am
వేలూరి గారికి,
ఈమాట లాంటి వెబ్ పత్రికకి సంపాదకులయి ఉండీ మీరు, అయ్యో! గుర్తుగా పేజీ మడతపెట్టుకోవడంలో ఉన్న ఆనందం ఈ ఎలెక్ట్రానిక్ పుస్తకాలతో లేదుగదా, అని వాపోవడం వింతగా ఉంది.
ఎర్ర గుర్తు పెట్టుకున్న మీ సొంత పుస్తకాలన్నీ మీ ఇంట్లో ఉంటే, మీరు డెట్రాయిట్ వెళ్ళి సాహితీ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా అవసరమైతే ఎలా?
“Consider a future device for individual use, which is a sort of mechanized private file and library. It needs a name, and, to coin one at random, “memex” will do. A memex is a device in which an individual stores all his books, records, and communications, and which is mechanized so that it may be consulted with exceeding speed and flexibility. It is an enlarged intimate supplement to his memory.”
అని The Atlantic పత్రికలో Vannevar Bush ఓ ప్రఖ్యాత వ్యాసం, “As We May Think,” లో రాశాడు. రాసి కూడా అరవై ఏళ్ళకి పైనే అయింది. అది ఒక desk లా ఉంటుందనుకున్నాడు. అంతకన్నా సౌకర్యంగా, సంచీలో పుస్తకంలా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటే ఆనందించాల్సిన విషయమే కదా.
మీ సంపాదకీయం చదివే, NYRB లో Darnton వ్యాసమూ దానిపై జరిగిన చర్చా చదివాను. నాకర్థమైనంతవరకు గూగుల్ చేస్తున్నది మంచి పనేననిపిస్తుంది. మీరు మీ nostalgia ని కాస్త పక్కనబెట్టి, తెలుగు ప్రజలు, ప్రచురణ కర్తలు, రచయితలు, వారి వారసులు – వీళ్ళలో ఎవరికి నష్టమో ఇంకాస్త లోతుగా కాకపోయినా స్పష్టంగా వివరిస్తే బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు