మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు 🙂 కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
విధేయుడు – మోహన
ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు 🙁
బాబా గారు!
అద్భుతమైన కవితను పరిచయం చేశారు. ఆ తడబాటు కూడా కవి తన శైలిలో చూపినట్లుంది. అనుభూతితో నిండిపోయింది.
”ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.”
* * * *
“రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.”
”అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
* * * *
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము”
నా హృదయాన్నేదో ఆవహించినట్లుందీ కవిత చదువుతుంటే!
బాబాగారూ! మీది మంచి టేస్ట్!
అభినందనలు.
మీ
దార్ల
1957 లో ముసునూరి వేంకటశాస్త్రి గారు ఒక 80000 పదాలతో..”శబ్దార్ధ దీపిక” ని రూపొందించారు. ఉన్న వాటిల్లో చాలా ఉపయోగకరమైన..చాలా కృషి తో కూడిన నిఘంటువు ఇది. ఇలాంటి నిఘంటువు గురించి తెలిసిన వారు కూడా తక్కువ అనుకుంటాను. ఈ నిఘంటువు గనక అచ్చులో లభ్యమైతే ఎంత మందికో ఉపయోగంగా ఉంటుంది.దీన్ని ముద్రించగల్గితే తెనుగు వారికి చాలా మేలు చేసిన వారౌతారు.1430 పేజీలకు పైబడి ఉన్న పుస్తకం ఇది.
ఈమాట పాత సంచికల్లో జాషువా గారి కవిత్వంపై (ఫిరదౌసి) చక్కని విశ్లేషణ ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి, “20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తులు” లో ఒకరిగా గుర్తించబడిన శ్రీ జాషువా గురించి నాలుగు మాటలు ఇక్కడ చెప్పుకోవటం అవసరం. శ్రీ తిరుమల రామచంద్ర గారు, శ్రీ నీలంరాజు మురళీధర్ గార్లు (అందమైన చాయాచిత్రాలు తీసిన వారు) కలసి, ఆంధ్రప్రభ కోరిక మేర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేసి, వ్యాసాల రూపంలో అందంగా ఫొటోలతో సహా 1960 దశాబ్దంలో ప్రచురించారు. అదే “మరపురాని మనీషి – 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు”. ఈ వ్యాస సంపుటికి తరవాత “అజో-విభో” ఫౌండేషన్ వారు పుస్తక రూపాన్నిచ్చారు. అందులోవి ఈ నాలుగు మాటలు శ్రీ గుర్రం జాషువాపై ఉన్నాయి.
గుర్రంవారు ఒక మారు వార్ధాకు గాంధీజీ దర్శనం కోసం వెళ్ళారు. అక్కడున్న ఒక జర్మన్ పండితునికి ఒక రాజకీయ నాయకుడు వారిని “దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ పొయట్” అని పరిచయం చేసారట. ఆ విదేశీ పండితుడు ఆశ్చర్యపడి ఆ నాయకుని వైపు చూశాడట. కవితకు కులమతాలు అంటగట్టటం ఎలాంటి సభ్యతో అర్ధం కావటంలేదంటారు గుర్రంవారు. “విశ్వమానవ సౌభ్రాత్రం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి, ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా కవిత్వాలంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికే ప్రయత్నించాను. గహనసంచారం లేని కవిత్వం నా లక్ష్యం” అని స్పష్టపరిచారు గుర్రంవారు.
I don’t think i am qualified to talk about this story,…….
I don’t belong to your generation, and my father’s story is not similar to this,………….. but, i am reading this story again and again from past 3 years, without fail, whenever i want to feel my nanna…………
sometimes i don’t even bother to wipe my tears,………….
thank you! for this great heart touching story,…………………
కథ బావుందండి మీరు కథ చెప్పిన తీరు నచ్చింది.
ఇప్పటి తెలుగు సినిమా దర్శకులలో లేని విషయం మీలో ఉందని నాకనిపిస్తుంది.
మీరేదయినా తెలుగు సినిమాకు కథనం (స్క్రీన్ ప్లే) సమకూరిస్తే బావుంటుందని నా అభిప్రాయం.
ఇది నేను మనస్పూర్తిగా చెబుతున్నా.
మా రచనలు చేతితో రాసి స్కాన్ చేసి జె పి జె ఫయిల్ గా ఈమెయిల్ లో ఏల పంపించ కూడ దు.
[ఒకవేళ మీ చేతిరాత ముత్యాలు పేర్చినట్టున్నా కూడా, మీ చేతిరాతను మళ్ళీ మేము మా సమయం వెచ్చించో, ఇంకెవరికైనా డబ్బిచ్చో మేము మళ్ళీ టైపు చేయించాల్సి వస్తుంది. ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప, ఇలా చేయడం మాకు కుదరని పని. అంతే కాక, మీరు ఇమేజీ ఫైల్స్ పంపితే వాటిలోంచి టెక్స్ట్ ని ఎక్స్‌ట్రాక్ట్ చేసే సదుపాయం లేదు మాకు ప్రస్తుతం. అందువల్లనే, RTS లేదా యూనికోడ్ తెలుగులో మాత్రమే మీ రచనలని పంపగలరు – సం.]
బ్రహ్మానందం గారూ!! నేను మీ అభిప్రాయం తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. -rama bharadwaj
అభిప్రాయము బ్రహ్మానందం గారిది, మీరు కేవలం ఏకీభవించేవారు కావటాన – బ్రహ్మానందం గారి ఆ అభిప్రాయాన్ని quotes లో ఇస్తారా. Thanks.
“లైలా గారూ, […..] మీ వాదనెలా వుందంటే కాపీ కొట్టడం తప్పు కాదు కానీ అలా గొంతెత్తడం నేరమన్నట్లుగా వుంది.” -Sai Brahmanandam
” నేను ఈనాడు వాళ్ళకి కాల్ చేసింది ఆ సదరు రచయిత వుద్యోగం పీకించడానికి కాదు, కేవలం నా నిరసన తెలియజేయడానికే! అదే వ్యక్తి మరో కథనం రాసిస్తే ఆ పత్రికా యాజమాన్యం కాస్త ఓ కన్నేసి చూస్తారనంతే!” – Sai Brahmanandam
మీ రాతలను కాపీ కొట్టినట్లు ఎవరు ఋజువు చేశారు? ఋజువు చెయ్యకుండా కాపీకొట్టేశారని అపవాదులు (slander/libel) వెయ్యటం మాత్రం నేరం కాదూ?
ఎందుకు ఆ సదరు రచయిత మీద – రచనలు కాపీ కొడుతున్నాడని అనుమానం, అపనమ్మకం పత్రికాధికారులకు రేకెత్తించటం? ఎందుకా నేరస్థుడి ముద్ర?
“సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మా తండ్రి [….]భాగవతాగ్రేసరు లెవరో వారెల్లరు వర త్యాగరాజునకు పరమ బాంధవులు” అని లలిత రాగంలో రచించి, పాడుకున్న ఆ భక్తుడు త్యాగరాజూ గురించి వ్యాసం రాసిన మీకు – మరి ఆ సీతా రాముల కథ గురించి తెలియకుండా ఉంటుందా.
అపవాదు మనిషికి ఎంత చెరుపు చేస్తుందో వారి చరిత్ర మనకు చెప్పదూ! రాముడు అపవాదు భయానికి జడిసి సీతను అగ్ని పరీక్షకు గురిచేశాడు అంటారు గదా!
ఆ తర్వాత, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం, శ్రీరాముడు తన ఇంట్లో వాళ్ళతో – సీత మీద ఒక కన్నేసి ఉంచండి- అని చెప్పి ఉండాల్సిందా? 🙂 అసలు సీత తప్పేమీ చెయ్యకుండానే! How demeaning!
సర్లెండి! ఒక చాకలి వెర్రివాగుడుకి, రాముడికి చిర్రెత్తి కాదూ , సీతను ఆడివిలో వదిలి పెట్టించింది. సీతకు పట్టపురాణి పదవి పోయిందీ, జీవితం తారుమారయ్యిందీ – ఆ చాకలి అపవాదు వల్లేగా?. 🙂
మీరు మీ కాపీరైటు, దొంగతనం దాఖలాలు చూపిస్తూ ‘ఈనాడు’ పత్రిక యాజమాన్యం చెప్పిన మార్గంలోనే మీ అభియోగం ఫైల్ చేసుకోవచ్చు గదండి.
చౌర్యం ఋజువయ్యేదాకా ఆగాలి. తప్పదు. ఈ లోపలే ‘ఈమాట’ పత్రిక లో ప్రచురించబడిన మీ వ్యాసం నుండి మీ ‘సొంత వాక్యాలు’ ఎవరో రచయిత దొంగిలించినట్లు, ఈ పత్రికలో -అభిప్రాయాల విభాగం లో ‘వాదు’ వెయ్యటం సరి కాదు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి mOhana అభిప్రాయం:
09/02/2009 5:29 am
మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు 🙂 కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
విధేయుడు – మోహన
తెలుగు నిఘంటువు గురించి… గురించి Sowmya అభిప్రాయం:
09/01/2009 11:30 pm
ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు 🙁
ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి Dr.Darla అభిప్రాయం:
09/01/2009 10:19 pm
బాబా గారు!
అద్భుతమైన కవితను పరిచయం చేశారు. ఆ తడబాటు కూడా కవి తన శైలిలో చూపినట్లుంది. అనుభూతితో నిండిపోయింది.
”ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.”
* * * *
“రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.”
”అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
* * * *
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము”
నా హృదయాన్నేదో ఆవహించినట్లుందీ కవిత చదువుతుంటే!
బాబాగారూ! మీది మంచి టేస్ట్!
అభినందనలు.
మీ
దార్ల
తెలుగు నిఘంటువు గురించి… గురించి rama bharadwaj అభిప్రాయం:
09/01/2009 2:57 pm
1957 లో ముసునూరి వేంకటశాస్త్రి గారు ఒక 80000 పదాలతో..”శబ్దార్ధ దీపిక” ని రూపొందించారు. ఉన్న వాటిల్లో చాలా ఉపయోగకరమైన..చాలా కృషి తో కూడిన నిఘంటువు ఇది. ఇలాంటి నిఘంటువు గురించి తెలిసిన వారు కూడా తక్కువ అనుకుంటాను. ఈ నిఘంటువు గనక అచ్చులో లభ్యమైతే ఎంత మందికో ఉపయోగంగా ఉంటుంది.దీన్ని ముద్రించగల్గితే తెనుగు వారికి చాలా మేలు చేసిన వారౌతారు.1430 పేజీలకు పైబడి ఉన్న పుస్తకం ఇది.
రమ.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/01/2009 10:13 am
ఈమాట పాత సంచికల్లో జాషువా గారి కవిత్వంపై (ఫిరదౌసి) చక్కని విశ్లేషణ ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి, “20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తులు” లో ఒకరిగా గుర్తించబడిన శ్రీ జాషువా గురించి నాలుగు మాటలు ఇక్కడ చెప్పుకోవటం అవసరం. శ్రీ తిరుమల రామచంద్ర గారు, శ్రీ నీలంరాజు మురళీధర్ గార్లు (అందమైన చాయాచిత్రాలు తీసిన వారు) కలసి, ఆంధ్రప్రభ కోరిక మేర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేసి, వ్యాసాల రూపంలో అందంగా ఫొటోలతో సహా 1960 దశాబ్దంలో ప్రచురించారు. అదే “మరపురాని మనీషి – 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు”. ఈ వ్యాస సంపుటికి తరవాత “అజో-విభో” ఫౌండేషన్ వారు పుస్తక రూపాన్నిచ్చారు. అందులోవి ఈ నాలుగు మాటలు శ్రీ గుర్రం జాషువాపై ఉన్నాయి.
గుర్రంవారు ఒక మారు వార్ధాకు గాంధీజీ దర్శనం కోసం వెళ్ళారు. అక్కడున్న ఒక జర్మన్ పండితునికి ఒక రాజకీయ నాయకుడు వారిని “దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ పొయట్” అని పరిచయం చేసారట. ఆ విదేశీ పండితుడు ఆశ్చర్యపడి ఆ నాయకుని వైపు చూశాడట. కవితకు కులమతాలు అంటగట్టటం ఎలాంటి సభ్యతో అర్ధం కావటంలేదంటారు గుర్రంవారు. “విశ్వమానవ సౌభ్రాత్రం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి, ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా కవిత్వాలంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికే ప్రయత్నించాను. గహనసంచారం లేని కవిత్వం నా లక్ష్యం” అని స్పష్టపరిచారు గుర్రంవారు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
మధ్యాహ్నం మాణిక్యం గురించి asmita అభిప్రాయం:
08/30/2009 6:06 pm
I don’t think i am qualified to talk about this story,…….
I don’t belong to your generation, and my father’s story is not similar to this,………….. but, i am reading this story again and again from past 3 years, without fail, whenever i want to feel my nanna…………
sometimes i don’t even bother to wipe my tears,………….
thank you! for this great heart touching story,…………………
అస్మిత
త్రిల్ గురించి Venugopal Turlapaty అభిప్రాయం:
08/30/2009 10:07 am
కథ బావుందండి మీరు కథ చెప్పిన తీరు నచ్చింది.
ఇప్పటి తెలుగు సినిమా దర్శకులలో లేని విషయం మీలో ఉందని నాకనిపిస్తుంది.
మీరేదయినా తెలుగు సినిమాకు కథనం (స్క్రీన్ ప్లే) సమకూరిస్తే బావుంటుందని నా అభిప్రాయం.
ఇది నేను మనస్పూర్తిగా చెబుతున్నా.
విధేయుడు,
వేణుగోపాల్ తుర్లపాటి
రచయితలకు సూచనలు గురించి Rohiniprasad అభిప్రాయం:
08/26/2009 11:44 am
Attn. sudhama
You can easily make use of a fcility like lekhini.org and then copy/paste your article in MSWord format for emailing.
రచయితలకు సూచనలు గురించి sudhama అభిప్రాయం:
08/26/2009 6:33 am
మా రచనలు చేతితో రాసి స్కాన్ చేసి జె పి జె ఫయిల్ గా ఈమెయిల్ లో ఏల పంపించ కూడ దు.
[ఒకవేళ మీ చేతిరాత ముత్యాలు పేర్చినట్టున్నా కూడా, మీ చేతిరాతను మళ్ళీ మేము మా సమయం వెచ్చించో, ఇంకెవరికైనా డబ్బిచ్చో మేము మళ్ళీ టైపు చేయించాల్సి వస్తుంది. ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప, ఇలా చేయడం మాకు కుదరని పని. అంతే కాక, మీరు ఇమేజీ ఫైల్స్ పంపితే వాటిలోంచి టెక్స్ట్ ని ఎక్స్‌ట్రాక్ట్ చేసే సదుపాయం లేదు మాకు ప్రస్తుతం. అందువల్లనే, RTS లేదా యూనికోడ్ తెలుగులో మాత్రమే మీ రచనలని పంపగలరు – సం.]
మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి lyla yerneni అభిప్రాయం:
08/25/2009 9:04 pm

లైలా