కధలో కధకురాలి డిప్రెషన్ కి మూలమేంటో ఎక్కడైనా సూచిస్తారనుకునే లోపే కధ మలుపు తిరిగింది. మరీ ఇంత సూక్ష్మాంశం మీద టెలిస్కోప్ పెట్టడం సౌమ్య గారికి ప్రత్యేకమైన రచనాశిల్పం అనుకుంటా.
వ్యాసం బాగుంది. శైలిదేముంది లెండి, ఒకరికి మామూలు అన్నం,ఇంకోడికి పరమాన్నం, ఇంకొకరికి రాళ్ళతోకూడిన నూకన్నం.
ప్రతివారూ తానూ మాట్లాడే ప్రతి విషయంలోనూ, రాసే ప్రతి రాతలోనూ ఒక విధమైన అనుభవం ఉండబట్టి మాట్టాడతారు, రాస్తారు. కానీ ఆమాటల్లో, రాతల్లో సారం పాఠకులకు వారి వారి యోగ్యతానుసారం, గ్రహణశక్తానుసారం నివేదన చేసిన విషయం గ్రహణమవుతూ ఉంటుందని భవదీయుడి అభిప్రాయం. మీరు మటుకు ఇలాగే రాస్తూ ఉండండి. సానపెడుతూనే ఉండండి. కొద్దిరోజుల్లోనే కొంతమందికి వజ్రాల గని దొరుకుతుంది.
ఒకమాట చెప్పాలె – అంత గొప్పకవిగా ప్రశంశలు అందుకున్న నాగార్జున కవిగారి గురించి ఇతర పాఠకులకి తెలిసినంతగా ఇప్పటిదాకా నాకు తెలియదు. నిజం చెప్పాలంటే అసలలాటాయన ఒకడున్నాడని కూడా తెలియదు. 🙂 .. కానీ మీ వ్యాసం చదివాక నా అభిప్రాయం మారింది. ఎటువైపుకు దారితీస్తుందో తెలియదుకానీ… ధన్యవాదాలు
ఇంగ్లీషు పత్రికలని చూసి ఆ పధ్ధతిలో తెలుగు పత్రికలలో రచయితలూ కవులూ అనబడువారికి కొంత నాగరికతని నేర్పుదామని ఈమాట వారి ఊహ కావొచ్చు. ఈ “పీర్ రివ్యూ” పధ్ధతిని పరిచయం చేయడం!!
ఇంగ్లీషులో కుప్పలు తెప్పలుగా రచనలు వచ్చి పడతాయి. అందులో ఎంపికకి కావలసినంత వీలుంటుంది. అంగీకరించడానికీ..లేదా తిరస్కరించడానికీనూ!! కానీ తెలుగున రచనలు చేయగల్గిన వారి సంఖ్య వేళ్ళమీదలెఖ్ఖపెట్టవలిసిందే!! ఇందులో ఇంక ఎంపిక కి అవకాశం బహు తక్కువ. ఇంక వడపోత కార్యక్రమానికి దిగితే గనక మిగిలేదెవ్వరూ ఉండరు. అదే జరిగింది ఈమాట లో!! ఇంకో ముఖ్య మైన విషయం సీరియస్ రచయితలలాగే తెలుగున నిజానికి కమర్షియల్ రచనలు చేసే వారికీ కొరతే అని చెప్పాలి. ఆ మల్లాది ..యండమూరి..లేదా పట్టాభిరామ్ వంటీ మనస్తత్వ విశ్లేషకులు వంటి వారే ఉన్న కుర్చీలని ఆక్రమించుకుని కూర్చున్నవారు. అంటే తెనుగు అటువంటి రచయితలకి కూడా చాలా కొరత ఉందనే అర్ధం!! అసలు రాసేవాళ్ళే తక్కువ. అందునా మనసుని ఆకట్టుకునేలా రాయగల చతురత కల్గిన వారు ఇంకా తక్కువ. అన్ని రంగాలలోనూ కూడా!! ముందు ఈ సంగతిని గుర్తిస్తే అప్పుడు ఇంగ్లీషు పత్రికలలోని నమూనాని యధావిధిగా అమలు చేయలేమన్నది ఈమాట వారు గమనించవచ్చు.
అలాగే ఇంగ్లీషు పత్రికలవారిచ్చే రెమ్యునరేషన్ ని ఈమాట అనుసరించదలుచుకోలేదు. కారణాలు ఏమైనా!! మేము మాకు కావలసిన పధ్ధతిలో మాత్రమే విషయాలని నిర్ణయిస్తామూ ..మేము తెలుగు పాఠకులనీ రచయితలనీ సంస్క్కరిస్తామూ అంటే మరి వీటి విషయంలో మీ నాగరికత ఏమైందన్న విషయాన్ని అడగడం లో ఎవరైనా గానీ తప్పులేదు. గనక ముందు ఈమాట తన బాటని స్పస్టపరుచుకుంటే అటుపిమ్మట తెలుగు రచయితలకి వారెవరైనా గానీ ..రాయడంలో విధినిషేధాలు విధించే అర్హతని సంపాదించవచ్చును.
తెలుగున అదేదో ఒక మోటు సామెత ఉంది ..అందరికీ తెలిసినదే గనక నేను దానిని ప్రస్తావన చేయ పనిలేదు కానీ.. నాకు తెలుగు వారి కి మహా కవులని గురించి పరిచయం చేసే శక్తీ ..ఆసక్తీ రెండూ లేవు. అందుకే మీరు చేసే ప్రయత్నాన్ని అభినందించాను. ఆ పని మీరు మరింత శ్రధ్ధగా చేయగలిగితే బాగుంటుందని సూచన చేసాను. కవిత్వాన్ని అనువాదంచేసే భాష విషయంలో!! కవితా వాక్యాలు చాలా శక్తిమంతమైనవి గనక..వాటి విషయంలో శ్రధ్ధ అవసరం..కానీ ఇది వారి శక్తికి సంబంధించిన విషయమ్ నిజానికి. అందువలన ఆశించగలమే గానీ నిజంగా ఎంత చక్కగా రాయగలరూ.. అన్నది సందేహాస్పదమే!! ఔను.. నాకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి కొన్నిటి విషయంలో . అందులో ముఖ్యమైనది “చదివించే గుణం” అన్నది. వచనంలో విషయమ్ క్లుప్తంగా..సూటిగా ఉండాలి అన్నది. నస వాక్యాలని నేను చదవలేను. నాకు విసుగు . గనక సాధారణంగా చదవడానికి అంత ఉత్సాహం చూపించను. అందునా విప్లవ సంఘాల వారి తెలుగు వచనం అంటే చెప్పలేని చికాకు. వారు నలుగురికీ తెలియవలసిన ముఖ్య విషయాలని కూడా తమ పడికట్టు వాక్యాలతో పాఠకులని విషయానికి దూరంచేసి పారిపోయేలా చేయగల సమర్ధులు మరి.
Thanks for an interesting and informative article on Sri Ramesh naidu and his good rare songs with audio clips. I request you to kindly write on Sri Adinarayana rao and his good work.
నెలకి ఒక కవిని పరిచయం చేసినా సంవత్సరానికి 12 మంది భారతీయ కవులని తెలుగు పాఠకులకి పరిచయం చేయవచ్చును. తెలుగు వారు అజ్ఞానులు అని పది సార్లు జపించే బదులు ఈ దిశ గా మీరు ప్రయత్నమ్ చేస్తే బాగుంటుంది.
తెలుగు కవితా భాషలోనూ , అనువాదంలోనూ సాధన చేయటానికి కావలసిన వెసులుబాటు నాకు ఉండదు. ఇప్పటికైనా నాగార్జు న పేరు తెలిసింది, ఆయన చేసిన పని గురించి తెలిసింది కాబట్టి సమర్థులైన వాళ్ళు , ఆసక్తి ఉన్న వారూ ఆ పనికి ఎప్పుడో అప్పుడు తప్పకుండా పూనుకుంటారనే నా ఆశ.
మూడు దశాబ్దాల కాలంలో బాలగోపాల్ వ్రాసిన సాహిత్య సాంస్కృతిక విమర్శని సమీక్షించే సందర్భంలో ఆయన తెలుగు కవులని కవిత్వాన్నీ ఎట్లా పట్టించుకున్నాడో ఎట్లా పట్టించుకోలేదో అంచనా వేయటం అవసరమే. నేను వ్రాసినది సమీక్షా వ్యాసం కాదు కాబట్టి నేను ఆయన చేయని పనులు ఏమిటి అన్నది నేను ఈ సందర్భంలో ఎత్తలేదు. నేను చేసినది ఆయన తాత్విక చింతనలో తెలుగు కవులకి పనికొచ్చే విషయాన్ని ఎత్తి చూపించడం. సరళంగా, స్పష్టంగా రాయటం అవసరమే. నాకుండే పరిమితులకు లోబడి తప్పకుండా ప్రయత్నం చేస్తాను .
మీకు విసుగు పుట్టించకుండా వ్రాయటం అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఆ దిశగా నేను ప్రయత్నం చేయ దలుచుకోలేదు. మీ వ్యాఖ్యని బట్టి చూస్తే ఈ విషయం పట్ల మీకు బలమైన అభిప్రాయాలున్నట్టు కనపడుతోంది. అదేమిటో మీరు విశద పరిస్తే బండి ముందుకి కదులుతుంది.
సాధారణంగా పీర్ రెవ్యూ అనే ప్రక్రియ రెండు లక్ష్యాలతో జరుగుతుంది. ఒకటి – సంపాదకవర్గం తమ తమ ఇష్టా ఇష్టాల మీద ఆధార పడి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఆ యా రంగాలలో నిష్ణాతులయిన వారి సమిష్తి అభిప్రాయాల ఆధారంగా దేన్ని ప్రచురించాలో దేన్ని ప్రచురించ నవసరం లేదో తేల్చుకోవటం ( ఈ రకంగా ఇతరత్రా పనులలో మునిగి తేలుతూ ఉండే సంపాదకవర్గ సభ్యులకు కొంత శ్రమ కూడా తగ్గుతుంది.) రెండు – ఆ యా రంగాలలో ఉన్న సంప్రదాయాలలో దేన్ని నిలబెట్టాలో దేన్ని ఎట్లా మార్చాలో, ఏ ప్రచురణ ఎట్లా ఉంటే ఆ రంగంలో అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని ఒక డుగు ముందుకు వేయించ వచ్చునో అన్న చర్చ జరపగల సమర్ధుల అభిప్రాయాలను రచన ప్రచురణకి తయారయ్యే క్రమంలోకి చొప్పించటం.
ఈ ప్రక్రియ సరిగా జరగాలంటే పీర్ రెవ్యూ చేయగల సమర్ధత ఉండటమే కాక ఓపికగా బాధ్యతగా చేసే వ్యక్తులు చాలినంత మంది ఉండాలి. పీర్ రెవ్యూ ని పారదర్శకంగా అంటే రచయితకి రెవ్యూయర్స్ ఎవరు అన్నదీ, రెవ్యూయర్స్ కి రచయిత ఎవరు అన్నది తెలిసేటట్లుగా జరపవచ్చు. డబుల్ బ్లైండ్ పద్ధతి లో జరపవచ్చును. అంటే రచయిత ఎవరు అన్నదీ రెవ్యూయర్స్ ఎవరు అన్నదీ ఒక్క సంపాదక వర్గానికి తప్ప వెరెవరికీ తెలియకుండా జరపవచ్చు. ప్రచురణ జరిగిపోయిన తరువాత రెవ్యూయర్స్ కి రచయిత ఎవరు అన్నది ఎట్లాగూ తెలిసి పోతుంది. మూడు నాలుగు సంచికలకు ఒక సారి, ఆ సంచికలకు రెవ్యూయర్స్ గా ఎవరు పని చేశారు అన్నది అందరికీ తెలిసేలా ప్రచురించ వచ్చు. వీటన్నిటికీ దేనికి ఉండే సాధక బాధకాలు దానికి ఉంటాయి – కానీ రెవ్యూయింగ్ ప్రాసెస్ గురించి రచయితలకి పాఠకులకీ విశదమయేలా ఎప్పటి కప్పుడు చెప్తూ ఉండటం అవసరమే.
విషయ పరిజ్ఞానానికి సంబంధించి నంత వరకు పీర్ రెవ్యూ ప్రక్రియ ఎట్లా చేయాలీ అన్న దానికి ఇతర ప్రచురణా రంగాలలో పద్ధతులు ఉన్నాయి . దాదాపు ఒకటిన్నర శతాబ్దపు చరిత్ర ఉన్న ఈ పద్ధతి పట్ల విమర్శలూ ఉన్నాయి. ఆ చర్చల నించి, అనుభవం నించీ మనం నేర్చుకోదగ్గ విషయాలు ఉన్నాయి.
కానీ సృజనాత్మకమైన రచనలని ప్రోత్సహించడానికి కేవలం పీర్ రెవ్యూయింగ్ పద్ధతి ఎంత వరకు సరిపోతుంది అన్నది ఆలోచించ వలసిన విషయం. ఆన్ లైన్ పత్రికలు లేని సందర్భాలలో కొత్త రచయితలని తయారు చేసుకోవటానికి సీనియర్ రచయితలూ, సహృదయులైన పాఠకులు ఎట్లా తోడ్పడుతారు, ఏ ప్రక్రియలు సాంప్రదాయాలూ అనుసరిస్తారు, వాటిలో ఆన్ లైన్ పత్రికలు అనుసరించ దగినవి ఏ మున్నాయి వీటిగురించి కొంత ఆలోచిస్తే బాగుంటుందనుకుంటాను.
ముద్దమందారం సినిమాలో అనుకుంటాను, “అలివేణీ ఆణిముత్యమా” అనే పాటను రమేష్ నాయుడు గారు స్వర పరచినట్టు గుర్తు. వాయిద్యాల మోత ఏ మాత్రమూ పాటని dominate చెయ్యకుండా అద్భుతంగా ఉంటుంది ఈ పాట.
పరచూరి శ్రీనివాస్ గారు అందిచే శబ్దతరంగాలు నిజంగా అపురూపమైనవి. ఎప్పుడో విన్న పాటలు, మాటలు హాయిగా మళ్ళీ వినగలుగుతున్నాను. వారికి శతసహస్ర వందనాలు.
సంగీత పట్నం – కదనకుతూహలం గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:
05/05/2010 8:34 am
పై పాట శ్రీవారికి ప్రేమలేఖ జంధ్యాల సినిమాలో నరేశ్ మీద తీశారు కదా !
భవబంధాల సాక్షిగా… గురించి bhavani అభిప్రాయం:
05/05/2010 4:42 am
కధలో కధకురాలి డిప్రెషన్ కి మూలమేంటో ఎక్కడైనా సూచిస్తారనుకునే లోపే కధ మలుపు తిరిగింది. మరీ ఇంత సూక్ష్మాంశం మీద టెలిస్కోప్ పెట్టడం సౌమ్య గారికి ప్రత్యేకమైన రచనాశిల్పం అనుకుంటా.
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి వంశీ అభిప్రాయం:
05/05/2010 12:42 am
ఉపేంద్ర గారూ
వ్యాసం బాగుంది. శైలిదేముంది లెండి, ఒకరికి మామూలు అన్నం,ఇంకోడికి పరమాన్నం, ఇంకొకరికి రాళ్ళతోకూడిన నూకన్నం.
ప్రతివారూ తానూ మాట్లాడే ప్రతి విషయంలోనూ, రాసే ప్రతి రాతలోనూ ఒక విధమైన అనుభవం ఉండబట్టి మాట్టాడతారు, రాస్తారు. కానీ ఆమాటల్లో, రాతల్లో సారం పాఠకులకు వారి వారి యోగ్యతానుసారం, గ్రహణశక్తానుసారం నివేదన చేసిన విషయం గ్రహణమవుతూ ఉంటుందని భవదీయుడి అభిప్రాయం. మీరు మటుకు ఇలాగే రాస్తూ ఉండండి. సానపెడుతూనే ఉండండి. కొద్దిరోజుల్లోనే కొంతమందికి వజ్రాల గని దొరుకుతుంది.
ఒకమాట చెప్పాలె – అంత గొప్పకవిగా ప్రశంశలు అందుకున్న నాగార్జున కవిగారి గురించి ఇతర పాఠకులకి తెలిసినంతగా ఇప్పటిదాకా నాకు తెలియదు. నిజం చెప్పాలంటే అసలలాటాయన ఒకడున్నాడని కూడా తెలియదు. 🙂 .. కానీ మీ వ్యాసం చదివాక నా అభిప్రాయం మారింది. ఎటువైపుకు దారితీస్తుందో తెలియదుకానీ… ధన్యవాదాలు
భవదీయుడు
వంశీ
[ఈ కామెంట్ ఎడిట్ చేయబడింది – సం.]
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి rama bharadwaj అభిప్రాయం:
05/05/2010 12:06 am
ఇంగ్లీషు పత్రికలని చూసి ఆ పధ్ధతిలో తెలుగు పత్రికలలో రచయితలూ కవులూ అనబడువారికి కొంత నాగరికతని నేర్పుదామని ఈమాట వారి ఊహ కావొచ్చు. ఈ “పీర్ రివ్యూ” పధ్ధతిని పరిచయం చేయడం!!
ఇంగ్లీషులో కుప్పలు తెప్పలుగా రచనలు వచ్చి పడతాయి. అందులో ఎంపికకి కావలసినంత వీలుంటుంది. అంగీకరించడానికీ..లేదా తిరస్కరించడానికీనూ!! కానీ తెలుగున రచనలు చేయగల్గిన వారి సంఖ్య వేళ్ళమీదలెఖ్ఖపెట్టవలిసిందే!! ఇందులో ఇంక ఎంపిక కి అవకాశం బహు తక్కువ. ఇంక వడపోత కార్యక్రమానికి దిగితే గనక మిగిలేదెవ్వరూ ఉండరు. అదే జరిగింది ఈమాట లో!! ఇంకో ముఖ్య మైన విషయం సీరియస్ రచయితలలాగే తెలుగున నిజానికి కమర్షియల్ రచనలు చేసే వారికీ కొరతే అని చెప్పాలి. ఆ మల్లాది ..యండమూరి..లేదా పట్టాభిరామ్ వంటీ మనస్తత్వ విశ్లేషకులు వంటి వారే ఉన్న కుర్చీలని ఆక్రమించుకుని కూర్చున్నవారు. అంటే తెనుగు అటువంటి రచయితలకి కూడా చాలా కొరత ఉందనే అర్ధం!! అసలు రాసేవాళ్ళే తక్కువ. అందునా మనసుని ఆకట్టుకునేలా రాయగల చతురత కల్గిన వారు ఇంకా తక్కువ. అన్ని రంగాలలోనూ కూడా!! ముందు ఈ సంగతిని గుర్తిస్తే అప్పుడు ఇంగ్లీషు పత్రికలలోని నమూనాని యధావిధిగా అమలు చేయలేమన్నది ఈమాట వారు గమనించవచ్చు.
అలాగే ఇంగ్లీషు పత్రికలవారిచ్చే రెమ్యునరేషన్ ని ఈమాట అనుసరించదలుచుకోలేదు. కారణాలు ఏమైనా!! మేము మాకు కావలసిన పధ్ధతిలో మాత్రమే విషయాలని నిర్ణయిస్తామూ ..మేము తెలుగు పాఠకులనీ రచయితలనీ సంస్క్కరిస్తామూ అంటే మరి వీటి విషయంలో మీ నాగరికత ఏమైందన్న విషయాన్ని అడగడం లో ఎవరైనా గానీ తప్పులేదు. గనక ముందు ఈమాట తన బాటని స్పస్టపరుచుకుంటే అటుపిమ్మట తెలుగు రచయితలకి వారెవరైనా గానీ ..రాయడంలో విధినిషేధాలు విధించే అర్హతని సంపాదించవచ్చును.
రమ.
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి rama bharadwaj అభిప్రాయం:
05/04/2010 11:41 pm
ఉపేంద్రగారూ!!
తెలుగున అదేదో ఒక మోటు సామెత ఉంది ..అందరికీ తెలిసినదే గనక నేను దానిని ప్రస్తావన చేయ పనిలేదు కానీ.. నాకు తెలుగు వారి కి మహా కవులని గురించి పరిచయం చేసే శక్తీ ..ఆసక్తీ రెండూ లేవు. అందుకే మీరు చేసే ప్రయత్నాన్ని అభినందించాను. ఆ పని మీరు మరింత శ్రధ్ధగా చేయగలిగితే బాగుంటుందని సూచన చేసాను. కవిత్వాన్ని అనువాదంచేసే భాష విషయంలో!! కవితా వాక్యాలు చాలా శక్తిమంతమైనవి గనక..వాటి విషయంలో శ్రధ్ధ అవసరం..కానీ ఇది వారి శక్తికి సంబంధించిన విషయమ్ నిజానికి. అందువలన ఆశించగలమే గానీ నిజంగా ఎంత చక్కగా రాయగలరూ.. అన్నది సందేహాస్పదమే!! ఔను.. నాకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి కొన్నిటి విషయంలో . అందులో ముఖ్యమైనది “చదివించే గుణం” అన్నది. వచనంలో విషయమ్ క్లుప్తంగా..సూటిగా ఉండాలి అన్నది. నస వాక్యాలని నేను చదవలేను. నాకు విసుగు . గనక సాధారణంగా చదవడానికి అంత ఉత్సాహం చూపించను. అందునా విప్లవ సంఘాల వారి తెలుగు వచనం అంటే చెప్పలేని చికాకు. వారు నలుగురికీ తెలియవలసిన ముఖ్య విషయాలని కూడా తమ పడికట్టు వాక్యాలతో పాఠకులని విషయానికి దూరంచేసి పారిపోయేలా చేయగల సమర్ధులు మరి.
రమ.
ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి T.Raja gopal అభిప్రాయం:
05/04/2010 10:14 pm
Rare collection. Enjoyed. Thanks for posting.
Raja gopal
మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి T.Raja gopal అభిప్రాయం:
05/04/2010 10:05 pm
Srinivas garu
Thanks for an interesting and informative article on Sri Ramesh naidu and his good rare songs with audio clips. I request you to kindly write on Sri Adinarayana rao and his good work.
Regards,
Raja gopal
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
05/04/2010 9:37 pm
రమగారూ,
నెలకి ఒక కవిని పరిచయం చేసినా సంవత్సరానికి 12 మంది భారతీయ కవులని తెలుగు పాఠకులకి పరిచయం చేయవచ్చును. తెలుగు వారు అజ్ఞానులు అని పది సార్లు జపించే బదులు ఈ దిశ గా మీరు ప్రయత్నమ్ చేస్తే బాగుంటుంది.
తెలుగు కవితా భాషలోనూ , అనువాదంలోనూ సాధన చేయటానికి కావలసిన వెసులుబాటు నాకు ఉండదు. ఇప్పటికైనా నాగార్జు న పేరు తెలిసింది, ఆయన చేసిన పని గురించి తెలిసింది కాబట్టి సమర్థులైన వాళ్ళు , ఆసక్తి ఉన్న వారూ ఆ పనికి ఎప్పుడో అప్పుడు తప్పకుండా పూనుకుంటారనే నా ఆశ.
మూడు దశాబ్దాల కాలంలో బాలగోపాల్ వ్రాసిన సాహిత్య సాంస్కృతిక విమర్శని సమీక్షించే సందర్భంలో ఆయన తెలుగు కవులని కవిత్వాన్నీ ఎట్లా పట్టించుకున్నాడో ఎట్లా పట్టించుకోలేదో అంచనా వేయటం అవసరమే. నేను వ్రాసినది సమీక్షా వ్యాసం కాదు కాబట్టి నేను ఆయన చేయని పనులు ఏమిటి అన్నది నేను ఈ సందర్భంలో ఎత్తలేదు. నేను చేసినది ఆయన తాత్విక చింతనలో తెలుగు కవులకి పనికొచ్చే విషయాన్ని ఎత్తి చూపించడం. సరళంగా, స్పష్టంగా రాయటం అవసరమే. నాకుండే పరిమితులకు లోబడి తప్పకుండా ప్రయత్నం చేస్తాను .
మీకు విసుగు పుట్టించకుండా వ్రాయటం అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఆ దిశగా నేను ప్రయత్నం చేయ దలుచుకోలేదు. మీ వ్యాఖ్యని బట్టి చూస్తే ఈ విషయం పట్ల మీకు బలమైన అభిప్రాయాలున్నట్టు కనపడుతోంది. అదేమిటో మీరు విశద పరిస్తే బండి ముందుకి కదులుతుంది.
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
05/04/2010 9:03 pm
సాధారణంగా పీర్ రెవ్యూ అనే ప్రక్రియ రెండు లక్ష్యాలతో జరుగుతుంది. ఒకటి – సంపాదకవర్గం తమ తమ ఇష్టా ఇష్టాల మీద ఆధార పడి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఆ యా రంగాలలో నిష్ణాతులయిన వారి సమిష్తి అభిప్రాయాల ఆధారంగా దేన్ని ప్రచురించాలో దేన్ని ప్రచురించ నవసరం లేదో తేల్చుకోవటం ( ఈ రకంగా ఇతరత్రా పనులలో మునిగి తేలుతూ ఉండే సంపాదకవర్గ సభ్యులకు కొంత శ్రమ కూడా తగ్గుతుంది.) రెండు – ఆ యా రంగాలలో ఉన్న సంప్రదాయాలలో దేన్ని నిలబెట్టాలో దేన్ని ఎట్లా మార్చాలో, ఏ ప్రచురణ ఎట్లా ఉంటే ఆ రంగంలో అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని ఒక డుగు ముందుకు వేయించ వచ్చునో అన్న చర్చ జరపగల సమర్ధుల అభిప్రాయాలను రచన ప్రచురణకి తయారయ్యే క్రమంలోకి చొప్పించటం.
ఈ ప్రక్రియ సరిగా జరగాలంటే పీర్ రెవ్యూ చేయగల సమర్ధత ఉండటమే కాక ఓపికగా బాధ్యతగా చేసే వ్యక్తులు చాలినంత మంది ఉండాలి. పీర్ రెవ్యూ ని పారదర్శకంగా అంటే రచయితకి రెవ్యూయర్స్ ఎవరు అన్నదీ, రెవ్యూయర్స్ కి రచయిత ఎవరు అన్నది తెలిసేటట్లుగా జరపవచ్చు. డబుల్ బ్లైండ్ పద్ధతి లో జరపవచ్చును. అంటే రచయిత ఎవరు అన్నదీ రెవ్యూయర్స్ ఎవరు అన్నదీ ఒక్క సంపాదక వర్గానికి తప్ప వెరెవరికీ తెలియకుండా జరపవచ్చు. ప్రచురణ జరిగిపోయిన తరువాత రెవ్యూయర్స్ కి రచయిత ఎవరు అన్నది ఎట్లాగూ తెలిసి పోతుంది. మూడు నాలుగు సంచికలకు ఒక సారి, ఆ సంచికలకు రెవ్యూయర్స్ గా ఎవరు పని చేశారు అన్నది అందరికీ తెలిసేలా ప్రచురించ వచ్చు. వీటన్నిటికీ దేనికి ఉండే సాధక బాధకాలు దానికి ఉంటాయి – కానీ రెవ్యూయింగ్ ప్రాసెస్ గురించి రచయితలకి పాఠకులకీ విశదమయేలా ఎప్పటి కప్పుడు చెప్తూ ఉండటం అవసరమే.
విషయ పరిజ్ఞానానికి సంబంధించి నంత వరకు పీర్ రెవ్యూ ప్రక్రియ ఎట్లా చేయాలీ అన్న దానికి ఇతర ప్రచురణా రంగాలలో పద్ధతులు ఉన్నాయి . దాదాపు ఒకటిన్నర శతాబ్దపు చరిత్ర ఉన్న ఈ పద్ధతి పట్ల విమర్శలూ ఉన్నాయి. ఆ చర్చల నించి, అనుభవం నించీ మనం నేర్చుకోదగ్గ విషయాలు ఉన్నాయి.
కానీ సృజనాత్మకమైన రచనలని ప్రోత్సహించడానికి కేవలం పీర్ రెవ్యూయింగ్ పద్ధతి ఎంత వరకు సరిపోతుంది అన్నది ఆలోచించ వలసిన విషయం. ఆన్ లైన్ పత్రికలు లేని సందర్భాలలో కొత్త రచయితలని తయారు చేసుకోవటానికి సీనియర్ రచయితలూ, సహృదయులైన పాఠకులు ఎట్లా తోడ్పడుతారు, ఏ ప్రక్రియలు సాంప్రదాయాలూ అనుసరిస్తారు, వాటిలో ఆన్ లైన్ పత్రికలు అనుసరించ దగినవి ఏ మున్నాయి వీటిగురించి కొంత ఆలోచిస్తే బాగుంటుందనుకుంటాను.
మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
05/04/2010 4:19 pm