పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. ప్రేమ కవితలు గురించి sasi అభిప్రాయం:

    03/27/2011 2:32 am

    కవితలు కవితలు కవితలు కవితలు…
    ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
    అక్కడ ఇక్కడ అంతా కవితలు.

    ప్రేమ ఫలిస్తే, వాన కురిస్తే,
    చిటికెన వేలుకు చీమ కరిస్తే…
    ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
    అక్కడ ఇక్కడ అంతా కవితలు.

  2. కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి bhanu అభిప్రాయం:

    03/26/2011 6:58 am

    Story is good but you have to maintain clarity in this story .

  3. స్వేచ్ఛ? గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/26/2011 1:44 am

    ఠాగూర్ ప్రతి వాక్యాన్నీ ఇంత విధ్వంసం చేసి చూడనఖ్ఖరలేదనుకుంటా.

    కవికి కూడా ఏమీ ఆశ లేనే లేకపోతే నిజంగానే భయపడవలసిన విషయమ్ అది. మనకి స్వాతంత్రమ్ వచ్చి ఇంకా కొన్ని పదులు గడిచింది లేదు. దాన్ని అర్ధమ్ చేసుకోకుండా ఇంత నిరాశ నింపుకోవడం అందునా యువతరానికి చెంది ఉండి అది ఏం సబబు? పోరాట పటిమ లేనట్టుగా ఉంటే అదేం సందేశం? అందుకు దేవుడేం చేస్తాడమ్మాయీ??

    ఈ అరవై ఏళ్ళ ప్రస్థానంలో ఇండియా ఎంత సాధించిందో ఎవరైనా గమనించారా?? ప్రతీ కాలం లోనూ అవినీతి లంచగొండితనం రౌడీయిజం బానిసత్వం అధికారం కోసం పాకులాటా లేవా?? సంతోషించాలి మనం. గడిచిన ఎన్నో కాలాలకన్నా కూడా ఎంతోకొంత నోరువిప్పి మాట్లాడగలిగిన యుగంలో ఉన్నాం. ప్రశ్నలు వేయగలుగుతున్నాం! ఉన్నవాటిని గమనించగలగాలి. లేని వాటిని గుర్తించి వాటిని మార్చగలగాలి. యువతరానికి ఉండవలసిందే ఒక ఉడుంపట్టు, అవిశ్రాంత పోరాట పటిమానూ. ఇలాంటి నస కవితల వల్ల ఏమీ ప్రయోజనం లేదు.

    ఇకపోతే దారుణాల మారణాలు ఎందుకూ? మొదటిపదంలో బహువచనం అవసరం ఏమీ లేదే?? దెబ్బలాడండి. ఒక ఉత్తేజంతో కదలండి. కానీ ఊరికే ఇలా “భావహీను”లవకండి.

    రమ.

  4. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/25/2011 2:03 pm

    చాలా సంతోషం శాయి గారూ !! మీరు “శబ్దార్ధదీపిక “ని మీ ఆంధ్రభారతికి జత చేర్చిన తరువాత , ఆ సమాచారాన్ని “ఈమాట” ద్వారా పాఠకులకు, అలాగే సాహితీమిత్రులకు తెలియజేయగలరు. మీ కృషిని అభినందిస్తూ…..

    రమ.

  5. సామాన్యుని స్వగతం: మా దేవక్క గురించి yedukondala swamy అభిప్రాయం:

    03/25/2011 11:17 am

    కథ రాసే పద్ధతి లో రచయిత కేవలము “నాయన” అన్న చోట తప్ప మిగిలిన చోట్ల రాయలసీమ మాండలీకాన్ని పెద్దగా ఉపయోగించక పోవటము వలన కథలో కొంచము సహజత్వము లోపించినట్లనిపిస్తున్నది.

  6. రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల పరామర్శ గురించి chavakiran అభిప్రాయం:

    03/25/2011 7:39 am

    ఈ పుస్తకాలు ఇప్పుడు కినిగె పై లభిస్తున్నాయి డిజిటల్ పుస్తకాలుగా. http://kinige.com/kauthor.php?id=39

  7. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి srav అభిప్రాయం:

    03/24/2011 4:29 pm

    Interesting article. Nice to find the song rammanave in the list.

    Please, Rammanave mani rachanalu” paata ki lyrics unte istara ? Meeku punyam untundi babu !

  8. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Vadapalli SeshatalpaSayee అభిప్రాయం:

    03/24/2011 3:01 pm

    రమ గారూ-

    నేను చెప్పిన ” శబ్దార్ధ దీపిక” చాలా ముఖ్యమైన నిఘంటువు. … ఎవరైనా ఈ నిఘంటువుని గురించి తప్పక వెతికి కంప్యూటరైజ్ చేసేందుకు ప్రయత్నించాలి. శాయి గారూ !! — మీరు తప్పక ప్రయత్నించ గలరు.

    ఈ నిఘంటువు మావద్ద ఉంది. తప్పకుండా దీనినికూడా “ఆంధ్రభారతి నిఘంటుశోధన”కు త్వరలో అనుసంధించాలనే మాకోరికా, ప్రయత్నమూ.

    ధన్యవాదములతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  9. అన్నీ చెప్పగల భాష గురించి Prashant Gundavarapu అభిప్రాయం:

    03/24/2011 4:23 am

    ఈకవితలో, పద్మలతగారు అసలు ఏంచెప్పదలుచుకున్నదీ స్పష్టపడలేదు. తన కవిత్వపు భాషకి ఎంత పెంకితనముందో మొదటగా ఉపమించి చెప్పిన కవయిత్రి, ఏదీ? ఆ పెంకితనాన్ని మిగతా కవిత మొత్తం మీద ఎక్కడా చూపించనే లేదే.. మరి..ఇదేమి కల్పనా? ఏదో రాసేద్దామన్న తొందర తప్ప.. ఈ కవితలో తాను చెప్పాలనుకున్న విషయాన్ని గురించి ఈమె ఒక నైపుణ్యాన్ని చూపించలేకపోయింది. శ్రీరామ్మూర్తిగారన్నట్టూ.. ఇది ఒక అతిమామూలు వ్యక్తీకరణ. “అన్నీచెప్పగల భాష” లోంచి ఏమీ చెప్పలేకపోవడమే ఈ కవిత ప్రత్యేకత అంతా! ఎందుకంటే, ఈ కవితలోని ఉపమానాల్లో ఒక పొందిక లోపించింది. ఈమె తన కవిత మొదట్లో చెప్పుకున్నట్టు తనది” పెంకితనమైన భాషే” అయితే గనక, దాని వ్యక్తీకరణే వేరు. దాని పదునే వేరు. కానీ ఈ కవిత ఊహ చాలని భావాల కలగలుపు .పాపం “ఈమాట” వారు ఏదో కొత్తవారిని ప్రోత్సహించాలని వేసినట్టుంది దీన్ని.

    కొంపదీసి, ఇలాంటి అనేక కవితల సంకలనమేనా ఏమిటి.. ఈ “అనేక పదేళ్ళ కవిత్వ సంకలనం” ఎవరా ప్రచురణకర్తలూ? అయితే, తెలుగు కవిత్వ పాఠకుల నెత్తిన ఇలాంటివి, పైగా అనేక పదేళ్ళవి… ఎన్నో ఘాటైన మొట్టికాయలేనన్నమాట.

    ప్రశాంత్ .

  10. కాలనీ భోగి గురించి Satya Petluri అభిప్రాయం:

    03/23/2011 10:20 pm

    రైల్వే కాలనీలు సహజంగా నానాజాతి సమితులు. హైదరాబాద్ కన్నా రామకృష్ణ గుంటూరు జిల్లా వాడు అయ్యే అవకాశం ఉంది.అదే ఉద్దేశం అండి !!