రాధ గారికి అభినందనలు. మాతృమూర్తికి మన సంస్కృతిలో గల స్థానాన్ని వివరిస్తూ, యశోదమ్మనూ, పోతన్ననూ, సంస్మరిస్తూ సాగిన మీ రచన, మీ భావోద్వేగాలతో బాటు, మీ రచనానైపుణ్యాన్ని అద్దం పట్టి చూపిస్తుంది. ఇలాంటి రచనలు మీ కలం నుండి ఇంకా రావాలని కోరుతూ…
జయప్రభ గారూ: మీ పేరు తప్పుగా పడినందుకు క్షమించండి. మీ పేరు తెలియక కాదు. మీరు తెలుగులో మంచి కవయిత్రి అని తెలుసును. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన చేసారని తెలుసును. ఆ మధ్య విశాఖపట్నం సభలో పాల్గొనటమూ తెలుసును. కాకపొతే పొరపాటు పడింది. యిక విషయనికి వస్తాను.
1) మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. “విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను” అంటున్నారు. కానీ, పత్రికలొ రాస్తున్న విషయం మరిచిపోతున్నారు.
2) మీరు “యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!“అన్నారు. తప్పక వినవలసిందే, వింటాం. కాని ఆయన (కా.రా) చెప్పారు గాబట్టి నమ్మవలసిందే అంటే మాత్రం నమ్మం.
3) లక్షిం పేట హత్యల ప్రస్తావన తెచ్చారు. అగ్ర వర్ణ దురహాంకారంతో చేసే హత్యలకు,కన్న బిడ్డను చేసే హత్యకు పోలికా…!
4) మీరు “మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు.“అన్నారు. కాకూడదని మాకేమి కోరిక లేదు. ఎందుకంటే అది ఎలాగు ఉత్తమ కధ కాదు గనక. యాభయ్యేళ్ళ క్రితం నుంచి వేసిన వీరతాళ్ళు ఉన్నాయి గనక మరి కొన్నాళ్ళు వాటిని మోసే వీరాభిమానులు ఉంటారు. నిజానికి అదో పెద్ద తిరోగమన భావజాలాన్ని ప్రచారం చేసే కధ.
5) మీరు “ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట 🙂” అని అన్నారు. మీరు చర్చకు నిలబడరని అర్థమయింది. కాబట్టి, అనవసరమనుకున్న చోట నేనూ చర్చించను.
ఒక ఆసక్తి కరమైన విషయం – విశ్వనాథ ‘తెలుగు ఋతువులు’ లొ గ్రీష్ముణ్ణి వర్ణిస్తూ ఇంద్రాణి అన్న చివరి మాట అన్నారు, ‘పొట్ట’ తొ సహా. దాదాపు ఒక డెభ్బయి సంవత్సరాలయినా అయ్యుంటుందా ! ‘మాకంద నవఫలానంద తుందిలరసాత్తానంద భావుడౌ అమృత భొగి’ అని ఉన్న తేడా పెద్దదే, మామిడి రసం అక్కడ కవి తాగలేదు. గ్రీష్ముడు ఆ భోగి.
ఎప్పటికీ మాయని భావాలు ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తులేసుకుని రాంప్ మీద నడుస్తాయనుకుంటాను.
ఆదిత్యా రెడ్డీ! నా పేరు జయప్రభ. జయప్రద కాదు. మీరు ఆవేశపడకండి.
విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను. ఆ జవాబు మీకు సరిపడదని మీరు భావిస్తే మీరు ఊరుకోవచ్చునే? యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!
ఇంక ఆయన జోస్యమే చెప్పారా?? చెప్పారు కామోసు. రచయిత క్రాంతిదర్శి కదా??
ఇంక హింస భౌతిక రూపంలో అతి దారుణంగా భారతీయ వ్యవసాయ రంగాన అమలులో ఉంది. అది ఇవాళ్టికీ ఏమీ మారలేదు. హత్యల రూపానో ఆత్మహత్యల రూపానో ప్రతిదినమూ కళ్లముందుకి వస్తోంది. రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. హత్య అయినా ఆత్మహత్య అయినా ఒక సందర్భంలో నిరసన ప్రకటనే!! ఈ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా?? అంటే ఇటువంటి హింసకి తెలుగు సమాజంలో ఇంకా కాలం చెల్లలేదన్నమాట. అంటే ఏదో రూపంలో ఆ కధాంశానికీ కాలం చెల్లలేదన్నమాటే!
శ్రీకాకుళం జిల్లా లో మొన్ననే జరిగిన లక్షింపేట దళితుల ఊచకోత మీద ఒకవేళ మీరెవరైనా కధ రాయవలసే వస్తే ఏం రాస్తారూ?? హింసాతీతంగా రాస్తారా?? నాకు ఊరికే వాదనలు చేసే అలవాటూ లేదు. అటువంటి వాటిని చదివే ఆసక్తీ లేదు. ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట :).
యజ్ఞం కధలో రాజకీయమే లేదనీ అలాంటిది వెతకడం ఎండమావిలో నీరు వెతకడమేననీ అన్న విద్యాసాగర్ వ్యాసాన్ని ఎందుకూ చదవడం?? ఆ అభిప్రాయం ప్రకారం ఇవాళ్టి IMF అప్పూ రాజకీయం కాదు. ఇవాళ్టి రైతుల ఆత్మహత్యలూ రాజకీయం కానే కాదు. అంతే కదా??
యజ్ఞం కధ తరవాతే శ్రీకాకుళ రైతాంగ పోరాటం [ఆయన ఆ కధ రాసిన ఒక నాలుగేళ్ళకే] ఆ ప్రాంతమ్లో వచ్చిందీ అంటే దాని అర్ధం ఏమిటీ?? ఆ విషయం మనకి ఏమి చెబుతూందీ?? మీకు మీవైన రాజకీయాలు ఉండి ఉండవచ్చు. వాటి ప్రకారం మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు. దాని ప్రభావం తెలుగు సాహిత్యమ్లో ఉండకాపోదు.
మీ ఉదాహరణలకి కాలరేఖ అక్కర లేదనుకుంటాను. కాని చరిత్రకి కావాలి. అందునా ఆ కధ శ్రీకాకుళం జిల్లా లోని భూసంభందాలకు కధారూపమని విమర్శకులు ప్రవచించారు. చరిత్ర గురించి మాట్లాడితే ఇప్పుడు చరిత్ర అడక్కు చెప్పింది విను అంటున్నారు. శ్రీకాకుళ ఉద్యమం 1968లో మాటవరసకి ప్రారంభం కాలేదు. అక్కడ ఉద్యమం 1959లోనే ప్రారంభం అయింది. కాకుంటే చావులుంటే తప్ప మనకి ఉద్యమం ఉన్నట్టు కాదు. కధ చెప్పినట్టు కాదు. దేశంలో కథ చదివినవాళ్ళంతా రచయితని కలవలేరు.
[అభిప్రాయాలు వెలిబుచ్చే వారు, చర్చించేవారు, దయచేసి అభిప్రాయం పంపే ముందు అచ్చు తప్పులు సరిచేసుకోమని సవినయంగా మనవి చేస్కుంటున్నాం. – సం.]
అమ్మ గోపెమ్మ గురించి thummuri rammohan rao అభిప్రాయం:
07/06/2012 1:19 pm
రాధ గారికి అభినందనలు. మాతృమూర్తికి మన సంస్కృతిలో గల స్థానాన్ని వివరిస్తూ, యశోదమ్మనూ, పోతన్ననూ, సంస్మరిస్తూ సాగిన మీ రచన, మీ భావోద్వేగాలతో బాటు, మీ రచనానైపుణ్యాన్ని అద్దం పట్టి చూపిస్తుంది. ఇలాంటి రచనలు మీ కలం నుండి ఇంకా రావాలని కోరుతూ…
వేసవి గురించి thummuri rammohan rao అభిప్రాయం:
07/06/2012 12:58 pm
గ్రీష్మతాపోపశమన కవిత. చిన్న మార్పులు చేస్తే నిర్దుష్టంగా వుంటుంది.
1st లైనులో – రయ్యిమనే, 5th లైను – రెక్కలను; 9th లైను – మండే ఎండను; 12th లైను – కాయలతొ
లయాత్మక కవిత శ్రీశ్రీ గారి దారిలో ఉంది.
స్నానాల గదిలో గురించి thummuri rammohan rao అభిప్రాయం:
07/06/2012 8:11 am
స్నానాల గది నుంచి కాగితం మీదికి ఎక్కించేదాకా తడి ఆరని ఊహలకు జోహార్లు.
జనరంజని: మహానటి సావిత్రి గురించి bhavya అభిప్రాయం:
07/06/2012 2:32 am
ఇది నేను మా అమ్మకి మా అత్తయ్యకి ఇవ్వగలిగే అద్భుతమైన ఆశ్చర్యపరిచే బహుమతి!
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi అభిప్రాయం:
07/05/2012 9:18 pm
జయప్రభ గారూ: మీ పేరు తప్పుగా పడినందుకు క్షమించండి. మీ పేరు తెలియక కాదు. మీరు తెలుగులో మంచి కవయిత్రి అని తెలుసును. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన చేసారని తెలుసును. ఆ మధ్య విశాఖపట్నం సభలో పాల్గొనటమూ తెలుసును. కాకపొతే పొరపాటు పడింది. యిక విషయనికి వస్తాను.
1) మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. “విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను” అంటున్నారు. కానీ, పత్రికలొ రాస్తున్న విషయం మరిచిపోతున్నారు.
2) మీరు “యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!“అన్నారు. తప్పక వినవలసిందే, వింటాం. కాని ఆయన (కా.రా) చెప్పారు గాబట్టి నమ్మవలసిందే అంటే మాత్రం నమ్మం.
3) లక్షిం పేట హత్యల ప్రస్తావన తెచ్చారు. అగ్ర వర్ణ దురహాంకారంతో చేసే హత్యలకు,కన్న బిడ్డను చేసే హత్యకు పోలికా…!
4) మీరు “మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు.“అన్నారు. కాకూడదని మాకేమి కోరిక లేదు. ఎందుకంటే అది ఎలాగు ఉత్తమ కధ కాదు గనక. యాభయ్యేళ్ళ క్రితం నుంచి వేసిన వీరతాళ్ళు ఉన్నాయి గనక మరి కొన్నాళ్ళు వాటిని మోసే వీరాభిమానులు ఉంటారు. నిజానికి అదో పెద్ద తిరోగమన భావజాలాన్ని ప్రచారం చేసే కధ.
5) మీరు “ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట 🙂” అని అన్నారు. మీరు చర్చకు నిలబడరని అర్థమయింది. కాబట్టి, అనవసరమనుకున్న చోట నేనూ చర్చించను.
ఆఖరి మనిషి గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/05/2012 6:46 pm
బ్రతుకు నాటకం ముగిసాక, రంగు కడిగేసిన పాత్ర కి ప్రతిబింబం – ఈ కవిత..
జీవితం అంటే – ‘ అసలైన విషాదాన్ని ‘ తెలుసుకోడం!
వేసవి గురించి తఃతః అభిప్రాయం:
07/05/2012 2:39 pm
ఒక ఆసక్తి కరమైన విషయం – విశ్వనాథ ‘తెలుగు ఋతువులు’ లొ గ్రీష్ముణ్ణి వర్ణిస్తూ ఇంద్రాణి అన్న చివరి మాట అన్నారు, ‘పొట్ట’ తొ సహా. దాదాపు ఒక డెభ్బయి సంవత్సరాలయినా అయ్యుంటుందా ! ‘మాకంద నవఫలానంద తుందిలరసాత్తానంద భావుడౌ అమృత భొగి’ అని ఉన్న తేడా పెద్దదే, మామిడి రసం అక్కడ కవి తాగలేదు. గ్రీష్ముడు ఆ భోగి.
ఎప్పటికీ మాయని భావాలు ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తులేసుకుని రాంప్ మీద నడుస్తాయనుకుంటాను.
రెండు కవితలు – ఇద్దరు కవులు గురించి Indrani Palaparthy అభిప్రాయం:
07/05/2012 12:05 pm
గిరిధర రావు గారు,
నావంటి సామాన్యురాలికి ఇలా వీర తాళ్ళు వేస్తే ఏమి చెయ్యగలను? వినమ్రంగా వంగి దండాలు చెప్పడం తప్ప.
పాలపర్తి ఇంద్రాణి.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి jayaprabha అభిప్రాయం:
07/05/2012 1:49 am
ఆదిత్యా రెడ్డీ! నా పేరు జయప్రభ. జయప్రద కాదు. మీరు ఆవేశపడకండి.
విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను. ఆ జవాబు మీకు సరిపడదని మీరు భావిస్తే మీరు ఊరుకోవచ్చునే? యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!
ఇంక ఆయన జోస్యమే చెప్పారా?? చెప్పారు కామోసు. రచయిత క్రాంతిదర్శి కదా??
ఇంక హింస భౌతిక రూపంలో అతి దారుణంగా భారతీయ వ్యవసాయ రంగాన అమలులో ఉంది. అది ఇవాళ్టికీ ఏమీ మారలేదు. హత్యల రూపానో ఆత్మహత్యల రూపానో ప్రతిదినమూ కళ్లముందుకి వస్తోంది. రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. హత్య అయినా ఆత్మహత్య అయినా ఒక సందర్భంలో నిరసన ప్రకటనే!! ఈ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా?? అంటే ఇటువంటి హింసకి తెలుగు సమాజంలో ఇంకా కాలం చెల్లలేదన్నమాట. అంటే ఏదో రూపంలో ఆ కధాంశానికీ కాలం చెల్లలేదన్నమాటే!
శ్రీకాకుళం జిల్లా లో మొన్ననే జరిగిన లక్షింపేట దళితుల ఊచకోత మీద ఒకవేళ మీరెవరైనా కధ రాయవలసే వస్తే ఏం రాస్తారూ?? హింసాతీతంగా రాస్తారా?? నాకు ఊరికే వాదనలు చేసే అలవాటూ లేదు. అటువంటి వాటిని చదివే ఆసక్తీ లేదు. ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట :).
యజ్ఞం కధలో రాజకీయమే లేదనీ అలాంటిది వెతకడం ఎండమావిలో నీరు వెతకడమేననీ అన్న విద్యాసాగర్ వ్యాసాన్ని ఎందుకూ చదవడం?? ఆ అభిప్రాయం ప్రకారం ఇవాళ్టి IMF అప్పూ రాజకీయం కాదు. ఇవాళ్టి రైతుల ఆత్మహత్యలూ రాజకీయం కానే కాదు. అంతే కదా??
యజ్ఞం కధ తరవాతే శ్రీకాకుళ రైతాంగ పోరాటం [ఆయన ఆ కధ రాసిన ఒక నాలుగేళ్ళకే] ఆ ప్రాంతమ్లో వచ్చిందీ అంటే దాని అర్ధం ఏమిటీ?? ఆ విషయం మనకి ఏమి చెబుతూందీ?? మీకు మీవైన రాజకీయాలు ఉండి ఉండవచ్చు. వాటి ప్రకారం మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు. దాని ప్రభావం తెలుగు సాహిత్యమ్లో ఉండకాపోదు.
జయప్రభ
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి vidyasagar అభిప్రాయం:
07/05/2012 12:57 am
జయప్రభ గారు – మీ వ్యాఖానం చదివాను.