పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నా కోరిక, నా ప్రార్థన గురించి Rao Vemurio అభిప్రాయం:

    09/05/2012 3:37 pm

    బ్రహ్మానందం గారూ

    వ్యాసం బాగుంది. మీ అనువాదం ఇంకా బాగుంది. అనువాదం చదువుతూన్నట్లు అనిపించనే లేదు. ఇంకా రాయండి.

    వేమూరి

  2. ఒక సరళ నిర్వచనం గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:

    09/05/2012 12:35 pm

    నారాయణ గారూ- నాగరికత ను చాలా చక్కగా తేలికైన మాటలలో రాసారు. బాగుంది ఇంకా రాస్తూ ఉండండి.

  3. కాల్వీనో కథల నుంచి – 5 గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:

    09/05/2012 12:31 pm

    మాధవ్ గారు – ఇప్పటి వరకు మీరు రాసిన ఇటాలో కాల్వీనో కధల అనువాదములు అన్నీ చదివాను. నాకు ఇంతకు ముందు ఇటాలో కాల్వీనో గురుంచి తెలేదు కానీ మీ రచనల ద్వారా ఆయన గురుంచి తెలుసుకోవడం జరిగింది. మీ అనువాదములు అన్నీ చక్కగా ఉన్నాయి. ఇంకా రాస్తూ ఉండండి.

    ఇట్లు
    శివ

  4. మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    09/05/2012 3:39 am

    >>కృష్ణమూర్తిగారు ఛందోబద్ధమయిన పద్యాలను కూడ ఎన్నో వ్రాసారని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఎవరైనా కొన్ని మచ్చు తునకలను అందిస్తారనుకొంటాను.

    భద్రిరాజుగారు చిన్ననాట వ్రాసిన పద్యాలను సంకలనం చేసి “చిన్ననాటి పద్యాలు” అనే పుస్తకంగా ప్రచురించారు. వాటిలో కొన్ని పద్యాలీ కింద లింకులలో చదవవచ్చు:
    http://groups.yahoo.com/group/telusa/message/1187
    http://groups.yahoo.com/group/telusa/message/1199

    భద్రిరాజుగారు స్వయంగా వినిపించిన రెండు మూడు పద్యాలు ఈమాట శబ్దతరంగాలలోనే ఉన్నాయి.

  5. ఛందస్సులో గణితాంశములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    09/05/2012 3:03 am

    మోహనరావుగారు,

    >>కాని దానిని సీసము అని చెప్పడము కష్టమే 🙂

    అవి రెండు ఆటవెలదులు (ఎత్తుగీతితో కలిపి మూడు) అని మాత్రం సులువుగా చెప్పవచ్చు 🙂

    మీరు వివరించాక ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యిందండి ఆ పేరా. అక్షరగణాలూ, అంశగణాలూ, సమరూపాలే (isomorphic)! లఘువుతో మొదలయ్యే ప్రతి అక్షరగణానికీ ముందొక లఘువు తగిలిస్తే చాలు. అందుకే ఈ రెండు రకాల గణాలకూ నిజానికి గణమేరువు ఒకటే. మీరు అంశగణమేరువులో గురువుల సంఖ్య బదులు మాత్రా సంఖ్య తీసుకున్నారు కాబట్టి అక్షరగణ మేరువుకు రెట్టింపు వచ్చింది. ఇక్కడా గురుసంఖ్య తీసుకుంటే రెండూ సరిసమానం!

    మరొక విషయం, పాఠకులు గమనించే ఉంటారు – అక్షర, అంశ గణ మేరువులు సుష్ఠైనవి (symmetrical). మాత్రాగణ మేరువు కాదు. ఎందుకో ఊహించడం పెద్ద కష్టం కాదు!

  6. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తఃతః అభిప్రాయం:

    09/05/2012 2:24 am

    శ్రీ మోహన: సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం. గాయకులను నట విటుల్లొ కలిపేశారు. ముఖ్యంగా మన దక్షిణాది సంప్రదాయంలో గాయకులకు గౌరవం వారు పాడు తున్న భక్తి సాహిత్యం నుంచి వచ్చింది. వారు భాగవతారులుగా పరిగణింపబడ్డారు.

    వేదాన్ని పాడకూడదన్న నియమం ఉన్నదనీ, కవి అన్న పదం వేదంలో సాక్షాత్తూ భగవంతుని సూచించే పదంగా ఉన్నదనీ కవిని స్వయంభువుగా పరిభువుగా వేదం అభివర్ణిస్తుందనీ పెద్దల నుంచి విన్నాను. [ఈ కారణంగానే పద్యాలను రాగాలు తీసి పాడేవాళ్ళంటే నాకు కొంత చిన్న చూపు. పౌరాణిక నాటకాలలో నటుల్లొ పీసపాటి వారి పద్ధతి నాకు చాలా ఇష్టం ]

    సంగీతాన్ని పొగుడు తున్నప్పుడు సాధారణంగా దొర్లించే, ” శిశుర్వేత్తి …” నిజానికి సాహిత్యం యొక్క గొప్పదనాన్ని సంగీతంతో పోల్చి చెప్పినది. కృష్ణ శాస్త్రి గారి ఒక పాటకు వరస చేసి శాస్త్రి గారికి పాడి వినిపిస్తున్నప్పుడు శ్రీ వోలేటి శాస్త్రి గారి పాదాల చెంత కూర్చున్నారని విన్నాను. సచిన్ దేవ్ బర్మన్ తో సాహిర్ లూధియాన్వీ ప్యాసా పాటల విషయంలో ఈ కారణంగానే విబేధించాడు.

    మనోధర్మ [కర్ణాటక] సంగీతం అంటె నా అభిప్రాయంలో సాహిత్యాన్ని మనసుకు ఎక్కించుకుని తదనుగుణంగా పాడేదే. “సామజ వర గమన ” అంటే అర్థం తెలీకుండా సంగీతం నేర్పే వాళ్ళను -పెద్ద సంగీత సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను – నేను చూశాను అటువంటివాళ్ళు యెంత ‘మనోధర్మ’సంగీతం పాడతారా అన్నది నా మనో ధర్మ సందేహం.

    सुकविता यद्यस्ति राज्येन किम् ॥
    “సుకవితాయద్యస్తి రాజ్యేన కిం”

    నమస్కారాలతో
    తఃతః

  7. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    09/05/2012 12:36 am

    తః తః గారికీ, మోహన గారికీ మీ అభినందనలకి సంతోషించాను.

    తఃతః గారిచ్చిన లింకులో వ్యాసం చదివాను. పినాకపాణి లాంటి మేధావులు పాటల్లో సాహిత్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. పాటల్లో సాహిత్యం నిజంగా పిప్పి అయితే మరెందుకు క్షేత్రయ్య పదాలకి ఆయన వరసలు కట్టారో అర్థం కావడం లేదు. మరీ ఘాటుగా చూస్తే క్షేత్రయ్య పదాల్లో శృంగారం పాలు ఎక్కువే. అది సాహిత్య పరంగా ఇబ్బంది కానప్పుడు మామూలు పాటల్లో సాహిత్యం తుక్కు అనడం వింతగా వుంది. రాళ్ళపల్లి వారు కూడా త్యాగయ్య కృతుల్లో సాహిత్యం పాలు తక్కువన్నారు. అన్నమయ్య పాటల్లో సాహిత్య గుబాళింపులే ఎక్కువని పొగిడారు. సంగీతానికి సాహిత్యం ఉంటేనే ప్రజల నాలుకల మీద నానుతుంది. పూర్వం సాహిత్యం లేకుండానే కచేరీలు చేసుకునే వారు. అందుకే మామూలు జనం సంగీతానికి దూరంగా పారిపోయారు. పురందరదాసూ, రామదాసూ, త్యాగయ్యా, అన్నమయ్యా వంటి వారు కాస్తో కూస్తో సాహిత్యపు మెరుగులు అద్దాకే ప్రజలకి సంగీతం పట్ల అభిరుచి ఎక్కువయ్యింది. కేవలం స్వరాలతోనే పాడితే అది అనుభూతి రహితంగా ఉంటుంది. ఏ కళయినా అనుభూతికి దూరంగా మనలేదు.

    ఇహ బాలమురళి గురించి చాలామంది పలురకాలుగా విమర్శలు చేసారు. నటులందరూ దర్శకులు కాలేనట్లే, గాయకులందరూ వాగ్గేయకారులూ, సంగీతజ్ఞులూ కాలేరు. కొంతమందికి అలా అనిపించుకోవాలన్న కోరిక వుండచ్చు.
    కొత్తవి కనుక్కోవాలన్న ముచ్చట తప్పేమీ కాదు. త్యాగరాజు ఒకటే పాటని కొన్ని కొన్ని రాగాల్లో కట్టాడనుకున్నా, అవన్నీ చక్కటి పాటలే కదా? పాట వినేటప్పుడు చెవిని మొదట చేరేది స్వరాలు కావు. దాన్ని అంటిపెట్టుకున్న అక్షరాలే రసస్పందన్ని కలిగిస్తాయి. ఏమయినా సంగీతకారులకి సాహిత్యం అంటే తక్కువ అభిప్రాయమే ఉండడం అనాదిగా చూస్తూనే ఉన్నాం. ఇదేమీ కొత్త కాదు.

    -బ్రహ్మానందం

  8. ఛందస్సులో గణితాంశములు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    09/05/2012 12:15 am

    మోహన గారూ,

    మీ వ్యాసం అద్భుతం. ఒక పి.హెచ్.డి థీసిస్ లా వుంది, చదువుతూంటే.
    సంగీతంలో రాగతాళాల విభజనకీ, ఫ్రీక్వెంసీ ల సమన్వయానికీ గణితానికీ ఎంతో దగ్గరసంబంధం వుంది. హర్మొనిక్‌ ప్రొగ్రషన్స్, జామెట్రిక్ ప్రొగ్రషన్స్ లతో వీటికి చాలా పోలికలు కనిపిస్తాయి. మీ వ్యాసం నాలాంటి వారికి ప్రేరణ ఇస్తుంది. వేలూరి గారు చెప్పినట్లు ఇంగ్లీషులో రాయండి. తెలుగునాట చందస్సు ఎప్పుడో మర్చిపోయారు.

    -బ్రహ్మానందం

  9. నా కోరిక, నా ప్రార్థన గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    09/05/2012 12:04 am

    మోహన గారికీ, ఇంద్రాణి గారికి, రమగారికీ మీకు నా అనువాదం నచ్చినందుకు కృతజ్ఞతలు.

    సాధారణంగా నేను అనువాదాలు చెయ్యడానికి ఇష్టపడను. అనువాదం ఒక ప్రత్యేక కళ. నాకది లేదని నా నమ్మకం.
    ఈ బల్రాజ్ సహని వ్యాసం నాకు మిత్రుడు శ్యామ్ పంపిచారు. అది చదివాక ఆపుకోలేక ఎలాగయినా అందరికీ ఇది తెలియాలన్న తపనతో చేసిన అనువాదం.

    ఎనభయ్యో పడిలో వున్నా, ఇంకా గెంతుతానూ, పలానా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుంది ( పెళ్ళి సభా మర్యాద, లోపల మాత్రం అనుభవించాలనే ) వంటి నటులున్న మనకి, ఇటువంటి ప్రసంగం వినే అదృష్టం ఎప్పటికయినా వస్తుందా? డాక్టరేట్లూ, బిరుదులూ అన్నీ అమ్మకానికి కొనుక్కునే నటచక్రవర్తులే నేటి యువతకి ప్రేరణ కలిగించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కనీసం నూటికొక్కరయినా ఇది చదివితే నా శ్రమ ఫలించినట్లేనని భావించాను.

    రమగారూ, అనువాదం చేసేటప్పుడు సామ్యవాదమా, సమాజ వాదమాని కాస్త తర్జన భర్జన పడిన మాట వాస్తవం, సామ్యవాదం వాడకూడదని కాదు, సమాజవాదం బావుందనిపించింది. ముఖ్యంగా బల్రాజ్ సాహని చెప్పిన విషయాలకి. అంతకు మించి ఏవీ లేదు. మీరు చెప్పినదంతా నూటికి నూరుపాళ్ళూ వాస్తవం. రాజకీయ నాయకులు అన్ని రంగాలని ఆవరించుకోవడం వల్ల పట్టిన దౌర్భాగ్యం ఇది. ప్రజలు కూడా స్తబ్ధుగానే ఉంటున్నారు. ఎవరికి వారికి వారి పనయిపోతే చాలన్న ధోరణే ప్రస్తుత పరిస్థితులకి కారణం.

    విజయ వర్ధన్ గారూ, మీరిచ్చిన లింకుకి థాంక్స్! భలే పట్టుకున్నారే!
    తెలుగులో కంటే ఇంగ్లీషయితే బాగా ఎక్కుతుందనా?

    -బ్రహ్మానందం

  10. చెట్టు కింది మనుషులు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/04/2012 9:33 pm

    ఇంద్రాణి గారు,

    ఎలా చెప్పాలో తెలీదు, మీ కవితకి హేట్స్ అప్ చెప్పడం తప్ప. అద్భుతంగా వుందండి. కవిత ఎంత సరళంగా వుందో, మీ ధ్రుక్కోణం అంత నిశితంగా వుంది. చాలా బాగుంది.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి