వింజమూరి హృదయ సీమలందుండి, అతడి స్వప్నంబునందుండి ఇటుల పద్యరూపంబు పొందిన అతడి ” హృదయ రాజ్ఞి” అతడి ” స్వప్న లోక రాజ్ఞి” పంతొమ్మిదివందల ఇరవయ్యో దశకం నించి ఒక్కసారి ఇలా ఈమాట లోకి జారిపడి పునర్దర్శనం కలిగించినట్లైంది. మల్లవరపు స్వప్న కింకిణిలాగో, మధు కీల లాగో.. బాపిరాజు శశికళ లాగో ఇంకా అలా ఒక ఎలాగో.. గో..!! ఇదివరకు ఎక్కడో ఇది చదివినట్టే ఉంది కూడా!
ఒక సాహిత్య రూపం కనుమరుగవడం జరుగుతున్నఫ్ఫుడు దానిని వాడి, అందులో భావ వ్యక్తీకరణ చేయడానికి తిరిగి ప్రయత్నించే వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలుంటాయి. అలాగే కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. అప్పటికే పాతబడిన రూపాన్ని వాడటంలో దానికున్న ప్రాచీనత కారణంగా ఆ సాహితీ రూపానికి మరోసారి గుర్తింపు చేకూర్చే పనిలో ఎందరు నిజంగా జయం పొందుతున్నారూ నాకు స్పష్టంగా తెలీదు గానీ (తెలియాలంటే అలాంటి పద్యాలు మళ్ళీ శ్రీనాధుని వాటిలాగానో, పోతన గారి పద్యాల లాగానో అందరికీ నోటిమీద అనివార్యంగానూ అలవోక గానూ పట్టుబడితే తప్ప పద్యం నిజంగా విజయం పొందినట్టు కాదు మరి), అలా పద్యాలు రాస్తున్న వాళ్ళు ఇవాళ ఎందుకని తమ వ్యక్తీకరణలో ఒక “నవ్యత”ని ఒక సమకాలీనతనీ సా ధించలేకపోతున్నారన్నది నా ప్రశ్న .
అన్నులమిన్నా! నారీమణీ, రాకేందుముఖీ, లలనా, నీరజగంధీ, సారసనేత్రీ! లాంటి సంబోధనలు ఇవాళ్టి “స్వప్నసుందరులు” సైతం పకపకా నవ్వేవి కావా? స్వప్నాలలో నవీనత రాదా? ఆశ్చర్యమే!! నా స్వప్నంబులందు సైతం ఇప్పటికీ ఆధునిక వేషధారణలతో ఉన్న అమ్మాయిలే వస్తారేలనో? (మేలి ముసుగుల రోజులు పోయేకా మేలిముసుగుల కలలూ పోవా?)
నేను పద్యాలని వేటిని చదివినా ఆధునిక కాలంలో వస్తున్నవి వారు ఇప్పటికీ ఆ పాత పాత వ్యక్తీకరణలలోనే ఇరుక్కుపోయి పద్య రచన లోని భాష విషయంలోనూ భావాల విషయంలోనూ ఇప్పటికీ ఒక రామరాజభూషణుని పదాలలోంచో ఒక పాలవేకరి కదిరీపతి పదాలలోంచో తమ తమ “స్వప్నసుందరులని” బయటికి తేవడం గమనిస్తున్నాను. శ్రీనాధుడు తన కాలాన్ని తన రచనలలో ప్రతిఫలించగలిగినప్పుడు అన్నమయ్య తన పదాలలో తన కాలంనాటి స్త్రీని అలమేలుమంగలో చూపించగలిగినప్పుడు ఈ కాలంలో పద్యాలు రాసే వీరి భాష కల్పనా ఇంకా వెయ్యేళ్ళ వెనకే నడుస్తే ఎలాగా అని? పద్యం రాస్తే ఇలాంటి భాషే వాడాలన్న నియమం ఏమీ లేదే? వాళ్ళు చందస్సుని పాటించమని నియమాలు పెట్టి ఉన్నారు గానీ “అన్నులమిన్నా!” అని అంటేనే గాని అది పద్యం కాదని ఏమన్నా చెప్పేరా?
కనీసం రెండు మూడు సార్లు చదవాల్సిన వ్యాసం. ఆలస్యంగా నైనా చదివినందుకు నన్ను నేను అభినందించుకున్నాను.
రచయితకు కవిత అంటే సూటిగా చెప్పడం కాదు అన్న సామాన్యమైన అపోహ లేదు. [సూటిగా చెప్పితే కవిత కాదు అనటం వేరు. వేటూరివి అందమైన జాను తెలుగు పదాలతొ చెప్పిన అందమైన భావాలు ఎన్నో ఉన్నా, ఆత్రేయ “మెల్ల మెల్ల మెల్లగా …మెత్తగ అడిగితే లేదనేది లేదుగా” నాకు ఇంకా అందంగా వినపడి, మరీ అందంగా కనపడుతుంది.]
తీసుకున్న వస్తువును బట్టి చెప్పటానికి ఎంచుకున్న భాష, ఆ భాషలో చెప్పిన తీరుతొ – కవిత్వంలొ తలకాయకి పని లేదనుకొకుండా – గుండెని తాకుతూ, [మంచి] కవిత కేవలం అనుభూతిని వ్యక్తీకరించడమే కాకుండా ఒక విశ్లేషణని గూడా ప్రసాదిస్తుందని నా అభిప్రాయం. ఆలొచనామృతంగానూ ఆపాత మధురంగానూ ఉండేటట్లుగా ఒక రచనని రూపొందించే ప్రక్రియ ఆల్కెమీ కాక ఏమవుతుంది. అందుకే చేసి చూపించి ఇక అప్పీలు లేకుండా కవిత్వం ఒక ఆల్కెమీ అనేశాడు తిలక్.
శ్రీ భాస్కర్ — మీరు చూపించిన ఉదాహరణలు చాలా మంచివి. మీరు చెప్పదలుచుకున్న దాన్ని చెప్పి అవి మీ పనిని అవి పూర్తిగా నెరవేర్చాయి.
ఈ వ్యాసం మీద ఇప్పటివరకూ అభిప్రాయాలేవీ కనబడక పోవటం ?!?!
తః తః
“అసలు పేరుతొ రాసినా ఇలాగే రాస్తాను కాబట్టి అసలు పేరును దాని మానాన దాన్ని ఉండనిచ్చేసాను.”
నమస్కారాలతొ
తః తః..
తహ్:
నమస్కారము.
మారుపేరుతో రాస్తున్నా మీరు మహనీయులే ఐఉంటారు. ఏదో సబబు కారణమే ఉండి ఉంటుంది. లేకుంటే ఈ విధానము ఎందుకు అవలంబిస్తారు? ఎవరి పేరును వారు కోరి మరుగు పరుచుకుంటారు?
(నా ఉద్దేశములో, సొంత పేరుతో రచనలు, అభిప్రాయాలు, ప్రచురించే పత్రికలకు విలువ ఎక్కువ ఉంటుంది. అభిప్రాయాలు కూడా పత్రిక సొత్తే. పత్రిక ఒక విలువైన ఆస్థియే. ఆ విషయం మీకు మాత్రం తెలియనిదా ఏమి. 🙂 ఈమాట పత్రిక రచయితలకు “Pulitzer” రావాలని నా కోరిక.)
The important thing is to enjoy various people’s writings in the magazine, and also give the readers other relavant articles ( like you are doing, Thank you, ) to broden our reading experience.
I get lot of joy out of writers of this magazine, and from the good company of people who participate in hearty discussions here.
I thought this article on Dr. PinakapAni is a very nice one, and so is the other reference you gave us earlier.
Good Writing! Happy Reading and Happy Holidays to All!
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి visweswara rao అభిప్రాయం:
12/14/2012 1:49 am
కథ చాలా బాగుంది. మనసుకు హత్తుకునేల రాశారు.
పేరు గలవాడేను మనిషోయ్ గురించి Naresh అభిప్రాయం:
12/13/2012 1:39 pm
కథ చాల బాగుంది.
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి NARAYANA RAO MITTAPALLI అభిప్రాయం:
12/13/2012 12:56 pm
చాలా అద్భుతమైన విశ్లేషణ. చండీదాస్ రచనల గొప్పదనం ఏమిటి అంటే అవి ఒక విషయాన్ని ఎవరో చెప్పిన విధంగా యదాతధంగా అంగీకరించకుండా మన జ్ఞానాన్ని ఉపయోగించమంటయి.
స్వప్న సుందరి గురించి rama bharadwaj అభిప్రాయం:
12/12/2012 10:11 pm
వింజమూరి హృదయ సీమలందుండి, అతడి స్వప్నంబునందుండి ఇటుల పద్యరూపంబు పొందిన అతడి ” హృదయ రాజ్ఞి” అతడి ” స్వప్న లోక రాజ్ఞి” పంతొమ్మిదివందల ఇరవయ్యో దశకం నించి ఒక్కసారి ఇలా ఈమాట లోకి జారిపడి పునర్దర్శనం కలిగించినట్లైంది. మల్లవరపు స్వప్న కింకిణిలాగో, మధు కీల లాగో.. బాపిరాజు శశికళ లాగో ఇంకా అలా ఒక ఎలాగో.. గో..!! ఇదివరకు ఎక్కడో ఇది చదివినట్టే ఉంది కూడా!
ఒక సాహిత్య రూపం కనుమరుగవడం జరుగుతున్నఫ్ఫుడు దానిని వాడి, అందులో భావ వ్యక్తీకరణ చేయడానికి తిరిగి ప్రయత్నించే వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలుంటాయి. అలాగే కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. అప్పటికే పాతబడిన రూపాన్ని వాడటంలో దానికున్న ప్రాచీనత కారణంగా ఆ సాహితీ రూపానికి మరోసారి గుర్తింపు చేకూర్చే పనిలో ఎందరు నిజంగా జయం పొందుతున్నారూ నాకు స్పష్టంగా తెలీదు గానీ (తెలియాలంటే అలాంటి పద్యాలు మళ్ళీ శ్రీనాధుని వాటిలాగానో, పోతన గారి పద్యాల లాగానో అందరికీ నోటిమీద అనివార్యంగానూ అలవోక గానూ పట్టుబడితే తప్ప పద్యం నిజంగా విజయం పొందినట్టు కాదు మరి), అలా పద్యాలు రాస్తున్న వాళ్ళు ఇవాళ ఎందుకని తమ వ్యక్తీకరణలో ఒక “నవ్యత”ని ఒక సమకాలీనతనీ సా ధించలేకపోతున్నారన్నది నా ప్రశ్న .
అన్నులమిన్నా! నారీమణీ, రాకేందుముఖీ, లలనా, నీరజగంధీ, సారసనేత్రీ! లాంటి సంబోధనలు ఇవాళ్టి “స్వప్నసుందరులు” సైతం పకపకా నవ్వేవి కావా? స్వప్నాలలో నవీనత రాదా? ఆశ్చర్యమే!! నా స్వప్నంబులందు సైతం ఇప్పటికీ ఆధునిక వేషధారణలతో ఉన్న అమ్మాయిలే వస్తారేలనో? (మేలి ముసుగుల రోజులు పోయేకా మేలిముసుగుల కలలూ పోవా?)
నేను పద్యాలని వేటిని చదివినా ఆధునిక కాలంలో వస్తున్నవి వారు ఇప్పటికీ ఆ పాత పాత వ్యక్తీకరణలలోనే ఇరుక్కుపోయి పద్య రచన లోని భాష విషయంలోనూ భావాల విషయంలోనూ ఇప్పటికీ ఒక రామరాజభూషణుని పదాలలోంచో ఒక పాలవేకరి కదిరీపతి పదాలలోంచో తమ తమ “స్వప్నసుందరులని” బయటికి తేవడం గమనిస్తున్నాను. శ్రీనాధుడు తన కాలాన్ని తన రచనలలో ప్రతిఫలించగలిగినప్పుడు అన్నమయ్య తన పదాలలో తన కాలంనాటి స్త్రీని అలమేలుమంగలో చూపించగలిగినప్పుడు ఈ కాలంలో పద్యాలు రాసే వీరి భాష కల్పనా ఇంకా వెయ్యేళ్ళ వెనకే నడుస్తే ఎలాగా అని? పద్యం రాస్తే ఇలాంటి భాషే వాడాలన్న నియమం ఏమీ లేదే? వాళ్ళు చందస్సుని పాటించమని నియమాలు పెట్టి ఉన్నారు గానీ “అన్నులమిన్నా!” అని అంటేనే గాని అది పద్యం కాదని ఏమన్నా చెప్పేరా?
రమ
[ఈ అభిప్రాయం కొంత కత్తిరించబడింది – సం.]
స్వప్నభంగం గురించి jayaf అభిప్రాయం:
12/12/2012 10:18 am
చాలా బాగుంది ఈ కవిత.
కవిత్వంలో భావ సాంద్రత గురించి తః తః అభిప్రాయం:
12/11/2012 10:24 am
కనీసం రెండు మూడు సార్లు చదవాల్సిన వ్యాసం. ఆలస్యంగా నైనా చదివినందుకు నన్ను నేను అభినందించుకున్నాను.
రచయితకు కవిత అంటే సూటిగా చెప్పడం కాదు అన్న సామాన్యమైన అపోహ లేదు. [సూటిగా చెప్పితే కవిత కాదు అనటం వేరు. వేటూరివి అందమైన జాను తెలుగు పదాలతొ చెప్పిన అందమైన భావాలు ఎన్నో ఉన్నా, ఆత్రేయ “మెల్ల మెల్ల మెల్లగా …మెత్తగ అడిగితే లేదనేది లేదుగా” నాకు ఇంకా అందంగా వినపడి, మరీ అందంగా కనపడుతుంది.]
తీసుకున్న వస్తువును బట్టి చెప్పటానికి ఎంచుకున్న భాష, ఆ భాషలో చెప్పిన తీరుతొ – కవిత్వంలొ తలకాయకి పని లేదనుకొకుండా – గుండెని తాకుతూ, [మంచి] కవిత కేవలం అనుభూతిని వ్యక్తీకరించడమే కాకుండా ఒక విశ్లేషణని గూడా ప్రసాదిస్తుందని నా అభిప్రాయం. ఆలొచనామృతంగానూ ఆపాత మధురంగానూ ఉండేటట్లుగా ఒక రచనని రూపొందించే ప్రక్రియ ఆల్కెమీ కాక ఏమవుతుంది. అందుకే చేసి చూపించి ఇక అప్పీలు లేకుండా కవిత్వం ఒక ఆల్కెమీ అనేశాడు తిలక్.
శ్రీ భాస్కర్ — మీరు చూపించిన ఉదాహరణలు చాలా మంచివి. మీరు చెప్పదలుచుకున్న దాన్ని చెప్పి అవి మీ పనిని అవి పూర్తిగా నెరవేర్చాయి.
ఈ వ్యాసం మీద ఇప్పటివరకూ అభిప్రాయాలేవీ కనబడక పోవటం ?!?!
తః తః
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి lyla yerneni అభిప్రాయం:
12/10/2012 4:34 pm
“అసలు పేరుతొ రాసినా ఇలాగే రాస్తాను కాబట్టి అసలు పేరును దాని మానాన దాన్ని ఉండనిచ్చేసాను.”
నమస్కారాలతొ
తః తః..
తహ్:
నమస్కారము.
మారుపేరుతో రాస్తున్నా మీరు మహనీయులే ఐఉంటారు. ఏదో సబబు కారణమే ఉండి ఉంటుంది. లేకుంటే ఈ విధానము ఎందుకు అవలంబిస్తారు? ఎవరి పేరును వారు కోరి మరుగు పరుచుకుంటారు?
(నా ఉద్దేశములో, సొంత పేరుతో రచనలు, అభిప్రాయాలు, ప్రచురించే పత్రికలకు విలువ ఎక్కువ ఉంటుంది. అభిప్రాయాలు కూడా పత్రిక సొత్తే. పత్రిక ఒక విలువైన ఆస్థియే. ఆ విషయం మీకు మాత్రం తెలియనిదా ఏమి. 🙂 ఈమాట పత్రిక రచయితలకు “Pulitzer” రావాలని నా కోరిక.)
The important thing is to enjoy various people’s writings in the magazine, and also give the readers other relavant articles ( like you are doing, Thank you, ) to broden our reading experience.
I get lot of joy out of writers of this magazine, and from the good company of people who participate in hearty discussions here.
I thought this article on Dr. PinakapAni is a very nice one, and so is the other reference you gave us earlier.
Good Writing! Happy Reading and Happy Holidays to All!
లై 🙂
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి ramu అభిప్రాయం:
12/10/2012 7:27 am
నాకు అదే అనిపిస్తుంది.
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి anjani అభిప్రాయం:
12/09/2012 7:26 pm
చాలా బాగుంది కాని శీనూ మంచితనం అర్దం చేసుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:
12/09/2012 12:14 am
The first ever శతావధాన in కన్నడ.
నమస్తే,
శాయి.