పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. టి. జి. కమలాదేవి గురించి జనార్దన శర్మ అభిప్రాయం:

    03/11/2013 5:10 am

    కొన్నేళ్ళ కిందట తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మద్రాసులోని “పనగల్ పార్కు” లో కమలాదేవిని సత్కరించి, ఆమెకు ఆర్థిక సహాయము అందజేశారు. అది పత్రికలలో వచ్చింది. ఫోటో కూడా వేశారు. చూశాను కానీ దురదృష్టవశాత్తూ నేను దానిని తీసుకోలేకపోయాను.

  2. మరియ గురించి indrani Palaparthy అభిప్రాయం:

    03/10/2013 4:38 pm

    కధ చాలా బాగున్నది. చాలా రోజుల తర్వాత మంచి కధ చదివాను. మన తెలుగు కధల్లో సర్వసాధారణంగా కనిపించే అనవసరమైన ఉపోద్ఘాతాలు, ఉపన్యాసాలు, సాగతీత, పేజీల కొద్దీ వర్ణనలు, స్వగతాలు, మాండలికాల మాయలు ఏమీ లేకుండా హాయిగా ఉంది.

    పాలపర్తి ఇంద్రాణి.

  3. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి renuka ayola అభిప్రాయం:

    03/10/2013 1:23 pm

    అబద్దాల వంతెనపై నడుస్తూ
    లాలించడానికో వెన్నెల మొక్కను
    కిటికీకి తగిలించాలనుకుంటాం!

    తప్పదు కొన్ని సార్లు అబద్దాల వెన్నెల చూపించాలి.

    చాలా బాగుంది జాన్ గారు మీకవిత.

  4. విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార గురించి నరసింహ శర్మ అభిప్రాయం:

    03/10/2013 10:02 am

    ప్రియ సంపాదకులకు,

    ఆర్యా, శ్రీ సంపత్కుమారాచార్య వారి వ్యాసము మా మిత్రులతో పేస్ బుక్ లో పంచుకొనుటకు మీ అనుమతి కోరుచున్నాను.

    భవదీయుడు జాజిశర్మ.

    [ఆన్‌లైన్లోనే ఉన్న వ్యాసాన్ని మళ్ళీ పూర్తిగా ఎందుకు ప్రచురిద్దామనుకుంటున్నారు? వ్యాసం నుంచి ఒకటీ రెండు పేరాలు మీ పేజ్‌లో ఉటంకించి పూర్తి వ్యాసానికి ఈమాట లింక్ ఇవ్వండి – సం.]

  5. ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి గురించి lyla yerneni అభిప్రాయం:

    03/10/2013 3:11 am

    “వేరువేరు స్త్రీ చిత్రాలు పరిశీలించిన తరువాత,….”

    Why only see the woman, even in the paintings where woman and man are side by side? Why the refusal of male essayist to observe the physical appearance, emotions of a man? What is he afraid of? Loneliness, aging, ugliness, death – are these exclusive to women? Is man exempted? Is a male a non-emotional, non-destructible substance?

    I would let the essayist explain.

    Of course, the male essayist can categorically refuse, the slanted impressions he is creating, in his essay.:-)

    Like Georgia O’Keeffe, the female artist, for instance.:-)

    When an adult viewer looks at G. O’Keeffe paintings of flowers, they can not fail to see female genitalia. And in some, the male genitalia as well. Some viewers of art, see them as expressions of G. O’Keeffe own sexuality and her awareness of sexuality in general. But the artist herself, insisted that her flowers are nothing but accurate (magnified) anatomical drawings of flowers.

    A few of her ‘flower paintings’ are included in the current exhibition “Inventing Abstraction 1910-1925” at MOMA, New York. Rightly so. Her paintings can also be included, in Veluri’s art selection /essay – which he thinks is ‘all about’ women.

    If I end this writing, with this poem;

    చాహనేవాలే హమే చాహ్ రహా హై
    ఫూల్ కా సూరత్ దేఖ్ రహా హై
    క్యా బాత్ హై ఔరత్! – కహ్ భి రహా హై
    చాహత్ పథ్ పర్ హర్ దం హం మిల్ భి రహా హై.

    What is it about?

    లైలా.

  6. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rallapalli Sundaram అభిప్రాయం:

    03/09/2013 8:53 pm

    నారాయణరావు గారి వ్యాసం చాలా బాగుంది. సుమతీ అన్నది సంబోధన, దానివల్ల సుమతీశతకం పేరు రాలేదు. నారా లాంటి వారే సుమతి శతకాన్ని పదేపదే సుమతీ శతకం అనటం బాగులేదు. 1842లో బ్రౌన్ పుస్తకం అచ్చు వేసినప్పుడు 1870 ప్రసక్తి అవసరం లేదు. నారా గారి విశ్లేషణ చాలా బాగుంది.

    రాళ్లపల్లి సుందరం

  7. పిఠాపురంలో నా మొదటి మజిలీ గురించి Rao Vemuri అభిప్రాయం:

    03/09/2013 3:05 pm

    పరుచూరి గారూ:

    ఎన్నాళ్లబట్టో నన్ను వేధిస్తూన్న నా అనుమానాన్ని మీరు ఇప్పుడు తీర్చేరు. ధన్యవాదాలు.

  8. అర్జున గురించి తః తః అభిప్రాయం:

    03/09/2013 2:45 pm

    “One impulse from vernal wood
    May teach you more of man
    Of moral, evil and of good
    Than all the sages can”

    అన్న నేచర్ పొయెట్ చిన్న చిన్న మాటలు, అర్ఘ్యాలూ, పాద్యాలూ లేకుండా, ఈ కథ చెప్పదలుచుకున్న దాన్ని ఎంతో మిన్నగా అంతకన్నా చాలా హాయిగా చెపుతున్నవనుకుంటాను.
    తః తః

  9. దోసిట్లో నక్షత్రాలు గురించి D.Venkateswara Rao అభిప్రాయం:

    03/09/2013 12:10 pm

    మూలా సుబ్రహ్మణ్యం గారు! ధన్యవాదాలు. సృష్టి రహస్యాన్ని 20 సూత్రాలతొ చాలా చక్కగా వర్ణించారు. కవి భావనను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్ధం చేసుకుంటారు. పొడుపుకథల మాదిరిగా ఉండే ఈ కవిత షేక్స్‌పియర్ జీవితాన్ని వర్ణించినట్లుంది.

    1. సూర్యుడు
    2. మేఘం
    3. ప్రేమ
    4. సముద్రం
    5. ఆకాశం
    6. వర్షం
    7.వాయువు
    8. భూమి
    9. పడవ
    10. నది
    11. జీవితం
    12. వృద్ధాప్యం
    13. బాధ
    14. ప్రాణం
    15. పెళ్ళి
    16. ఆలోచన
    17. కలయిక
    18. ఆశ
    19. ఒంటరితనం
    20. మరణం

    దదాల వెంకటెశ్వరరావు

  10. దోసిట్లో నక్షత్రాలు గురించి k.v.rama krishna అభిప్రాయం:

    03/09/2013 8:22 am

    ప్రపచానికి ఇప్పుడు కావలసింది బద్ధకం. చాలా బావుంది.