పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మద్దుకూరి చంద్రహాస్ అభిప్రాయం:

    05/02/2013 5:09 pm

    పీ బీ శ్రీనివాస్ గారి గురించిన చక్కని వ్యాసాన్ని అందించినందుకు వ్యాసకర్తలకు కృతజ్ఞతలు. ఈమాటలో మునుపు వచ్చిన వ్యాసాల స్థాయిలోనే ప్రామాణికంగా వుంది.

    కాకపోతే మంచికైనా చెడుకైనా ఒక్కరుకాక ముగ్గురు వ్రాస్తే ఎలావుంటుందో అలాగే వుంది.

    మంటలు రేపే నెలరాజా పాడిన సందర్భంలో పీబీశ్రీనివాస్ గారు పాడిన ఆలాపనలు గమకాలు ఘంటసాల గారు ఎంతో మెచ్చుకున్నారని ‘అవి ఇప్పుడు నేను పాడలేను బాబూ’ అన్నారని విన్నాను. అయితే అప్పటికి ఆయన కంఠం వయసువల్ల అనారోగ్యం వల్ల మార్పు చెందిన సంగతి ప్రస్తావించుకోవటం అప్రస్తుతం కాదనుకుంటాను.

    తా.క.
    లక్ష్మన్నగారూ, మిమ్మల్ని ఇక్కడ టెక్సాస్లో మేము మిస్సవుతున్నాం.

  2. Good Bye. గురించి lyla yerneni అభిప్రాయం:

    05/02/2013 4:02 pm

    Good Bye! Good Bye! That’s highly ridiculous. I don’t like it one bit. You can’t say good bye. Just when I am getting into the mood to write all kinds of obnoxious things, I so much wanted to, for years. Ready to make an idiot of myself, in this international magazine.

    This is a free world. You are a free man. You make free choices. Of course.
    But, when a man says, – I had a good time, now I must leave, Good Bye! Guys! -Strangely, ( Is it because I am a woman :-)) I can’t happily reconcile, and think -The man says he had a good time. Let him go.
    Instead I feel like asking, if you are having a good time, why won’t you have more of it. What the hell are you doing? Why are you leaving? Where are you going?

    What is the matter with you, Veluri garu! Why are you ditching your writers, who yet have to write their good stuff.
    Angry with you, my Editor -in -Chief. I am angry with you.

    lyla

  3. పలుకుబడి – కాలమానము II గురించి sivasankar ayyalasoamayjula అభిప్రాయం:

    05/02/2013 2:35 pm

    అయ్యా ! మీ పరిశీలనకి ధన్యవాదములు..
    మీ నుంచి మరిన్ని ఆశిస్తూ..
    శివ

  4. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి sivasankar ayyalasoamayjula అభిప్రాయం:

    05/02/2013 2:23 pm

    ఎన్నో సున్నితమైన చారిత్రాత్మక విషయాలని నిSiతంగా పరిశీలించి సరళంగా సులువుగా అందించినందుకు ధన్యవాదములు.

    అందుకే మనకి కవుల జీవిత చరిత్రలు లేవు. కవుల కథలే ఉన్నాయి. నన్నయ ఎప్పుడు పుట్టాడు, ఎవరి దగ్గర పని చేశాడు, ఎవరితో దెబ్బలాడాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నారడు, ఆయన ఎలా వుండేవాడు, ఎలా బతికాడు, ఎలా మరణించాడు, ఆయనకీ రాజరాజనరేంద్రుడికీ ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలా వుండేవి? అనేవి మనకి తెలియవు. తెలియాలని మనం కోరుకోలేదు కూడా. మనకి కావలిసింది నిజజీవితంలో నన్నయ కాదు, భారతం గౌరవప్రదమైన పుస్తకం కావడానికి తోడ్పడే నన్నయ. మన మనస్సులో ఆ నన్నయ ‘నిత్య సత్యవచనుడు, మత్యమరాధిపాచార్యుడు,’

    పాశ్చ్యాత్తులతో పోలిస్తే మన కవుల జీవిత చరిత్రల గురుంచి లభించే కధలు గానీ రచనలు గానే అరుదే అని చెప్పుకోవాలి.

    “నాటకే భవభూతిర్వా వయంవా వయమేవవా,
    ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే. ”

    అని మహాకవి కాళిదాసు భవభూతిని ప్రశంసించినట్లు చరిత్ర చెబుతోంది. దీనిని బట్టి పోలిస్తే భవభూతి కాళిదాసు కంటే ప్రాచీనుడని చెప్పవచ్చును. ఇది నాకు తెలిసిన చదివిన ఒక పరిశీలన, దీనిని మీ పరిశీలనతో జతపరుస్తున్నాను. ఒకప్పుడు అతి విస్తారముగా తెలుగులో చారిత్రక పరిశీలన చేసిన మల్లంపల్లి సోమశేఖర శర్మ లా, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పరిశోధన చాలా ప్రశంసనీయమైనది.

    ఇలానే మీరు మరిన్ని పరిశోధనలు చేయాలని కొరుకుంటున్నాను.

    శివ

  5. Good Bye. గురించి మోహన అభిప్రాయం:

    05/02/2013 1:41 pm

    I am sure he will be fresher to write more without his editorial responsibilities. That may even be the reason for his departure. vElUri gAru, enjoy yourself and enlighten us more. I don’t know why, but suddenly one of Nixon’s quotes comes to my mind. I am sure he will enjoy the humor 🙂 Regards! – mOhana

  6. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి మోహన అభిప్రాయం:

    05/02/2013 1:12 pm

    పి బి శ్రీనివాస్ రచనలను చదివే అదృష్టము ఇప్పటివరకు నాకు దొరకలేదు. వారు మురళీధరరావుగారిని ఎలా ప్రశంసించి వ్రాసియుండేవారో అన్న విషయాన్ని ఊహించడము కష్టము. కాని మురళిధరరావుగారికి ఇలా ఒక మురళీవృత్తమును వ్రాసి ఉండేవారో అనే ఒక భావన కలిగినది. దాని ఫలితమే ఈ మురళీ వృత్తము. వరుసగా 16 గురువులు వస్తుంది ప్రతి పాదములో. ఇలాటి దీర్ఘాక్షరాలకు సంస్కృత పదాలు బాగుంటాయి. కాని నా సంస్కృతము దుష్కృతమే అవుతుంది. అందువల్ల నాకు తెలిసినట్లు వ్రాసినాను. తప్పులు ఉంటే నా అజ్ఞానానికి క్షమించాలి. పద్యములో నేకవచనముతో సంబోధించినంత మాత్రాన బహువచనశీలురైన వారిపై బహుళ గౌరవము లేక పోలేదు. ఏల్చూరి మురళీధరరావు గారి యత్నమునకు జోహారుగా మురళీ వృత్తము –

    సార్థకనామ వృత్తము మురళీ – మ మ మ మ మ ర ల ల ల ల – UUUUUU UUUUUU UUUUIU IIII అనగా మ మ మ మ మ ర న ల గణములతో విరాజిల్లునది మురళీ(లీ)వృత్తము. ప్రతి పాదమునకు 22 అక్షరములు. ఇది సార్థకనామ వృత్తమే కాదు, పాదాంతములో లఘువు ఉండే అరుదైన వృత్తము కూడ.

    మురళీవృత్తము – మ మ మ మ మ ర న ల, యతి (1, 7, 13)
    22 ఆకృతి 3997697

    ఆ సచ్ఛీలున్ సిద్ధున్ – హాసానందోత్సాహున్ –
    హర్షిన్ శ్రీ శ్రీనివాసుఁ బొగడి
    వ్యాస మ్మిట్టుల్ సొంపై – వ్రాయన్ నీకే జెల్లున్ –
    పాండిత్య మ్మెంతయో జిలుకగ
    నీ సచ్ఛైలిన్ భాషన్ – నేనేరీతిన్ జెప్పన్ –
    నిస్సందేహమ్ముగా వెలిగెను
    వ్యాసంగమ్మున్ సాహి-త్యమ్మున్ సంగీతమ్మో –
    యంచున్ మ్రోగించు డా మురళిని

    విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు

  7. Good Bye. గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    05/02/2013 12:02 pm

    అప్పుడేనా?

    మీ కథ/వ్యాసం ‘కేతిగాడు బంగారక్క’ తానా పత్రికలో (తొంభైల్లో) చదివినప్పట్నించీ మీకు అభిమానినయ్యాను. ఈమాట సంచికల్లో ఏది చదివినా చదవకపోయినా మీ సంపాదకీయం మాత్రం వదలను. మీరు విశ్రాంతి కావాలంటే కాదనలేం, కానీ చెళుకులు, విరుపులు, చురకలు, చరిత్ర, విజ్ఞత అన్నీ కలబోసి నడిచే మీ సంపాదకీయాలు మాత్రం వదులుకోవడం కష్టమే! ఏదో ఒక రచనా వ్యాసంగంతో మమ్మల్ని అలరించడం మాత్రం మానకండి.

    ధన్యవాదాలు మాష్టారూ!

    కృష్ణారావు

  8. పై గదిలో ప్రేమికుడు గురించి Murty అభిప్రాయం:

    05/02/2013 11:38 am

    శారద గారూ: నేను ఆ కధ ఇంగ్లీషులో చదవలేదు, కానీ తెలుగులో మీరు అద్భుతం గా అనువాదం చేశారు.
    mUrti.

  9. జాతర గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    05/02/2013 10:04 am

    సాయి పద్మ గారు

    బాగుంది కవిత, ఇందులో మీరు ఉపయోగించిన అభివ్యక్తి నాకు నచ్చింది.

    అభినందనలు

  10. జాతర గురించి అఫ్సర్ అభిప్రాయం:

    05/02/2013 8:42 am

    మనసొక పెద్ద మందు పాతర…ఈ మాట ఎవరంటారా అని ఎదురుచూస్తున్నా, సాయిపద్మ గారూ. చాలా పదునుగా వుంది నడక…నట్లు పడని సూటిదనం. రాయండి వొక explosion లాగా…