పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. గురుదేవునికి అంజలి గురించి Srinivas Maddali అభిప్రాయం:

    05/08/2013 10:02 am

    చాలా బాగున్నాయి. రవీంద్రుడు యెందుకు విశ్వకవి అయ్యాడో మీ అనువాదం ద్వారా అర్ధమయ్యింది. ధన్య వాదాలు శ్రీ మోహన్ గారు.

  2. పలుకుబడి – కాలమానము II గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/08/2013 9:38 am

    @mohan గారు: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365+ రోజుల కాలం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 29.5 రోజులు పడుతుంది. 12 చాంద్రమాసాలు 354+ రోజులకు పూర్తి అవుతాయి. అంటే సౌర చంద్ర మానాలకు దాదాపు 11 రోజుల తేడా ఉంది. రెండున్నర సంవత్సరాలలో ఈ తేడా దాదాపు ఒక చాంద్రమాసపు నిడివి చేరుకుంటుంది. కాబట్టి ఈ తేడా పరిహరించడానికి దాదాపు ప్రతి రెండు సంవత్సరాల ఎనిమిది నెలలకు ఒక మాసాన్ని అధికమాసంగా జత చేస్తారు. ఆ సంవత్సరంలో పదమూడు నెలలు ఉంటాయి. ఉదాహరణకు 2012లో నందన నామ సంవత్సరంలో భాద్రపద మాసం రెండు సార్లు వచ్చింది. ఆ సంవత్సరంలో మాసాలు వరుసగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, (అధిక) భాద్రపదం, (నిజ) భాద్రపదం, ఆశ్వయుజం… ఇలా అన్నమాట.

    సూర్య గమనాన్ని, చంద్ర గమనాన్ని శాస్త్ర పరంగా గమనించి, అధికమాస నిర్ణయానికి చాలా సులభతరమైన మార్గాన్ని సూర్యసిద్ధాంతంలో సూచించారు. ఆ పద్ధతిని స్థూలంగా వివరిస్తాను:

    సూర్యుడి 365+ రోజుల సంవత్సరపు కాలగమనాన్ని 12 రాశులుగా విభజించవచ్చు. ప్రతి నెల 14-16 వ తేదీల సమయంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి సంక్రమణం చేస్తాడు. దీనిని మాససంక్రాంతి అంటారు. (సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతిని పండగగా జరుపుకుంటాం కదా!) ఈ సౌరమాసంతో సంబంధం లేకుండా 29న్నర రోజుల చాంద్రమాసమేమో అమావాస్య నుండి అమావాస్య దాకా సాగుతుంది. అంటే తరచుగా చంద్రమాసం ఒక సౌరమాసంలో ప్రారంభమై మరో సౌరమాసంలో అంతమౌతుంది. ఉదాహరణకు ప్రస్తుతం నడుస్తున్న చైత్ర మాసం ఏప్రిల్ 11న ప్రారంభమై (ఏప్రిల్ 10 అమవాస్య), మే 10వ తేది అమావాస్యతో ముగుస్తుంది. అయితే, సూర్యుడు ఏప్రిల్ 14న మేషరాశిలో ప్రవేశించాడు. మే 14న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.

    అయితే, ఏ కాలంలోనైనా 29న్నర రోజుల చాంద్రమాసం ఒకే సౌరమాసంలో (అంటే సూర్యుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు) ప్రారంభమై, అదే సౌరమాసంలో పూర్తి అవుతుందో ఆ మాసాన్ని అధికమాసంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2012లో సూర్యుడు ఆగష్టు 17న ఉదయం 8:05కు సింహరాశిలో ప్రవేశించి సెప్టెంబర్ 17 ఉదయం 8:23 వరకూ ఉన్నాడు. అదే సమయంలో ఆగష్టు 18న చంద్రుని భాద్రపద మాసం ప్రారంభమై, సెప్టెంబర్ 16 ఉదయం 8:05 గంటలకు అమావాస్యతో పూర్తవుతుంది, కాబట్టి ఆ భాద్రపదమాసం అధిక భాద్రపదం.

    2012లో భాద్రపద మాసంతో పాటు, 2010 వికృతి నామ సంవత్సరంలో వైశాఖ మాసం అధికమాసం. మళ్ళీ ఇంకో అధికమాసం 2015లో మన్మథ నామ సంవత్సరంలో – అధిక ఆషాడ మాసంగా రాబోతుంది.

    ఇదే కాకుండా ప్రతి 141 సంవత్సరాలకు, ఆపై 19 సంవత్సరాలకు ఒక నెల తక్కువగా సంవత్సరంలో పదకొండు నెలలుగా లెక్కిస్తారు. తక్కువగా లెక్కించిన మాసాన్ని క్షయమాసం అంటారు. ఉదాహరణకు 1964లో పుష్య మాసం క్షయమాసం, 1983లో మాఘ మాసం క్షయమాసం. మళ్ళీ మరో క్షయ మాసం మన జీవితకాలంలో మనం చూడలేము — వచ్చే క్షయమాసం 141 ఏళ్ళ తరువాత 2124 సంవత్సరంలో వస్తుంది.

  3. కతికితే అతకదు గురించి P Santha Devi అభిప్రాయం:

    05/08/2013 4:45 am

    కథ చాలా బాగుంది. కతకదానికీ అతకదానికీ సంబంధం లేదని నిరూపించారు

  4. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి P Santha Devi అభిప్రాయం:

    05/08/2013 4:20 am

    Dear Muralidhara Rao garu,

    Your vyasam on Late Shri P.B.Srinivas is unique like every other work of yours is. As you said Andhra State missed what Tamil Nadu gained as far as P.B.Srinivas is concerned. We all think of him only when we listen to his melodious songs, more particularly like ‘chiguralula Uyalalo’, ‘Andala O chilulka’, ‘Oho Gulabibala’ etc. I could not of course understand the depth of his works. I will preserve this vyaasam so that I can understand it by reading it in your presence. I hope I will get that opportunity.

    With greatest regards and best wishes
    Santha Devi

  5. కతికితే అతకదు గురించి nagarjuna అభిప్రాయం:

    05/08/2013 3:03 am

    చాలా బాగుంది . ఒక సినిమాలా

  6. పై గదిలో ప్రేమికుడు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    05/07/2013 5:07 pm

    శారద గారు:

    మీ అనువాదాలు చాలా బాగుంటాయి. కానీ ఎందుకో నాకీ కధ నచ్చలేదు. ఈ కళాకారుల్ని ఇక్కడే వదిలేసి ఆ పై గదిలో ప్రేమికుడు తక్షణం గది ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిది.

    మీకు ఆసక్తి ఉంటే సైన్సు వ్యాసాలు / సైన్సు ఫిక్షను అనువాదాలు రాస్తే/చేస్తే ఆసక్తికరంగా ఉంటుంది, నాలాంటి విద్యార్థులకి.

    పాలపర్తి ఇంద్రాణి.

  7. కతికితే అతకదు గురించి Phaneendra అభిప్రాయం:

    05/07/2013 1:52 pm

    కధ చాలా బాగుంది. జంపాల చౌదరి గారి వ్యాఖ్యలతో అంగీకరించను. ఆంధ్ర దేశంలో పెళ్ళి చూపులలలో ఫలహారాలు పెట్టడం సహజం. దానిని కతకడం అనరని నా అభిప్రాయం.

  8. ఈమాట మే 2013 సంచికకు స్వాగతం! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/07/2013 11:38 am

    యెర్నేని లైలా గారికి
    నమస్కృతులతో,

    మీ అభిలషితానికి ధన్యవాదాలు. నా ఎం.ఫిల్. లఘుసిద్ధాంత వ్యాసం “మహాభారతములో ద్రోణపర్వము”ను అచ్చువేయలేదు. దానిలోని ముఖ్యవిషయసంగ్రహాన్ని మాత్రం పునస్సంక్షేపించి ఒక వ్యాసంగా ఏదో సంచికలో 1980లో ప్రకటించినట్లు గుర్తు. అది దొరికితే, మీకు ‘ఈమాట’ సంపాదకుల ద్వారా అభిప్రాయార్థం అందజేస్తాను.

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

  9. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి nagaraju raveender అభిప్రాయం:

    05/07/2013 11:14 am

    పి. బి. శ్రీనివాస్ గారు ఒక మంచి గాయకుడనే తెలుసు ఇన్నాళ్ళూ. కాని ఆయన ఒక బహుభాషా కోవిదుడు మరియు పండితుడని మీ వ్యాసం చదివాకే తెలిసింది.

  10. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/07/2013 10:29 am

    పిబిఎస్ గారికి శ్రీమతి సుశీల తన ట్రస్ట్ తరఫున Lifetime Achievement Award రెండేళ్లకు ముందు బహూకరించారు. ఈ నెల మొదటి వారములో SPB బెంగళూరులో ఒక సన్మానాన్ని ఏర్పాటు చేశారు, కాని ఆ పురస్కారమును పిబిఎస్ అందుకొనటానికి విధి అడ్డు పడినది. తోటి గాయకులు వారిని గురించి తమ హృదయపు లోతులనుండి వివరముగా హిందూ పత్రికలో ఇచ్చిన సందేశములను, అదే విధముగా ఇండియాగ్లిట్జ్ లోని ఈ రెండు ( 1, 2) పేజీలను చదవండి, కొన్ని కొత్త విషయాలను తెలిసికొంటారు.

    విధేయుడు – మోహన