పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అవధారు గురించి naresh nunna అభిప్రాయం:

    07/02/2013 8:25 am

    మీ త్రిపుర తలపోత చదివాక నా Tear ducts క్లీనయితే బాగానే ఉండేది కనక ప్రసాద్ గారు.

    కానీ, పొగులుతూ తన వెనక సిద్ధంగా ఉన్న సింధువుని ఉబకనీకుండా ఆపేసే ఒకే ఒక్క బిందువు- దిగులంత బరువెక్కి కూడా తొణకక గురుత్వాకర్షణకే సవాలుగా Tear ducts అంచున, కనుకొలకుల్లోనే ఆగిపోయి, పొరలా కంటిని కమ్మేసి, అక్షరాల్ని అలికి ఆరడి పెడుతోంది.

    తత్వదర్శి అయితే అయ్యేడు. యెదవనాకొడుకు. — అంటూ ముగిసిన epitaph లోని చివరి పదబంధం, ‘అవధారు దేవ హరికుల రామ/ వివిధమై నీబంటు వెలయుచున్నాడు’ అని రాముడికి హనుమయ్య గురించి అన్నమయ్య నివేదించినట్టు, త్రిపురకి మీ సంతప్తాంతరంగాన్ని గురించి ఎరుక పరుస్తుందేమో అనిపిస్తోంది.

  2. భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి Siddineni Bhava Narayana. అభిప్రాయం:

    07/02/2013 7:33 am

    పప్పు నాగరాజు గారూ, పరుచూరి శ్రీనివాస్‌ గారూ,
    Quite laudable effort. Going by the lull that prevailed after the publication the work by Jolipalyam Mangamma garu, one could hardly have entertained any hope of sustained study in these allied branches. You insinuate this series of essays to be an agendum. I do appreciate the exhaustive inclusions you have incorporated. My limitations in comprehending the technical side of the subject not withstanding, I enjoyed my self with the information you provided by way of laying down the course for further research and for compiling consummate treatises on the branch.

    I very eagerly look forward for the next installment. As your essay enlightened me far beyond the elementary acquaintance gleaned from ‘Symbol and Script’ by Hans Jensen. I would like to express my sincere appreciation of your effort for the reliable authentic information you have provided. We are indebted to you for the painstaking effort you have put into the endeavour. I extend my thanks for inciting the right kind of inquisitiveness and meaningful doubts as to the context of the vernaculars of India.

    Yours faithfully,
    Siddineni Bhava Narayana.

  3. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి రవి అభిప్రాయం:

    07/02/2013 6:56 am

    అద్భుతమైన పద్యానికి అత్యద్భుతమైన వివరణ. ధన్యవాదములు.

    వాణి విలాసబంధురతభాతి పయోధర పోల్కిలేమిచే
    దా నిరువ్రయ్యలై చనిన దద్దశ జూచి సుభాష్య యోధులున్
    దాని పదాంతరంబునను _దారు వసించినవారు గావునన్
    బూని తదంశమున్ సమతఁ _బోల్చిరి తత్సతి దృక్కుచంబులన్.

  4. ఇంకొంచెం అసంబద్ధం గురించి రవి అభిప్రాయం:

    07/02/2013 5:58 am

    కవిత మాత్రమే అసంబద్ధం. భావం ఎక్కడో గుచ్చుతోంది. నిజమే. దేవుడు,పాపాయి, కవి చూస్తూ ఉంటారు. ఆ చూపే ఒక అద్దం అవుతుంది.

    మీ కవిత బావోలేదు. ఎందుకంటే అందులో నిజం ఉంది. 🙂

  5. అవధారు గురించి Mercy Margaret అభిప్రాయం:

    07/02/2013 4:52 am

    కనక ప్రసాద్! గారు త్రిపురగారితో మీ అనుభవాల్ని, జ్ఞాపకాల్ని చదివి మాటల లేకుండా ఉండిపొయాను, “నిశ్శబ్దపు పిలుపు వినగలవు నువ్వు, నిశ్శబ్దపు గర్జనను వినగలవు, ఈ ప్రపంచం కంటే లోతైన ప్రపంచాల్లోంచీ…” ఈ మాటలకి అర్ధం వివరించినట్టుంది. ధన్యవాదాలు.

  6. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి ఆ. సౌమ్య అభిప్రాయం:

    07/02/2013 3:56 am

    చాలా బాగుంది వ్యాసం. అయితే, నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ప్రతీ కవి కథే అయితే ప్రతీ విమర్శకుడు లేదా కవి జీవిత చరిత్రని రాస్తున్నవాడు ‘కథ’ ఎందుకు కాడు? మీరన్నట్టు కవి జీవితంలో లేని విషయాలని కల్పించి రాసి డబ్బు కోసమో, కీర్తి కండూతి కోసమో తపిస్తున్నవాడిలో మాత్రం కవి, లౌకిక వ్యక్తి అనే రెండు స్వభావాలు ఉండవా? ఒక మాట నాకు బాగా నచ్చింది… కవిత్వం/రచన తరతరాలు చదవాలి. అప్పుడే రాగద్వేషాలు పోయి కవిత్వం మిగులుతుంది అన్నారు కదా. చాలా మంచి మాట చెప్పారు. ఇదే మాట కవి జీవిత చరిత్రలు రాస్తున్నవారికి కూడా వర్తిస్తుంది కదా!!

    కొంతమంది కవుల జీవితగాథలు తెలిస్తే వారి కవిత్వం బాగా అర్థమవుతుంది అన్నదాన్లో కొంత నిజం లేకపోలేదు. నా స్వానుభవంలో… కమలా దాస్ కవితలు చదువుతుంటే ఒకటే ఆవేదన నాకు. ఎందుకు ఈమెకి ఇంత బాధ! ఇంత దుఃఖం! ఎందుకు ఇంత వేదనాభరితమైన కవిత్వం రాస్తోంది! అన్న ప్రశ్నలు వేధించేవి. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకున్నాక ఆవిడ కవితలమీద నా అవగాహన పెరిగింది.

    రాగద్వేషాలకు అతీతంగా కవిని అర్థం చేసుకోవడం, ప్రేమించడం సాధ్యమవుతుందా!! అని. ఎంతో ప్రేమించిన కవి లోని లౌకిక వ్యక్తి, తన సొంత రచనలకు పూర్తి వ్యతిరేకమైన పనులు చేస్తూ/మాట్లాడుతూ కళ్ళముందు కనిపిస్తుంటే ఆ కవి కథని అతని సృజన ద్వారా మాత్రమే ఎలా రూపొందించుకోవడం అని!!

  7. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి jayaprabha అభిప్రాయం:

    07/02/2013 2:28 am

    బాగా రాసేరు కామేశ్వర రావు గారూ! దాశరధిని గురించి నేను మరి కొంత చెప్పవలసి ఉంది. నిజానికి ఎప్పుడో రాయవలసి ఉండింది. కానీ ఏవో నా రాత కోతల్లో పడి ఎప్పుడూ కుదరలేదు. అలా ఇంకా కుదరనివి ఎన్నో ఉన్నాయి. వాటిని సైతం ఎప్పుడైనా రాయగలనో లేనో? నాకు కూడా దాశరధి ఎంతో ఇshTaమైన కవి. మీరన్నట్టూ పద్యం ఆయన చేతిలో నర్తించింది. కవిత్వంలో తెలుగు భాషని అంత అందంగానూ అంత కవనోద్రేకంగానూ వాడిన వారు అరుదు!

    విశ్వనాధ సూర్యనారాయణతో పాటు నన్ను కూడా తెలుగు కవితా రంగానికి తన ముందు మాట ద్వారా 1980లో పరిచయం చేసినది దాశరధే! ఆయన రాసిన “కవితా సూర్యప్రభ” ఆ రోజుల్లో చాలా మందికి నచ్చిన పరిచయం!

    ఆ రోజుల్లో దాశరధి నాతో చాలా మాట్లాడేవారు. వారానికి ఒక రెండు రోజులైనా ఆయనని హైదర్ గూడాలో వాళ్ళ ఇంటిలో కలిసేదాన్ని. బోలెడన్ని సాహిత్యపు సంగతులు నా ముందు పోత పోసేవారు. కానీ అవన్నీ ఆనాడు నిజంగా నాకు అర్ధమయ్యేయని నేను చెప్పలేను. అప్పటికి నా వయసు చిన్నది. నా సాహిత్య పరిజ్ఞానం అప్పటికి తక్కువ. ఇంకా తెలుగు సాహిత్యపు మూలాలలోకి నేను వెళ్లని కాలం అది. అయినా నామీద ఆయనకి ఎందుకో అపారమైన విశ్వాసం ఉండేది. ఎంతో ఇష్టం ఉండేది. ఆయన వట్టి భోళా మనిషి. ఎంతో ఆత్మీయతతో మసిలేవారు. ప్రధమ కోపమూ ఉండేది. వెనువెంటనే చల్లబడేవారు . ఉద్రేక స్వభావి! అంతే సహృదయుడూనూ!

    జీవిక కోసం దాశరధి కూడా సినిమా పాటల్ని రాసినా మిగిలిన ఆయన కాలపు కవులకి మల్లే నాకు తెలిసీ ఆయన చెత్త పాటల్ని గాని, బూతు పాటల్ని గాని రాయలేదని గుర్తు. సినిమాల్లో ఆయన రాసిన యుగళ గీతాలూ భక్తి గీతాలూ కవిగా ఆయన సున్నిత స్పందనలకి కొనసాగింపుగానే కనిపిస్తాయి. సినిమా రంగంలో మంచి పాటల్ని రాయడం కష్టమైపోతున్న కాలం అప్పటికే వచ్చింది. కానీ దాశరధి మాత్రం ఏవగింపు కలిగే ఏ పాటనీ రాయలేదు. మీరన్నట్టు పద్యం అలవోకగా అతి గాఢం గా నిర్మించగలిగిన నేర్పు దాశరధి స్వంతం! శిల్పిని గురించి ఆయన రాసిన అన్ని పద్యాలూ నాకిష్టం! గాలిబ్ గీతాలకి ఆయన చేసిన అనువాదం నాకు మహా ఇష్టం! ఎన్నో ఉటంకించవచ్చును. కానీ ఒక చిన్న పద్యాన్ని మాత్రం ఇక్కడ చెబుతాను ఆయన భావ విన్యాసానికి మచ్చుతునకగా!

    “ప్రతి వికార శిలయు ప్రతిమయై కనుపట్టు
    పడతివోలె కులికి వలపు రేపు
    నీ కరావలంబ నిభృత మైనపుడెల్ల
    రాతి రాతి లోన నాతి దోచు”

    [ఆయన శిల్పి కవితా ఖండిక నించి]

    “ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
    నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము ”

    తో మొదలు పెట్టి ఆయన అనువదించిన గాలిబ్ గీత మాలిక ప్రతి సుమ సౌరభం!! అందులో నాకిష్టమైనవి ఎన్నో! కానీ ఈ ఒక్క చిన్న పదంతో ముగిస్తాను.

    ” ఆమె తనను గూర్చి అతి గర్వపడుచుండు
    కాన పిలువబోదు తాను నన్ను
    నేను స్వాభిమాన నిరతుడ గావున
    పిలువకుండ పోను; కలియుటెట్లు ? ”

    [ ఆయన “గాలిబ్ గీతాలు” నించి ]

    మీరు చేసిన శ్రీమాన్ దాశరధి కృష్ణమాచార్యుల వారి పద్య ప్రస్తావన ఆయనని గురించిన నా పాత తలపోతలని ఆనాటి కాలాన్నీ తిరిగి నా కంటిముందు నిలిపింది. లేకపోతే బహుశా నేను ఈ మాటలు రాయడానికి మరికొంత కాలం తీసుకునే దానినేమో!! ఇలా దాశరధిని నేను గుర్తు చేసుకునే వీలు కల్పించిన మీకూ ఈమాటకూ నా నిండు కృతజ్ఞతలు.

    జయప్రభ.

  8. భార్యోత్సాహం గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:

    07/02/2013 2:13 am

    మళ్లా చాలా రోజులకి బులుసు వారు తమ పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించారు. వారు వండి వడ్డించినది ఏదైనా రుచిగానే ఉంటుంది కదా?

  9. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి naresh nunna అభిప్రాయం:

    07/02/2013 2:02 am

    వస్తు-రూప ద్వంద్వానికి అంతుచిక్కని, నెపం వంటి కేవల రూపాన్ని మించి ప్రచ్ఛన్నంగా పరుచుకొని సారమై నిలిచిన త్రిపుర రాతలలోంచి ఆయన మూర్తిని, మూర్తిమత్వాన్ని ఊహిస్తూ గుట్టలుగా పోగుపడ్డ నా appraisals వల్లనే ఆయనని కలవాలని నేను వెంపర్లాడలేదు. ‘త్రిపుర ఎలా ఉంటారో అన్న కుతూహలం లాంటి ప్రశ్న, త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది నాకు.

    తీరా త్రిపురని కలిసిన తర్వాత, ఆయనని నేరుగా చూడటం కంటే, పొంచి చూడటంలో ఎక్కువ ఆనందాన్ని పొందే వాడిని. అందుకే కలిసిన సందర్భాల కంటే, చూసినవి, పొంచి చూసినవే ఎక్కువ. ఈ దోబూచులాటలకి వీలులేకుండా, ఆయన వెళ్ళిపోయారన్న ఆలోచన ఆవేదనై లోన ఘనీభవిస్తే, దానిని కరిగించి, కన్నీళ్లు చేసి ఒక శుభ్ర వేదనలో నన్ను శుద్ధి చేసిందీ ఎలిజీ. శోకంలో కూరుకు పోవడం, లేదా అందులోంచి విడుదల కావడం అని రెండే పార్శ్వాలు, రెండే ముఖాలు, రెండే మార్గాంతరాలు తెలిసిన నాకు నారింజ క్లేశపు తొనలు వలిచి చూపిందీ స్మృతిగీతం. కాగితం మీద కవిత నక్కిన జాగా పోను, తక్కిన తెల్లని ఖాళీ అంటే- ‘త్రిపుర ఉన్నప్పటి ప్రపంచాన్ని లేనప్పటి ప్రపంచంతో పోల్చుకోవడం’ లాంటిదని విప్పి చెప్పిందీ విలాప విరాళి.

    అట్నుంచి ఏడో నంబర్లోనూ, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడని త్రిపుర నిర్థారించుకొని వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన భగవంతం చెప్పుల్లేని పాదాలకింద పడి నలుగుతున్న పండుటాకుల చప్పుడు ఈ ‘శోక’విత…

  10. మేఘదూతః(మేఘసందేశః) -2 గురించి Sarada Prasad అభిప్రాయం:

    07/02/2013 1:59 am

    ఈ పద్యాలకు అర్ధాలు కూడా ఇస్తె బాగుండేది .