పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి prasadd ayyagari అభిప్రాయం:

    07/06/2013 9:56 am

    మనిషి భస్మాసురుడయ్యాడు.

  2. అవధారు గురించి ramanajeevi అభిప్రాయం:

    07/06/2013 8:27 am

    త్రిపురని త్రిపుర లాగే పరిచయం పరిచయం చేశారు, అంత గాయం లోనూ. చాలా కష్టమైన పని.

  3. భార్యోత్సాహం గురించి D.Ravindrababu అభిప్రాయం:

    07/06/2013 8:14 am

    బావుందండీ.సరదాగా నవ్వుకోవచ్చు.

  4. ఇప్పుడెందుకిలా? గురించి karanam srinivas అభిప్రాయం:

    07/06/2013 7:29 am

    లోతు తెలియని లోయలాంటి ఒంటరితనం. నిజంగా ఒంటరితనం అగాథాన్ని అద్భుతంగా ఆ విష్కరించారు. ధన్యవాదాలు

  5. ఈమాట గురించి గురించి karanam srinivas అభిప్రాయం:

    07/06/2013 7:20 am

    మాధవ పాణినిలకు అభినందనలు

  6. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి mallikarjuna sarma devarakonda అభిప్రాయం:

    07/06/2013 3:33 am

    “The Death of the Author”, (a 1968 essay by the French literary critic and theorist Roland Barthes) వ్యాసానికీ, ప్రస్తుత వ్యాసానికీ ఎలాంటి పోలికలూ తేడాలూ వున్నాయో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాలని వుంది కానీ ప్రస్తుతం నేనున్న వ్యక్తిగత స్థితి అందుకు అనుకూలంగా లేదు. కనుక నా ప్రార్ధన ఏమంటే ఎవరైనా అలాంటి ప్రయత్నం లో వుంటే దయచేసి “ఈమాట”లో పంచుకుంటే చర్చ మరింత విస్త్రుతమయే అవకాశం వుంది.

  7. అవధారు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/06/2013 1:47 am

    ఒక సారి ఒక అభిప్రాయం వ్రాసిన తర్వాత, అది ఎందుకో తెలీదు మాయవై పోతే మళ్ళా వ్రాయాలంటే అభ్భా అనిపిస్తుంది.

    జయప్రభ గారు, మా యన్న వెళ్ళిపోయి చాలా కాలం అయిందండి. ఇప్పటికి కూడా, నా కంటే దాదాపు పదేళ్ళు పెద్దవాడు, కానీ ఇప్పటికి కూడా ఒరే దొంగ నాకొడకా నువ్వు వుండుంటే ఎంత బాగుండేది కదరా అనుకుంటాను. మాయన్న, నా బంగారన్న. కొన్ని సార్లు దుఖ్ఖం సునామీలా మనసును ముంచేస్తే, పదాలు కాదండీ, ఎమోషన్సే.
    అప్పుడు మన చుట్టు మనం కట్టుకున్న గోడలు కాదు, మన మనసులో వున్నదే, అదే, నిజంగా అదే, మరే మర్యాద మాటలు అవసరం లేదు. అప్పుడు వాడిన ఏ మాటకి మరో అర్థం తీయ్యాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇష్టాన్ని ఫలాని రకంగానే బయటపెట్టాలని రూలేం లేదు కదండి. మీకు తెలిసిన భాష, మాకు తెలియదు. మాకు తెలిసిన భాష మాదే, మీరొప్పుకున్నా, కాదన్నా.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. అలిఖిత కఠిన శాసనం! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/06/2013 12:27 am

    1. జ్వలించే ప్రేమల వల్ల కలిగే సంయోగ వియోగాలు అందరి జీవితాల్లో సహజమే కాబట్టి కవిత చటుక్కున బాగుందనిపిస్తోంది.

    * ఇది మీ మొదటి అభిప్రాయం.

    2. కానీ, form దృష్ట్యా, అంటే నిర్మాణపరంగా కవిత ‘అంత మంచి కవిత ‘ అనిపించడం ‘ లేదు.

    * ఇది మీ రెండో అభిప్రాయం. (అయినా, అంత సందిగ్ధత ఎందు కు?)

    3. నా కవిత మాట పక్కన పెడదాం! కనీసం…నా సమాధానం అయినా పూర్తిగా చదవకుండా, ‘విభజనా విధానాన్ని ‘చేపట్టి, లేని పోని స్పర్ధలు రేపి, వినోదించాలనుకోవడం..మీ వంటి పండితులకి తగదు.

    4. కొసమెరుపు గా మీకూ నాదొక మాట! ‘ నా ఈ కవిత వల్ల ‘పాత జ్ఞాపకాలేవో రేగి,”…తాను మరింత ఎక్కవ connect ఐ, ఈ కవిత చదవమని- మీకు మీ మిత్రు రాలు లింక్ పంపారా?

    ( .. బదులివ్వడం – ఒక slap on the face …? – అంటే నాకు అర్ధం కాలేదండి.)

    * ధన్య వాదాలు!
    విధేయురాలు..
    -ఆర్.దమయంతి.

  9. కొవ్వుపుంజి గురించి naresh nunna అభిప్రాయం:

    07/05/2013 9:17 pm

    నారాయణ స్వామి గారు మినహా, చలం గార్ని ఎవరూ తలచడం లేదు 🙂

    Boule de Suif (Ball of Fat) అనే ఈ Maupassant ఫ్రెంచి పెద్ద కథకి, చలం ‘సత్యం’ నాటిక అనుసరణ. ఫ్రాన్స్- జర్మని యుద్ధానంతరం (1870-71) జర్మని ఆక్రమణలో ఉన్న తమ ప్రాంతం నుంచి ఫ్రెంచి పౌరులు కొందరు ఒక రైలులో పారిపోయే ప్రయత్నం ఈ పెద్ద కథకి నేపథ్యం. బుస్సీ సాయంతో విజయరామరాజు బొబ్బిలి రాజుల్ని చంపి, కోటని ఆక్రమించుకున్నాక, బొబ్బిలి పౌరులు కొందరు ఒక ఏడ్లబండిలో పారిపోయే ప్రయత్నమే- చలం ‘సత్యం.’

    మధ్య తరగతికి చెందిన లైసో దంపతులు, డబ్బున్న కారీ- లెమెడన్ జంట, ఒక తాత్విక ద్వయం, మత ప్రచారానికి అంకితమైన ఇద్దరు బ్రహ్మచారిణిలు, ఎలిసెబెత్ రుసె (ఇక్కడ శారద గారు ముద్దుగ పిలిచిన కొవ్వుపుంజి) అనే వేశ్య సహ ప్రయాణీకులు.

    అదే విధంగా, సత్యం అనే భోగం స్త్రీ, ఆమె విటుడు సూర్యప్రకాశం, అమృతం, కనకమ్మ దంపతులు, వారి కొడుకు మాధవుడు, ఒక సన్యాసి, మరో విధవ దుర్గమ్మ ఆ ఎడ్లబండిలో సహగాములు. సంస్కారులు, మర్యాదస్తుల ఇరుకు మనస్థత్వాలు, కొంచెం బుద్ధులు, వేశ్యలుగా, కులటలుగా ముద్ర పడినవారి ఔన్నత్యాల్ని కళ్ళకి కడతారు మొపాసా, చలం ఈ రచనల్లో.

    ఎర్నెస్ట్ హేకోక్స్ రాసిన Stage to Lordsburg (1937) కథలో కూడా డల్లాస్ అనే కొవ్వుపుంజి ఉంది. కాబట్టి, ఇంత శ్రమకోర్చి అనువాదం చేసిన శారద గారు! చలం గారి ‘సత్యం’ మీరు తప్పక చదివితే, చలం మీద మొపాసా ప్రభావం గురించి ఎక్కువ అథారిటీతో మాకు చెప్పగలరని ఆశ.

  10. కొడుకుల శివరాం భాగవత గానం గురించి Ram Konada అభిప్రాయం:

    07/05/2013 2:05 pm

    Pardha Saradhi gAri abhiprayam tho nEnu EkEbhavisthunnAnu. ME krushi ki dhanyavAdhamulu,