నాకు తెలీదు, ఒక కవితని, ఒక పీర్ రెవ్యూడ్ వ్యాసంలా చదివి అర్థం చేసుకోవాలని. నాకు తెలిసిన కవిత, కవిత్వం, నా మనసులోనుంచి, నా గుండెల్లోనించి వచ్చిన నా అనుభవాల, లేకపోతే నాకు తెలిసిన ఆ కొంచం వైకారియస్ అనుభవాల వ్యక్తీకరణ. కామెంట్ చెయ్యడం కోసం, ఆ కవితని ఒక సైన్స్ పీర్ రెవ్యూడ్ వ్యాసం లాగ నేను చూడను. చదివినప్పుడు అది నా మనసుని ఒప్పించిందా, నా గుండె కొంచం ఎక్కువగా కొట్టుకుందా. నాకొక చిన్న సంతోషవో, ఒక చిన్న దిగులో అనిపించిందా? అంతే, అదే నాకు కావాల్సింది. నాకు తెలుగు తెలియదు, నాకు కవిత్వం తెలియదు, నాకు తెలిసిందల్లా, నా గుండెని, మనసుని కదిలించగలిగేదే.
దమయంతి గారు, మీ కవిత్వ బహుశా “నున్నా గారు” చెప్పగలరేవో. నాకు నచ్చింది, నచ్చిందని చెప్పడం. కవిత్వం తో సంబంధం లేదు, మనసుతోనే సంబధం, బతుకుతోనె సంబంధం. అది శ్రీశ్రీ అయినా మీరయినా, నేనయినా, నున్నా గారయినా.
వేసవి జ్ఞాపకం కవితలో అపురూప పరిచయాల అల్లికగా వేసవిని భలే ప్రస్తావించారు. ఇండియాలో వేసవంటే సెలవులు, ఆటలు, తాటి ముంజెలు, మామిడి పళ్ళు ఇవి బాగా గుర్తుకొస్తాయి. గుర్తుండీ గుర్తుకు రాని దృశ్యాల-బంధాలను మీ కవిత బాగా గుర్తు చేసింది. ఉదాహరణలుగా ఇవి వ్రాశారు.
ఎంత అద్భుతమైన విషాద చిత్రం .. ప్రకృతిలోని నిశ్శబ్దాన్నీ , విషాదాన్నీ ఎందుకు ప్రేమిస్తారో తెలిసినపుడు, ఏదో అవగతమైన భావన.. ఆ కోనేటి మెట్లనే చూస్తూ సాగే కార్తీక దీపంలా .. ఘనం అవుతానని తెలిసి నవ్వుకున్న మార్మికత పదాల నిండా.. థేంక్ యు స్వాతి గారూ ..
ఈ “మీరూ మేమూ” ఏమిటి? ఈ విభజన మీరెలా చేస్తున్నట్టూ? ఎవరి తరుపున చేస్తున్నట్టూ? లోకంలో ఉన్న కోట్ల మందికి కోట్ల వ్యక్తీకరణలుండొచ్చు! అవన్నీ తెచ్చి పోతపోస్తూంటే అది ఒక పోగు అయి కూచుంటుంది తప్పితే దానికో వ్యక్తీకరణ ఏర్పడదు. అదలా ఉంచితే ఈ తరహా మాటలు నామిని శైలి! ఎవరైనా నామినిని అభిమానించడం వేరు. నామినిని అనుకరించడం వేరు. నేను నా అభిప్రాయం చెప్పేను. నాకు అనిపించింది. అందులో ఎవరికీ ఇబ్బంది ఉండనవసరం లేదు. ఎప్పుడైనా ఎవరితోవ వారిదే!! మీరు చెప్పిన దాని మీద నేను వాదనకి దిగను. అలాగే నా అభిప్రాయాన్నీ మార్చుకోను.
అలిఖిత కఠిన శాసనం! గురించి ravikiran timmireddy అభిప్రాయం:
07/07/2013 2:42 pm
నాకు తెలీదు, ఒక కవితని, ఒక పీర్ రెవ్యూడ్ వ్యాసంలా చదివి అర్థం చేసుకోవాలని. నాకు తెలిసిన కవిత, కవిత్వం, నా మనసులోనుంచి, నా గుండెల్లోనించి వచ్చిన నా అనుభవాల, లేకపోతే నాకు తెలిసిన ఆ కొంచం వైకారియస్ అనుభవాల వ్యక్తీకరణ. కామెంట్ చెయ్యడం కోసం, ఆ కవితని ఒక సైన్స్ పీర్ రెవ్యూడ్ వ్యాసం లాగ నేను చూడను. చదివినప్పుడు అది నా మనసుని ఒప్పించిందా, నా గుండె కొంచం ఎక్కువగా కొట్టుకుందా. నాకొక చిన్న సంతోషవో, ఒక చిన్న దిగులో అనిపించిందా? అంతే, అదే నాకు కావాల్సింది. నాకు తెలుగు తెలియదు, నాకు కవిత్వం తెలియదు, నాకు తెలిసిందల్లా, నా గుండెని, మనసుని కదిలించగలిగేదే.
దమయంతి గారు, మీ కవిత్వ బహుశా “నున్నా గారు” చెప్పగలరేవో. నాకు నచ్చింది, నచ్చిందని చెప్పడం. కవిత్వం తో సంబంధం లేదు, మనసుతోనే సంబధం, బతుకుతోనె సంబంధం. అది శ్రీశ్రీ అయినా మీరయినా, నేనయినా, నున్నా గారయినా.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి.
పై గదిలో ప్రేమికుడు గురించి cumaar అభిప్రాయం:
07/07/2013 1:11 pm
శారద గారు! ఈ కథ సగములో ఆగినట్టనిపించింది. ఇంకో రెండు మూడు వ్యాక్యాలు రాసి ముగిస్తే బాగుండునని నా అభిప్రాయము. మొత్తానికి బాగానే వుంది.
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి O.V.R.Venugopal Rao అభిప్రాయం:
07/07/2013 12:51 pm
మీ కవిత్వం నా మనసుని పిండేసింది. The way death came at Kedarnath even Lord Yama will weep and weep.
నదిలోని నీరు గురించి Jayashree Naidu అభిప్రాయం:
07/07/2013 11:01 am
kabhee tanhaayiyon mein yU..
ఈ పాట తెలుగు పదాల్లో ఒరుసుకుపోయి.. గుండె ని కోసుకుంటూ వెళ్ళినట్టుంది స్వాతి గారు
నదిలోని నీరు గురించి Kolluru Siva nageswararao అభిప్రాయం:
07/07/2013 10:36 am
చాలా బాగుంది.
వేసవి జ్ఞాపకం గురించి Naren అభిప్రాయం:
07/07/2013 10:05 am
వేసవి జ్ఞాపకం కవితలో అపురూప పరిచయాల అల్లికగా వేసవిని భలే ప్రస్తావించారు. ఇండియాలో వేసవంటే సెలవులు, ఆటలు, తాటి ముంజెలు, మామిడి పళ్ళు ఇవి బాగా గుర్తుకొస్తాయి. గుర్తుండీ గుర్తుకు రాని దృశ్యాల-బంధాలను మీ కవిత బాగా గుర్తు చేసింది. ఉదాహరణలుగా ఇవి వ్రాశారు.
‘అమ్మమ్మ తడి నూలుచీర ఎన్నిసార్లు చుట్టినా
సింహతలాటపు ఎర్రని కూజానో’
‘పెరట్లో ఎర్రగన్నేరు చెట్టుకింద’
‘సూర్యుడు సాయంకాలమయ్యేసరికి
శాంతించిన ప్రేమికునిలా
సంధ్య ఒళ్ళో మెల్లగా తలదాచుకుంటాడు
పెరట్లో విచ్చుకుంటున్న మల్లె మొగ్గలు, విరజాజులు’
‘చుక్కల చెమ్కీల కుట్టుపూల చీరను’
‘చల్లని పైరగాలిలో నిద్రలోకి జారుకుంటుంది’
అభినందనలతో,
నరేన్.
భార్యోత్సాహం గురించి Rajkumar అభిప్రాయం:
07/07/2013 9:38 am
సూపర్ .. సూపర్
తెలుగు అధికార భాష కావాలంటే గురించి నూర్ బాషా రహంతుల్లా అభిప్రాయం:
07/07/2013 1:20 am
తెలుగు ఇప్పటికీ “అధికార భాష” కాలేదు. అవ్వాలనే ఆశ.
నదిలోని నీరు గురించి సాయి పద్మ అభిప్రాయం:
07/07/2013 12:56 am
ఎంత అద్భుతమైన విషాద చిత్రం .. ప్రకృతిలోని నిశ్శబ్దాన్నీ , విషాదాన్నీ ఎందుకు ప్రేమిస్తారో తెలిసినపుడు, ఏదో అవగతమైన భావన.. ఆ కోనేటి మెట్లనే చూస్తూ సాగే కార్తీక దీపంలా .. ఘనం అవుతానని తెలిసి నవ్వుకున్న మార్మికత పదాల నిండా.. థేంక్ యు స్వాతి గారూ ..
అవధారు గురించి jayaprabha అభిప్రాయం:
07/06/2013 10:04 am

జయప్రభ.