పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నన్నయ హంసగీతికలు గురించి శ్రీరామం దగ్గుబాటి అభిప్రాయం:

    07/15/2013 12:30 am

    మోహన గారి నన్నయ హంసగీతికలు వ్యాసము చాల బాగున్నది. శ్రీ కామేశ్వరరావు గారు దయచేసి మీరు పేర్కొన్న “నన్నయ గారి వెన్నెలరేయి” (నన్నయ భారతి నుండి) అన్న వ్యాసము నాకు పంపగలరా? నాకు వెబ్లో దొరకలేదు.
    సాహిత్యాభిలాషి
    శ్రీరామం

  2. ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/14/2013 3:44 pm

    కుటుంబాలలో – స్త్రీలకి సాటి స్త్రీలతో గల సంబంధ బాంధవ్యాలలో మధురమైన బంధం – అత్తా కోడాళ్ళ అనుబంధం. గృహాన్ని స్వర్గ సీమ లా మార్చడం లో ఈ ఇద్దరి పాత్రలూ సమున్నతం గా వుండాలని నా అభిప్రాయం. ఆ ప్రయత్నం లో భాగం గా రాసిన చిన్న సంఘటన ఇది! మీకు నచ్చినందుకు, మీ హృదయ స్పందన తెలియ చేసినందుకు ధన్య వాదాలు – రత్నశిఖా మణి గారూ!
    శుభాభినందనలతో..
    ఆర్.దమయంతి.

  3. నిశ్శబ్దం గురించి lyla yerneni అభిప్రాయం:

    07/14/2013 3:20 pm

    ఆడబిడ్డలు లేనిల్లు ఉంటుందా, ఆడబిడ్డలుంటే ఈ కష్టం తెలియని ఇల్లుంటుందా. ఇంత చదువుకున్న, తెలుసుకున్న ఈ “ఈమాట” పాఠకుల్లో ఇంత హిపోక్రసీ నిజవేనా?
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

    ఇళ్ళల్లో ఆడకూతుళ్ళూ ఉంటారు. మొగ కొడుకులూ ఉంటారు. అప్పటికి మీరు చదువుకున్న చదువులు బట్టి, మీకు తోచింది రాశారు. రాసింది మీరూ, హిపోక్రసీ పాఠకులదా? పాఠకులు ఎందరో రచయితలను, ఎన్నో సమాజాలను గమనిస్తుంటారు.

    స్టే హోమ్ డాడీ
    డయాపర్ స్టేషన్ మీదెక్కి
    పంగలు జాపి పొడుకున్న కొడుకును
    పట్టించుకోడు
    “డాడే, డాడే, డయాపర్ నువ్వే మారసాలి
    డాడే!” అని సోకాలు పెట్టే కొడుకుని పట్టించుకోడు
    పిలగాడు పెంట, ఉచ్చ అన్నీ సులకాయంతా
    పులుముకుంటుంటే పట్టించుకోడు;
    ముడ్డీ, నోరూ తెలీని గుంటడు పెంట
    తింటుంటే పట్టించుకోడు;
    కమలాదాస్ కదలు తల్సుకుని
    ఆమె తన తలుపెందుకు కొట్టదా?
    కొడితే తన గింత బోర్ కొట్టదు కదా అని
    ఓడకా లోకి ఏడుసుకుని
    బుజం మీది వేలాడే తువ్వాలుకి ముక్కు తుడుసుకుని
    తలుపు తీసుకుని లోని కొచ్చిన పెల్లాన్ని సూసి
    “ఏవో ఇంతాలీసం అఇందేవో,”
    అంటే,
    పెళ్లం – “ఎలర్జీలా? నేసల్ కంజెషన్?
    ఇదుగో నేసొనెక్స్ సాంపుల్
    యావో, యావయ్యిందో అనకుండా
    ఏమో, ఏమిటో అని స్పష్టంగా అనగలవ్
    క్లీనప్, క్లీనప్, కమ్ సీ మి ఇన్ ద బెడ్రూమ్,”
    అనేసి వెళ్లి పోతే వెంటబడి వెళ్ళి ఆ మొగ కొడుకు

    పై పంక్తులకు, మీ ఆఖరు కవిత ఖండం జోడించి, మొత్తం ఒకసారి చదివి చూడండి.

    లైలా

    PS: Looking forward to the opening of second season of “The News Room” tonight. It is my fancy, that Aaron Sorkin is a notable American writer, who influenced cinema, as well as American politics.

  4. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి jayaprabha అభిప్రాయం:

    07/14/2013 6:47 am

    మరే! బతుకు మొత్తం నాటకమే అని కదా అన్నమయ్య అన్నది, “నానాటి బతుకు నాటకమూ” అంటూ!! బతుకు నాటకం అయ్యేకా అది ఇంక ఫిక్షన్ గానే మారుతుంది. అందువల్ల ఎవరు ఏమి చెప్పినా దాన్ని నాటకంలో భాగంగానే గ్రహించాలన్న మాట! నటనకి ఇచ్చిన ప్రాముఖ్యతని మనుష్యులు నిజానికి ఇవ్వడానికి ఇస్టపడరు కదా? అది నిజమే అని తెలిసినా… దాన్ని “కధ” అనుకుని చదవడంలో ఉండే కిక్కు ముఖ్యం మరి!

    జయప్రభ.

  5. నిశ్శబ్దం గురించి jayaprabha అభిప్రాయం:

    07/14/2013 6:33 am

    “హిపోక్రసీ” అని మెల్లిగా అంటారేమిటీ రవికిరణూ? ఉన్నదంతా అదే కదా??

    మీ కవిత లో ఉన్న వ్యక్తీకరణ తెలుగు సాహిత్యానికి ఏమీ కొత్తది కాదు. చలం రాసేడు.. చండీదాసూ రాసేడు. పాత సాహిత్యం లో పద కవులూ రాసేరు.. ప్రబంధ కవులూ రాసేరు.

    ఎప్పుడన్నా కవిత లో మనం ఏమి రాసేమన్న దానితో పాటు ఎలా రాసేమన్నదే ముఖ్యం. చదివిన వారి మనసులోకి ఆ భావాన్ని ఎలా పంపగలుగుతున్నామన్నదీ కూడా !!

    అయితే కవి ఒక పద్యాన్ని ఎప్పుడూ ముందు తన కోసమే రాసుకుంటాడు. పాఠకులకోసమో.. విమర్శకుల కోసమో కాదు. గనక మీ మనసుకి నచ్చిందా మీకు ఇతరులు ఏమనుకుంటారన్నదే ముఖ్యం కాకూడదు. ఇంక ఈ గొడవ మీ మనసుకి పట్టనే కూడదు. కవిత రాసే వరకే మీ బాధ్యత / మీ తపన / మీ దుఖావేశమూ/ సంతోషమూను. అటు పిమ్మట ఆ కవిత మీద ఇతరులు ఏమని అనుకున్నా అది మీకు అనవసరం కావాలి. రాసిన తరవాత ఇంకా దాన్ని అలా భుజాన మోసే బరువుని మాత్రం కవి పెట్టుకోకూడదు. మీరీ కవితని దాని బతుకుని దాన్ని బతకనిచ్చి ఇంకో కవిత వైపుకి ప్రయాణం కండి! అదీ ముఖ్యం!

    జయప్రభ.

  6. ఉరుము ఉరిమి… గురించి రత్నశిఖామణి అభిప్రాయం:

    07/14/2013 5:37 am

    అత్తాకోడళ్ళ సంభాషణల ద్వారా వారి కర్కష complaints వినిపించినా వారి మనసుల్లోని సున్నితత్వాన్ని compassion ని మాత్రం చక్కటి అభివ్యక్తీకరణ ద్వారా స్పష్టం చేశారు.

  7. బాల్కనీలో బచ్చలిమొక్క గురించి రత్నశిఖామణి అభిప్రాయం:

    07/14/2013 5:08 am

    అనురాగ మనస్కులయిన అందరిలోనూ మొక్కలపట్ల ఆప్యాయత ఉంటుందనే నిజం మీ స్పందన వలన అవగతమవుతున్నది.
    “విస్తరాకులంత ఆకుపచ్చని పత్రాలతో కొండంత పందిరై దాని నీడన కూర్చుని చదువుకునే నాకు శాంతి నికేతనమైంది ఈ బచ్చలి తీవే!” అని మీరు చెప్పిన తీరు నా ఈ కవితకు మకుటమయింది.
    దమయంతిగారూ, మీకు ధన్యవాదములు.
    స్థలాభావంవల్ల తానా 2013 సంపాదకులు ఈ కవితని కుదించారు.

    రత్నశిఖామణి

    దీని పూర్తి పాఠం ఈ క్రిందివిధంగా వుంది:
    బాల్కనీలో బచ్చలిమొక్క

    బాల్కనీలో బచ్చలిమొక్క భలే బాగా పెరుగుతోంది.
    మేమెవరమూ నాటకుండానే తనకై తానే పుట్టుకొచ్చిందీ బచ్చలి —
    ఈ బచ్చలికీ మాకూ ఏదో ఋణానుబంధం వున్నట్లే వుంది!
    నా చిన్నప్పుడు మా వాకిట్లో నేనొక బచ్చలి మొక్కను నాటినందుకు కాబోలు—
    అంతరిక్షంలోకి తొంగిచూస్తున్న ఇరవైఅయిదో అంతస్తులోని
    బాల్కనీలోకి వచ్చి పడింది బచ్చలి విత్తనం– ఎంత చిత్రం–
    ఎంతో పత్రహరితంగా ఎదుగుతూన్న ఈ బచ్చలికి నామీదెంత ప్రేమో!
    బాల్కనీలో నిల్చున్నపుడల్లా పచ్చని నిగనిగల నగవులు చిందిస్తుంది.
    చెంబెడు నీళ్ళైనా పోయందే తానుమాత్రం
    గంపెడాకుల తీగలతో గగనానికి ఎగబ్రాకుతోంది.
    బాల్కనీలో బట్టలారవేసే తీగలపైకెగబాకి
    బరువుగా ఆలపించిన దరువులా సాగుతుంది.
    ముత్యాల్లాంటి పూలు పూసి మరెంతో మురిపించి పగడాల్లాంటి పళ్ళు కాసి
    పండగనాటి తోరణమై పచ్చటి తీగలతో బాల్కనీ నిండుగా పందిరి వేసింది.
    ఆకాశపుటంతస్తులలో అందంగా పెరిగి మా కింతటి పచ్చదనాన్నిచ్చిన
    ఈ ముత్యాల పగడాల తోరణాల ఒంటరి పందిరి బచ్చలికి
    ఎందుకింత అనురాగం! ఇంతటి కృతజ్ఞత?
    అనంతమనిపించే సతతహరితారణ్యలనే హరించేసిన
    ఈ స్వార్థపూరిత మానవుడు సంకల్పించనిదే, ప్రయత్నించనిదే
    తానుగా ఒక్కగానొక్క మొక్కగా మొలిచి తీగలై పెరిగి
    తన నిస్వార్థమైన అలౌకికానుబంధంతో నన్ను ఆనందింపజేస్తోంది.
    నా మానవజాతి ఈ హరితారణ్యశోభిత ధరణికి చేసిన
    ద్రోహాన్ని తలుచుకొని సిగ్గుపడేలా చేస్తోంది.
    హరితవిప్లవానికి ప్రతీకగా ఉద్భవించింది ఇంతటి ఎత్తైన భవనంలో–
    తరతరాలుగా తన పచ్చదనాన్ని ఆహారంగా ధారబోసి మన రక్తకణాలైన
    ఈ బచ్చలి సంతతి చల్లగా వర్ధిల్లు గాక!
    ఒంటినిండా మెరిసే ఆభరణాలైన ఆ పగడాల విత్తనాలలో
    దాగున్నాయి మరెన్నో పచ్చని “బచ్చలి బయళ్ళు”
    మహావృక్షాల్ని పెంచకపోయినా మొక్కలోనె తుంచకూడదనీ
    పెద్దచెట్టైనా చిన్నమొక్కైనా అది సకలజీవులకు ఆధారమేనని
    జ్ఞానోదయమైంది నాకీ బచ్చలి పందిరికింద.
    దాన్నివండుకోడానికి మాకు మనసొప్పట్లేదు—
    ఈ బచ్చలి తీగెలపై పండిన గింజల్ని ఈ ఆకాశపు బాల్కనీలలో
    విస్తరింపజేస్తే ఎంత బాగుంటుందో కదా!
    ప్రతి ఇంటా ఇంతటి పచ్చదనం వెల్లివిరిస్తే,
    ఒక్కొక్కరూ కనీసం ఒక్క మొక్కైనా తుంచక కాపాడి పెంచితే
    ఈ భూమాత ఎంత సంతసిస్తుందో కదా!
    * * *

  8. అవ్వ – బువ్వ గురించి రత్నశిఖామణి అభిప్రాయం:

    07/14/2013 4:44 am

    ఈ కవిత చదివాక మనసంతా ఏదో అభావం ఆవరించింది. అయినా మనసు ఆలోచించక ఉండలేదు కాబట్టి అవ్వకు జరిగిన ఈ వాస్తవ ఘటన ఎందుకు జరగాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇంకా ఎన్నో ప్రశ్నలు, కానీ జవాబులే ఉండవు. అందుకేనేమో ఈ అభావం! ఈ కవిత అంతా మానవ అస్తిత్వానికే ఒక పెద్ద ప్రశ్న అనిపిస్తున్నది. సమకాలీన వ్యవస్థలో కొన్ని ప్రశ్నలకు జవాబే లేదనడానికి ఈ కవిత నిదర్శనమనిపిస్తున్నది. ఈ కవిత మానవ హృదయాన్ని కలచివేసే ప్రశ్నార్థకమయిన వాస్తవ ఘటనాశిల్పం.

    Picturesque speechless!
    ~రత్నశిఖామణి

  9. భోగి తలంట్లు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/14/2013 3:29 am

    ‘కళ కళలాడుతున్న పంచరంగుల చిత్రం లోకి వెళ్ళిపోయాను ‘ అన్న మీ ప్రశంస నాకెంతో ఆనందాన్నిచ్చింది మైథిలి గారూ!
    మీ స్పందనని తెలియ చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,
    శుభాభినందనలతో..
    -ఆర్.దమయంతి.

  10. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/13/2013 5:35 pm

    చాలా కాలం తర్వాత వ్రాస్తున్నాను ఈ అభిప్రాయాన్ని. మధ్య, మధ్య లో ఈ కవితని చదువుతూనేవున్నాను. ఇప్పటికి కూడా నాకు అభ్భా అనిపిస్తుంది. ఇది అతడు, ఆమె వ్యవహారం అయినా, సహజత్వాన్ని పచ్చి అని ఎవరనుకున్నా, దీంట్లో ఉన్న ఒక అనంతవైన ధుఖ్ఖాన్ని, మన భారతీయ సమాజం లో ఉన్న ఈ అత్యంత సహజవైన ఈ జీవితాన్ని ఎవరూ ఎందుకు గమనించలేదు. ఆడబిడ్డలు లేనిల్లు ఉంటుందా, ఆడబిడ్డలుంటే ఈ కష్టం తెలియని ఇల్లుంటుందా. ఇంత చదువుకున్న, తెలుసుకున్న ఈ “ఈమాట” పాఠకుల్లో ఇంత హిపోక్రసీ నిజవేనా?

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి