అద్భుతం. అప్పటి కార్యక్రమాలు వినగలగటం అందులోనూ తెలుగు సాహిత్యంలో హేమాహేమీల గొంతులు వినగలగటం చాలా ఆనందాన్నిచ్చింది. ఇంటర్‌నెట్లో లో తెలుగు రేడియో కార్యక్రమల్లో అతి పురాతనమైన రేడియో రికార్డింగులు ప్రస్తుతానికి ఇవ్వే అనుకుంటాను. ధన్యవాదాలు.
తెలుగు మాట దేవుడెరుగు. మనలో చాలామందికి తెలుగు పదాలకీ, సంస్కృత పదాలకీ తేడా తెలియదు. ‘ఊర్థ్వజ్ఞుడు’, ‘వ్యాఘ్రేశ్వరుడు’ ఈ రెండూ అచ్చ తెలుగు పదాలు కావు. రెండూ సంస్కృత భూయిష్ట పదాలే!
పైగా ఊర్థ్వజ్ఞుడు అన్నది తప్పు. ఊర్థ్వజ్ఞువు అన్నది సరైన సంస్కృత పదం. కనిపించిన ప్రతీ సంస్కృత పదానికీ, “డు”, “ము”, “వు” లు తగిలించేస్తే తెలుగు పదం అయిపోతుందన్న సంస్కారం వేళ్ళూనుకుపోయింది. ఈ మధ్య ఇంగ్లీషు పదాలకి తెలుగు పదాలు కనుక్కునే కొత్త గుంపొకటి తయారయ్యింది. ఇంటర్నెట్ ని అంతర్జాలం అని అనడం అనవాయితీగా మారింది. సంస్కృత పదం అరువు తెచ్చుకోగా లేనిది, ఇంగ్లీషు పదమే వాడడంలో వచ్చే నష్టమేవిటో తెలియదు. ముఖ్యంగా సాంకేతిక పదాలు దిగుమతిచేసుకోవడమ్లో.
చాలామందికి తెలుగు నేర్పేయాలన్న తహ తహే తప్ప వారి అర్హతలు బేరీజు వేసుకోరు. మాట్లాడడం వేరు, భాషా బోధన వేరు. దౌర్భాగ్యం ఏవిటంటే చాలామందికి, అంటే తెలుగు వచ్చుననుకున్న భ్రమలో మునిగినవారికి, పట్టుమని ఒక వాక్యం కూడా రాయడం రాదు. ఒక్క ఇంగ్లీషు పదం ఉపయోగించకుండా రోజే గడవదు. ఇదంతా అనవసర వాక్యశోష. గణాంకాలకిచ్చే గుర్తింపు నాణ్యతకి ఇవ్వడం తెలుగు వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. మిగిలిందీ, వచ్చినదీ ఒకటే – చంకలు గుద్దుకోవడం, భుజాలు తట్టుకోవడం. యావత్తు తెలుగుజాతీ అయోమయమ్లో కొట్టుమిట్లాడుతోంది ప్రస్తుతం.
ఇదొక దౌర్భాగ్య సంధి కాలం.
ఎంతో ఆలోచింపజేసే వ్యాసానికి, practicalగా ఉపయోగపడే సలహాలను అందించినందుకు వెల్చేరుగారికి చాలా కృతజ్ఞతలు.
తెలుగు ప్రపంచ భాష అనేది దేవుడెరుగు, కనీసం ఇంకొక తరానికైనా ఇప్పటి తరం వాళ్ళకున్నంత ప్రవేశం, పాండిత్యం, భాషపైన పట్టు గాని వెసలుబాటూ గాని- “నేర్చుకోవడానికి” అవసరమయ్యే అవకాశాలను అందించగలమా అనేది అనుమానమే.
సిలికానాంధ్ర వారి “మనబడి” ప్రయత్నాలు అభినందనీయం. కాని అందులో ఎందుకో “మన” అన్నదానికే కొంత లోటేమో అనిపిస్తుంది. వారు నిర్దేశించిన సంఖ్యలో విద్యార్థులను పోగుచేస్తేనే కాని వాళ్ళ పుస్తకాలు సైతం అమ్మడానికి నిరాకరించడం విద్యార్థులకు లోటే. అయినా ఎవరికి అమ్మాలో ఎవ్వరికి అమ్మకూడదో వాళ్ళ ఇష్టం. కాని వాళ్ళు ఎంచుకున్న భాషాసేవకు నష్టం.
అపార్థం చేసుకోరనే ఆశతొ, విన్నపంతో అడుగుతున్న ప్రశ్న మాత్రమే – ఎవరికి కావాలండి “ఊర్థ్వజ్ఞుడు” అనే పదం రాయడం? అంటే అది మంచిది కాదని కాదు, సాధారణ విషయాలను సైతం తెలుగులో సరిగ్గా చెప్పడానికి కష్టపడే పిల్లలచేత గహనమైన పదాలు, అసలెప్పుడూ వాడనివి నిఘంటువుల్లో మాత్రమే దొరికేవి (దొరకనివి!) వ్రాయిస్తే వాళ్ళకే కాదు సాటి పిల్లలకు మాత్రం ఏం మేలు ఒరిగింది అనే బాధతో అడిగింది. విమర్శ కన్నా ఇది ఆత్మ విమర్శ. అసలాపదం పెద్దవాళ్ళెంత మందికి తెలుసు, ఎన్ని సార్లు జీవితంలో రాశారు, చదివారు, వాడారు! కాదు, మా పిల్లవాడు ఊర్థ్వజ్ఞుడు అంటే చెప్పేదేమీ లేదు. వీలైనంతవరకు తెలుగులో సొంత భావ వ్యక్తీకరణకు సాయపడినప్పుడే తెలుగు శిక్షణకు, చదువుకు సార్థకత అనిపిస్తుంది.
మీ అభిప్రాయం నాకు నచ్చింది. నాకూ సరిగ్గా మీకు వచ్చిన ఆలోచన లాంటిదే వచ్చింది.
మీరన్నట్టు …… “మన మనుగడకి మూలాధారమైన సూర్యుడిని, భూమిని, దైవ సమానులుగా పూజించి, తండ్రి తోను, తల్లి తోను పోల్చడం హేతుబద్ధమే అని నా నమ్మకం. మనం ప్రవర చెప్పుకునేటప్పుడు, “ఈ పాల సముద్రంలో, ఈ సూర్య మండలంలో, ఈ భూమి మీద, ఈ పశ్చిమ భూభాగంలో….అంటూ గోత్ర నామాలు చెప్పుకుని, “అహంభో అభివాదయే” అంటే సరిపోతుంది. ”
కొంచెం ధాటీ గా అయితే ఉంది గానీ కేశవ్ గారి అభిప్రాయం బాగుంది. వేమూరి గారూ కవిత్వం మీద మోజు ఉన్న వాళ్లకి అందరికీ విజ్ఞాన శాస్త్రం మీద కూడా మోజు ఉండాలని లేదు కదండీ? ఉదాహరణ కి నాకు “ఆదిత్య హృదయం” అంటే మహా ఇష్టం! దాన్ని నేను భక్తి తో చదువుతాను. అందులో సూర్యుడిని చూసిన విధానం శాస్త్రీయం గా ఉందో లేదో నాకు అఖ్ఖర లేదు. ఆసక్తి కూడా లేదు. అక్కడ సూర్య నమస్కారం మాత్రమే నేను చూసేది చేసేదీను]. ఆదిత్య హౄదయంలో సూర్యుడిని వాల్మీకి “విశ్వభావన” అని సంబోధించడం నాకు ఎంతో బాగుంటుంది. అది కవితాత్మకంగా ఉంటుంది.
ఇంక ఎప్పటి నుంచో ఆడవాళ్ళు సూర్యుడిని స్మరించుకునే ఆ తెలుగు పదం లోనూ నాకు కవిత్వమే కనబడుతుంది. మధ్యహ్న బాలుడూ మల్లె పూవూ చాయ.. మల్లె పూవూ మీద మంకెన్న పొడి చాయ అని అన్నప్పుడు అలా పాడిన మా అమ్మమ్మ, మా అమ్మ గుర్తుకి వస్తారు. వాళ్ళు చూసిన చూపించిన ఆ కవితా దౄశ్యం లోంచి నేను అలాంటి ఒక సూర్యుడిని చూసే ప్రయత్నం చేస్తాను. అయితే అది శాస్త్రీయంగా ఉందా లేదా అని నేను ఆలోచించను. నాది కవితా దృస్టి మాత్రమే! విజ్ణాన దృష్టి బహుసా కేశవ్ చెప్పినట్టు వేరుగా వ్యక్తం కావాలి వ్యాసం లో. కవిత్వాన్నీ.. శాస్త్రీయతనీ ఒకటే గాట కట్టి మాట్లాడ కూడదు కదా? ఆచార సంప్రదాయాలలో మనం వల్లించుకునే వాటికి సైతం మీరి “హేతుబధ్ధతని” లేదా ఒక శాస్త్రీయతని ఆపాదించుకోవడం లో సబబు ఏముందీ? అది “సైంటిఫిక్” కాదేమో? మీకు కవి రచయితల మీద అంత చికాకు ఉండడం ఎందుకూ? కవులు విజ్ణాన దృస్టి కలిగి ఉండాలని మీరసలు ఎలా ఆశిస్తారో? కవికి హేతుబధ్ధత ఎందుకూ :)? ఇంక సూర్యుని మీద వచ్చిన కవిత్వం మీద మోజు ఉండటం వేరు, సూర్యుడి మీద రాసిన కవిత్వం లోంచి సైన్సుని చూపించాలని అనుకోవడం వేరూను! కేశవ్ గారి అభిప్రాయం అందుకని నాకు నచ్చింది.
“ఇక్కడ ఇచ్చిన సూర్య స్తుతి భక్తి పూర్వకంగా వినిపించినా, కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే గత కొన్ని వందల సంవత్సరాలల్లో శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలు ఈ స్తుతిలో నిక్షిప్తమై ఉన్నాయి అనిపిస్తుంది.”
ఈ స్తుతి చిన్నప్పటినుంచీ లెక్కలేనన్ని సార్లు విని ఉంటాను.
ఏ ఆధారంతో ఆర్య సంస్కృతి భరత ఖండంలో బీజం పోసుకుందని చెప్పగలిగారు?
ఇది నిజంగా భౌతికశాస్త్రంలో పిహెచ్.డీ చేసిన రచయిత రాసిన వ్యాసమేనా? ఇది “వైజ్ఞానిక” వ్యాసమా? దాన్ని మిగతా “వైజ్ఞానిక” దృక్పథం, శిక్షణ ఉన్న పాఠకులు ఎలా మెచ్చుకుంటున్నారు? ఇంజినీర్లు, సైంటిస్టులు అయిన సంపాదకులు ఇలాంటి వ్యాసం (?) ఎలా ‘ఈమాట’లో ప్రచురించడానికి తీసుకున్నారు? ఏ ప్రమాణాలు చూసి ప్రచురించారు?
ఇంటి మొగుడు గురించి karanam srinivas అభిప్రాయం:
09/10/2013 1:46 am
బులుసు గారు కథా పులుసు అదిరిందండీ
ఇంటి మొగుడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
09/10/2013 12:25 am
సౌమ్య గారికి,
సీత గారికి,
రాధాకృష్ణ గారికి,
ధన్యవాదాలు.
ఉగాది కవిసమ్మేళనాలు గురించి SIVARAMAPRASAD KAPPATANTU అభిప్రాయం:
09/09/2013 9:21 pm
అద్భుతం. అప్పటి కార్యక్రమాలు వినగలగటం అందులోనూ తెలుగు సాహిత్యంలో హేమాహేమీల గొంతులు వినగలగటం చాలా ఆనందాన్నిచ్చింది. ఇంటర్‌నెట్లో లో తెలుగు రేడియో కార్యక్రమల్లో అతి పురాతనమైన రేడియో రికార్డింగులు ప్రస్తుతానికి ఇవ్వే అనుకుంటాను. ధన్యవాదాలు.
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
09/09/2013 4:50 pm
తెలుగు మాట దేవుడెరుగు. మనలో చాలామందికి తెలుగు పదాలకీ, సంస్కృత పదాలకీ తేడా తెలియదు. ‘ఊర్థ్వజ్ఞుడు’, ‘వ్యాఘ్రేశ్వరుడు’ ఈ రెండూ అచ్చ తెలుగు పదాలు కావు. రెండూ సంస్కృత భూయిష్ట పదాలే!
పైగా ఊర్థ్వజ్ఞుడు అన్నది తప్పు. ఊర్థ్వజ్ఞువు అన్నది సరైన సంస్కృత పదం. కనిపించిన ప్రతీ సంస్కృత పదానికీ, “డు”, “ము”, “వు” లు తగిలించేస్తే తెలుగు పదం అయిపోతుందన్న సంస్కారం వేళ్ళూనుకుపోయింది. ఈ మధ్య ఇంగ్లీషు పదాలకి తెలుగు పదాలు కనుక్కునే కొత్త గుంపొకటి తయారయ్యింది. ఇంటర్నెట్ ని అంతర్జాలం అని అనడం అనవాయితీగా మారింది. సంస్కృత పదం అరువు తెచ్చుకోగా లేనిది, ఇంగ్లీషు పదమే వాడడంలో వచ్చే నష్టమేవిటో తెలియదు. ముఖ్యంగా సాంకేతిక పదాలు దిగుమతిచేసుకోవడమ్లో.
చాలామందికి తెలుగు నేర్పేయాలన్న తహ తహే తప్ప వారి అర్హతలు బేరీజు వేసుకోరు. మాట్లాడడం వేరు, భాషా బోధన వేరు. దౌర్భాగ్యం ఏవిటంటే చాలామందికి, అంటే తెలుగు వచ్చుననుకున్న భ్రమలో మునిగినవారికి, పట్టుమని ఒక వాక్యం కూడా రాయడం రాదు. ఒక్క ఇంగ్లీషు పదం ఉపయోగించకుండా రోజే గడవదు. ఇదంతా అనవసర వాక్యశోష. గణాంకాలకిచ్చే గుర్తింపు నాణ్యతకి ఇవ్వడం తెలుగు వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. మిగిలిందీ, వచ్చినదీ ఒకటే – చంకలు గుద్దుకోవడం, భుజాలు తట్టుకోవడం. యావత్తు తెలుగుజాతీ అయోమయమ్లో కొట్టుమిట్లాడుతోంది ప్రస్తుతం.
ఇదొక దౌర్భాగ్య సంధి కాలం.
-బ్రహ్మానందం గొర్తి
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
09/09/2013 3:07 pm
ఎంతో ఆలోచింపజేసే వ్యాసానికి, practicalగా ఉపయోగపడే సలహాలను అందించినందుకు వెల్చేరుగారికి చాలా కృతజ్ఞతలు.
తెలుగు ప్రపంచ భాష అనేది దేవుడెరుగు, కనీసం ఇంకొక తరానికైనా ఇప్పటి తరం వాళ్ళకున్నంత ప్రవేశం, పాండిత్యం, భాషపైన పట్టు గాని వెసలుబాటూ గాని- “నేర్చుకోవడానికి” అవసరమయ్యే అవకాశాలను అందించగలమా అనేది అనుమానమే.
సిలికానాంధ్ర వారి “మనబడి” ప్రయత్నాలు అభినందనీయం. కాని అందులో ఎందుకో “మన” అన్నదానికే కొంత లోటేమో అనిపిస్తుంది. వారు నిర్దేశించిన సంఖ్యలో విద్యార్థులను పోగుచేస్తేనే కాని వాళ్ళ పుస్తకాలు సైతం అమ్మడానికి నిరాకరించడం విద్యార్థులకు లోటే. అయినా ఎవరికి అమ్మాలో ఎవ్వరికి అమ్మకూడదో వాళ్ళ ఇష్టం. కాని వాళ్ళు ఎంచుకున్న భాషాసేవకు నష్టం.
అపార్థం చేసుకోరనే ఆశతొ, విన్నపంతో అడుగుతున్న ప్రశ్న మాత్రమే – ఎవరికి కావాలండి “ఊర్థ్వజ్ఞుడు” అనే పదం రాయడం? అంటే అది మంచిది కాదని కాదు, సాధారణ విషయాలను సైతం తెలుగులో సరిగ్గా చెప్పడానికి కష్టపడే పిల్లలచేత గహనమైన పదాలు, అసలెప్పుడూ వాడనివి నిఘంటువుల్లో మాత్రమే దొరికేవి (దొరకనివి!) వ్రాయిస్తే వాళ్ళకే కాదు సాటి పిల్లలకు మాత్రం ఏం మేలు ఒరిగింది అనే బాధతో అడిగింది. విమర్శ కన్నా ఇది ఆత్మ విమర్శ. అసలాపదం పెద్దవాళ్ళెంత మందికి తెలుసు, ఎన్ని సార్లు జీవితంలో రాశారు, చదివారు, వాడారు! కాదు, మా పిల్లవాడు ఊర్థ్వజ్ఞుడు అంటే చెప్పేదేమీ లేదు. వీలైనంతవరకు తెలుగులో సొంత భావ వ్యక్తీకరణకు సాయపడినప్పుడే తెలుగు శిక్షణకు, చదువుకు సార్థకత అనిపిస్తుంది.
విధేయుడు
శ్రీనివాస్
ఇంటి మొగుడు గురించి Radhakrishna అభిప్రాయం:
09/09/2013 1:52 am
కెవ్వు కేక … కథ మొత్తం నవ్వుతూనే చదివాను ….
ఇలాంటి కథలు చదివే ప్లాట్ ఫార్మ్ కల్పించినందుకు ఈమాట వారికి ధన్యవాదములు
శ్రీ సూర్యనారాయణా… గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/08/2013 11:54 am
వేమూరి గారికి:
మీ అభిప్రాయం నాకు నచ్చింది. నాకూ సరిగ్గా మీకు వచ్చిన ఆలోచన లాంటిదే వచ్చింది.
మీరన్నట్టు …… “మన మనుగడకి మూలాధారమైన సూర్యుడిని, భూమిని, దైవ సమానులుగా పూజించి, తండ్రి తోను, తల్లి తోను పోల్చడం హేతుబద్ధమే అని నా నమ్మకం. మనం ప్రవర చెప్పుకునేటప్పుడు, “ఈ పాల సముద్రంలో, ఈ సూర్య మండలంలో, ఈ భూమి మీద, ఈ పశ్చిమ భూభాగంలో….అంటూ గోత్ర నామాలు చెప్పుకుని, “అహంభో అభివాదయే” అంటే సరిపోతుంది. ”
నేనూ మీలాగే “అహంభో అభివాదయే” అనుకుంటున్నాను!
విష్ణుభొట్ల లక్ష్మన్న
శ్రీ సూర్యనారాయణా… గురించి jayaprabha అభిప్రాయం:
09/07/2013 2:50 pm
కొంచెం ధాటీ గా అయితే ఉంది గానీ కేశవ్ గారి అభిప్రాయం బాగుంది. వేమూరి గారూ కవిత్వం మీద మోజు ఉన్న వాళ్లకి అందరికీ విజ్ఞాన శాస్త్రం మీద కూడా మోజు ఉండాలని లేదు కదండీ? ఉదాహరణ కి నాకు “ఆదిత్య హృదయం” అంటే మహా ఇష్టం! దాన్ని నేను భక్తి తో చదువుతాను. అందులో సూర్యుడిని చూసిన విధానం శాస్త్రీయం గా ఉందో లేదో నాకు అఖ్ఖర లేదు. ఆసక్తి కూడా లేదు. అక్కడ సూర్య నమస్కారం మాత్రమే నేను చూసేది చేసేదీను]. ఆదిత్య హౄదయంలో సూర్యుడిని వాల్మీకి “విశ్వభావన” అని సంబోధించడం నాకు ఎంతో బాగుంటుంది. అది కవితాత్మకంగా ఉంటుంది.
ఇంక ఎప్పటి నుంచో ఆడవాళ్ళు సూర్యుడిని స్మరించుకునే ఆ తెలుగు పదం లోనూ నాకు కవిత్వమే కనబడుతుంది. మధ్యహ్న బాలుడూ మల్లె పూవూ చాయ.. మల్లె పూవూ మీద మంకెన్న పొడి చాయ అని అన్నప్పుడు అలా పాడిన మా అమ్మమ్మ, మా అమ్మ గుర్తుకి వస్తారు. వాళ్ళు చూసిన చూపించిన ఆ కవితా దౄశ్యం లోంచి నేను అలాంటి ఒక సూర్యుడిని చూసే ప్రయత్నం చేస్తాను. అయితే అది శాస్త్రీయంగా ఉందా లేదా అని నేను ఆలోచించను. నాది కవితా దృస్టి మాత్రమే! విజ్ణాన దృష్టి బహుసా కేశవ్ చెప్పినట్టు వేరుగా వ్యక్తం కావాలి వ్యాసం లో. కవిత్వాన్నీ.. శాస్త్రీయతనీ ఒకటే గాట కట్టి మాట్లాడ కూడదు కదా? ఆచార సంప్రదాయాలలో మనం వల్లించుకునే వాటికి సైతం మీరి “హేతుబధ్ధతని” లేదా ఒక శాస్త్రీయతని ఆపాదించుకోవడం లో సబబు ఏముందీ? అది “సైంటిఫిక్” కాదేమో? మీకు కవి రచయితల మీద అంత చికాకు ఉండడం ఎందుకూ? కవులు విజ్ణాన దృస్టి కలిగి ఉండాలని మీరసలు ఎలా ఆశిస్తారో? కవికి హేతుబధ్ధత ఎందుకూ :)? ఇంక సూర్యుని మీద వచ్చిన కవిత్వం మీద మోజు ఉండటం వేరు, సూర్యుడి మీద రాసిన కవిత్వం లోంచి సైన్సుని చూపించాలని అనుకోవడం వేరూను! కేశవ్ గారి అభిప్రాయం అందుకని నాకు నచ్చింది.
జయప్రభ.
శ్రీ సూర్యనారాయణా… గురించి కేశవ్ అభిప్రాయం:
09/07/2013 11:49 am
ఈ స్తుతి చిన్నప్పటినుంచీ లెక్కలేనన్ని సార్లు విని ఉంటాను.
“ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైక నాధాధినాధా మహాభూత భేదంబులున్ నీవయై బ్రోవుమెల్లప్పుడున్ భాస్కరా హస్కరా పద్మినీ వల్లభా వల్లకీ గానలోలా త్రిమూర్తిస్వరూపా విరూపాక్షనేత్రా మహా దివ్యగాత్రా అచింత్యావతారా నిరాకారా ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత నిర్ధూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాటి యేకాకినై చిక్కి యే దిక్కునున్ గానగా లేక యున్నాడ నీవాడనో తండ్రీ”
మిగతా అన్ని దండకాల లాగే ఉంటుంది. ఇందులో “సైంటిఫిక్” విశేషం ఏమిటో, శాస్త్రజ్ఞాన విషయాలు ఇందులో ఏం నిక్షిప్తం అయివున్నాయో?
ఏ ఆధారంతో ఆర్య సంస్కృతి భరత ఖండంలో బీజం పోసుకుందని చెప్పగలిగారు?
ఇది నిజంగా భౌతికశాస్త్రంలో పిహెచ్.డీ చేసిన రచయిత రాసిన వ్యాసమేనా? ఇది “వైజ్ఞానిక” వ్యాసమా? దాన్ని మిగతా “వైజ్ఞానిక” దృక్పథం, శిక్షణ ఉన్న పాఠకులు ఎలా మెచ్చుకుంటున్నారు? ఇంజినీర్లు, సైంటిస్టులు అయిన సంపాదకులు ఇలాంటి వ్యాసం (?) ఎలా ‘ఈమాట’లో ప్రచురించడానికి తీసుకున్నారు? ఏ ప్రమాణాలు చూసి ప్రచురించారు?
కేశవ్
పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి indrani Palaparthy అభిప్రాయం:
09/06/2013 10:14 pm
ఇలాగ పల్లెటూరి భాషలో రాయడం ఇదే మొదటిసారి. ఇది ప్రకాశం జిల్లాలోను,ఆ చుట్టు పక్కల పల్లెటూళ్ళల్లోనూ వినిపించే భాష.పాఠకులకి అర్ధం అవుతోందనే ఆశిస్తున్నాను.
కొంత వివరణ:
1.తంబూరి — బిచ్చగాళ్ళు వాయించే చిన్న తంబూరలాంటి వాయిద్యం.
2.లగెత్తే — పరిగెత్తే
3.యనకమాల — వెనకాల
4.కాడ — దగ్గర
ధన్యవాదాలు.
ఇంద్రాణి.