పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నా అమెరికా ప్రయాణం గురించి Rao Vemuri అభిప్రాయం:

    10/22/2013 5:50 pm

    రమ గారికి,

    నేను రాసినది ఐదేళ్లు పోయిన తరువాత మీరు చదివితే మీరు రాసిన స్పందన రెండేళ్లు పోయిన తరువాత నేను చదువుతున్నాను. మరీ సైన్సు ఫిక్షన్ కథలలా సమాచారం ప్రయాణం చెయ్యటానికి ఇంతింత సేపు పడితే ఎలా అని నొచ్చుకుంటూ ఆలస్యంగా సమాధానం ఇస్తున్నాను.
    రమ భరద్వాజ గారికి, శివ రాజేష్ గారికి:
    తరువాయి కథ చదవాలని ఉంటే నేను రాసిన “అమెరికా అనుభవాలు” అనే పుస్తకంలో దొరుకుతాయి. ఎమెస్కో వారు ప్రచురించేరు. ఇంకా ప్రతులు విపణి వీధిలో దొరుకుతున్నాయనే అనుకుంటాను.

    నా రాతలు చదివి ఆనందించినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
    – వేమూరి.

  2. అదే నేను గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    10/22/2013 5:28 am

    రాధ/దేవి గార్లకు,
    మీరు మాట్లాడుకుంటున్న ఆ బ్లాగ్ ఏమిటో (మీకు అభ్యంతరం లేకపోతేనే) తెలియచేయగలరా?

    నమస్తే,
    మల్లికార్జున శర్మ.

  3. అదే నేను గురించి Radha అభిప్రాయం:

    10/21/2013 4:30 pm

    దేవి గారూ, ధన్యవాదములు. మీ బ్లాగ్ చూశాను. చాలా బావున్నాయి మీ కవితలు, నానీలు. ఆత్మ విచారం చేసుకోవలనే ఆలోచన కలగడమే అదృష్టం. ఒకసారి ఆ మార్గం లో నడుస్తున్నపుడు అస్పష్టత తప్పకుండా తొలిగిపోతుంది. కదా?

  4. భోగి తలంట్లు గురించి Devi అభిప్రాయం:

    10/21/2013 12:16 pm

    చాలా బాగుందండీ. కళ్ళ ముందు కదుల్తున్నట్లే రాసారు. ఇది కల్పితం కాదని తెలిసాక మరింత ముచ్చటేసింది. నలుగు పెట్టుకుని, అమ్మ చేత తలంటు పోయించుకున్నంత హాయిగా అనిపించింది. కనుమరుగైపోతున్న so called చాదస్తపు సాంప్రదాయాల్ని, వాటి అందాన్ని సజీవంగా మనసులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు.

  5. అదే నేను గురించి Devi అభిప్రాయం:

    10/21/2013 10:58 am

    చాలా బాగుందండి. మనసులోని అస్పష్టమైన ఆలోచనల్ని ఇంకొకరి రచనల్లో స్పష్టంగా చదవటం చాల హాయినిస్తుంది. ఈ కవితని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  6. భోగి తలంట్లు గురించి r.damayanthi అభిప్రాయం:

    10/21/2013 9:54 am

    సురేష్ గారూ, నిజమేనండి!
    కొన్ని రచనలు చదువుతున్నప్పుడు – మన ప్రియమైన వారు గుర్తొస్తారు. కొన్ని క్షణాల పాటు మెరుపు చిత్రాలై మెరిసిపోతారు. గుండెని నిశ్శబ్దం చేసి పోతారు.

    -మీ మాటలు నన్నెంతగానో కదిలించాయి. రచన చదివి, మీ అందమైన స్పందన తెలియచేసినందుకు చాలా సంతోషంగా వుంది.

    మీ ఇరువురికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ
    శుభాభినందనలతో…

  7. ట్రిల్ గురించి ఫణీన్ద్ర పురాణపణ్డ అభిప్రాయం:

    10/20/2013 12:45 pm

    “1900 శతాబ్ది” — ??
    trying to understand the story …

  8. రాతి పడవ గురించి ఫణీన్ద్ర పురాణపణ్డ అభిప్రాయం:

    10/20/2013 12:30 pm

    wow. అక్షరం అక్షరం జాగ్రత్తగా… ముందుకూ వెనక్కూ చూసుకుంటూ… ఒళ్ళు దగ్గరపెట్టుకుని చదివాను.

    ఆఖర్లో ప్రస్తావించిన స్కార్లెట్టూ రెట్‌ బట్లరూ తెలీనందున… మీ భావం పట్టుకోలేక పోయాను.

    wonderful piece of creation.

  9. నా అమెరికా ప్రయాణం గురించి siva rajesh అభిప్రాయం:

    10/20/2013 8:18 am

    Great Post, Please share more experiences

  10. పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Sowmya అభిప్రాయం:

    10/19/2013 11:53 pm

    వంశీ గారికి: వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    లైలా గారంటే నాకు కూడా గౌరవమే నండి. ఈమాటలో నేను కాస్తో కూస్తో ఎదురుచూసి మరీ చదివే కథకుల్లో వారూ ఒకరు. భయం కొద్దీ వ్యాఖ్యలు రాయనంతే. ఎటొచ్చీ, “మేధావి” అనడం చిన్న బుచ్చడం కాదు. నాకు నిజంగానే అందరితోనూ చర్చలు పెట్టి అవతలి మనుషుల్ని మన వాదనతో కన్విన్స్ చేసి, కన్వర్ట్ చేయడం మీద (మిషనరీ పద్ధతి మీద) ఆసక్తి లేదు.

    ఫలానా అంశం నాకు నచ్చింది అన్నాను. ఎందుకు? అన్నది నేను వివరంగా రాయలేదు. నిజమే. కానీ, పైన రాసిన వ్యాఖ్యల్లో నేను చెప్పనివి కొన్ని నాకు ఆపాదించినట్లు అనిపించింది. రంగి పాత్రని సినిమాలో ఆవిష్కరించిన తీరు నచ్చిందంటే పాత్ర నచ్చిందని కాదు…పాత్ర చేసే పనులు నచ్చాయని కాదు. రెంటికీ చాలా తేడా ఉంది (కనీసం నా దృష్టిలో). లైలా గారు, నాకు రంగి పాత్రని సినిమాలో తీసిన తీరు నచ్చింది అనగానే…”ఈవిడా నీకు నచ్చింది? ఈవిడ చేసే పనులా నీకు నచ్చింది?” టైపులో అటాక్ చేస్తే నేనేం చేయలేను. ప్రేమ గుడ్డిది – అన్న విషయం కథల్లో పాత్రలకి కూడా వర్తిస్తుంది అని చెప్పి తప్పుకుపోవడం తప్ప.

    ఎలాగైనా, తక్కిన జాల గూళ్ళకీ, ఈ మాటకీ ఈ విషయంలో మాత్రం తేడా ఏమీ లేదని అర్థమైంది నాకు. ఇప్పుడు దయచేసి ఆ వాక్యం పట్టుకుని ఉన్నవీ లేనివి మాత్రం ఇంటర్ప్రెట్ చేయకండి. దానికర్థం నేను ఇకపై ఈమాట చదవనని మాత్రం కాదు. “బాగుంది” అన్న వ్యాఖ్య రాయాలనిపిస్తే తప్ప, మరొక వ్యాఖ్య రాయనని మాత్రమే! నా గొప్ప పరిశీలనా శక్తి లేకపోవడం వల్ల ఈమాట నష్టపోయేదేమీ లేదు లెండి.. 🙂