కవిత అరమరికలు, ఆడంబరాలు లేని సౌందర్యంతో సాగింది. ఎందుకో “దొంగలా నవ్వుతూ” అన్న పదాలే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇతరులు ఆశ్చర్యపడితే దొంగలు నవ్వుతారో లేదో కాని, “వెన్నదొంగలా నవ్వుతూ” అనుకుంటే వచ్చిన సందేహం నిస్సం”దేహం”గా మారినట్టు అనిపించింది.
=======
విధేయుడు
_శ్రీనివాస్
very nice and interesting story. lot of people are doing same way. Beginning of the days husbands are cooking like introduction. later on it is going life long.. tragedy.. but very funny and nice story.
నారాయణరావు గారు వ్రాసిన వ్యాసం (ప్రసంగ పాఠం)చాలా చాలా లోతైన ఆలోచనతో ఎంతో నిర్మాణాత్మకమైన సలహాలతో నిండి వుంది. ఈ వ్యాసాన్ని దీనిలోని సూచనలనూ విదేశాల్లోనే కాదు తెలుగు భాషాభివృద్దికి కృషి చేసే ప్రతి సంస్థా గుర్తుంచుకోవాలి.
ఇక నారాయణరావు గారు పై వ్యాసంలో వెలిబుచ్చిన అనేక భాషాపరమైన సందేహాలకు సమాధానాలు తెలిసినా అలాంటి వాటికి సమాధానాలు వివరించమని వారు అడగలేదు. వాటికి సమాధానాలు ఆయనకు తెలిసినా నేను ఇక్కడ వివరించడం లేదు. అది అప్రస్తుతం కనుక. అనేకమందికి ఇలాంటి సందేహాలు వచ్చే అవకాశం వుంది కనుక లోతైన పరిశోధనలతో ఇంకా స్పష్టంగా పాఠాలు చెప్పాలి’ అని హెచ్చరించడానికి వారు చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను.
“మనం తెలుగు నేర్చుకోలేదు. మనకి తెలుగు వచ్చింది. ఏది మీరు నేర్చుకున్నారో, అది మీరు చెప్పగలరు. సంగీతం నేర్చుకుంటే, సంగీతం చెప్పగలరు. నాట్యం నేర్చుకుంటే, నాట్యం నేర్పగలరు. వంకాయ కూర చెయ్యడం మీకొస్తే వంకాయ కూర ఎలా చెయ్యాలో మీరు చెప్పగలరు. కానీ, తెలుగు మనం నేర్చుకోలేదు. ఏరకంగా తెలుగు మన మనస్సుల్లోకి ప్రవేశించిందో ఏరకంగా తెలుగు మన శరీరంలో భాగమైపోయిందో మనం చెప్పలేం. అంచేత తెలుగు పుట్టుకతో రానివాళ్లకి తెలుగు ఎలా చెప్పాలో మనకి తెలియదు.”- వేల్చేరు నారాయణరావు గారు
ఈ వ్యాసంలో ఇది అతకని వాక్యం. ఇది అసలు నేర్పడం అనేది అసాధ్యం కనుక అలా నేర్పాలని చూడడం మూర్ఖత్వం అని మీరు అనుకుంటున్నారని కొందరు అభిప్రాయపడే ప్రమాదం వుంది. ఇక్కడ కూర్చుని కనీసం మేము మీ వ్యాసాన్ని ఈ రోజు ఒక ఎనిమిది మంది చదువుతున్నాము. అందరూ ఈ వాక్యం పూర్తికాగానే “ఇక అర్ధమైపోయిందిలే సిలికాన్ ఆంధ్ర వారి తెలుగు విశ్వవిద్యాలంయం మీద మీరు కువిమర్శలకు పాల్పడుతున్నారని భావించారు. ఈ వ్యాసంలో దీనిని తొలగించడం వల్ల ఈ వ్యాసానికి ఎలాంటి నష్టం లేకపోగా వారు (నారాయణరావుగారు)వెలిబుచ్చిన లోతైన ఆలోచనలనూ సలహాలను అపార్ధం చేసుకోకుండా వుండడానికి మరింతగా ఉపయోగపడుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే మనం ఒక ఆలోచన వెంట మరొక ఆలోచనకు కారణమై అలా ముందుకెళ్ళి పొతాం. ఆ విధంగా అకారణంగా ఎంతో మంచి నిర్మాణాత్మకమైన ఈ వ్యాసాన్ని కొంతమంది చదవకపోయే అవకాశం వుంది.
ఇక ఇక్కడ B.S Rao గారు తన కామెంట్స్ లో “అమెరికాలో తెలుగు విశ్వవిద్యాలయం” అన్న సిలికాన్ ఆంధ్ర వారు చేస్తున్న ప్రయత్నాలపై… అమెరికాలో ఒన్ రూప్ టూరూమ్ విశ్వవిద్యాలయాలు అనేకం వున్నాయని అంటూ చేసిన విమర్శ, అనవసరం. అప్రస్తుతం కూడా. వారు అంత చవకబారు మనుషులు కాదుకదా.! మరి ఎందుకీ విమర్శలు? ఏవో చవకబారు విశ్వవిద్యాలయాలు వారు ఏర్పాటు చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నట్టు వారిని చిత్రించడానికి, తక్కువ చెయ్యడానికీ ప్రయత్నం ఎందుకు?
మీరు కూడా అమెరికాలోనే వున్నారు అని చెప్పకుండానే అర్ధమౌతోంది. కనుక మీరు చేసిన విమర్శను తెలుగు వారిలో అనేకులు సిలికాన్ ఆంధ్ర వారికి వస్తున్న గుర్తింపును చూసి మీరు అసూయతోనో కంటగింపుతోనో ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారని అనుకునే ప్రమాదం కూడా వుంది కదా. మీరు అలాంటి వన్ రూమ్ టూ రూమ్ విశ్వవిద్యాలయాలుగా ఇది మిగిలిపోకూడదూ అన్న సదుద్దేశ్యంతోనే ఆ వివరాలు చెప్పి హెచ్చరించి వుండవచ్చు. కనుక ఇలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా స్పష్టంగా అభిప్రాయం వెలిబుచ్చడం అవసరం.
అందరికీ ధన్యవాదాలు. మీకు అందరకీ నచ్చినందుకు సంతోషం. ఇందులో నేను రాసినది ఏమీ లేదు. భాగవతం వెబ్ సైట్ లోంచి కాపీ-పేస్ట్ చేసినవే అన్ని పద్యాలూనూ. కధ కూడా అందరకీ తెల్సిందే. పోతన ఎంత గొప్పవాడో ఆయన రాసిన మహాభాగవతమే చెప్తుంది.
మల్లికార్జున శర్మ గారు, ఇందులో స్వకపోల రచన ఏమీలేదండి కాపీరైట్ పెట్టడానికి. మీకు ఇది నచ్చితే దాని గొప్పతనం “జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికావిరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును” అయిన వాడిదీ, దీనిని రాసిన పోతనదీను. ఎందుకంటే ఆయన నారాయణీయం చెప్పినట్టూ “యత్త్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్.” నేను వీళ్ళద్దర్నీ సిగ్గులేకుండా కాపీ చేసిన వాడిని. మీకు ఇది చదివాక కళ్ళమ్మటనీళ్ళు తిరిగాయా? పోతన భాగవతం తెరిచినప్పుడూ, ఇది రాస్తున్నప్పుడు/మళ్ళీ (మళ్ళీ) చదువుతున్నప్పుడూ నేను దాదాపు ప్రతీరోజూ గొంతు గద్గదమైపోయి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాను.
మొదట్లోనే చెప్పినట్టూ, దీని మూలాన ఎవరికైనా పోతన మహాభాగవతం చదవాలనిపిస్తే అంతకన్న కావాల్సింది మరోటి లేదు. వామనావతారంలో శ్రీహరి గొప్పతనం ఏమీలేదు. మొత్తం క్రెడిట్ అంతా బలి చక్రవర్తిదే. జేబులో చెయ్యిపెట్టి పది రూపాయలు మనఃస్ఫూర్తిగా దానం ఇవ్వలేని మనతో పోల్చి చూస్తే బలి ఎంత గొప్పవాడో ఆయన చేసిన దానమే చెప్తుంది. దానం మాట అటుంచి, ఇచ్చేటప్పుడు — నిరయంబైన… దుర్మరణంబైన.. — అంటూ ఎంత గొప్పగా ఆలోచించాడో అనేది తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందుకే శ్రీమహావిష్ణువు సంతోషంగా బలి ద్వారం దగ్గిర కాపలాకి తయరైపోయేడు. మరొక్కసారి అందరికీ ధన్యవాదములు.
మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
ఎంతో ఆలస్యంగా, ఈ నాటికి ఈ వ్యాసాన్ని చదవగలిగాను. చదివి ఎంతో ఆనందించాను. నాకు చాలా నచ్చిన విషయం: ఛందస్సును ఒక గణమాత్రావిభజనధర్మి, పద్యలక్షణశాస్త్రం అని కాకుండా, మీరు పరిధిని విస్తరింపజేసి – దానినొక సర్వాంతర్వర్తనీయమైన, వేదాంగశిరోమణిరూపమైన దృగ్విషయంగా మలిచి చూపుతున్నారు. ఆ ప్రయత్నంలో మీరు ఎన్నో సంగీత సాహిత్య ప్రక్రియావిశేషాలను ఒక్క ఛందస్సు గొడుగు క్రిందికి తెచ్చి నూతనదృక్కోణాలను ఆవిష్కరింపగలుగుతున్నారు. షట్ప్రత్యయాలను మీరు వివరించిన తీరు విజ్ఞానశాస్త్రవేత్తగా మీకున్న నైపథ్యానికి ప్రకాశకం. అక్షర మాత్రావృత్తాల లోనూ, చిత్రబంధ గర్భబంధాలలోనూ ప్రత్నగతులను కనుగొంటున్నారు. చిరకాలికమైన ఆ కృషిఫలితంగా మీరు సరిక్రొత్త నడకలను, సార్థక నామవృత్తాలను ఆవిష్కరించటం మీ విద్యావిజయానికి సంకేతంగానే ఉన్నది. ఉత్తమ భావుకతతో కూడిన సలక్షణమైన కవితారచనను చేయగలగటం మీ లాక్షణికతను మరింత అందగింపజేసింది. తెలుగువారిలో ప్రాతఃస్మరణీయులైన ఛందోవిజ్ఞాతల పంక్తిలో మీరున్నారని చెప్పగలుగుతున్నాను.
క్రౌంచపదాన్ని చారిత్రిక వికాసదృష్టితో అనుశీలించి, దాని పూర్వాపరాలను చర్చిస్తూ ఒకానొక కవి హృదయధర్మాన్ని పరిశీలించేందుకు, ఆయన పౌర్వికతను నిర్ధారించేందుకు మీరు ఈ వ్యాసంలో ప్రవేశపెట్టిన ప్రమాణపరంపర నన్నెంతో ఆకట్టుకొన్నది. నన్నెచోడుని కర్తృత్వాన్ని గురించి, కాలాన్ని గురించి మీచే నిశ్చీయమానాలుగా ఉన్న అభిప్రాయాలతో నాకు ఐక్యానుసంధానం లేనప్పటికీ మీ వాదధోరణి, తర్కసంగతి, సహృదయత నాకు ఆకర్షణీయంగా అగుపించాయి.
పైని చర్చలో కుమారసంభవం లోని ఈ పద్యం (6-141) ప్రసక్తి వచ్చింది:
ఇందులో “తరులు” – “తృషాభిహతులు” అన్నచోట మహదమహద్వాచకాల సాంకర్యం మాటెలా ఉన్నా, ఆరుద్ర గారు దీని మూలాన్ని జయంగొండార్ కళింగత్తుప్పరణిలో గుర్తుపట్టి సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటంలో ఉదాహరించారు. మీరు జెయన్ కొండార్ మూలాన్ని, ఆరుద్ర గారి అనువాదపాఠాన్ని ఇవ్వటం బాగున్నది.
నేను రామగుండం వాసిని. ఈ మధ్య శ్రీ పోతనచరిత్రమను శ్రీ వానమామలై వరదాచార్యుల విరచితంబైన పుస్తకం కొరకు ఎతుకుతున్న కాని దొరుకుత లేదు ఏవారైనా కలిగి యుండి వారు వద్దనుకున్న, లేక ఇంకొక పుస్తకమున్న యొడల తగిన ధర చెల్లించి కొనుక్కోగలను అట్టివారెవ్వరైనా యున్న ఎడల దయచేసి నా ఈ మైల్ చిరునామాకు తెలియ జేయగలరు నా ఈ మైల్ అడ్రస్సు tungakanakaraju@gmail.com
వెంకట రమణ గారూ,
వెన్నెల ఉందిగా? అయినా వెంకట రమణుడికి చీకటి వెలుగులు ఉంటాయా? ఈ సృష్టి నిర్ధారితమై నడుస్తుందా లేక ఇచ్ఛాపూర్వకంగా నడుస్తుందా? ఎవరైనా చెప్తారేమోనని ఎదురుచూస్తున్నాను సర్ – తెలిస్తే చెప్పండి. మీ స్పందనకు ధన్యవాదములతో
అదే నేను గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
10/29/2013 2:46 pm
కవిత అరమరికలు, ఆడంబరాలు లేని సౌందర్యంతో సాగింది. ఎందుకో “దొంగలా నవ్వుతూ” అన్న పదాలే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇతరులు ఆశ్చర్యపడితే దొంగలు నవ్వుతారో లేదో కాని, “వెన్నదొంగలా నవ్వుతూ” అనుకుంటే వచ్చిన సందేహం నిస్సం”దేహం”గా మారినట్టు అనిపించింది.
=======
విధేయుడు
_శ్రీనివాస్
భార్యోత్సాహం గురించి Prasad అభిప్రాయం:
10/29/2013 8:20 am
very nice and interesting story. lot of people are doing same way. Beginning of the days husbands are cooking like introduction. later on it is going life long.. tragedy.. but very funny and nice story.
thank you.
ఇంటి మొగుడు గురించి Prasad అభిప్రాయం:
10/29/2013 7:34 am
కధ చాల భాగుంధి. చాలా అధ్భుతంగ ఉంధి.
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి గౌతమ్ కశ్యప్ అభిప్రాయం:
10/29/2013 6:58 am
వేల్చేరు నారాయణరావు గారికి నమస్సులు.
నారాయణరావు గారు వ్రాసిన వ్యాసం (ప్రసంగ పాఠం)చాలా చాలా లోతైన ఆలోచనతో ఎంతో నిర్మాణాత్మకమైన సలహాలతో నిండి వుంది. ఈ వ్యాసాన్ని దీనిలోని సూచనలనూ విదేశాల్లోనే కాదు తెలుగు భాషాభివృద్దికి కృషి చేసే ప్రతి సంస్థా గుర్తుంచుకోవాలి.
ఇక నారాయణరావు గారు పై వ్యాసంలో వెలిబుచ్చిన అనేక భాషాపరమైన సందేహాలకు సమాధానాలు తెలిసినా అలాంటి వాటికి సమాధానాలు వివరించమని వారు అడగలేదు. వాటికి సమాధానాలు ఆయనకు తెలిసినా నేను ఇక్కడ వివరించడం లేదు. అది అప్రస్తుతం కనుక. అనేకమందికి ఇలాంటి సందేహాలు వచ్చే అవకాశం వుంది కనుక లోతైన పరిశోధనలతో ఇంకా స్పష్టంగా పాఠాలు చెప్పాలి’ అని హెచ్చరించడానికి వారు చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను.
ఈ వ్యాసంలో ఇది అతకని వాక్యం. ఇది అసలు నేర్పడం అనేది అసాధ్యం కనుక అలా నేర్పాలని చూడడం మూర్ఖత్వం అని మీరు అనుకుంటున్నారని కొందరు అభిప్రాయపడే ప్రమాదం వుంది. ఇక్కడ కూర్చుని కనీసం మేము మీ వ్యాసాన్ని ఈ రోజు ఒక ఎనిమిది మంది చదువుతున్నాము. అందరూ ఈ వాక్యం పూర్తికాగానే “ఇక అర్ధమైపోయిందిలే సిలికాన్ ఆంధ్ర వారి తెలుగు విశ్వవిద్యాలంయం మీద మీరు కువిమర్శలకు పాల్పడుతున్నారని భావించారు. ఈ వ్యాసంలో దీనిని తొలగించడం వల్ల ఈ వ్యాసానికి ఎలాంటి నష్టం లేకపోగా వారు (నారాయణరావుగారు)వెలిబుచ్చిన లోతైన ఆలోచనలనూ సలహాలను అపార్ధం చేసుకోకుండా వుండడానికి మరింతగా ఉపయోగపడుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే మనం ఒక ఆలోచన వెంట మరొక ఆలోచనకు కారణమై అలా ముందుకెళ్ళి పొతాం. ఆ విధంగా అకారణంగా ఎంతో మంచి నిర్మాణాత్మకమైన ఈ వ్యాసాన్ని కొంతమంది చదవకపోయే అవకాశం వుంది.
ఇక ఇక్కడ B.S Rao గారు తన కామెంట్స్ లో “అమెరికాలో తెలుగు విశ్వవిద్యాలయం” అన్న సిలికాన్ ఆంధ్ర వారు చేస్తున్న ప్రయత్నాలపై… అమెరికాలో ఒన్ రూప్ టూరూమ్ విశ్వవిద్యాలయాలు అనేకం వున్నాయని అంటూ చేసిన విమర్శ, అనవసరం. అప్రస్తుతం కూడా. వారు అంత చవకబారు మనుషులు కాదుకదా.! మరి ఎందుకీ విమర్శలు? ఏవో చవకబారు విశ్వవిద్యాలయాలు వారు ఏర్పాటు చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నట్టు వారిని చిత్రించడానికి, తక్కువ చెయ్యడానికీ ప్రయత్నం ఎందుకు?
మీరు కూడా అమెరికాలోనే వున్నారు అని చెప్పకుండానే అర్ధమౌతోంది. కనుక మీరు చేసిన విమర్శను తెలుగు వారిలో అనేకులు సిలికాన్ ఆంధ్ర వారికి వస్తున్న గుర్తింపును చూసి మీరు అసూయతోనో కంటగింపుతోనో ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారని అనుకునే ప్రమాదం కూడా వుంది కదా. మీరు అలాంటి వన్ రూమ్ టూ రూమ్ విశ్వవిద్యాలయాలుగా ఇది మిగిలిపోకూడదూ అన్న సదుద్దేశ్యంతోనే ఆ వివరాలు చెప్పి హెచ్చరించి వుండవచ్చు. కనుక ఇలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా స్పష్టంగా అభిప్రాయం వెలిబుచ్చడం అవసరం.
– గౌతమ్ కశ్యప్ కావూరి.
దానవోద్రేక స్తంభకుడు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
10/28/2013 9:09 am
అందరికీ ధన్యవాదాలు. మీకు అందరకీ నచ్చినందుకు సంతోషం. ఇందులో నేను రాసినది ఏమీ లేదు. భాగవతం వెబ్ సైట్ లోంచి కాపీ-పేస్ట్ చేసినవే అన్ని పద్యాలూనూ. కధ కూడా అందరకీ తెల్సిందే. పోతన ఎంత గొప్పవాడో ఆయన రాసిన మహాభాగవతమే చెప్తుంది.
మల్లికార్జున శర్మ గారు, ఇందులో స్వకపోల రచన ఏమీలేదండి కాపీరైట్ పెట్టడానికి. మీకు ఇది నచ్చితే దాని గొప్పతనం “జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికావిరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును” అయిన వాడిదీ, దీనిని రాసిన పోతనదీను. ఎందుకంటే ఆయన నారాయణీయం చెప్పినట్టూ “యత్త్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్.” నేను వీళ్ళద్దర్నీ సిగ్గులేకుండా కాపీ చేసిన వాడిని. మీకు ఇది చదివాక కళ్ళమ్మటనీళ్ళు తిరిగాయా? పోతన భాగవతం తెరిచినప్పుడూ, ఇది రాస్తున్నప్పుడు/మళ్ళీ (మళ్ళీ) చదువుతున్నప్పుడూ నేను దాదాపు ప్రతీరోజూ గొంతు గద్గదమైపోయి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాను.
మొదట్లోనే చెప్పినట్టూ, దీని మూలాన ఎవరికైనా పోతన మహాభాగవతం చదవాలనిపిస్తే అంతకన్న కావాల్సింది మరోటి లేదు. వామనావతారంలో శ్రీహరి గొప్పతనం ఏమీలేదు. మొత్తం క్రెడిట్ అంతా బలి చక్రవర్తిదే. జేబులో చెయ్యిపెట్టి పది రూపాయలు మనఃస్ఫూర్తిగా దానం ఇవ్వలేని మనతో పోల్చి చూస్తే బలి ఎంత గొప్పవాడో ఆయన చేసిన దానమే చెప్తుంది. దానం మాట అటుంచి, ఇచ్చేటప్పుడు — నిరయంబైన… దుర్మరణంబైన.. — అంటూ ఎంత గొప్పగా ఆలోచించాడో అనేది తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందుకే శ్రీమహావిష్ణువు సంతోషంగా బలి ద్వారం దగ్గిర కాపలాకి తయరైపోయేడు. మరొక్కసారి అందరికీ ధన్యవాదములు.
భవదీయుడు
శర్మ దంతుర్తి
ఆనకట్ట గురించి kusuma kanthi అభిప్రాయం:
10/28/2013 5:18 am
మనసును కదిలించింది…చాలా బాగుంది..
నన్నెచోడుని క్రౌంచపదము గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
10/26/2013 2:01 am
మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
ఎంతో ఆలస్యంగా, ఈ నాటికి ఈ వ్యాసాన్ని చదవగలిగాను. చదివి ఎంతో ఆనందించాను. నాకు చాలా నచ్చిన విషయం: ఛందస్సును ఒక గణమాత్రావిభజనధర్మి, పద్యలక్షణశాస్త్రం అని కాకుండా, మీరు పరిధిని విస్తరింపజేసి – దానినొక సర్వాంతర్వర్తనీయమైన, వేదాంగశిరోమణిరూపమైన దృగ్విషయంగా మలిచి చూపుతున్నారు. ఆ ప్రయత్నంలో మీరు ఎన్నో సంగీత సాహిత్య ప్రక్రియావిశేషాలను ఒక్క ఛందస్సు గొడుగు క్రిందికి తెచ్చి నూతనదృక్కోణాలను ఆవిష్కరింపగలుగుతున్నారు. షట్ప్రత్యయాలను మీరు వివరించిన తీరు విజ్ఞానశాస్త్రవేత్తగా మీకున్న నైపథ్యానికి ప్రకాశకం. అక్షర మాత్రావృత్తాల లోనూ, చిత్రబంధ గర్భబంధాలలోనూ ప్రత్నగతులను కనుగొంటున్నారు. చిరకాలికమైన ఆ కృషిఫలితంగా మీరు సరిక్రొత్త నడకలను, సార్థక నామవృత్తాలను ఆవిష్కరించటం మీ విద్యావిజయానికి సంకేతంగానే ఉన్నది. ఉత్తమ భావుకతతో కూడిన సలక్షణమైన కవితారచనను చేయగలగటం మీ లాక్షణికతను మరింత అందగింపజేసింది. తెలుగువారిలో ప్రాతఃస్మరణీయులైన ఛందోవిజ్ఞాతల పంక్తిలో మీరున్నారని చెప్పగలుగుతున్నాను.
క్రౌంచపదాన్ని చారిత్రిక వికాసదృష్టితో అనుశీలించి, దాని పూర్వాపరాలను చర్చిస్తూ ఒకానొక కవి హృదయధర్మాన్ని పరిశీలించేందుకు, ఆయన పౌర్వికతను నిర్ధారించేందుకు మీరు ఈ వ్యాసంలో ప్రవేశపెట్టిన ప్రమాణపరంపర నన్నెంతో ఆకట్టుకొన్నది. నన్నెచోడుని కర్తృత్వాన్ని గురించి, కాలాన్ని గురించి మీచే నిశ్చీయమానాలుగా ఉన్న అభిప్రాయాలతో నాకు ఐక్యానుసంధానం లేనప్పటికీ మీ వాదధోరణి, తర్కసంగతి, సహృదయత నాకు ఆకర్షణీయంగా అగుపించాయి.
పైని చర్చలో కుమారసంభవం లోని ఈ పద్యం (6-141) ప్రసక్తి వచ్చింది:
ఆతపభీతి నీడలు రయంబున మ్రాఁకులక్రిందు దూఱెనో
యా తరులుం దృషాభిహతులై తమ నీడలు దార త్రాగెనో
భాతి ననంగ నీడ లురుపాదపమూలములం దడంగె గ్రీ
ష్మాతపమధ్యవాసరములందుఁ జలింపకయుండు నెండలన్.
ఇందులో “తరులు” – “తృషాభిహతులు” అన్నచోట మహదమహద్వాచకాల సాంకర్యం మాటెలా ఉన్నా, ఆరుద్ర గారు దీని మూలాన్ని జయంగొండార్ కళింగత్తుప్పరణిలో గుర్తుపట్టి సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటంలో ఉదాహరించారు. మీరు జెయన్ కొండార్ మూలాన్ని, ఆరుద్ర గారి అనువాదపాఠాన్ని ఇవ్వటం బాగున్నది.
ఆడుగిన్ఱ శిఱై వెంబరుంది నిళల్ అంజి యక్కడువనత్తై వి
ట్టోడుగిన్ఱ నిళలొక్కుం నిఱ్కుం నిళల్ ఓరిడత్తు ముళవల్లవే.
– కలింగత్తుప్పరణి (80)
జ్వలియించు దినకరుని చరపు లోర్వగలేక
పులుగుగమి మేతకై పోవు నీడలు తక్క
నిలకడగ నిగిడారు నీడ లీ కానలో
కలయ జూచినమేర కనిపించ నేరవు. (ఆరుద్ర)
ఆదవంబరుగు మెన్ఱు నిన్ఱ నిళల్ అంగు నిన్ఱు కుడి పోనద-
ప్పాదవంబునల్ పెఱా దుణంగువన పరుగుం నమ్మైయెన వెరువియే.
– కలింగత్తుప్పరణి (81)
తీక్ష్ణాంశు వాకలిచె తినివేయునని వగచి
వృక్షపాదము లంటి వేడుకొన్నది నీడ
అక్షీణ క్షుధచేత ఆ తరువు త్రావునని
వీక్షించుచుండగనె వెడలి పోయినది. (ఆరుద్ర)
నిజానికి ఈ రెండింటికీ మూలం గాథాసప్తశతి (1-49)లో ఉన్నది:
థోఅం పి ణ ణీసరఈ మజ్ఝణ్ణే ఉహ సరీర-తల-లుక్కా
ఆఅవ-భఏణ ఛాఈ వి పహిఅ తా కిం ణ వీసమసి.
(స్తోకమపి న నిఃసరతి మధ్యాహ్నే పశ్య శరీరతలలీనా
ఆతపభయేన చ్ఛాయాపి పథిక తత్కిం న విశ్రామ్యసి.)
దీనికి ‘ఈమాట’లో మీరు ప్రకటించిన అనువాదం:
నడు దినమున నెండకు భయ,పడి దేహపు నీడ కనుల బడకను దాగెన్
బడలికతో నీవిప్పుడు, నడువక విశ్రాంతి గొనుము నా గృహమందున్.
తమిళాంధ్రకవులిద్దరూ ప్రాకృతగాథకు అనుకర్తలే అయితే, జెయన్ కొండార్ అనుసరణ విషయం కుమారసంభవం రచనా కాలనిర్ణయానికి దోహదింపదు.
ఛందస్సు విషయంలో మీ కృషి మాత్రం విభ్రమాస్పదంగా ఉన్నది. అందుకు మీకు అభినందనలు!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఈమాట గురించి గురించి kanaka Raju Tunga అభిప్రాయం:
10/26/2013 12:24 am
నేను రామగుండం వాసిని. ఈ మధ్య శ్రీ పోతనచరిత్రమను శ్రీ వానమామలై వరదాచార్యుల విరచితంబైన పుస్తకం కొరకు ఎతుకుతున్న కాని దొరుకుత లేదు ఏవారైనా కలిగి యుండి వారు వద్దనుకున్న, లేక ఇంకొక పుస్తకమున్న యొడల తగిన ధర చెల్లించి కొనుక్కోగలను అట్టివారెవ్వరైనా యున్న ఎడల దయచేసి నా ఈ మైల్ చిరునామాకు తెలియ జేయగలరు నా ఈ మైల్ అడ్రస్సు tungakanakaraju@gmail.com
ధన్యవాదాలు
తుంగ కనకరాజు
సెల్ నెం 9032891593
సమ్మోహనామృతం గురించి Radha అభిప్రాయం:
10/25/2013 1:24 pm
వెంకట రమణ గారూ,
వెన్నెల ఉందిగా? అయినా వెంకట రమణుడికి చీకటి వెలుగులు ఉంటాయా? ఈ సృష్టి నిర్ధారితమై నడుస్తుందా లేక ఇచ్ఛాపూర్వకంగా నడుస్తుందా? ఎవరైనా చెప్తారేమోనని ఎదురుచూస్తున్నాను సర్ – తెలిస్తే చెప్పండి. మీ స్పందనకు ధన్యవాదములతో
సమ్మోహనామృతం గురించి cbs venkata ramana అభిప్రాయం:
10/25/2013 10:04 am
చీకటిలొ చీర రంగు ఎలా కనిపిస్తుంది?