పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి Rao Vemuri అభిప్రాయం:

    11/02/2013 10:31 am

    ఈ వ్యాసం చాల బాగుంది. నేను ఇంజనీరింగు చదువుకునే రోజులలో మా లెక్కల పరీక్షా పత్రం ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉన్న ఆచార్యులు తయారు చేసేవారని అప్పట్లో వినికిడి. ఆ ప్రశ్న పత్రం రామస్వామి గారు తయారు చేస్తే పరీక్ష కఠినంగా ఉంటుందనిన్నీ, మీనాక్షీసుందరం గారు తయారు చేస్తే కొరుకుపడుతుందనిన్నీ అనుకునే వాళ్లం. వీరిద్దరిలో ఈ తేడా ఎందుకు ఉందో ఈ వ్యాసం చదివిన తరువాత అర్థం అయింది. ఆ పాత రోజుల్లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్తుతో నేటి పరిస్థితిని పోల్చి చూస్తే దివిటీ ముందు దివ్వెలా అనిపిస్తుంది. కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు వచ్చిన తరువాత దేశవ్యాపతంగా ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు దిగజారిపోతున్నాయేమో అనిపిస్తోంది. అంతే కాదు. ఈ రోజుల్లో ప్రతిభ ఏమాత్రం ఉన్నా ప్రోగ్రామింగ్ నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిపోయి అమెరికా వెళిపోయి డబ్బు గణిద్దామనే యావ తప్ప మీనాక్షీసుందరంలా ఐఏఎస్ అవకాశం వదులుకుని డబ్బులు లేని గణితశాస్త్రంలో పరిశోధనలు చేసేవారు ఎక్కడ ఉన్నారు? – వేమూరి వేంకటేశ్వరరావు

  2. ఒక్కో రోజు గురించి Prasuna అభిప్రాయం:

    11/02/2013 3:56 am

    కవిత చాలా చాలా బాగుంది మానసా.

  3. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి jayaprabha అభిప్రాయం:

    11/02/2013 3:01 am

    ఇందులో మొదలు నన్నెచోడ, తెనాలిరామకృష్ణ కవుల పద్యాల లోని విషయాన్ని వివరించ పూనుకుని, ఇద్దరు తెనాలి రామ క్రిష్ణులని గురించి ప్రస్తావించి, మళ్ళీ ఆ విషయాన్ని వదిలేసి, నన్నెచోడకవి కృతమని అనుకునే తెనుగు కుమార సంభవం రచన కాలంలో రామకృష్ణ కవికి తరవాతదే నిజానికి అన్న అర్ధం వచ్చే లాగా తన విమర్శని కొనసాగించి, చివరికి దానినే స్థిరపరిచారు ఏల్చూరి. అంటే మానవల్లి రామకృష్ణ కవి గారే కుమార సంభవాన్ని రాసి నన్నెచోడకవి పేర దానిని ప్రకటించినారన్న అర్ధం రానే వస్తూంది కదా? విషయం బహుశా ఈ వ్యాసం లో ప్రముఖమైనది ఇదే కావలసి ఉండగా మధ్యలో “శృంగార తిలకం” వైపు గా చాలా సేపు వ్యాసం తీగసాగింది. ఇందువలన మొదలుపెట్టిన అసలు విషయం మధ్యలో కాసేపు [కాదు చాలాసేపే ]వెనక్కివెళ్ళింది.

    ఇంతకీ ఈ వ్యాసం ప్రతిపాదించే సంగతి, రామకృష్ణకవి [తెనాలి] కల్పన ఆయనకి శృంగారతిలకం మీద ఉన్న ఆసక్తి ఆధారంగానే జరిగినది అనీ, నన్నెచోడకవి [:)] కాలానికి అసలు ఈ శృంగారతిలక రచనే జరగలేదనీ గనక తెనాలి రామకృష్ణ కవి పద్యమే తొలిది కాగా, నన్నెచోడుని వెలికి తెచ్చిన మానవల్లి రామకృష్ణకవిగారు తెనాలి రామకృష్ణ కవి గారి మీద చెసిన ఆరోపణ నిజమైనది కాదని– చివరికి ఈ వ్యాసం ఇచ్చిన అభిప్రాయంగా తేలింది. అంతేనా? లేక నేనేమన్నా పొరబడ్డానా ఏల్చూరిగారూ?? ఈ వ్యాసాన్ని ఇంతకన్నా క్లుప్తంగా చెప్పగలిగే వీలున్నదేమో ఒకసారి అచ్చుకి ఇచ్చేముందు ఏల్చూరి మురళి గారు మరొక సారి చూసుకుని ఉంటే బాగుండెదేమో కదా అని కూడా అనిపించింది సుమా! ఏదైనా సుదీర్ఘమైన తన ఈ వ్యాసంలో ఏల్చూరి శృంగార తిలకం లోని శ్లోకాలని మాత్రం విపులంగా పేర్కొనడం నాకు [ఇదివరకు చదవనందువలన ] లాభించింది.

    మురళీధర రావు గారూ ! మీరే మరొక సంకలనం తెలుగులో” శృంగార తిలకానికి” చేయరాదో? బాగుంటుంది.

    భవదీయ,
    జయప్రభ.

  4. విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    11/02/2013 2:23 am

    మురళీధరునిపై ముచ్చటైన మూడు పద్యరత్నాలను పదికాలాలపాటు పదిలపరచి పాఠకులకు అందించిన మురళీధరరావు గార్కి ధన్యవాదాలు.
    డబ్బు శాశ్వతం కాదనడానికి ఇదో ఉదాహరణ. కాని, మనం అత్యంత విలువైనదిగా భావించే అది తప్ప ఇంకేం ఇచ్చుకోగలం… సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే వచ్చినా, కవిసామ్రాట్టే వచ్చినా! నాకు తెలిసినంత వరకు అప్పటి మూడు వందలంటే ఇప్పటి పదివేలుపైనే!

    మల్లికార్జున శర్మ దేవరకొండ.

  5. అల్లరి పిచుకలు గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    11/02/2013 1:52 am

    ఇంద్రాణి గార్కి,
    ఆలోచనలకి అలవాటుపడ్డ మనసు, బియ్యానికి అలవాటుపడ్డ పిచుకల్లాంటిదే. ధ్యానం లేకపోతే ఆలోచనలాగవు. ధాన్యం లేకపోతే పిచుకలు రావు. రెండోది ఉందన్న ద్వైతభ్రమలో అటు పిచుకలు, ఇటు మనసు, అదిగో అసలైన ‘నేను’ కలగజేసుకుంటేగాని పోవు. మంచి ఆలోచనల్ని కలిగించిన కవిత! అభినందనలు.

    ‘నీ పుస్తకాల అక్షరాల రెపరెప’ అని వుండాలేమో ఒకచోట. నాకు సరిగ్గా అర్థం కాలేదు.
    మల్లికార్జున శర్మ దేవరకొండ.

  6. రచయితలకు సూచనలు గురించి lekansee అభిప్రాయం:

    11/02/2013 12:48 am

    మొదటిసారిగా ఈ వెబ్సైట్ చూడగానే ఆనందంగావుంది.

  7. విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి vaman kumar అభిప్రాయం:

    11/01/2013 10:13 pm

    నమస్కారం.
    శ్రీ విశ్వనాథ వారి పద్యాలను అందించినందులకు మీకు ధన్యవాదములు.
    వామన కుమార్.

  8. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి yaddanapudi Kameswari అభిప్రాయం:

    11/01/2013 2:58 pm

    మురళీధర రావుగారూ,

    ఎంతోకాలం తరువాత మంచి పరిశోధనాత్మక వ్యాసం చదివాను. ఇంత ఓపికగా, అవసరమైనన్ని , అంతకుమించి పుస్తకాలను చదివి వివరణాత్మకంగా, తార్కికంగా కొన్ని నిర్ణయాలను చేయటం ఇటీవల వ్యాసాలను వ్రాసిన వారు చేయగా చూడలేదు. ఇటువంటి బరువైన వ్యాసాలను ప్రచురించేవారు కూడా అరుదు. ఈమాట వారిని ఇందుకు అభినందిస్తున్నాను. మీకు నమస్కరిస్తున్నాను. ‘ఏకవీర నవలకు నవలానాయికకు ఆ పేరే ఎందుకు’ అనేవ్యాసాన్ని వ్రాయడానికి నాకు ఆరేడు నెలలు పట్టగా, అదృష్టవశాత్తు ప్రపంచతెలుగు మహాసభలు జరిగి, ప్రత్యేకసంచికలో ప్రచురింపబడటానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది. ఏ పత్రికవారైనా వ్యాసం బాగుంది అనటమే కాని, గంభీర పరిశోధనను ప్రచురించే సాహసం ఎవరికీ లేకపోయింది. చివరకు అది ఆ వ్యాసానికి వరమే అయింది.

  9. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/01/2013 2:03 pm

    మాన్యులు శ్రీ మురళీధరరావు గారికి:

    మీ వ్యాసము పూర్తిగా చదవలేదు ఇంకా! అయినా నా అభిప్రాయం చెప్పకుండా ఉండలేను!

    ప్రాచీన తెలుగు సాహిత్యంలో ప్రవేశమూ, జ్ఞానమూ ఎక్కువగా లేకపోయినా – మీ వంటి పరిశోధకులు, పండితులు వల్ల ఇలాంటి గొప్ప విషయాలు తెలుస్తూ ఉంటాయి!

    ఇటువంటి వ్యాసాలను, ఎటువంటి మార్పులు లేకుండా, ప్రచురించ గలిగే పత్రికలు ఆంధ్రదేశంలో ఉన్నయో లేదో తెలియదు. కానీ, అందరికీ అందుబాటులో ఉండి ఉచితంగా చదవగలిగిన సదుపాయం ఉన్న ఈమాట పత్రికలో మీ వ్యాసం ప్రచురించబడటం నాకు మిక్కిలి ఆనందం కలిగిస్తోంది.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. చినుకొకపరి… గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    11/01/2013 2:03 pm

    రామారావు గారు,

    చాలా బాగుంది.