వాసుదేవరావు గారూ! ఒక మంచి టీచర్ని గురించి వారి ప్రతిభని గురించి తెలియజెప్పారు. సంతోషం కలిగింది మనసుకి. మీ తెలుగు వాక్యాలు కూడా క్లుప్తంగా విషయాన్ని బోధించడంలో స్థిమితంగా సాగాయి. ఇది కూడా ఒక మంచి టీచర్ కి ఉండవలసిన లక్షణానికి గుర్తే!
నేననుకుంటానూ మంచి టీచర్లు వాళ్ళు ఏ సబ్జెక్ట్ ని అయినా బోధించనివ్వండి ఒకలాంటి లక్షణాలని కలిగి ఉంటారని. పరిశోధనలో వారు చూపే ప్రత్యేకత, ఊహకి వారిచ్చే ప్రాధాన్యతా — వీటిని ఉన్నవారిని ప్రోత్సహించడం లాంటి లక్షణాలు.
సాధారణంగా సాహిత్యం లోనూ వేదాంతం లోనూ పేరు తెచ్చుకున్న వారిని గురించి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇతర రంగాల లోని వారిని గురించి అంతగా బయటి వారికి తెలియదు. అదే తెలుగులో అయితే తెలిసే వీలూ ఉండదు. మన వాళ్లని గురించి మనం గుర్తు చేసుకునే సందర్భం తక్కువే! బయటి వాళ్ళు చెబుతేనే తెలియాలి. అలాంటిది మీరు తెలుగు పాఠకులకి మీనాక్షీ సుందరం గారిని గురించి తెలియజేసారు. వేరే రంగాలలో ఉన్న మేధావులని గురించిన పరిచయాలు ఎంతో అవసరం. ఆ పనిని వారిని గురించి బాగా తెలిసిన వారూ సహృదయులూ మాత్రమే చేయవలసి ఉంది. మీవ్యాసం ఆ పనిని చేసినట్లయ్యింది. నాకు లెఖ్ఖలూ ఫిజిక్సూ వంటి సబ్జెక్టులలో ఓనామా రాదు. కానీ ఒక పండితునిగా గురువుగా మీనాక్షీ సుందరం గారి ప్రతిభ ఎంతటిదో మాత్రం గ్రహించగలిగేను మీ వ్యాసం ద్వారా! ఆరోజుల్లో మన దేశంలోని పేరుగన్న పండితులందరిమీదా భారతీయ నాగరికత ప్రభావం అలాగే భారతీయ తాత్వికత ప్రభావం గాఢంగానే ఉండెది [కమ్యూనిస్టు అయిన డీడీ కోశాంబీ తో సహా!]. లెఖ్ఖల్లో తన థియరీలతో పాశ్చ్యాత్తులని చకితులని చేసిన రామానుజన్, అదంతా తమ కుల దైవమైన అమ్మవారి మహిమ మాత్రమే అని చెప్పేవారని అంటారు. మనకి మనదే అయిన ఒక తాత్విక గుర్తింపు ఉంది. దానికి ఉన్న ప్రాధాన్యత గొప్పది కూడాను. దాన్ని ఈ మేధావులంతా మనసా అర్ధం చెసుకుని బతికేరు. వారిదైన ముద్రని కూడా బహుశా ఈ రకమైన వ్యక్తిత్వం వల్లనే వేయగలిగేరు అని అనిపిస్తుంది. మంచి పరిచయ వ్యాసం అందించేరు మీరు మీనాక్షీ సుందరం గారిని గురించి. ధన్యవాదాలు.
అనువాదం బాగుందండి. అన్నిటికన్నా చివరి పాట చాలా బాగుంది.అది మీరు రాసిందా? ఆ డైరీలో అలానే ఉన్నదా? పియానో మీదే కాక అలా ఓ సారి హిందుస్తానీలోనూ, కర్నాటక సంగీతం లోనూ ఓ బాణీ వేసి ఎవరైనా పాడితే వినాలని ఉన్నది.
మీకు పియానో పరిచయం ఉన్నది కాబట్టి మీరే వీలు చూసుకుని పియానో మీద ఆ పాట ప్లే చేసి ఒక ఆడియో రికార్డు చేసి ఇక్కడైనా, ఎక్కడైనా వేస్తే బాగుంటుందని ఈ మీ వీరాభిమాని, భవదీయుడి విజ్నప్తి (ఈ “విజ్నప్తి” టైపు ఎలా చెయ్యాలో తెలియలా.. తప్పు పడింది, క్షమించాలి.)
పోతే చదవటం మొదలుపెట్టినదగ్గరినుంచి ఇది యద్దనపూడి శైలిలో సాగిపోయినదనిపించింది, కొద్దిగా డాక్టర్ చక్రవర్తి సినిమాలో పియానో మీద పాటలూ కనపడ్డాయి. ఈ నిసి షామల్ కథలు మీరు ఇంకా ఏవన్నా రాసుంటే దయచేసి పంచుకోండి.
రూబెన్ పాత్రలో ఆర్.నాగేశ్వరరావు, నిసి పాత్రలో షావుకారు జానకి కనపడ్డారు నాకు. 🙂 ఆర్.నాగేశ్వరరావు చాలా అందగాడండి విలనుగా సెటిలైపోయాడు కానీ.
చక్కని వ్యాసం, మానవత్వమున్న శాస్త్రవేత్తను పరిచయం చేసిన తీరు హృద్యం. గణితం, కవిత్వం నాకెప్పుడూ ఇరుగూ పొరుగుల్లాగానే కనిపిస్తాయి.గణితంలో ప్రవేశం, అభినివేశం గలవారు కవిత్వానికి మంచి పాఠకులు కాగలరు అన్నది అనుభవైక వేద్యం. వాసుదేవరావు గారి అందమైన వాక్యాల్లో కవిత్వానికి ఉపకరించేవి:
“ఉపాధ్యాయునిగా మీనాక్షిసుందరం ఊహకు (intuition, imagination) ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు. నిర్దిష్టత (rigor) ఎంత అవసరమైనా, మంచి ఊహ నిర్దిష్టతను తప్పకుండా సాధిస్తుందని ఆయన నమ్మిక. ఈ రిగర్‌కీ ఇంట్యూషన్‌కీ యుద్ధం లెక్కల వాళ్ళకు నిత్యోత్సవం. ఒక ఐడియాని ముందుకు తీసుకు వెళుతున్నప్పుడు రిగర్‌ను కొంచెం వెనకాల పెట్టి ఊహను స్వేచ్ఛగా మసలనివ్వాలనీ, ఊహ సరియైన దోవన సంచరిస్తే రిగర్ దానంతట అదే వచ్చి ఊహను సర్దుకుంటూ పోతుందని, మీనాక్షిసుందరం విద్యార్థులకు డిపార్ట్‌మెంట్‌లో జరిగే సమావేశాలలో సూటి గానూ, తను పాఠం చెప్పే పద్ధతి ద్వారా సూచన గానూ, తరచూ యిచ్చిన ముఖ్యమైన సందేశం. ఇటువంటి ధోరణి ఫిజిక్స్‌తో పరిచయం ఉన్న లెక్కలవాళ్ల లోనే కనపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. రిగర్ గురించి మరింతగా పట్టించుకునే వాళ్ళను ‘గుడ్డు మీద ఈకలు లెక్కపెట్టేవాళ్ళు’ అని విశ్వకళా పరిషత్‌లో వ్యవహరించటం పరిపాటి.”
రామాయణంలో పిడకల వేట: రామానుజం ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది కుంభకోణం ప్రాంతాల్లో నైనా, ఆయన చదువుకున్నది తెలుగు మీడియంలనే, జీవిత చరిత్ర కారుడు ఇంత చిన్న విషయాన్ని కూడా వదలకుండా పట్టుకొచ్చినందుకు నేను చాలా ఆనందించాను. (The Man Who Knew Infinity: A Life of the Genius Ramanujan by Robert Kanigel.)
పైన వాసుదేవ రావు గారు వ్రాసినటువంటి చక్కని వాక్యాలు నాకు G.H Hardy. స్మృతిగ్రంధంలో కూడా కనిపించినాయి.
శ్రీ శ్రీనివాస్: ‘శ్రోతల ఉత్తరాలకు జవాబులు ‘సత్య’ పేరు సత్యనారాయణ అని గుర్తు. ఇంటి పేరు గుర్తు లేదు.
మీకు వింజమూరి సూర్య సుబ్బలక్ష్మి గారి ఇప్పటి వివరాలు తెలుసా? ఆమె హైస్కూల్ రొజుల్లొ పాడిన ‘అక్షరాలూ దిద్దు నాకూ ఆటబొమ్మ లెందుకింక అబ్బిగాడికిచ్చి వేస్త…’ వినిపించ గలరా?
వేంకటేశ్వరరావు గారికీ, రామారావు గారికీ ధన్యవాదాలు. — రామారావు గారూ నేను August1968 – June70 లలొ ఆంధ్ర విశ్వకళాపరిషత్ లొ M Sc Applied Mathematics చదువుకున్నాను. 1971 నుంచి 2009 దాకా కళాపరిషత్ లొ పంతులు పనిచేశాను.
నేను ఆంధ్రా యూనివర్సిటీలోచదువుకునే రోజుల్లో మీనాక్షీసుందరం గారి పేరు అడపాదడపా విన్నాను కాని ఇలాటి వివరాలు కాని ఇంతటి విశేషాలు కాని ఎవరూ అనగా విన్లేదు. శ్రమతో ఎన్నో విషయాల్ని సేకరించి అందించిన వాసుదేవరావు గారికి కృతజ్ఞతలు. ఒక కుతూహలం: వాసుదేవరావు గారికి Applied mathematics department తో ప్రత్యక్షసంబంధం ఉన్నదా? తెలియజేస్తే ఆనందిస్తాం.
ఈ సంచిక లో -మీరు కొన్ని రచనలు ప్రత్యేకమని మాకు తెలుపుతున్నారు. వాటి తరువాత ఒక చుక్కల దడి కట్టి అప్పుడు, ఇంకా ఈ సంచికలో మిగతా రచనలు అంటూ ఒక జాబితా ఇస్తారు. ఇలా విభజన చెయ్యటానికి కారణాలు ఏమిటి? ఎందువలన కొన్ని రచనలు, ఎవరికి ప్రత్యేకమని, ఎవరు భావిస్తున్నారో మీరు చెప్పగలరా?
చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. మీ సమాధానం విన్నాక, మీ విభజన పై, నా అభిప్రాయం తెలుపటమో, లేక నేను మరి కొన్ని ప్రశ్నలు అడగటమో జరుగుతుంది.
నమస్కారములు,
లైలా
[మేము ముందుమాటలో ఎత్తిచూపిన రచనలు మాకు ప్రత్యేకమనిపించినవే (highlights of the issue). పాఠకలోకం కూడా అవి ప్రత్యేకమైనవని భావిస్తుందనే మా ఆశ. — సం.]
నన్నెచోడుని కుమార సంభవంలోని పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలోని పద్యానికి మూలం కాదని, పద్యశిల్పాన్ని బట్టి రామలింగకవి పద్యం సహజమై ఉండగా నన్నెచోడుని పద్యం కృతకంగా ఉన్నదని, అందువల్ల నన్నెచోడుని పద్యమే అనుకరణం కావచ్చునని మొట్టమొదటిసారి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ‘నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?’ అన్న తమ గ్రంథంలో ప్రతిపాదించారు. దానికి చెప్పుకోదగిన, సమర్థమైన ప్రతివిమర్శ అంటూ ఏదీ ఇంతవరకు రాలేదు. ఆ తర్వాత నేను తెనాలి రామలింగకవి ‘కందర్పకేతు విలాసం’ సంస్కృతంలో సుబంధుని ‘వాసవదత్తా కథ’కు, కన్నడంలో నేమిచంద్రుని ‘లీలావతీ కథ’కు సంయుక్తానువాదమని గుర్తించి, ‘లలితాస్యాంబురుహంబు’ పద్యం తప్పక అందులోనిదే అయివుంటుందని తదితరవిశేషాలతో వ్యాసాలను ప్రకటిస్తూ వచ్చాను. తెనాలి రామలింగకవి పద్యం ‘శృంగార తిలకము’లోని శ్లోకానికి అనువాదమని గుర్తించాక ఈ విషయంలో మానవల్లి రామకృష్ణకవి గారు పొరబడ్డారని స్పష్టమైంది. రెండు పద్యాలలోనూ (1) కల్పన, (2) పూర్ణతయా నాలుగవ పాదం అన్నవి ఒకటే అయినందువల్ల – నన్నెచోడుడు, తెనాలి రామలింగకవి అన్న ఇద్దరిలో ఎవరో ఒకరే అనుకర్త కాబట్టి ‘శృంగార తిలకము’ కాలనిర్ణయం చేయవలసివచ్చింది. ‘శృంగార తిలకము’ 15-వ శతాబ్దికి పూర్వం ఉండిన ఆధారాలేవీ కనబడలేదు. అందులోని రెండు మూడు శ్లోకాలు తెనాలి రామలింగకవికి అభిమానపాత్రాలని, వాటిని విడివిడిగా ఎక్కడెక్కడో చూసి అనువాదం చేసి ఉంటాడని భావించటం కంటె 15-వ శతాబ్ది (±) ప్రాంతాల వెలసిన ఆ సంకలన కృతినే చదువుకొని అనువాదం చేశాడని భావించటం సమంజసం. అందువల్ల చర్చాసంగతంగా మధ్యలో ‘శృంగార తిలకము’ను గురించి కొంచెం ఎక్కువగా వ్రాయవలసివచ్చింది. అది మీటర్ గేజి పట్టాలమీదికి బ్రాడ్ గేజి పెట్టెను ఎక్కించినట్లుంటే వ్యాసరచనలో పొరపాటే.
వివాదాంశాలు మూడు: (1) పెదపాటి జగన్నాథకవి ‘ప్రబంధరత్నాకరము’లో స్పష్టంగా “లలితాస్యాంబురుహంబు” పద్యం కందర్పకేతు విలాసం లోనిదని పేర్కొనకపోయినా, బలమైన ప్రమాణాంతరాన్ని బట్టి అది అందులోనిదే అని నిశ్చయించటం మొదటిది. కందర్పకేతు విలాసం సుబంధుని ‘వాసవదత్తా కథ’కు అనువాదం కావటం ఆ నిశ్చయానికి దోహదం చేసింది. (2) ఆ పద్యం ‘శృంగార తిలకము’ లోని శ్లోకానికి అనువాదం కనుక, ఆ అనువాదాన్ని రామలింగకవి క్రీ.శ. 1525లో ‘ఉద్భటారాధ్యచరిత్రము’ నాటికే చేపట్టి ఉండటం మూలాన, వాటికి అనుకరణం అయిన నన్నెచోడుని “అలిధమ్మిల్ల” పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం రచనాకాలానికంటె (అంటే, సుమారు క్రీ.శ. 1565 కంటె) తర్వాతిదని నిర్ణయించటం రెండవది. ఒకవేళ కాలాంతరంలో ‘శృంగార తిలకము’ సంకలనం కాని, అందులోని “బాహూ ద్వౌ చ” అన్న శ్లోకం కాని క్రీ.శ. 10 – 13 శతాబ్దులకు మునుపే ఉన్నవని ఆధారాలు దొరికినా, నన్నెచోడుడే అనుకర్త అన్న నేటి మన నిశ్చయంలో మాత్రం మార్పుండదు. (3) దాదాపు కొంత అటూ ఇటూగా ఒకే కాలంలో ఇద్దరు తెనాలి రామలింగకవులు ఉండటం వల్ల – కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి హాస్యచాటువులను చెప్పినది, ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ కావ్యాలను చెప్పినది “మల్లికార్జున తనూభవుడు”, విశ్వబ్రాహ్మణుడు అయిన తెనాలి రామలింగకవి అని; ‘కందర్పకేతు విలాసము’, బహుశః ‘హరిలీలా విలాసము’ ఆయనవే కావచ్చునని శ్రీ కొడాలి లక్ష్మీనారాయణ వంటి చరిత్రకారులు భావించారు. ఇది మూడవ వివాదాంశం. ‘కందర్పకేతు విలాసము’, ‘ఉద్భటారాధ్య చరిత్రము’, ‘పాండురంగ మాహాత్మ్యము’, ‘ఘటికాచల మాహాత్మ్యము’ కావ్యాలలో “లలితాస్యాంబురుహంబు” పద్యం వంటి పద్యాలు అదే కల్పనతో విధవిధాలుగా ఉండటం వల్ల ఆ కల్పన రామలింగకవికి అభిమానపాత్రమని నిరూపించే ప్రయత్నం నేనిందులో చేశాను. ఏ మాత్రమూ ప్రామాణికం కాలేని ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ వంటి శిథిలబంధపు అప్రౌఢరచనలు చేసిన ఆ రెండవ తెనాలి రామలింగకవి సంస్కృతాంధ్రకావ్యసర్వస్వాన్ని మూదలించిన ‘కందర్పకేతు విలాసం’ వంటి అతిప్రౌఢరచనలను ఒకనాటికీ చేయలేడని – ఆ మొదలైన వివరాలను నేనిందులో విస్తరభీతి మూలాన వ్రాయలేదు. మీరన్నట్లు ప్రస్తావించి వదిలేశాను. ఒకవేళ కందర్పకేతు విలాసాన్ని ఆ రెండవ రామలింగకవే వ్రాసి ఉండినా, కాలాన్ని బట్టి నన్నెచోడుడు ఆయనకూ ఆధునికుడే కావలసి ఉంటుంది.
మీరు వ్యాసతాత్పర్యం ఇది – అని చెప్పినదంతా సవ్యమేనండీ! నన్నెచోడుడు తెనాలి రామలింగకవికంటె ఆధునికుడని మాత్రమే నా ప్రతిపాదన. మానవల్లి రామకృష్ణకవి గారు ఆ పద్యానికి మూలం ఒకటుండి, ఏదో ఒకనాడది నన్నెచోడుని కాలనిర్ణయానికి అవరోధం కాగలదని ఊహింపకపోవటం వల్ల ఈ చర్చ అంతా సంగతం అయింది. దీనిని సంక్షేపించి, ఇంకా స్పష్టంగా చెప్పలేకపోవటం నా లోపమే.
చారిత్రికంగా నన్నెచోడుడు అనే కవి లేడా? లేనట్లయితే, ‘కుమార సంభవము’ ఎవరి రచన? మానవల్లి రామకృష్ణకవి గారే దానిని వ్రాసి ఉండవచ్చునా? ఆ మహామహునిపై ఏర్పడినది వట్టి అపవాదేనా? నన్నెచోడునిదీ, ఆయనదీ కాకపోతే అది ఎవరి రచన? అన్నవి నిజంగా నిగ్గు తేల్చవలసిన ప్రశ్నలు. విశ్వవిద్యాలయాలకు ఎలాగూ అక్కరలేదు. పత్రికలు ప్రకటించవు. ఆ అతీతకాలయవనికను తొలగించి, ప్రతీతసత్యాలను ఆవిష్కరించేందుకు శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారి వంటి విద్వన్మార్గదర్శులు కొందరు ‘ఈమాట’ వంటి సమర్థసాధనాన్ని రూపొందించి ఉండటం ఎంతో అభినందనీయం.
‘శృంగార తిలకము’ను విశదపర్యాలోకనసమేతంగా ప్రకటించటం మంచిదే. వ్యాసాన్ని ఆసాంతం దయతో చదివి, సహృదయంతో స్పందించినందుకు మీకు నా ధన్యవాదాలు.
మాన్యులు శ్రీ NS మూర్తి గారికి, శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి, డా. యద్దనపూడి కామేశ్వరి గారికి – ధన్యవాదాలు!
అదే నేను గురించి Radha అభిప్రాయం:
11/03/2013 3:03 am
శ్రీనివాస్ గారూ, మన లోలోపల దాక్కునే వాడు దొంగే కదా! ఎంత దొంగంటే ఎంత కాలం పడుతుందో వెతకడానికి. దొరక్కపోవచ్చు కూడా.
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి jayaprabha అభిప్రాయం:
11/03/2013 1:18 am
వాసుదేవరావు గారూ! ఒక మంచి టీచర్ని గురించి వారి ప్రతిభని గురించి తెలియజెప్పారు. సంతోషం కలిగింది మనసుకి. మీ తెలుగు వాక్యాలు కూడా క్లుప్తంగా విషయాన్ని బోధించడంలో స్థిమితంగా సాగాయి. ఇది కూడా ఒక మంచి టీచర్ కి ఉండవలసిన లక్షణానికి గుర్తే!
నేననుకుంటానూ మంచి టీచర్లు వాళ్ళు ఏ సబ్జెక్ట్ ని అయినా బోధించనివ్వండి ఒకలాంటి లక్షణాలని కలిగి ఉంటారని. పరిశోధనలో వారు చూపే ప్రత్యేకత, ఊహకి వారిచ్చే ప్రాధాన్యతా — వీటిని ఉన్నవారిని ప్రోత్సహించడం లాంటి లక్షణాలు.
సాధారణంగా సాహిత్యం లోనూ వేదాంతం లోనూ పేరు తెచ్చుకున్న వారిని గురించి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇతర రంగాల లోని వారిని గురించి అంతగా బయటి వారికి తెలియదు. అదే తెలుగులో అయితే తెలిసే వీలూ ఉండదు. మన వాళ్లని గురించి మనం గుర్తు చేసుకునే సందర్భం తక్కువే! బయటి వాళ్ళు చెబుతేనే తెలియాలి. అలాంటిది మీరు తెలుగు పాఠకులకి మీనాక్షీ సుందరం గారిని గురించి తెలియజేసారు. వేరే రంగాలలో ఉన్న మేధావులని గురించిన పరిచయాలు ఎంతో అవసరం. ఆ పనిని వారిని గురించి బాగా తెలిసిన వారూ సహృదయులూ మాత్రమే చేయవలసి ఉంది. మీవ్యాసం ఆ పనిని చేసినట్లయ్యింది. నాకు లెఖ్ఖలూ ఫిజిక్సూ వంటి సబ్జెక్టులలో ఓనామా రాదు. కానీ ఒక పండితునిగా గురువుగా మీనాక్షీ సుందరం గారి ప్రతిభ ఎంతటిదో మాత్రం గ్రహించగలిగేను మీ వ్యాసం ద్వారా! ఆరోజుల్లో మన దేశంలోని పేరుగన్న పండితులందరిమీదా భారతీయ నాగరికత ప్రభావం అలాగే భారతీయ తాత్వికత ప్రభావం గాఢంగానే ఉండెది [కమ్యూనిస్టు అయిన డీడీ కోశాంబీ తో సహా!]. లెఖ్ఖల్లో తన థియరీలతో పాశ్చ్యాత్తులని చకితులని చేసిన రామానుజన్, అదంతా తమ కుల దైవమైన అమ్మవారి మహిమ మాత్రమే అని చెప్పేవారని అంటారు. మనకి మనదే అయిన ఒక తాత్విక గుర్తింపు ఉంది. దానికి ఉన్న ప్రాధాన్యత గొప్పది కూడాను. దాన్ని ఈ మేధావులంతా మనసా అర్ధం చెసుకుని బతికేరు. వారిదైన ముద్రని కూడా బహుశా ఈ రకమైన వ్యక్తిత్వం వల్లనే వేయగలిగేరు అని అనిపిస్తుంది. మంచి పరిచయ వ్యాసం అందించేరు మీరు మీనాక్షీ సుందరం గారిని గురించి. ధన్యవాదాలు.
జయప్రభ.
ప్రోగ్రెషన్ గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:
11/03/2013 12:18 am
అనువాదం బాగుందండి. అన్నిటికన్నా చివరి పాట చాలా బాగుంది.అది మీరు రాసిందా? ఆ డైరీలో అలానే ఉన్నదా? పియానో మీదే కాక అలా ఓ సారి హిందుస్తానీలోనూ, కర్నాటక సంగీతం లోనూ ఓ బాణీ వేసి ఎవరైనా పాడితే వినాలని ఉన్నది.
మీకు పియానో పరిచయం ఉన్నది కాబట్టి మీరే వీలు చూసుకుని పియానో మీద ఆ పాట ప్లే చేసి ఒక ఆడియో రికార్డు చేసి ఇక్కడైనా, ఎక్కడైనా వేస్తే బాగుంటుందని ఈ మీ వీరాభిమాని, భవదీయుడి విజ్నప్తి (ఈ “విజ్నప్తి” టైపు ఎలా చెయ్యాలో తెలియలా.. తప్పు పడింది, క్షమించాలి.)
పోతే చదవటం మొదలుపెట్టినదగ్గరినుంచి ఇది యద్దనపూడి శైలిలో సాగిపోయినదనిపించింది, కొద్దిగా డాక్టర్ చక్రవర్తి సినిమాలో పియానో మీద పాటలూ కనపడ్డాయి. ఈ నిసి షామల్ కథలు మీరు ఇంకా ఏవన్నా రాసుంటే దయచేసి పంచుకోండి.
రూబెన్ పాత్రలో ఆర్.నాగేశ్వరరావు, నిసి పాత్రలో షావుకారు జానకి కనపడ్డారు నాకు. 🙂 ఆర్.నాగేశ్వరరావు చాలా అందగాడండి విలనుగా సెటిలైపోయాడు కానీ.
నమస్కారాలతో
శిష్యుడు
మాగంటి వంశీ మోహన్
శ్రీ సూర్యనారాయణా… గురించి ravi shankar అభిప్రాయం:
11/03/2013 12:13 am
మీ వ్యాసం చాలా బాగుంది. ధన్యవాదములు.
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
11/02/2013 11:42 pm
చక్కని వ్యాసం, మానవత్వమున్న శాస్త్రవేత్తను పరిచయం చేసిన తీరు హృద్యం. గణితం, కవిత్వం నాకెప్పుడూ ఇరుగూ పొరుగుల్లాగానే కనిపిస్తాయి.గణితంలో ప్రవేశం, అభినివేశం గలవారు కవిత్వానికి మంచి పాఠకులు కాగలరు అన్నది అనుభవైక వేద్యం. వాసుదేవరావు గారి అందమైన వాక్యాల్లో కవిత్వానికి ఉపకరించేవి:
ఊహను కవిత తోను, నిర్దిష్టతను పాండిత్యంతోను ప్రతిక్షేపించి చదువుకొనండి:
రామాయణంలో పిడకల వేట: రామానుజం ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది కుంభకోణం ప్రాంతాల్లో నైనా, ఆయన చదువుకున్నది తెలుగు మీడియంలనే, జీవిత చరిత్ర కారుడు ఇంత చిన్న విషయాన్ని కూడా వదలకుండా పట్టుకొచ్చినందుకు నేను చాలా ఆనందించాను. (The Man Who Knew Infinity: A Life of the Genius Ramanujan by Robert Kanigel.)
పైన వాసుదేవ రావు గారు వ్రాసినటువంటి చక్కని వాక్యాలు నాకు G.H Hardy. స్మృతిగ్రంధంలో కూడా కనిపించినాయి.
తమ్మినేని యదుకుల భూషణ్
మేఘసందేశం (తెలుగులో) గురించి తః తః అభిప్రాయం:
11/02/2013 11:38 pm
శ్రీ శ్రీనివాస్: ‘శ్రోతల ఉత్తరాలకు జవాబులు ‘సత్య’ పేరు సత్యనారాయణ అని గుర్తు. ఇంటి పేరు గుర్తు లేదు.
మీకు వింజమూరి సూర్య సుబ్బలక్ష్మి గారి ఇప్పటి వివరాలు తెలుసా? ఆమె హైస్కూల్ రొజుల్లొ పాడిన ‘అక్షరాలూ దిద్దు నాకూ ఆటబొమ్మ లెందుకింక అబ్బిగాడికిచ్చి వేస్త…’ వినిపించ గలరా?
తః తః
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి వాసుదెవ రావు అభిప్రాయం:
11/02/2013 11:24 pm
వేంకటేశ్వరరావు గారికీ, రామారావు గారికీ ధన్యవాదాలు. — రామారావు గారూ నేను August1968 – June70 లలొ ఆంధ్ర విశ్వకళాపరిషత్ లొ M Sc Applied Mathematics చదువుకున్నాను. 1971 నుంచి 2009 దాకా కళాపరిషత్ లొ పంతులు పనిచేశాను.
వాసుదేవరావు
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
11/02/2013 9:18 pm
నేను ఆంధ్రా యూనివర్సిటీలోచదువుకునే రోజుల్లో మీనాక్షీసుందరం గారి పేరు అడపాదడపా విన్నాను కాని ఇలాటి వివరాలు కాని ఇంతటి విశేషాలు కాని ఎవరూ అనగా విన్లేదు. శ్రమతో ఎన్నో విషయాల్ని సేకరించి అందించిన వాసుదేవరావు గారికి కృతజ్ఞతలు. ఒక కుతూహలం: వాసుదేవరావు గారికి Applied mathematics department తో ప్రత్యక్షసంబంధం ఉన్నదా? తెలియజేస్తే ఆనందిస్తాం.
ఈమాట నవంబర్ 2013 సంచికకు స్వాగతం! గురించి lyla yerneni అభిప్రాయం:
11/02/2013 7:34 pm
ప్రియ సంపాదకులకు:
ఈ సంచిక లో -మీరు కొన్ని రచనలు ప్రత్యేకమని మాకు తెలుపుతున్నారు. వాటి తరువాత ఒక చుక్కల దడి కట్టి అప్పుడు, ఇంకా ఈ సంచికలో మిగతా రచనలు అంటూ ఒక జాబితా ఇస్తారు. ఇలా విభజన చెయ్యటానికి కారణాలు ఏమిటి? ఎందువలన కొన్ని రచనలు, ఎవరికి ప్రత్యేకమని, ఎవరు భావిస్తున్నారో మీరు చెప్పగలరా?
చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. మీ సమాధానం విన్నాక, మీ విభజన పై, నా అభిప్రాయం తెలుపటమో, లేక నేను మరి కొన్ని ప్రశ్నలు అడగటమో జరుగుతుంది.
నమస్కారములు,
లైలా
[మేము ముందుమాటలో ఎత్తిచూపిన రచనలు మాకు ప్రత్యేకమనిపించినవే (highlights of the issue). పాఠకలోకం కూడా అవి ప్రత్యేకమైనవని భావిస్తుందనే మా ఆశ. — సం.]
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/02/2013 2:10 pm
మాన్య జయప్రభ గారికి
నమస్కృతులతో,
నన్నెచోడుని కుమార సంభవంలోని పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలోని పద్యానికి మూలం కాదని, పద్యశిల్పాన్ని బట్టి రామలింగకవి పద్యం సహజమై ఉండగా నన్నెచోడుని పద్యం కృతకంగా ఉన్నదని, అందువల్ల నన్నెచోడుని పద్యమే అనుకరణం కావచ్చునని మొట్టమొదటిసారి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ‘నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?’ అన్న తమ గ్రంథంలో ప్రతిపాదించారు. దానికి చెప్పుకోదగిన, సమర్థమైన ప్రతివిమర్శ అంటూ ఏదీ ఇంతవరకు రాలేదు. ఆ తర్వాత నేను తెనాలి రామలింగకవి ‘కందర్పకేతు విలాసం’ సంస్కృతంలో సుబంధుని ‘వాసవదత్తా కథ’కు, కన్నడంలో నేమిచంద్రుని ‘లీలావతీ కథ’కు సంయుక్తానువాదమని గుర్తించి, ‘లలితాస్యాంబురుహంబు’ పద్యం తప్పక అందులోనిదే అయివుంటుందని తదితరవిశేషాలతో వ్యాసాలను ప్రకటిస్తూ వచ్చాను. తెనాలి రామలింగకవి పద్యం ‘శృంగార తిలకము’లోని శ్లోకానికి అనువాదమని గుర్తించాక ఈ విషయంలో మానవల్లి రామకృష్ణకవి గారు పొరబడ్డారని స్పష్టమైంది. రెండు పద్యాలలోనూ (1) కల్పన, (2) పూర్ణతయా నాలుగవ పాదం అన్నవి ఒకటే అయినందువల్ల – నన్నెచోడుడు, తెనాలి రామలింగకవి అన్న ఇద్దరిలో ఎవరో ఒకరే అనుకర్త కాబట్టి ‘శృంగార తిలకము’ కాలనిర్ణయం చేయవలసివచ్చింది. ‘శృంగార తిలకము’ 15-వ శతాబ్దికి పూర్వం ఉండిన ఆధారాలేవీ కనబడలేదు. అందులోని రెండు మూడు శ్లోకాలు తెనాలి రామలింగకవికి అభిమానపాత్రాలని, వాటిని విడివిడిగా ఎక్కడెక్కడో చూసి అనువాదం చేసి ఉంటాడని భావించటం కంటె 15-వ శతాబ్ది (±) ప్రాంతాల వెలసిన ఆ సంకలన కృతినే చదువుకొని అనువాదం చేశాడని భావించటం సమంజసం. అందువల్ల చర్చాసంగతంగా మధ్యలో ‘శృంగార తిలకము’ను గురించి కొంచెం ఎక్కువగా వ్రాయవలసివచ్చింది. అది మీటర్ గేజి పట్టాలమీదికి బ్రాడ్ గేజి పెట్టెను ఎక్కించినట్లుంటే వ్యాసరచనలో పొరపాటే.
వివాదాంశాలు మూడు: (1) పెదపాటి జగన్నాథకవి ‘ప్రబంధరత్నాకరము’లో స్పష్టంగా “లలితాస్యాంబురుహంబు” పద్యం కందర్పకేతు విలాసం లోనిదని పేర్కొనకపోయినా, బలమైన ప్రమాణాంతరాన్ని బట్టి అది అందులోనిదే అని నిశ్చయించటం మొదటిది. కందర్పకేతు విలాసం సుబంధుని ‘వాసవదత్తా కథ’కు అనువాదం కావటం ఆ నిశ్చయానికి దోహదం చేసింది. (2) ఆ పద్యం ‘శృంగార తిలకము’ లోని శ్లోకానికి అనువాదం కనుక, ఆ అనువాదాన్ని రామలింగకవి క్రీ.శ. 1525లో ‘ఉద్భటారాధ్యచరిత్రము’ నాటికే చేపట్టి ఉండటం మూలాన, వాటికి అనుకరణం అయిన నన్నెచోడుని “అలిధమ్మిల్ల” పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం రచనాకాలానికంటె (అంటే, సుమారు క్రీ.శ. 1565 కంటె) తర్వాతిదని నిర్ణయించటం రెండవది. ఒకవేళ కాలాంతరంలో ‘శృంగార తిలకము’ సంకలనం కాని, అందులోని “బాహూ ద్వౌ చ” అన్న శ్లోకం కాని క్రీ.శ. 10 – 13 శతాబ్దులకు మునుపే ఉన్నవని ఆధారాలు దొరికినా, నన్నెచోడుడే అనుకర్త అన్న నేటి మన నిశ్చయంలో మాత్రం మార్పుండదు. (3) దాదాపు కొంత అటూ ఇటూగా ఒకే కాలంలో ఇద్దరు తెనాలి రామలింగకవులు ఉండటం వల్ల – కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి హాస్యచాటువులను చెప్పినది, ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ కావ్యాలను చెప్పినది “మల్లికార్జున తనూభవుడు”, విశ్వబ్రాహ్మణుడు అయిన తెనాలి రామలింగకవి అని; ‘కందర్పకేతు విలాసము’, బహుశః ‘హరిలీలా విలాసము’ ఆయనవే కావచ్చునని శ్రీ కొడాలి లక్ష్మీనారాయణ వంటి చరిత్రకారులు భావించారు. ఇది మూడవ వివాదాంశం. ‘కందర్పకేతు విలాసము’, ‘ఉద్భటారాధ్య చరిత్రము’, ‘పాండురంగ మాహాత్మ్యము’, ‘ఘటికాచల మాహాత్మ్యము’ కావ్యాలలో “లలితాస్యాంబురుహంబు” పద్యం వంటి పద్యాలు అదే కల్పనతో విధవిధాలుగా ఉండటం వల్ల ఆ కల్పన రామలింగకవికి అభిమానపాత్రమని నిరూపించే ప్రయత్నం నేనిందులో చేశాను. ఏ మాత్రమూ ప్రామాణికం కాలేని ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ వంటి శిథిలబంధపు అప్రౌఢరచనలు చేసిన ఆ రెండవ తెనాలి రామలింగకవి సంస్కృతాంధ్రకావ్యసర్వస్వాన్ని మూదలించిన ‘కందర్పకేతు విలాసం’ వంటి అతిప్రౌఢరచనలను ఒకనాటికీ చేయలేడని – ఆ మొదలైన వివరాలను నేనిందులో విస్తరభీతి మూలాన వ్రాయలేదు. మీరన్నట్లు ప్రస్తావించి వదిలేశాను. ఒకవేళ కందర్పకేతు విలాసాన్ని ఆ రెండవ రామలింగకవే వ్రాసి ఉండినా, కాలాన్ని బట్టి నన్నెచోడుడు ఆయనకూ ఆధునికుడే కావలసి ఉంటుంది.
మీరు వ్యాసతాత్పర్యం ఇది – అని చెప్పినదంతా సవ్యమేనండీ! నన్నెచోడుడు తెనాలి రామలింగకవికంటె ఆధునికుడని మాత్రమే నా ప్రతిపాదన. మానవల్లి రామకృష్ణకవి గారు ఆ పద్యానికి మూలం ఒకటుండి, ఏదో ఒకనాడది నన్నెచోడుని కాలనిర్ణయానికి అవరోధం కాగలదని ఊహింపకపోవటం వల్ల ఈ చర్చ అంతా సంగతం అయింది. దీనిని సంక్షేపించి, ఇంకా స్పష్టంగా చెప్పలేకపోవటం నా లోపమే.
చారిత్రికంగా నన్నెచోడుడు అనే కవి లేడా? లేనట్లయితే, ‘కుమార సంభవము’ ఎవరి రచన? మానవల్లి రామకృష్ణకవి గారే దానిని వ్రాసి ఉండవచ్చునా? ఆ మహామహునిపై ఏర్పడినది వట్టి అపవాదేనా? నన్నెచోడునిదీ, ఆయనదీ కాకపోతే అది ఎవరి రచన? అన్నవి నిజంగా నిగ్గు తేల్చవలసిన ప్రశ్నలు. విశ్వవిద్యాలయాలకు ఎలాగూ అక్కరలేదు. పత్రికలు ప్రకటించవు. ఆ అతీతకాలయవనికను తొలగించి, ప్రతీతసత్యాలను ఆవిష్కరించేందుకు శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారి వంటి విద్వన్మార్గదర్శులు కొందరు ‘ఈమాట’ వంటి సమర్థసాధనాన్ని రూపొందించి ఉండటం ఎంతో అభినందనీయం.
‘శృంగార తిలకము’ను విశదపర్యాలోకనసమేతంగా ప్రకటించటం మంచిదే. వ్యాసాన్ని ఆసాంతం దయతో చదివి, సహృదయంతో స్పందించినందుకు మీకు నా ధన్యవాదాలు.
మాన్యులు శ్రీ NS మూర్తి గారికి, శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి, డా. యద్దనపూడి కామేశ్వరి గారికి – ధన్యవాదాలు!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు