పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఒంటరి ప్రపంచం గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    12/02/2013 10:24 pm

    ఆ ఒంటరితన౦ ఎంతో సుఖం.

  2. ఒంటరి ప్రపంచం గురించి bhaskarkondreddy అభిప్రాయం:

    12/02/2013 10:29 am

    బాగుందండి.

  3. ఒంటరి ప్రపంచం గురించి sasikala అభిప్రాయం:

    12/02/2013 8:00 am

    మీ ఒంటరితనం పొగోట్టుకోడానికి
    నన్నొంటరిని చేసి
    ఈ ప్రపంచంలోకి లాక్కొస్తారు

    నిజం. ప్రపంచాన్ని చక్కగా పదాల్లోకి మార్చారు క్రాంతి గారు.

  4. భార్యోత్సాహం గురించి సుబ్రహ్మణ్యం నిష్టల అభిప్రాయం:

    12/02/2013 4:49 am

    మీ కథలు చాలా బాగున్నాయి. ధన్యవాదములు మరియు అభినందనలు.

  5. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి సుబ్రహ్మణ్యం నిష్టల అభిప్రాయం:

    12/02/2013 4:12 am

    మీ హాస్య చతురతకు కధాశైలికి నా హృదయపూర్వక అభినందనలు. చాలాకాలం తరువాత ఈ ఫేస్ బుక్ ధర్మమా అని మీ వంటి మంచి రచయితల మంచి కధలను చదవగలిగేను. మీకు మీ రచనలు చదివే భాగ్యం కలిగించిన వారికి నా కృతజ్నతలు.

  6. గాథాసప్తశతి శతకం గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:

    12/01/2013 10:24 pm

    చాలా బాగున్నాయి. శ్రీ బెజ్జాల కృష్ణమోహన్ గారికి శతవందనములు.

  7. శబ్ద తరంగాలు గురించి satyanarayana అభిప్రాయం:

    12/01/2013 3:08 am

    మీ ఈ మాట సార్ధక నామదేయంగా ఉంది మాకు – కిన్నెరసాని పాటలపై వ్యాఖ్యానం కావాలి. దయచేసి ఇవ్వగలరా…

  8. కొడుకులు గురించి ముత్యాల రామకృష్ణారావు అభిప్రాయం:

    11/30/2013 2:26 am

    కథ చాలా బాగుంది.
    పెద్దింటి అశోక్ కుమార్ గారికి అభినందనలు.

  9. పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి Ramarao Paluri అభిప్రాయం:

    11/29/2013 6:41 pm

    మీరు ప్రస్తావించని ఒక విషయం..ఆంధ్రలో కన్న శ, ష,స ల మధ్య సరైన ఉచ్చారణా భేదం మనకి మలయాళీల వద్ద కనిపిస్తుంది. అనేక ఇతర పదాలకు బాగా ఊనిక వాడినా ఈ అక్షరాలను మాత్రం అధిక మలయాళీలు సంస్కృత శిష్ట పద్ధతికి బహుచేరువగా పలకడం మనం గమనించవచ్చు.

  10. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి వాసుదేవ రావు అభిప్రాయం:

    11/29/2013 12:01 am

    శ్రీ భాస్కర్ కొంపెల్ల: నమస్కారాలు.SMS రీసెర్చ్ తొ విద్యార్థి గా పరిచయమున్న మీ మాటలు ఎంతొ సంతోషాన్ని కలగచేసాయి. మూడు నాలుగు సంవత్సరాల క్రితం SMS గురించి సుజన పరిచయం గా ఒక వ్యాసం తెలుగు లొ రాయాలనిపించింది. జరిగి పొయిన మే నెలలొ మొదలు పెట్టాను. అప్పుడే నేను ఆయన వ్యాసాలు కొన్ని చదివాను. మీరు ఇంకా ఇటువంటి వ్యాసంగం [Math-Phy] లో ఉన్నట్లయితే మీ కృషి గురించి తెలుసుకొవాలని ఉంది. నా ఈమైల్ ఐ.డి vasudevary@gmail.com

    శ్రీ విష్ణుభొట్ల :’ఈ మాట’ లొ SMS పరిచయ వ్యాసం వచ్చింతర్వాత తెలిసిన విషయం: డాక్టర్ సుబ్బారావు వున్నవ [Dr Subba Rao V Wunnava,Professor Emeritus,ECE Department, Florida International University, Cell 305 7721766] న్యూక్లియర్ ఫిజిక్స్ లొ ఎమ్మస్సీ, పీఎచ్. డి లు ఆంధ్ర విశ్వకళాపరిషత్ నుంచి తీసుకున్నారు. వారి తరగతులకు SMS ‘క్వాంటంఎలక్ట్రో డైనమిక్స్’ లొ పాఠాలు చెప్పారు.

    నమస్కారాలతో
    వాసుదేవ రావు