పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. పన్నీరు బుడ్డి గురించి కెక్యూబ్ వర్మ అభిప్రాయం:

    01/03/2014 10:36 am

    హత్తుకుంది సార్.

  2. పలుకుబడి: రంగులు గురించి మోహన అభిప్రాయం:

    01/03/2014 10:12 am

    మంచి వ్యాసము!

    హంసవింశతిలో రంగులను గుఱించిన ఒక పద్యమును క్రింద చదువవచ్చును –

    హరిత హారిద్ర కృష్ణ ర-క్తావదాత
    శబల పాటల ధూమల – శ్యామ కపిల
    వర్ణములఁ గూర్చి చిప్పల – వాగె లునిచి
    చిత్తరువు వ్రాయు గుళ్లలోఁ – జిత్రఘనుఁడు
    – అయ్యలరాజు నారాయణామాత్యుఁడు, హంసవింశతి, 3.008

    (హరిత = ఆకుపచ్చని, హారిద్ర = పసుపు, కృష్ణ = నలుపు, రక్త = ఎఱుపు, అవదాత = తెలుపు, శబల = వివిధ వర్ణయుక్త spotted, పాతల = తెలుపు కలిసిన ఎఱుపు, ధూమల = నలుపు కలిసిన ఎఱుపు, శ్యామ = నలుపు, కపిల = గోరోజనము, మట్టి రంగు, వాగె = కుంచె)

    విధేయుడు – మోహన

  3. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/03/2014 9:04 am

    * ‘మీ రచన బంతి పూల పడవ మీద పోదాం పదవా’ చదివేను. చదివేను అనడం కన్న అనుభూతికి లోనయ్యేను అని చెప్పాలి. –

    జోగారావు గారు! ఏ రైటర్ కైనా ఇంతకు మించిన అవార్డ్సెందుకనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలతో.

    * ఎంత అందమైన వ్యాఖ్య రాసి మనసుని రంజింప చేసారు పూర్ణిమ గారూ! మీ అభిమానానికివే నా ధన్యవాదాలు. చక్కని కవిత్వంతో కూడా కథ ని ఇలా ప్రశంసించవచ్చని నిరూపించారు. బావుంది. అచ్చు సంక్రాంతిలా! చివర్లో భక్తురాలు అంటూ చమక్కుమనిపించారు లేఖని. థాంక్యూ.థాంక్యూ! మీకు పండగ శుభాకాంక్షలతో. మీ లేఖాభిమానిని. 🙂

  4. కృషితో దుర్భిక్షం గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    01/03/2014 8:21 am

    వీటో చేసిన ప్రభావతిగారి ఆఙ్ఞానుసారం సంచీ పుచ్చుకుని రైతుబజార్ కి వెళ్ళడమే మీ తక్షణ కర్తవ్యం..

  5. అసమయాల అమావాస్య గురించి సాయి పద్మ అభిప్రాయం:

    01/03/2014 7:58 am

    చాలా థాంక్స్ అండీ.. మీ ప్రోత్సాహానికి

  6. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి Anil battiula అభిప్రాయం:

    01/03/2014 6:15 am

    ఆర్.శర్మ దంతుర్తి గారు. కథని చాల బాగా అనువాదం ఛేశారు. కథ చాల బాగుంది. మీ నుండు మరికొన్ని అనువాదాల్ని ఆశిస్తున్నాం.

  7. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి ajay అభిప్రాయం:

    01/03/2014 5:59 am

    చక్కటి కథను అనువాదం చేశారు. టాల్ స్టాయ్ “టు ఓల్డ్ మెన్” కథను కూడా అనువాదం చేయమని నా మనవి.

  8. ఏటి గట్టున ఇల్లు గురించి poornima అభిప్రాయం:

    01/03/2014 5:15 am

    దమయంతి గారు మీ కథలకు పెట్టే పేర్లే భావుకత నిండి పాఠకులను కథ చదివేలా ప్రోత్సహిస్తాయి. తీరా కథ చదివాక ఆ కథతో పాటు మేమూ ప్రయాణించి ఆ పాత్రలతో తాథ్యాత్మం చెంది మమేకమై పోతాం. ఈ మధ్య కాలంలో భావుకత నిండిన కథలు ఎక్కువ గా రాసేది మీరేనేమో. మీరిలాగే అందమైన కథలు రాసి మమ్మల్ని తరింప చేయగలరు. ఇంతకీ మీ కథ గురించి చెప్పలేదు కదూ తెల్లవారుజామున వచ్ఛే అందమైన కల మీ కథ. అనుభూతిగా దాచుకోగలమే కానీ అనుభవంలో చెప్పలేము. మీ పూర్ణిమ.

  9. అసమయాల అమావాస్య గురించి kolluru sivanageswararao అభిప్రాయం:

    01/03/2014 4:32 am

    కాఫీ డికాక్షన్ వాసన, నానిన సుద్దముక్కల వాసన, ఒకేసారి గౌతమ్‌ని పలకరించాయి! Excellent baga vrasaru

  10. రచయితలకు సూచనలు గురించి poornima అభిప్రాయం:

    01/03/2014 2:37 am

    ఈమాట చాలా బావుందండి మా కోసం ఈమాట ను ప్రారంభించిన మీ అందరికి కృతజ్ఞతలు.