పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి Y Subba Rao అభిప్రాయం:

    01/09/2014 2:42 am

    What a programme it is! It is Great. Great programme, Great selection by Great personality. Where is such melody now? How to convey my gratitude to you for presenting such a programme. Gratefully thanks.

  2. ఒక తియ్యని కల గురించి krishibsk@gmail.com అభిప్రాయం:

    01/08/2014 10:06 pm

    ఎంత బాగుందో ప్రసూన! నిద్ర సిగలో వికసించే కల. ఎంత చక్కని ప్రయోగం ?

  3. నాకు నచ్చిన పద్యం: చూపులు పలికించే సున్నిత భావాలు గురించి మోహన అభిప్రాయం:

    01/08/2014 9:49 pm

    ప్రశ్న: ప్రవరునికి మీసములున్నవా?

    ప్రవరునికి తలిదండ్రులు ఉన్నారు కాబట్టి మీసాలు ఉన్నాయి }:)
    – మోహన

  4. అర్థంకాని మాటల గురించి మరికొన్ని మాటలు గురించి lyla yerneni అభిప్రాయం:

    01/08/2014 9:04 pm

    “మొన్న మొన్నటి వరకూ నాకు, “ఏ తీరుగనను దయజూచెదవో…” అన్న పాటలోని “కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా!” అన్న వాక్యం అర్థమయ్యేది కాదు. “కారుణ్యాలయ”, “భక్తవరద” అన్నవి కౌసల్యకు విశేషణాలెలా అయ్యాయా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఈ మధ్యనే తెలిసింది, “కానుపు” అంటే “చూపు” అన్న అర్థం కూడా ఉన్నదని. అప్పుడు అందులోని భావం తేటతెల్లమైంది.”

    నాకు అర్ధం కాలేదు. వేరే మాటల్లో చెపుతారా. (ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నప్రశ్న.)

    లైలా

  5. నాకు నచ్చిన పద్యం: చూపులు పలికించే సున్నిత భావాలు గురించి lyla yerneni అభిప్రాయం:

    01/08/2014 8:52 pm

    “కవిత్వం, ముఖ్యంగా కావ్యరచన అనేది శిల్పం లాగా చిత్రలేఖనం లాగా చాలా సాధనతో కూడుకున్న కళ.”

    Sure it is.

    1. Experiencing technical difficulties with the first poem. — మన్మథుడు పంచశరుడు. అతనికి ఉన్నవి ఐదు రకాల పూల బాణాలు మాత్రమే. తమ్మరసమేమిటీ? బాణపు ములుకేమిటీ? Those must be poetic liberties one can take as the chief poet of the court.

    2. Likewise with the second poem. This poem tells me at the time of writing it, Peddana had no experience in painting, or sculpting. If he did, he did not use models. The poem/s immediately following, in Manucarithra, confirm his lack of knowledge. Think of ‘The Thinker.’ Think Rodin.

    Can a woman resting her forehead in one hand, spot a man plucking flowers at a distance? The answer is No. For a woman who is distraught, and has unseeing eyes, Varudhini seems to see a whole lot more than any.

    ప్రశ్న: ప్రవరునికి మీసములున్నవా?

    Lyla

  6. మంచు గురించి raju అభిప్రాయం:

    01/08/2014 6:11 pm

    చావంటే ఏమీలేనితనమా? ఎవరు చెప్పారండీ? ఎవడైనా చచ్చిపోతే ప్రపంచంలో ఇంకేమీ ఉండదా? బెంగళూర్ లాంటి ఊళ్ళో ఉద్యోగం చేస్తూ వీకెండ్ కి విహారయాత్రలకి వెళ్లి చూసొచ్చిన రాళ్ళ మీద తొండల్నీ బట్టలు ఉతుక్కునే బండల్నీ బ్రహ్మాండంగా వర్ణించేస్తే కధ అయిపోయిందా?

    చావు గురించే కధ అయితే ఏ వల్లకాణ్ణో వర్ణించొచ్చు. ఈ వల్లకాడు అనేది రచయిత వాడిన మాటే. ఈ కధకి తలా, తోకా, వల్లకాడు, ఏమీ లేవు. అయితే ప్రకృతి వర్ణన బాగానే ఉంది కాని కధకి అది సరిపోదు. చావంటే ముక్కూ మొహం తెలియని వాడింట్లో బంగాళా దుంపల వేపుడు అన్నం కడుపు నిండా తినడం కాదు. అది తిన్నాక దాన్ని జీవితాంతం (!) గుర్తుపెట్టుకుంటానని చెప్పడం అంతకన్నా కాదు.

    [Comment edited – Ed.]

  7. స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా? గురించి దేశికాచారి అభిప్రాయం:

    01/08/2014 4:04 pm

    ఏల్చూరివారి వ్యాసం వివిధవిషయసమన్వితంగా, పాండితీమండితంగా ఉందనుటలో సందేహం లేదు. వారునన్నెచోడుని, తెనాలిరామకృష్ణుని పద్యాలు రెండూ శృంగారతిలక మనే సంకలనగ్రంథస్థ ‘బాహూ ద్వౌ చ’ అనే శ్లోకానికి అనుసృజనలని నిరూపించడం గూడ చాలా గొప్పగా నున్నది. కాని శృంగారతిలకసంకలనాలను ఆధారంగా చేసుకొని నన్నెచోడుని కాల నిర్ణయం చేయడం సమర్థనీయంగా తోచుటలేదు.

    పండితులవదనాలలో తరతరాలుగా మెదలుచున్న, లేక పూర్వగ్రంథాల్లో నున్న(అవి లుప్తమైనా నిలిచియున్న) చెదురుముదురు శ్లోకాల సంకలనమే శృంగారతిలక మని వారే నిరూపించినారు. అందులో కొన్ని శ్లోకాలు 9, 10 శతాబ్దాల నాటివే అనియు వారే తెల్పినారు. కాని నన్నెచోడునకు గాని, రామకృష్ణునకు గాని పరిచితమైన ఈశ్లోకానికి ఈసంకలనమే మూలమని ఇదమిత్థంగా నిర్ణయించలేము. కాళిదాసు, భోజరాజుల కాలంనాటి చాటువులు కేవలం జనశ్రుతివల్ల ఈనాటికీ నిలిచియుండుట మనం గమనింపవచ్చు. అట్లే జనశ్రుతిలో నున్న పైశ్లోకం నన్నెచోడుని పద్యానికి మూలమై ఉండవచ్చు ననే అంశాన్ని మనం త్రోసిపుచ్చలేము. అందుచేత నన్నెచోడుని కుమారసంభవం శృంగారతిలకానంతరగ్రంథ మని ఇదమిత్థంగా చెప్పలేము. ఈ నిర్ణయం కావ్యమందలి భాషాసంప్రదాయాలను, ఇతర చారిత్రకాధారాలనుబట్టి చేయడం సమంజసంగా ఉంటుంది.

    ఏల్చూరివా రొకచోట నన్నెచోడుని పద్యంలో రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలో నీశ్లోకానుకరణలో నున్న ‘అతిరిక్తభావాలు’ వచ్చిచేరాయని తెల్పినను, అది కాలనిర్ణయానికి సరియైన ఆధారంగా కన్పడదు. ఎందుకంటె మూలశ్లోకానువాదం చేసినప్పుడే, రామకృష్ణునితో ప్రసక్తి లేకుండ నన్నెచూడుని కిట్టి పదబంధములు దోచియుండుటలో ఆశ్చర్య మేమీలేదు. ఆమహాకవి కంతపాటి సామర్థ్యము లేకపోలేదు. ఏల్చూరివారి వ్యాసంవల్ల గ్రహింప వలసిన ముఖ్యవిషయం నన్నెచోడుని అనుసృజన రామకృష్ణునికంటె న్యూనంగాను, రసభంగకరంగాను ఉన్నదనుట. ఈవిషయాన్ని వారత్యంత విశ్వసనీయంగా, నిర్ద్వంద్వంగా నిరూపించినారనడంలో విప్రతిపత్తి లేదు. కాని ఈపద్యాన్ననుసరించి వారు చేసిన నన్నెచోడుని కాలనిర్ణయం సమర్థనీయంగా లేదని నాయభిప్రాయము.

  8. సిరుల సంక్రాంతి గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/08/2014 1:05 pm

    అంటే 23 యేళ్ళ కిందటి మాట కదూ మీరు చెబుతోంది ?..ఆ కవిత ఇక్కడ వుంచితే మేము కూడా చదివి ఆనందిస్తాం కదా రావ్ గారు! 🙂 సిరుల సంక్రాతి నచ్చినందుకు ధన్య వాదాలు తెలియచేసుకుంటూ,
    పండగ శుభాకాంక్షలతో.

  9. కొంచెం అది కొంచెం ఇది గురించి wahed అభిప్రాయం:

    01/08/2014 12:46 pm

    పుస్తకాల దొంతరల
    గొడుగు నీడ కింద
    ఒక్క చుక్క వాన రాదు.

    చాలా బాగుంది.

  10. సిరుల సంక్రాంతి గురించి VNM RAO అభిప్రాయం:

    01/08/2014 9:14 am

    ఎప్పుడో 1990లో కాలేజ్ మాగజైన్‌కి వ్రాసిన సంక్రాంతి కవిత గుర్తొచ్చింది. బావుంది.