నా అభిప్రాయములు క్రింది అభిప్రాయములకు మాత్రమే పరిమితము –
1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
కైకేయికి ఈ వరములను గురించి తెలుసు. ఆమెకు కూడ రాముడంటే ప్రీతి, వాత్సల్యము. పట్టాభిషేకమునకు ముందే పుత్రశోక శాపము దశరథుడు అనుభవిస్తే తరువాత రాజ్యపాలన ఎట్టి కష్టము లేకుండ సాగిపోతుంది కాబట్టి ఆ వరములను కైక అడిగినట్లు భాసమహాకవి ప్రతిమా నాటకములో, యజ్ఞఫలనాటకములో వివరిస్తాడు. తన తొట్రుబాటులో 14 రోజులు అనడానికి బదులు 14 ఏండ్లు అంటుంది ఆమె. The rest is history. కాని మునిశాపమును దశరథుడు అనుభవించడమును కైకేయి ఆపలేక పోతుంది. వాల్మీకి రామాయణములో సీత లక్ష్మణుని సందేహించడము ఆమె పాత్రలో లోపమా? విధేయుడు – మోహన
[Note to commenters: Please refrain from posting article links without an original opinion, or a comment for them to be a part of. No further posts with only links to essays on the web are allowed – Ed.]
4. Univ of Chicago site link summarizing the issue of western interpretations of Hinduism. It also discusses the views of Rajiv Malhotra http://magazine.uchicago.edu/0412/features/
గీత పై శంకర-మధ్వ భాష్యాలపై మీరడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ముందు ఒక విషయాన్ని పంచుకోదలిచాను.
మన ధార్మిక గ్రంథాల విశ్లేషణ చేసే సందర్భంలో విశ్లేషకులు రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి:
1. ప్రసంగం
2. ప్రసక్తి
ఒక ప్రసంగంలో ఎన్నో ప్రసక్తులు ఉంటాయి. ఉదా: రామాయణంలోని రామ వనవాసం. ఈ ప్రసంగం పుట్టడానికి ఎన్ని ప్రసక్తులు అవసరమయ్యయో చూడాలి.
సురేశ్ గారు దశరథుని కాముకత్వం వల్ల వనవాస ప్రసంగం పుట్టుకొచ్చిందన్నట్టుగా వ్రాసారు. అది చదివిన వారికి మరే ప్రసక్తి లేనట్టుగా అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఐదు ప్రసక్తులు ఉన్నాయి:
1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
3. మంథర – కైకేయి సంభాషణ.
4. ఎప్పుడో ఇచ్చిన వరాలను రామ పట్టాభిషేక సమయంలోనే కైక అడగడం.
5. వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షి నిర్ధారించిన పట్టాభిషేక ముహూర్తం విఫలమవడం.
పైవన్నీ ఒక్క బిందువు దగ్గర కలిసినప్పుడే వనవాస ప్రసంగం సంభవనీయమైంది. ఇందులో ఏ ఒక్క ప్రసక్తిని వదిలినా ప్రసంగంలోని పరమార్థం మాయమైపోతుంది. ప్రస్తుతం వెండీ గాని, సురేశ్ గారు గాని చేసినది ఇదే. ఏదో ఒకటి రెండు శ్లోకాలను తీసుకొని అందులోని మాటలే సిద్ధాంతమని అనుకోవడం పొరబాటు.
పై నేపధ్యంలో అర్జున విషాదాన్ని, నిర్వేదాన్ని ఒకటి, రెండు భగవద్గీత శ్లోకాలతోనే సరిపెట్టాలని చూస్తే అది విపరీతార్థాలకు దారి తీస్తుంది. బంధువుల్ని చంపలేనని ఏడ్చిన అర్జునుడు కృష్ణప్రబోధంతో యుద్ధానికి మళ్ళాడు. కానీ అభిమన్యుని మరణంతో మళ్ళీ దుఃఖించి యుద్ధం మధ్యలోనే అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడు. అంతకు మునుపు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కృష్ణుడి మీద అహంకరించాడు. ఇలా ఎన్నెన్నో ప్రసక్తుల్ని చేర్చి అర్జునుడిని ఉద్దేశ్యించి గీతలో కృష్ణుడు వాడిన పదాలను విశ్లేషించాలి.
రెండో అధ్యాయం మొదట్లోనే కృష్ణుడు “క్లైబ్యం మాస్మ గమః పార్థ” అని అర్జునుణ్ణి మందలిస్తాడు. క్లైబ్యం అంటే నపుంసకత్వమని అర్థం కదా! మరి అర్జునుడు నపుంసకుడా? కానప్పుడు ఆ పదాన్ని కృష్ణుడు ఎందుకు వాడాడు? – ఇవన్నీ అర్థం కావాలంటే భారత యుద్ధం వరకూ గల అర్జునుని వ్యవహారాలన్నింటినీ సమీక్షించాలే తప్ప ఒక్క యుద్ధ ప్రసంగంతోనే నిర్ధారణలకు రాకూడదు.
ఇక మీరుదహరించిన మధ్వభాష్యపు తెలుగు అనువాదం సరికాదని నా అనుమానం. మూల సంస్కృత భాష్యం ఇలా ఉంది:
పై దానిలో ప్రజ్ఞావాదాన్ అన్నదానిని “స్వమనీషోత్థవచనాని” అని వివరించారు. అంటే మానుషబుద్ధికి తోచిన మాటలని అర్థం. ప్రజ్ఞావాదానికి “స్వమనీషోత్థవచనాని” అన్న అర్థాన్ని ఎలా సాధించాలి? అని ప్రశ్నిస్తే “గతాసూన్” పదాన్ని గత + అసూన్ అని విడదీసినట్టుగానే ప్రజ్ఞ+అవాద అని విడదీయలన్నారు ఆచార్యుల వారు.
ఐతే ప్రజ్ఞావాదంను ప్రజ్ఞ+అవాదం అని ఎందుకు విడదీయాలన్నదే ముఖ్య విషయం.
దీనికి నా సమాధానం:
ప్రజ్ఞావాదం = పండిత వచనాలు అని భావిస్తే, “నాను శోచంతి పండితాః” లోని పండిత పదం రావడం వల్ల పునరుక్తి దోషాన్ని ఆపాదించాల్సివస్తుంది. తద్దోష పరిహారార్థంగా ప్రజ్ఞావాదాన్ని అశోచ్యా అన్న పదంతో బాటూ చదవాలని మధ్వచార్యులు సూచించారు. అశోచ్యా అంటే ఆలోచనకు అనర్హమైనదని అర్థం. మీరన్నట్టు అర్జునుడివి పండిత వచనాలైతే అవి శోచ్యాలే గానీ అశోచ్యాలు కాలేవు. కనుక ప్రజ్ఞావాదాన్ని ప్రజ్ఞ+అవాద గా విడదీసి ప్రజ్ఞావాదమంటే అశాస్త్రీయమైన మాటలని, అవి అనర్హమైనవని (అశోచ్యా) తెలుసుకోవాలని మధ్వుల భావన.
ఈ రెండింటినీ కలిపి చూస్తే, “బంధువులనూ పూజ్యులనూ ధర్మం నేర్పిన గురువులనూ చంపి రాజ్యం చేజిక్కించుకోవడం కంటే త్యజించి బిచ్చమెత్తుకోవడం శ్రేయస్కరం కదా, ఆలోచించు. ఏం చేయాలో నీవే చెప్పు” అన్న అర్జునుడితో కృష్ణుడు “పండితులైనవారు బ్రతికున్నవారిని గురించిగాని, చనిపోయినవారిని గురించిగాని దుఃఖింపరు. నువ్వు పండిత వచనాలు పలుకుతూ (పరిహాసంగా) కూడనివాటిని గురించి దుఃఖిస్తున్నావు” అన్నాడు. ఈ విధంగా చూసినపుడు కర్మధర్మాలలో అభిమానం కలిగి ఉండిన అర్జునుడు ఇతర శ్రుతులకు పలుకుతూ సందిగ్ద వాదన చేశాడుగాని మీరు అన్నట్టు అది అవాదం కాదేమో! నా ఈ అన్వయంలో ఏదన్నా తప్పుంటే చెప్పండి.
గురించి శంకర భాష్యం ఇలా ఉంది: “అర్జునా! వేదములు ఈ సంసారమే విషయముగా గలవి. నీవు నిష్కాముడవును, ద్వంద్వములను వదలినవాడవును, నిత్య సత్వగుణము గలవాడవునూ, ఆత్మజ్ఞానము కలవాడవును కోరికలేనివాడవును నగుము.”
అయితే ఇదే శ్లోకానికి మధ్వాచార్యులు భాష్యం చేస్తూ ఆ త్రిగుణాలు వేదాలలో పైకి కనిపించే అర్దం మాత్రమే అన్నారు.
“యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే..” అన్న శ్లోకం గురించి మధ్వాచార్యులు ఇలా చెప్పారు: “వేదాలలో చెప్పిన ఫలమంతా బ్రాహ్మణునిలో నంతర్భవించును. బ్రాహ్మమును పొందువాడు బ్రాహ్మణుడు. బాహ్మపరోక్షజ్ఞానము గలవాడు బ్రాహ్మణుడు. అది జ్ఞానమువలన కలుగును”
దీనికే శంకర భాష్యం “సమస్తవేదములయందు చెప్పబడిన కర్మలననుష్ఠించడంవల్ల గలుగు ఫలము అంతకన్నను మిక్కిలి గొప్పదైన జ్ఞానముగల బ్రహ్మజ్ఞానికి గలుగు మోక్షరూపఫలములో నంతర్భావము నొందును” గా ఉన్నది.
***
@సురేష్ గారు,
నాకు రచయిత్రి భాషా పరిజ్ఞానం గురించి సందేహాలు లేవండి. ఉన్న సంశయమల్లా ఆమె అన్వయాలు సబబుగా ఉన్నాయా, వాటిని అన్వయించడంలో ఆవిడ నిజాయితీగా ఉన్నారా లేదా అని. రామాయణంలోంచి మీరు ఉదహరించిన శ్లోకాలలో చూసినా “మహారాజు నేడు దుఃఖం అనుభవిస్తుంటాడు”, “అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది” అని కోరిక (this need not necessarily be lust .. భార్యపై ఉండే సహజమైన ఆసక్తి ఇష్టం కావచ్చు) వల్లనే నేడు మహారాజు దుఃఖితుడై ఉన్నాడని చెప్పిన రాముడు/లక్ష్మణుడితో దశరథుడిని explicit గా sex-addict అని చెప్పించడం కరెక్టేనా అని.
మంచి వ్యాసం.
కందంలో ప్రథమార్థం ఉత్తరార్థంలోనికి చొచ్చుకు రాకుండా ఉంటే బాగుంటుందని హెచ్చుమంది భావన. చాదస్తంగా పాటించనవసరం లేదు గాని వీలైనంతవరకూ పాటించితేనే బాగుంటుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి J K Mohana Rao అభిప్రాయం:
03/05/2014 4:40 pm
నా అభిప్రాయములు క్రింది అభిప్రాయములకు మాత్రమే పరిమితము –
1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
కైకేయికి ఈ వరములను గురించి తెలుసు. ఆమెకు కూడ రాముడంటే ప్రీతి, వాత్సల్యము. పట్టాభిషేకమునకు ముందే పుత్రశోక శాపము దశరథుడు అనుభవిస్తే తరువాత రాజ్యపాలన ఎట్టి కష్టము లేకుండ సాగిపోతుంది కాబట్టి ఆ వరములను కైక అడిగినట్లు భాసమహాకవి ప్రతిమా నాటకములో, యజ్ఞఫలనాటకములో వివరిస్తాడు. తన తొట్రుబాటులో 14 రోజులు అనడానికి బదులు 14 ఏండ్లు అంటుంది ఆమె. The rest is history. కాని మునిశాపమును దశరథుడు అనుభవించడమును కైకేయి ఆపలేక పోతుంది. వాల్మీకి రామాయణములో సీత లక్ష్మణుని సందేహించడము ఆమె పాత్రలో లోపమా? విధేయుడు – మోహన
డిటెక్టివ్ నీలూ గురించి Kamal అభిప్రాయం:
03/05/2014 4:21 pm
Wow just wow. Loved it so much thank you
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam అభిప్రాయం:
03/05/2014 4:19 pm
Why the Wendy Doniger episode is not a free speech issue
http://www.firstpost.com/india/why-the-wendy-doniger-episode-is-not-a-free-speech-issue-1388751.html
[Note to commenters: Please refrain from posting article links without an original opinion, or a comment for them to be a part of. No further posts with only links to essays on the web are allowed – Ed.]
కోనసీమ కథలు: శిరోముండనం గురించి Kamal అభిప్రాయం:
03/05/2014 3:28 pm
ఈ కథ చదివి ఏడ్చాను. నాకు కర్తవ్యం గుర్తుకు వచ్చింది.
బల్లి ఫలితం గురించి Kamal అభిప్రాయం:
03/05/2014 3:15 pm
ఛాలా బాగుంది. కథ కొత్తగా చెప్పారు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/05/2014 3:12 pm
Some links on this issue that could be educative to readers:
1. Rajiv Malhotra’s interview to Rediff.com on this issue:
http://www.rediff.com/news/slide-show/slide-show-1-when-westerners-make-fun-of-our-gods-theyre-instigating-trouble/20140217.htm
2. Kanchan Gutpa’s article on this matter in Niti Central on the hypocrisy of the “liberals”
http://www.niticentral.com/2014/02/12/wendy-doniger-hindus-and-fraudulent-left-liberals-189575.html
There are more links on this in Niti Central on this subject (search using Wendy Doniger)
3. List of books that are banned/unimportable in India:
http://en.wikipedia.org/wiki/List_of_books_banned_in_India
4. Univ of Chicago site link summarizing the issue of western interpretations of Hinduism. It also discusses the views of Rajiv Malhotra
http://magazine.uchicago.edu/0412/features/
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు అభిప్రాయం:
03/05/2014 2:57 pm
నాగరాజు గారు,
గీత పై శంకర-మధ్వ భాష్యాలపై మీరడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ముందు ఒక విషయాన్ని పంచుకోదలిచాను.
మన ధార్మిక గ్రంథాల విశ్లేషణ చేసే సందర్భంలో విశ్లేషకులు రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి:
1. ప్రసంగం
2. ప్రసక్తి
ఒక ప్రసంగంలో ఎన్నో ప్రసక్తులు ఉంటాయి. ఉదా: రామాయణంలోని రామ వనవాసం. ఈ ప్రసంగం పుట్టడానికి ఎన్ని ప్రసక్తులు అవసరమయ్యయో చూడాలి.
సురేశ్ గారు దశరథుని కాముకత్వం వల్ల వనవాస ప్రసంగం పుట్టుకొచ్చిందన్నట్టుగా వ్రాసారు. అది చదివిన వారికి మరే ప్రసక్తి లేనట్టుగా అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఐదు ప్రసక్తులు ఉన్నాయి:
1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
3. మంథర – కైకేయి సంభాషణ.
4. ఎప్పుడో ఇచ్చిన వరాలను రామ పట్టాభిషేక సమయంలోనే కైక అడగడం.
5. వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షి నిర్ధారించిన పట్టాభిషేక ముహూర్తం విఫలమవడం.
పైవన్నీ ఒక్క బిందువు దగ్గర కలిసినప్పుడే వనవాస ప్రసంగం సంభవనీయమైంది. ఇందులో ఏ ఒక్క ప్రసక్తిని వదిలినా ప్రసంగంలోని పరమార్థం మాయమైపోతుంది. ప్రస్తుతం వెండీ గాని, సురేశ్ గారు గాని చేసినది ఇదే. ఏదో ఒకటి రెండు శ్లోకాలను తీసుకొని అందులోని మాటలే సిద్ధాంతమని అనుకోవడం పొరబాటు.
పై నేపధ్యంలో అర్జున విషాదాన్ని, నిర్వేదాన్ని ఒకటి, రెండు భగవద్గీత శ్లోకాలతోనే సరిపెట్టాలని చూస్తే అది విపరీతార్థాలకు దారి తీస్తుంది. బంధువుల్ని చంపలేనని ఏడ్చిన అర్జునుడు కృష్ణప్రబోధంతో యుద్ధానికి మళ్ళాడు. కానీ అభిమన్యుని మరణంతో మళ్ళీ దుఃఖించి యుద్ధం మధ్యలోనే అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడు. అంతకు మునుపు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కృష్ణుడి మీద అహంకరించాడు. ఇలా ఎన్నెన్నో ప్రసక్తుల్ని చేర్చి అర్జునుడిని ఉద్దేశ్యించి గీతలో కృష్ణుడు వాడిన పదాలను విశ్లేషించాలి.
రెండో అధ్యాయం మొదట్లోనే కృష్ణుడు “క్లైబ్యం మాస్మ గమః పార్థ” అని అర్జునుణ్ణి మందలిస్తాడు. క్లైబ్యం అంటే నపుంసకత్వమని అర్థం కదా! మరి అర్జునుడు నపుంసకుడా? కానప్పుడు ఆ పదాన్ని కృష్ణుడు ఎందుకు వాడాడు? – ఇవన్నీ అర్థం కావాలంటే భారత యుద్ధం వరకూ గల అర్జునుని వ్యవహారాలన్నింటినీ సమీక్షించాలే తప్ప ఒక్క యుద్ధ ప్రసంగంతోనే నిర్ధారణలకు రాకూడదు.
ఇక మీరుదహరించిన మధ్వభాష్యపు తెలుగు అనువాదం సరికాదని నా అనుమానం. మూల సంస్కృత భాష్యం ఇలా ఉంది:
“తత్ర సేనయోర్మధ్యే్ బాంధవాదిమోహజాలసంవృతం వశీదంత అర్జునం భగవాన్ ఉవాచ – ప్రజ్ఞావాదాన్ స్వమనీషోత్థవచనాని | కథమ్ అశోచ్యా? గతాసూన్”
పై దానిలో ప్రజ్ఞావాదాన్ అన్నదానిని “స్వమనీషోత్థవచనాని” అని వివరించారు. అంటే మానుషబుద్ధికి తోచిన మాటలని అర్థం. ప్రజ్ఞావాదానికి “స్వమనీషోత్థవచనాని” అన్న అర్థాన్ని ఎలా సాధించాలి? అని ప్రశ్నిస్తే “గతాసూన్” పదాన్ని గత + అసూన్ అని విడదీసినట్టుగానే ప్రజ్ఞ+అవాద అని విడదీయలన్నారు ఆచార్యుల వారు.
ఐతే ప్రజ్ఞావాదంను ప్రజ్ఞ+అవాదం అని ఎందుకు విడదీయాలన్నదే ముఖ్య విషయం.
దీనికి నా సమాధానం:
ప్రజ్ఞావాదం = పండిత వచనాలు అని భావిస్తే, “నాను శోచంతి పండితాః” లోని పండిత పదం రావడం వల్ల పునరుక్తి దోషాన్ని ఆపాదించాల్సివస్తుంది. తద్దోష పరిహారార్థంగా ప్రజ్ఞావాదాన్ని అశోచ్యా అన్న పదంతో బాటూ చదవాలని మధ్వచార్యులు సూచించారు. అశోచ్యా అంటే ఆలోచనకు అనర్హమైనదని అర్థం. మీరన్నట్టు అర్జునుడివి పండిత వచనాలైతే అవి శోచ్యాలే గానీ అశోచ్యాలు కాలేవు. కనుక ప్రజ్ఞావాదాన్ని ప్రజ్ఞ+అవాద గా విడదీసి ప్రజ్ఞావాదమంటే అశాస్త్రీయమైన మాటలని, అవి అనర్హమైనవని (అశోచ్యా) తెలుసుకోవాలని మధ్వుల భావన.
మిగతాది రేపు కొనసాగిస్తాను….ధన్యవాదాలు.
అమ్మ గురించి MIRALI KRISHNA MANDALA అభిప్రాయం:
03/05/2014 1:51 pm
కథ చాలా బాగుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి ..nagarjuna.. అభిప్రాయం:
03/05/2014 1:17 pm
@రఘోత్తమరావు గారు, ప్రజ్ఞావాదం గురించి గీతలో మీరు ఉదహరించిన శ్లోకానికి ముందర శ్లోకం,
శ్లో: “తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత,
నేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః”
కు మధ్వాచార్యుల భాష్యం ఈ విధంగా ఉంది: జ్ఞానవంతుడైన నీ కిట్టి దుర్భుద్ది ఎట్లు కలిగెనని పరిహాసము చేయుచు అర్జునుని జూచి ఈ వాక్యమును పలికెను.
ఆ తరువాత వచ్చే శ్లోకం
శ్లో.అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భషసే,
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః
ఈ రెండింటినీ కలిపి చూస్తే, “బంధువులనూ పూజ్యులనూ ధర్మం నేర్పిన గురువులనూ చంపి రాజ్యం చేజిక్కించుకోవడం కంటే త్యజించి బిచ్చమెత్తుకోవడం శ్రేయస్కరం కదా, ఆలోచించు. ఏం చేయాలో నీవే చెప్పు” అన్న అర్జునుడితో కృష్ణుడు “పండితులైనవారు బ్రతికున్నవారిని గురించిగాని, చనిపోయినవారిని గురించిగాని దుఃఖింపరు. నువ్వు పండిత వచనాలు పలుకుతూ (పరిహాసంగా) కూడనివాటిని గురించి దుఃఖిస్తున్నావు” అన్నాడు. ఈ విధంగా చూసినపుడు కర్మధర్మాలలో అభిమానం కలిగి ఉండిన అర్జునుడు ఇతర శ్రుతులకు పలుకుతూ సందిగ్ద వాదన చేశాడుగాని మీరు అన్నట్టు అది అవాదం కాదేమో! నా ఈ అన్వయంలో ఏదన్నా తప్పుంటే చెప్పండి.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)
గురించి శంకర భాష్యం ఇలా ఉంది: “అర్జునా! వేదములు ఈ సంసారమే విషయముగా గలవి. నీవు నిష్కాముడవును, ద్వంద్వములను వదలినవాడవును, నిత్య సత్వగుణము గలవాడవునూ, ఆత్మజ్ఞానము కలవాడవును కోరికలేనివాడవును నగుము.”
అయితే ఇదే శ్లోకానికి మధ్వాచార్యులు భాష్యం చేస్తూ ఆ త్రిగుణాలు వేదాలలో పైకి కనిపించే అర్దం మాత్రమే అన్నారు.
“యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే..” అన్న శ్లోకం గురించి మధ్వాచార్యులు ఇలా చెప్పారు: “వేదాలలో చెప్పిన ఫలమంతా బ్రాహ్మణునిలో నంతర్భవించును. బ్రాహ్మమును పొందువాడు బ్రాహ్మణుడు. బాహ్మపరోక్షజ్ఞానము గలవాడు బ్రాహ్మణుడు. అది జ్ఞానమువలన కలుగును”
దీనికే శంకర భాష్యం “సమస్తవేదములయందు చెప్పబడిన కర్మలననుష్ఠించడంవల్ల గలుగు ఫలము అంతకన్నను మిక్కిలి గొప్పదైన జ్ఞానముగల బ్రహ్మజ్ఞానికి గలుగు మోక్షరూపఫలములో నంతర్భావము నొందును” గా ఉన్నది.
***
@సురేష్ గారు,
నాకు రచయిత్రి భాషా పరిజ్ఞానం గురించి సందేహాలు లేవండి. ఉన్న సంశయమల్లా ఆమె అన్వయాలు సబబుగా ఉన్నాయా, వాటిని అన్వయించడంలో ఆవిడ నిజాయితీగా ఉన్నారా లేదా అని. రామాయణంలోంచి మీరు ఉదహరించిన శ్లోకాలలో చూసినా “మహారాజు నేడు దుఃఖం అనుభవిస్తుంటాడు”, “అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది” అని కోరిక (this need not necessarily be lust .. భార్యపై ఉండే సహజమైన ఆసక్తి ఇష్టం కావచ్చు) వల్లనే నేడు మహారాజు దుఃఖితుడై ఉన్నాడని చెప్పిన రాముడు/లక్ష్మణుడితో దశరథుడిని explicit గా sex-addict అని చెప్పించడం కరెక్టేనా అని.
కంద పద్యగాథ – 1 గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/05/2014 12:59 pm