శ్రీ తమ్మినేని : సహృదయతతో మీరిచ్చిన వివరణకు ధన్యవాదాలు. ఒక మాట – మీకు తెలియనిది కాదు కానీ – చూడగలగటమూ (visualising a result), చూపగలగటమూ (proving it) రెండూ వేరు వేరు ప్రతిభలు. ప్రూవ్ చేయటం అన్నది నిపుణులకు ఆమోదయోగ్యమైన పద్ధతి /పద్ధతులలో ఉండాలి. చూడటానికి పద్ధతులు లేవు. చూడగలగటంలో రామానుజన్ది – మీరన్నట్టు – విలక్షణమైన ప్రతిభ. ప్రూవ్ చేయటం అంటే చూసిన దానిని నిజమని / కాదని నిర్ధారించటం. ఈ నిరూపణాద్వంద్వానికి రామానుజన్ అతీతుడు. దీనికి కారణం అతనికి మాత్రమే ప్రత్యేకమైన అతని నిర్మాణం. ఈ కారణంగా మీ ‘నిరూపించనంటావు’ రామానుజన్ విలక్షణమైన వ్యక్తిత్వానికి కొంత భంగం కలిగించిందనిపించి మనస్సు చివుక్కుమన్నది. మీ వివరణ దీన్ని తీసెయ్యలేదు కానీ మీ దృక్కోణాన్ని చాలా చక్కగా వివరించి ఒక మంచి సెమినార్లొ పాల్గొన్న సంతొషాన్ని కలగ చేసింది.
ఈ రెండు వాక్యాల వెనుక చాలా గ్రంథమే ఉంది. రామానుజం తనదైన గణిత ప్రపంచంలో మునిగిపోయినవాడు, అతను లండను వెళ్ళే నాటికి గణిత శాస్త్ర నిరూపణ పద్దతుల మీద అవగాహన లేదు, అంతే కాదు తనకు అవగాహన లేదన్న విషయం కూడా అతనికి తెలియదు. తొలుత ఈ విషయం హార్డీ గమనించాడు. కానీ, సున్నితంగా అతని అసమాన ప్రతిభ కు భంగం కలుగని రీతిలో బోధ పరుస్తూ వచ్చాడు, రామానుజం నెమ్మదిగా ఈ విషయం అర్థం చేసుకున్నాడు ( తన స్నేహితులకు రాసిన ఉత్తరాల్లో ఈ విషయం మనకు విశదం అవుతోంది).
——-
ఈ రెండు వాక్యాలు వీరిద్దరి మధ్య నడచిన చారిత్రక సంభాషణను సూచిస్తాయి
——
పాద పీఠికలు
హార్డీ ఉవాచ :
His ideas as to what constituted mathematical proof were of most shadowy description.All his results, new or old, right or wrong had been arrived at by a process of mingled argument, intuition and induction, of which he was entirely unable to give any coherent account.
లిటిల్ ఉడ్ కొద్ది మాటల్లో :
“The clear-cut idea of what is meant by a proof ,now a days so familiar as to be taken for granted,he perhaps did not possess at all; if a significant piece of reasoning occurred somewhere, and total mixture of evidence and intuition gave him certainty, he looked no further’
——–
రామానుజం కృష్ణారావుకు రాసిన ఉత్తరంలో (1914, నవంబర్)
“I am not going to publish any of my old results in my note books till the war is over.After coming here , I have learned some of their methods. I am trying to get new results by their methods”
సుబ్రహ్మణ్యంకు రాసిన ఉత్తరంలో:
“I am publishing only my present researches as I have not yet proved the results in my notebooks rigorously”
తాజా కలం:
అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే రామానుజం సహజ కవి, అతని హృదయంలోంచి ఉబికి వచ్చింది కవిత్వం. అది లోతైన కవిత్వం అన్న విషయంలో అతని మనసులో ఎటువంటి సంశయాలు లేవు. అది ఏ రకంగా కవిత్వం?? ఏ తరహా కవిత్వం?? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు అతని దగ్గర లేవు. కారణం వ్యుత్పత్తి లోపం, కానీ, హిమాలయశిఖరం అతని ప్రతిభ, హార్డీ లాంటి సహృదయులు సవిమర్శకంగా కవిత్వాన్ని ఆవిష్కరించడం నేర్పారు. అంతే.
శ్రీ తమ్మినేని: పది సంవత్సరాల క్రితం రాసిన మీ ఈ కవితని ఇప్పుడే చూశాను. ఈ genreలొ తెలుగులొ కవితలు రాయటం ఒక సాహసం. మీ కలం మీరు చేసిన సాహసానికి నిజాయితీతొ సహకరించింది. ఒక విషయం: ‘నిరూపించనంటావు’ అని అన్నారు మీ కవితలో, రామానుజన్ ఎప్పుడైనా ‘నిరూపించను’ అని స్పష్టంగా అన్నాడా, కాక పోతే హార్డీ మాటలనుంచి అల్లా అనుకొవచ్చా, లేక కేవలం మీ ఊహాత్మక అభిప్రాయమా? (రాసినది పది సంవత్సరాల క్రితమని తెలిసినా అడుగుతున్నాను).
సాయి గారు, కథ ఆర్ద్రతతో నిండి ఉంది. అమ్మమ్మ పాత్ర చిత్రణ, ఆమె పడిన వేదనని ఆమెని ద్వేషించే పాత్రల చేతే చెప్పించడం నాకు నచ్చింది. చంద్రమతికి ఆమె సలహా-సహాయం, దత్తత గురించి ఆమె అభిప్రాయం,పొలం రాయమని ఎంత వత్తిడి ఉన్నా నిలబడ్డ ఆమె స్ఠైర్యం ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ఆమె వ్యక్తిత్వం ఎలా రాటుదేలిందో కళ్ళకు కట్టింది. అలానే అమ్మమ్మ, చంద్రమతి ,కాచి పాత్రల ద్వారా వితంతువుల పరిస్థితిలో వచ్చిన మార్పుని చక్కగ ప్రతిబింబించారు అనిపించింది.
కానీ,గాజుల జత గురించిన అంశం మాత్రం ఆసాంతం శ్రీరమణ గారి “బంగారు మురుగు” కథని జ్ణప్తికి తెచ్చింది.
అయ్యా కృష్ణ మోహనరావు గారు, నమస్కారములు. కందం గురించి చాల విపులంగా సోదాహరణముగా వివరించారు. మీకు నా ధన్యవాదాలు. కందాలు మందలుగా వందలలో ఉంటాయని తెలుసుకున్నాను.
ఇట్లు భవధీయుడు
డా . కోమలరావు బారువ
శల్య వైద్య నిపుణుడు
శ్రీకాకుళం
No one can beat your style of writing. A very unique way of expressing and creating images in words. I don’t know if there are complex algorithms and depth in your poems. All I know is I get excited while reading your poems. Every word shows me something. Thanks.
ఈ కథలో వర్ణించిన ప్రదేశం నా బాల్యాన్ని బాగ గుర్తు చేసింది. ఎంతో అందమయిన ప్రదేశం. అంతకు మించి సాధరణ జీవన శైలి. నాకు కథలో మీరు ఏమి చెప్పదలచుకున్నారో అన్న కుతూహలం కంటే మీ కథా చిత్రాన్ని చూడటం లో నిమగ్నమయ్యాను. నా బాల్యం లోకి తీసుకెళ్ళారు. కథలో లోతు కోసం మరోసారి చదవక తప్పదు.
“అలాగే సంస్కృత భాగవతంలో రాసక్రీడల శ్లోకాలు చదివిన వారికి ఆ పుస్తకం మీది ముఖచిత్రం అంతా చోద్యంగా అనిపించదు. మచ్చుకు ఈ శ్లోకం అర్థం తెలుసుకోండి:
నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్…”
ఈ వ్యాసం చదువుతున్నానండి. అన్ని సంస్కృత శ్లోకాలకు అర్ధం చెప్పిన వారు, ఈ శ్లోకం అర్ధం మమ్మల్నే తెలుసుకోమన్నారు. ఎలాగండీ తెలుసుకోటం? కృష్ణుడొచ్చి చెపుతాడా?
ఇంతకు ముందోసారి విశ్వనాథ సత్యనారాయణ ఇలానే చేశారు. వసుచరిత్ర కావ్యం, విశ్వనాథ సాయంతో చదువుకుంటున్నప్పుడు, ఆ పుస్తకం మొదట్లోనే ఒక పర్వతం ఒక నదితో ప్రేమలో పడుతుంది. అక్కడి ఒక సన్నివేశం, కవి చమత్కారం, నే చెప్పేది కాదు, ఎవర్నైనా సంప్రదించి తెలుసుకోమని వి.స., ఆదేశం ఇచ్చారు. అది విశ్వనాధ లాటి పండితుడు చెయ్యాల్సిన పనేనా? ఎవరిని వెళ్లి అడగనండీ నేను, ఈ కధలో విషయమేంటి అని, ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టి అడగనా? విశ్వనాథ అంత విపులంగా, రసవంతంగా చెప్పే రచయిత, చెప్పకపోతే ఇంకెవరు చెపుతారు. ఏదో నా ఊహకు తగ్గట్టు ఊహించుకున్నా. అది తప్పో ఒప్పో చెప్పే గురువులేరీ?
అందుకని, ఈసారి ఇక్కడే అడుగుతున్నాను. ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో, పై శ్లోకానికి అనువాదం, దయతో, తెలుగులోగాని, ఇంగ్లీషులో గాని “ఈమాట” పత్రికలో ఇస్తారా. అలాగే, ఈ పుస్తకం అట్ట మీది వర్ణ చిత్రం గురించి కూడా, తెలిసినవారు వివరాలు ఇవ్వండి. ఈ పెయింటింగ్ నాకు మహా ఆకర్షణీయంగా ఉంది.
లైలా
Ps: Isn’t it time to give page numbers to the opinions on a writing in eemaata? Looks like scrolling days are over for opinions. This e-Magazine needs to make browsing opinions, just as efficient as browsing articles. Who knows what gets read more in the long run?
రామానుజం (1887-1920) గురించి తఃతః అభిప్రాయం:
04/28/2014 4:11 pm
శ్రీ తమ్మినేని : సహృదయతతో మీరిచ్చిన వివరణకు ధన్యవాదాలు. ఒక మాట – మీకు తెలియనిది కాదు కానీ – చూడగలగటమూ (visualising a result), చూపగలగటమూ (proving it) రెండూ వేరు వేరు ప్రతిభలు. ప్రూవ్ చేయటం అన్నది నిపుణులకు ఆమోదయోగ్యమైన పద్ధతి /పద్ధతులలో ఉండాలి. చూడటానికి పద్ధతులు లేవు. చూడగలగటంలో రామానుజన్ది – మీరన్నట్టు – విలక్షణమైన ప్రతిభ. ప్రూవ్ చేయటం అంటే చూసిన దానిని నిజమని / కాదని నిర్ధారించటం. ఈ నిరూపణాద్వంద్వానికి రామానుజన్ అతీతుడు. దీనికి కారణం అతనికి మాత్రమే ప్రత్యేకమైన అతని నిర్మాణం. ఈ కారణంగా మీ ‘నిరూపించనంటావు’ రామానుజన్ విలక్షణమైన వ్యక్తిత్వానికి కొంత భంగం కలిగించిందనిపించి మనస్సు చివుక్కుమన్నది. మీ వివరణ దీన్ని తీసెయ్యలేదు కానీ మీ దృక్కోణాన్ని చాలా చక్కగా వివరించి ఒక మంచి సెమినార్లొ పాల్గొన్న సంతొషాన్ని కలగ చేసింది.
తఃతః
రామానుజం (1887-1920) గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
04/27/2014 11:45 pm
ఉభయ కవితా విసర్గులకు నమస్సులు.
ఈ రెండు వాక్యాల వెనుక చాలా గ్రంథమే ఉంది. రామానుజం తనదైన గణిత ప్రపంచంలో మునిగిపోయినవాడు, అతను లండను వెళ్ళే నాటికి గణిత శాస్త్ర నిరూపణ పద్దతుల మీద అవగాహన లేదు, అంతే కాదు తనకు అవగాహన లేదన్న విషయం కూడా అతనికి తెలియదు. తొలుత ఈ విషయం హార్డీ గమనించాడు. కానీ, సున్నితంగా అతని అసమాన ప్రతిభ కు భంగం కలుగని రీతిలో బోధ పరుస్తూ వచ్చాడు, రామానుజం నెమ్మదిగా ఈ విషయం అర్థం చేసుకున్నాడు ( తన స్నేహితులకు రాసిన ఉత్తరాల్లో ఈ విషయం మనకు విశదం అవుతోంది).
——-
ఈ రెండు వాక్యాలు వీరిద్దరి మధ్య నడచిన చారిత్రక సంభాషణను సూచిస్తాయి
——
పాద పీఠికలు
హార్డీ ఉవాచ :
His ideas as to what constituted mathematical proof were of most shadowy description.All his results, new or old, right or wrong had been arrived at by a process of mingled argument, intuition and induction, of which he was entirely unable to give any coherent account.
లిటిల్ ఉడ్ కొద్ది మాటల్లో :
“The clear-cut idea of what is meant by a proof ,now a days so familiar as to be taken for granted,he perhaps did not possess at all; if a significant piece of reasoning occurred somewhere, and total mixture of evidence and intuition gave him certainty, he looked no further’
——–
రామానుజం కృష్ణారావుకు రాసిన ఉత్తరంలో (1914, నవంబర్)
“I am not going to publish any of my old results in my note books till the war is over.After coming here , I have learned some of their methods. I am trying to get new results by their methods”
సుబ్రహ్మణ్యంకు రాసిన ఉత్తరంలో:
“I am publishing only my present researches as I have not yet proved the results in my notebooks rigorously”
తాజా కలం:
అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే రామానుజం సహజ కవి, అతని హృదయంలోంచి ఉబికి వచ్చింది కవిత్వం. అది లోతైన కవిత్వం అన్న విషయంలో అతని మనసులో ఎటువంటి సంశయాలు లేవు. అది ఏ రకంగా కవిత్వం?? ఏ తరహా కవిత్వం?? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు అతని దగ్గర లేవు. కారణం వ్యుత్పత్తి లోపం, కానీ, హిమాలయశిఖరం అతని ప్రతిభ, హార్డీ లాంటి సహృదయులు సవిమర్శకంగా కవిత్వాన్ని ఆవిష్కరించడం నేర్పారు. అంతే.
తమ్మినేని యదుకుల భూషణ్
రామానుజం (1887-1920) గురించి తఃతః అభిప్రాయం:
04/27/2014 2:34 pm
శ్రీ తమ్మినేని: పది సంవత్సరాల క్రితం రాసిన మీ ఈ కవితని ఇప్పుడే చూశాను. ఈ genreలొ తెలుగులొ కవితలు రాయటం ఒక సాహసం. మీ కలం మీరు చేసిన సాహసానికి నిజాయితీతొ సహకరించింది. ఒక విషయం: ‘నిరూపించనంటావు’ అని అన్నారు మీ కవితలో, రామానుజన్ ఎప్పుడైనా ‘నిరూపించను’ అని స్పష్టంగా అన్నాడా, కాక పోతే హార్డీ మాటలనుంచి అల్లా అనుకొవచ్చా, లేక కేవలం మీ ఊహాత్మక అభిప్రాయమా? (రాసినది పది సంవత్సరాల క్రితమని తెలిసినా అడుగుతున్నాను).
నమస్కారాలతో – తఃతః
కోనసీమ కథలు: శిరోముండనం గురించి vamshi అభిప్రాయం:
04/25/2014 3:54 am
సాయి గారు, కథ ఆర్ద్రతతో నిండి ఉంది. అమ్మమ్మ పాత్ర చిత్రణ, ఆమె పడిన వేదనని ఆమెని ద్వేషించే పాత్రల చేతే చెప్పించడం నాకు నచ్చింది. చంద్రమతికి ఆమె సలహా-సహాయం, దత్తత గురించి ఆమె అభిప్రాయం,పొలం రాయమని ఎంత వత్తిడి ఉన్నా నిలబడ్డ ఆమె స్ఠైర్యం ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ఆమె వ్యక్తిత్వం ఎలా రాటుదేలిందో కళ్ళకు కట్టింది. అలానే అమ్మమ్మ, చంద్రమతి ,కాచి పాత్రల ద్వారా వితంతువుల పరిస్థితిలో వచ్చిన మార్పుని చక్కగ ప్రతిబింబించారు అనిపించింది.
కానీ,గాజుల జత గురించిన అంశం మాత్రం ఆసాంతం శ్రీరమణ గారి “బంగారు మురుగు” కథని జ్ణప్తికి తెచ్చింది.
కంద పద్యగాథ – 1 గురించి Komalarao baruva అభిప్రాయం:
04/24/2014 10:28 am
అయ్యా కృష్ణ మోహనరావు గారు, నమస్కారములు. కందం గురించి చాల విపులంగా సోదాహరణముగా వివరించారు. మీకు నా ధన్యవాదాలు. కందాలు మందలుగా వందలలో ఉంటాయని తెలుసుకున్నాను.
ఇట్లు భవధీయుడు
డా . కోమలరావు బారువ
శల్య వైద్య నిపుణుడు
శ్రీకాకుళం
ఉగాది పాటలు గురించి CH RAVINDER అభిప్రాయం:
04/23/2014 6:32 am
Excellent.
వాళ్ళు రాక ముందు గురించి Seetha అభిప్రాయం:
04/22/2014 6:51 pm
No one can beat your style of writing. A very unique way of expressing and creating images in words. I don’t know if there are complex algorithms and depth in your poems. All I know is I get excited while reading your poems. Every word shows me something. Thanks.
మంచు గురించి Seetha అభిప్రాయం:
04/22/2014 7:33 am
ఈ కథలో వర్ణించిన ప్రదేశం నా బాల్యాన్ని బాగ గుర్తు చేసింది. ఎంతో అందమయిన ప్రదేశం. అంతకు మించి సాధరణ జీవన శైలి. నాకు కథలో మీరు ఏమి చెప్పదలచుకున్నారో అన్న కుతూహలం కంటే మీ కథా చిత్రాన్ని చూడటం లో నిమగ్నమయ్యాను. నా బాల్యం లోకి తీసుకెళ్ళారు. కథలో లోతు కోసం మరోసారి చదవక తప్పదు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి lyla yerneni అభిప్రాయం:
04/21/2014 8:56 pm
ఈ వ్యాసం చదువుతున్నానండి. అన్ని సంస్కృత శ్లోకాలకు అర్ధం చెప్పిన వారు, ఈ శ్లోకం అర్ధం మమ్మల్నే తెలుసుకోమన్నారు. ఎలాగండీ తెలుసుకోటం? కృష్ణుడొచ్చి చెపుతాడా?
ఇంతకు ముందోసారి విశ్వనాథ సత్యనారాయణ ఇలానే చేశారు. వసుచరిత్ర కావ్యం, విశ్వనాథ సాయంతో చదువుకుంటున్నప్పుడు, ఆ పుస్తకం మొదట్లోనే ఒక పర్వతం ఒక నదితో ప్రేమలో పడుతుంది. అక్కడి ఒక సన్నివేశం, కవి చమత్కారం, నే చెప్పేది కాదు, ఎవర్నైనా సంప్రదించి తెలుసుకోమని వి.స., ఆదేశం ఇచ్చారు. అది విశ్వనాధ లాటి పండితుడు చెయ్యాల్సిన పనేనా? ఎవరిని వెళ్లి అడగనండీ నేను, ఈ కధలో విషయమేంటి అని, ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టి అడగనా? విశ్వనాథ అంత విపులంగా, రసవంతంగా చెప్పే రచయిత, చెప్పకపోతే ఇంకెవరు చెపుతారు. ఏదో నా ఊహకు తగ్గట్టు ఊహించుకున్నా. అది తప్పో ఒప్పో చెప్పే గురువులేరీ?
అందుకని, ఈసారి ఇక్కడే అడుగుతున్నాను. ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో, పై శ్లోకానికి అనువాదం, దయతో, తెలుగులోగాని, ఇంగ్లీషులో గాని “ఈమాట” పత్రికలో ఇస్తారా. అలాగే, ఈ పుస్తకం అట్ట మీది వర్ణ చిత్రం గురించి కూడా, తెలిసినవారు వివరాలు ఇవ్వండి. ఈ పెయింటింగ్ నాకు మహా ఆకర్షణీయంగా ఉంది.
లైలా
Ps: Isn’t it time to give page numbers to the opinions on a writing in eemaata? Looks like scrolling days are over for opinions. This e-Magazine needs to make browsing opinions, just as efficient as browsing articles. Who knows what gets read more in the long run?
అనగా అనగా ఒకరాత్రి గురించి G vijay Kumar అభిప్రాయం:
04/19/2014 9:42 am
కథా కథనము బాగుంది. భావుకత్వము బాగుంది.కాని, సరైన పొందిక లేదు అనిపిస్తుంది.