పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. మరి నువ్వేమో… గురించి Ismail అభిప్రాయం:

    05/01/2014 2:59 pm

    అనంత విశ్వాన్ని ఓ పరమాణువులో ఇమిడ్చారుగా! Nice.

  2. మరి నువ్వేమో… గురించి వేణూశ్రీకాంత్ అభిప్రాయం:

    05/01/2014 2:43 pm

    చాలా బాగుంది నిషీ.

  3. మరి నువ్వేమో… గురించి మధురవాణి అభిప్రాయం:

    05/01/2014 2:26 pm

    Very Beautiful!

  4. మరి నువ్వేమో… గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    05/01/2014 1:57 pm

    బాగుంది. ఏది బాగుంది అని అడిగితే చెప్పడం కొంచెం కష్టమే

    అభినందనలు

  5. త్రికాల సంపుటి త్రిపుర గురించి కె. కె. రామయ్య అభిప్రాయం:

    05/01/2014 10:18 am

    ఆయననొక విలక్షణ, విశిష్ట, విభిన్న, విపరీత, విధ్వంస రచయితగా మనకి మనం తెలిపేసుకున్నాక ఇంకేముంటాయి ఆ కథల్లో? ఇందులో అనుభవం, జ్ఞాపకం, చైతన్యం, పశ్చాత్తాపం, క్షమ, ధైర్యం, సాహసం ఉంటాయి.

    త్రిపుర కథలు ఆలోచనా స్రవంతులు కావు. జీవితానుభవాల స్రవంతులు అని కూడా ఒక భావన కలుగుతుంది. పరివర్తనీయత, ప్రవాహశీలత అనే గుణాలు రెండూ పాత్రల చైతన్యంలోనూ, అనుభవంలోనూ కనిపిస్తాయి.

    కాలం, అనుభవం, చైతన్యం- ఈ మూడూ త్రిపురలో, కథల్లో ముప్పేటలుగా, మూడు పాయలుగా అల్లుకొని ఉంటాయి..

    త్రిపుర కథలను వాటి తాత్త్విక మూలాల్లోంచి బోధపరచుకోవాలంటే అస్తిత్వవాదం, అసంబద్ధవాదం, ధ్యానబౌద్ధం మాత్రమే ఉపకరించవు. బెర్గ్‌సన్‌ ప్రతిపాదించిన కాలం, జ్ఞాపకం, చైతన్యం అనే భావనల గురించిన స్థూల సంవేదన కూడా అవసరం.

    త్రిపుర కథాసృజన మూలాలకున్న తాత్త్విక సిద్ధాంతాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆయనను మరింతగా బోధపరచుకోవడానికి వీలు కలుగుతుంది.

    త్రిపుర కధల గురించి ఇంత విశ్లేష్ణాత్మకమైన వ్యాసం ఇచ్చిన సీతారం గారికి ( డా. రావులపాటి సీతారామారావు, Son of Maanikyam Poetry Book fame గారికి ) హృదయపూర్వక కృతజ్ఞతలు. త్రిపుర కధల పుస్తకం మూడో ముద్రణ లో కనక ప్రసాద్ గారు రాసిన అద్భుతమైన విశ్లేష్ణాత్మక వ్యాసం “గురుప్రసాద శేషం” యీ సందర్భంలో స్పురణకు వస్తున్నది. త్రిపుర గారి ప్రధమ వర్ధంతి (మే 24, 2014 ) సందర్భంగా యీ వ్యాసానిచ్చిన ఈమాట సంపాదకులకు కృతజ్ఞతలు.

  6. కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/01/2014 8:36 am

    “పైకి ఎన్ని సుద్దులు చెప్పినా లోపల మనం ఇంకా బూజు పట్టిన మనుషులమే!” – చాలా బాగా అన్నారు. బావుందండీ కథ. అభినందనలు.

  7. మరి నువ్వేమో… గురించి అఫ్సర్ అభిప్రాయం:

    05/01/2014 8:23 am

    నిషి: చాలా వున్నాయి నచ్చిన వాక్యాలు! వాక్యాలే కవిత్వం కాకపోవచ్చు కాని, ఎందుకో ముందు వాక్యాల దగ్గిరే ఆగిపోతాను. ఇదిగో, ముందు ఇక్కడ ఆగిపోయాను:

    భద్రతలూ భరోసాల బరువు మాటలేమో కానీ
    నాకోసమే మౌనంగా వెలిగే స్థిమితానివి నువ్వు

    తరవాత మళ్ళీ మిగతా పోయెమ్ మొదటి నించీ చదువుకుంటూ వెళ్లాను. కవిత్వం ఫిలాసఫీ చెప్పడం నాకు అట్టే నచ్చదు. మీరు ఫిలాసఫీ చెప్పరు కానీ, కాసేపు ఆ తాత్విక ఛాయలో నిలబెడ్తారు చదువరిని తెరువరిని చేసి!

    ఇటీవలి మీ కవితల్లో నాకు నచ్చిన కవిత ఇది!

  8. రామానుజం (1887-1920) గురించి తఃతః అభిప్రాయం:

    05/01/2014 7:09 am

    శ్రీ తమ్మినేని: మిమ్మల్నినొప్పిస్తే మన్నించండి. రామానుజన్ సంగతి అటుంచితే (గణిత)శాస్త్రవేత్తలెవరయినా “నిరూపించను” అని అంటారని నేననుకోను. ఫెర్మా తను చూసిన ఒక రిసల్ట్ కి -1630 లలో- “నా దగ్గర ప్రూఫ్ ఉన్నది గానీ దాన్ని రాయటానికి ఇక్కడున్నచోటు చాలదు.” అన్నాడన్న విషయం ప్రసిద్ధం. అలా అన్న 350 సంవత్సరాల తర్వాత -ఇతరులు రాసిన- నూరు పేజీల నిడివి గల ప్రూఫ్ వెలువడింది. ఈ సంగతి మీకు తెలిసేవుంటుంది.

    నమస్కారాలతో- తఃతః

  9. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఉషారాణి నూతులపాటి అభిప్రాయం:

    04/29/2014 2:24 pm

    దమయంతి గారూ, చాలా చక్కటి అనుభూతిని మిగిల్చింది మీ కథ. ఇలాంటి మార్పు నేటి తరం యువతకి చాలా అవసరం. పాశ్చాత్య ధోరణుల వడిలో కొట్టుకు పోతున్న నేటి తరానికి అనుబంధాల విలువలు తెలియాల్సిన అవసరం ఎంతో వుంది. దాన్ని అందమైన ఉత్తరం రూపంలో, చక్కటి కథగా అల్లి చెప్పారు. నాకు నచ్చింది. మీ శైలి చాలా బావుంది. అభినందనలు.

  10. రచయితలకు సూచనలు గురించి pavankumar kodam అభిప్రాయం:

    04/29/2014 6:59 am

    నా కవిత సంకలనం ‘సగం సగం కలసి’ సమీక్షకు పంపాలి. వివరాలు తెలుపగలరు