పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి మోహన అభిప్రాయం:

    07/02/2014 7:34 am

    కవితాప్రసాద్ గారు, వ్యాసము నచ్చినందులకు సంతోషము.

    మేఘవిస్ఫూర్జిత వృత్తమునకు మందాక్రాంతమునకు పోలికలు ఉన్నవి. మేఘవిస్ఫూర్జితములో ముందున్న లగమును (IU) తొలగించగా మనకు మందాక్రాంత వృత్తము లభించును. ఈ విషయమును నేను “ఆషాఢస్య ప్రథమ దివసే” వ్యాసములోని పట్టికలో చూపియున్నాను. ఈ వృత్తమును గురించి నేను 14 ఫిబ్రవరి 2005 తారీకు మందాక్రాంతమును చర్చించు సమయములో తెలిపియున్నాను. అందులోని విషయాలు –

    మందాక్రాంత – 7

    క్రింద ఒక మందాక్రాంతము-

    ఆనందమ్మై – యమితగతితో – నందమై డెంద మూగున్
    శ్రీనాథా నీ – చిరునగవులే – చిత్రజీవంపు చేవల్
    త్రాణమ్మీయన్ – ద్వరితగతితోఁ – దన్వి ధైర్యమ్ముగా రా
    వేణిన్ బెట్టన్ – బ్రియపు సరులన్ – ప్రేమ వేదమ్ముగా రా

    మందాక్రాంతపు లక్షణములను ఇమిడించుకొన్న మఱొక వృత్తము మేఘవిస్ఫూర్జితము. మందాక్రాంతపు పాదమునకు ముందు ఒక లగమును ఉంచినయెడల మేఘవిస్ఫూర్జితము లభించును.

    మేఘవిస్ఫూర్జితము – 19 అతిధృతి 75714
    గణములు – య మ న స ర ర గ
    తెలుగు యతి – 1, 13
    సంస్కృత యతి – 1, 7, 15

    పై మందాక్రాంతమును మేఘవిస్ఫూర్జితము చేద్దామా- (యతి తెలుగు, సంస్కృతము రెంటికి చెల్లునట్లు వ్రాసినాను.)

    మేఘవిస్ఫూర్జితము-

    హరీ యానందమ్మై – యమితగతితో – నందమై డెంద మూగున్
    సిరుల్ శ్రీనాథా నీ – చిరునగవులే – చిత్రజీవంపు చేవల్
    దరిన్ త్రాణమ్మీయన్ – ద్వరితగతితోఁ – దన్వి ధైర్యమ్ముగా రా
    విరుల్ వేణిన్ బెట్టన్ – బ్రియపు సరులన్ – ప్రేమ వేదమ్ముగా రా

    విధేయుడు – మోహన

  2. భావించేవరకూ… గురించి S A RAHMAN అభిప్రాయం:

    07/02/2014 5:59 am

    ముచ్చటైన కవితంటే కాదనకు [కాదనకండి].
    ఇలాంటిదే మరో కవిత కావాలంటే కుదరదనకు [కుదరదనకండి].

    చిన్ని కవితను అందించిన రచయిత్రి గారికి సంపాదకులు గారికి అభినందనలతో:–

    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.

  3. నేపథ్య సంగీతం గురించి S A RAHMAN అభిప్రాయం:

    07/02/2014 5:33 am

    “సింప్లి సుపర్బ్” ఇంతకు మించి చెప్పాల్సింది లేదు. రచయిత్రి గారికి ధన్యవాదాలు.

    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.

  4. కాలం విలవ తెలీదు గురించి sundaram అభిప్రాయం:

    07/02/2014 1:01 am

    ఈ రచన కవిత్వమా ?

  5. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి Rallabandi kavithaprasad అభిప్రాయం:

    07/01/2014 10:27 pm

    I am very much delighted to read ur articles sir. Your research in the field of chandassastra is exemplary.
    Pl try to explore ‘Megha visphoorjitha vrittham’ in this context,can be comparable with sragdhara.

    We will meet very soon. I am planing to organise a seminar on chandassastram in hyderabad in which i wish you should deliver key note address .

    My sincere regards and appreciations
    Dr.Rallabandi Kavithaprasad
    Director,
    Dept of language and culture
    Govt of Telangana
    Telangana state

  6. సమస్త సిద్ధాంతం అవసరమా? గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    07/01/2014 5:25 pm

    “మన దైనందిన కార్యక్రమాలలో న్యూటన్ సిద్ధాంతాలు చాలు. అవి అర్థం చేసుకోవటం తేలిక. వాటిని వాడటం తేలిక. కళాశాలలో చదువుకునే విద్యార్థులు కూడ అర్థం చేసుకుని వాడగలరు. కనుక ప్రతి చిన్న విషయానికీ ఐన్‌స్టైన్ అక్కరలేదు; గోటితో మీటగలిగేవాటికి గొడ్డలి ఎందుకు?”

    శ్రీ వేమూరి: మీ ఉద్దేశ్యం ఏమైనా ఈ వాక్యాలు – ముఖ్యంగా ‘ప్రతి చిన్న విషయానికీ’ అనటం – న్యూటన్ ని చిన్నబుచ్చుతున్నట్టు లేవా? పైన ‘న్యూటన్ సిద్ధాంతాలు’ అన్నప్పుడు ‘ఐన్‌స్టైన్’ అనికాక ‘ఐన్‌స్టైన్ సిద్ధాంతం’ అని ఊండటం సబబు. పాప్యులర్ సైన్స్ వ్యాసమే అయినా ఇటువంటి లిబర్టీస్ తీసుకోకపోవటం మేలు. కొల్హాపూర్ షివాజీ యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ లంక రాధాక్రిష్ణ గారి పాపులర్ ఉపన్యాసంలో – మూడు పదుల కిందటిది – సరదా ఒకటి గుర్తొస్తోంది.

    ఎవరు గొప్ప? Einstein జర్మన్ భాషలో Ein+Stein = one stone = 14 పౌనులు. Newton= New+Ton ఇంగ్లండులో పాత టన్ను = 2240 పౌనులు, కెనడాలలో కొత్త టన్ను=2000 పౌనులు.

    వాసుదేవ రావు.

    సంపాదకులకు: ఇటువంటివీ – నా చూపుకు- కొంత తీవ్రమైనవీ ఈ వ్యాసంలో కనపడుతున్నాయి. వీటిమీద ఒకే పర్యాయంగా రాయాలంటే ఒక వ్యాసమే అవుతుంది. ఆంత సాహసం చేయలేను. ఒకింత, ఒకింతగా అప్పుడప్పుడు రాస్తాను. ప్రచురించటమా మానటమా అన్నది మీ ఇష్టం.

    వారా

  7. ఒక శతాబ్దకాలంలో భూపరిణామక్రమం: భూచక్రం గురించి Thirupalu అభిప్రాయం:

    07/01/2014 3:56 pm

    రమా సుందరి గారు, మీ సమీక్ష నవలను చదివినట్లు ఉంది. మీరు భూమి మీద చేసిన వ్యాఖ్యానం చాలాబాగుంది- నవలకే వన్నె తెచ్చినట్లు.అభినందనలు.

  8. సమస్త సిద్ధాంతం అవసరమా? గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    07/01/2014 12:24 pm

    శ్రీ వేమూరి: మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. లెక్కల వాళ్ళను మీరు గేలి చేస్తునారన్న ఆలోచన రాలేదు నాకు. నేను, “పైగా …ఉన్నాయి” అన్న వాక్యాన్ని మీరన్న ‘లెక్కల లొ అనంతం వస్తే భరించ లే’ మన్న దానిని గురించి రాశాను. ‘లెక్కల లొ అనంతం’ మీరన్నట్టు భారమైనది కాదు. అనేకములైన అనంతాల గురించి ‘లెక్కలు’ ఊహ చేస్తుంది. శూన్యాన్నిఎలా స్వీకరిస్తుందో లెక్కలు ఈ అనేక అనంతాలను గూడా అలాగే స్వీకరిస్తుంది. ఆ వాక్యాన్ని సవరించ వలసిఉన్నదేమో! మీ వ్యాసాలు ఇష్టంగా చదువుతాను. మరొకసారి చదివి నాకు తోచినవి నిస్సంకోచంగా రాస్తాను.

    వాసుదేవ రావు

  9. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి Katta G. Murty అభిప్రాయం:

    07/01/2014 12:11 pm

    శ్యామల దేవి గారూ: చాలా బాగా చెప్పారు. ఇలాంటి theme లోనే ఒక పద్యం రాశాను, ఇక్కడ చూడండి pages 12-13 లో.

    https://www.natsworld.org/e-newsletter/may-2014/May_2014_Akshara_Deepika.pdf

  10. ఛందం© – తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ గురించి రంగ అభిప్రాయం:

    07/01/2014 11:54 am

    చాలా చక్కగా ఉంది!

    రంగ