చాల బాగుంది. గణిత శాస్త్ర సమస్యని సామాన్య చదువరి కి కూడ అర్థమయ్యే లాగ వివరించారు హనుమంత రావు గారు. మరింత తఱచుగా ఇటువంటి వ్యాసాలు అందించమని శ్రీ హనుమంతరావు గారికి మనవి. ట్యూరింగ్ అమెరికా ప్రయాణం గురించిన రాబోయే వ్యాసం కోసం ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే.
మీ పరిశోధన బహు విస్తారముగా మరియు, ఉపయోగకరముగా యున్నది. ఛందస్సును మధించి మీరు వెలికి తీస్తున్నవి నిజానికి రత్నములే. వాటికి సరియగు సార్ధక నామములనుంచుట మరింత శోభస్కరముగానున్నది. ఇటువంటి పరిశోధనలు చందస్సు నేర్చుకుంటున్న వారికి బాగుగా ఉపయోగపడతాయి. అసలు,మన ఛందోశాస్త్రములో ఎన్నో ఛందో రీతులు మొదలే యుండగా వాటిలో మన పూర్వ కవులు కానీ, ప్రస్తుత కవులు కానీ కొన్నే యుపయోగించుటకు గల కారణమేమయ్యుండునో అనే సందేహము కలుగుతున్నది. ముఖ్యముగ గాన యోగ్యమైన గీతులను చాలా మటుకు నిర్లక్ష్యము చేసినారేమో. ద్విపదలలో వ్రాయబడిన రంగనాధ రామాయణము, ఇంకా, తరిగొండ వెంగమాంబ గారి అనేక ద్విపద రచనలు(రాజయోగ రహస్యము), మొదలగునవి, ఈనాదు కనుమఱుగైనాయి. ఈ నా యొక్క ప్రస్తావన కొంత యసందర్భమముగానుండవచ్చు. కానీ, యిచ్చట నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయమేమనిన, ఛందస్సు, ఛందస్సుతోటి పద్య నిర్మాణముపైన జనబాహుళ్యములో నుత్సాహము సన్నగిల్లు తున్న తరుణములో, మీ వంటి విజ్ఞులు చేయుచున్న యిట్టి పరిశోధనలకు ప్రాయోగికమైన లేదా ఔపయుక్తమైన, పరిస్థితి యుండునా యనునదే నా సందేహము. నాకు మాత్రము యీ పరిశోధనా వ్యాసము మంచి స్పూర్తిని కలిగించింది. ధన్యవాదములు మోహన్ రావు గారు!
నాకు శస్త్ర-సాంకేతిక-మరియు-వైజ్ఞానిక విషయాలను వ్యాసాలుగా వ్రాసినందుకు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు మరియు వేమూరి వెంకటేశ్వర రావు గారి మీద అమూల్యమైన గౌరవం ఉంది. ఈ మధ్య విష్ణుభొట్ల లక్ష్మన్న గారు కూడా ఇలాంటివి వ్రాస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఎప్పటి నుండో వ్రాయాలని అనుకుంటున్నాను.
ఇప్పుడు మీరు ఇంత బాగా వ్రాస్తుండటము చూసి చాలా సంతోషంగా ఉంది.
ఎంతో ఇష్టంతో ఇంత మంచి ఆర్టికల్ ని తెలుగు భాషలో వ్రాసినందుకు తెలుగు వారందరూ మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తోంది. చాలా సమగ్రమైన వ్యాసం. మీ ఓరిమికి, ఇష్టం కి, విషయములో మీ పట్టు కి చాలా ఆశ్చర్యంగాను ఆనందము గాను ఉంది.
1995 జూలై లో ఇండియా బాపు గారితో కలిసి ప్రయాణం చెయ్యడం జరిగింది. మద్రాసు చేరుకునే ముందు బొంబాయి లో 6 గంటల విరామంలో బాపు గారితో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా తెలిసింది, బుచ్చిబాబు ఆయనకు చిన్నాన్న వరసవుతారని. పట్టలేక అడిగేశాను, ఎప్పటికైనా చివరకు మిగిలేది సినిమాగా వచ్చే అవకాశం ఉందా? అని.
నాకు ఎంతగానో నచ్చిన నవలలోని భావాలను చిత్రీకరించగలిగే సామర్ధ్యం ఆ కళాకారుడికి ఒక్కరికే ఉందని నా నమ్మకం.
చాలా సున్నితంగా చెప్పారు, ‘ఎంతో విస్తృతంగా తీసినా గానీ కనీసం 30 శాతం కూడా న్యాయం చేయలేం, ఎవరినీ మెప్పించడం అసాధ్యం’ అని. సంభాషణలు, సంఘటనలు మాత్రమే చూపించగల సినిమాలో అంతటి భావుకత ఉన్న పాత్రల చిత్రీకరణ చూపించడం, న్యాయం చెయ్యగలగడం ఎంత అసంభవమో వివరించారు. వ్యక్తుల హావభావాలు కూడా గొంతు నుండే రావాల్సిన రేడియో నాటకం గురించి వేరే చెప్పాలా? అక్కడికీ పద్మరాజు గారు చాలా జాగ్రత్త పడ్డారు. దయానిధి, అమృతం, కోమలి పాత్రలు ఫర్వాలేదు కానీ, జగన్నాధం (నండూరి సుబ్బారావు), నారయ్య పాత్రలు ఎంతమాత్రమూ సరిపోలేదు. హైస్కూలు చదువుతున్న జగన్నాధం 60 ఏళ్ళ ముసలాడి లాగాను, పనిమనిషి నారయ్య మాట తీరు సంస్కృత పండితుడి మాటల్లాను ఉన్నాయి.
నవలను పరిచయం చేయడానికి ఈ నాటకం ప్రయత్నమేమో గానీ, అంత పేరున్న నవల గురించి, విన్నవారు ‘ఇంతేనా?’ అని పెదవి విరిచే అవకాశం చాలా ఎక్కువ!
ఎంతో బాగుంది ఈ వ్యాసం. అతి క్లిష్టమైన విషయాలను అతి సరళంగా చెప్పటం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి!
మొన్ననే ఎలన్ ట్యూరింగ్ జీవిత చరిత్ర ఆధారంగా విడుదలయిన సినిమా “The Imitation Game” చూసాను. చాలా బాగా తీసారు సినిమా. మీ వ్యాసం కూడా ఎన్నో వివరాలతో చాలా చక్కగా ఉంది.
శ్రీ పరుచూరి: ఒక పాతకాలపు అందాన్ని ఈ సంకలనంతో పంచిపెట్టారు మీరు. చిన్నతనాన విజయవాడ రేడియో స్టేషన్ వరండాల్లో శివరామారావు గారిని చూసిన జ్ఞాపకం.’పడవ నడపవోయ్’ శ్రీ ముసునూరి పాడినది విన్నట్టూ గుర్తు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి SeshaKumar KV అభిప్రాయం:
01/03/2015 8:53 am
చాల బాగుంది. గణిత శాస్త్ర సమస్యని సామాన్య చదువరి కి కూడ అర్థమయ్యే లాగ వివరించారు హనుమంత రావు గారు. మరింత తఱచుగా ఇటువంటి వ్యాసాలు అందించమని శ్రీ హనుమంతరావు గారికి మనవి. ట్యూరింగ్ అమెరికా ప్రయాణం గురించిన రాబోయే వ్యాసం కోసం ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే.
గీతులు గురించి Maddali Srinivas అభిప్రాయం:
01/03/2015 6:16 am
మీ పరిశోధన బహు విస్తారముగా మరియు, ఉపయోగకరముగా యున్నది. ఛందస్సును మధించి మీరు వెలికి తీస్తున్నవి నిజానికి రత్నములే. వాటికి సరియగు సార్ధక నామములనుంచుట మరింత శోభస్కరముగానున్నది. ఇటువంటి పరిశోధనలు చందస్సు నేర్చుకుంటున్న వారికి బాగుగా ఉపయోగపడతాయి. అసలు,మన ఛందోశాస్త్రములో ఎన్నో ఛందో రీతులు మొదలే యుండగా వాటిలో మన పూర్వ కవులు కానీ, ప్రస్తుత కవులు కానీ కొన్నే యుపయోగించుటకు గల కారణమేమయ్యుండునో అనే సందేహము కలుగుతున్నది. ముఖ్యముగ గాన యోగ్యమైన గీతులను చాలా మటుకు నిర్లక్ష్యము చేసినారేమో. ద్విపదలలో వ్రాయబడిన రంగనాధ రామాయణము, ఇంకా, తరిగొండ వెంగమాంబ గారి అనేక ద్విపద రచనలు(రాజయోగ రహస్యము), మొదలగునవి, ఈనాదు కనుమఱుగైనాయి. ఈ నా యొక్క ప్రస్తావన కొంత యసందర్భమముగానుండవచ్చు. కానీ, యిచ్చట నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయమేమనిన, ఛందస్సు, ఛందస్సుతోటి పద్య నిర్మాణముపైన జనబాహుళ్యములో నుత్సాహము సన్నగిల్లు తున్న తరుణములో, మీ వంటి విజ్ఞులు చేయుచున్న యిట్టి పరిశోధనలకు ప్రాయోగికమైన లేదా ఔపయుక్తమైన, పరిస్థితి యుండునా యనునదే నా సందేహము. నాకు మాత్రము యీ పరిశోధనా వ్యాసము మంచి స్పూర్తిని కలిగించింది. ధన్యవాదములు మోహన్ రావు గారు!
నిర్ణయం గురించి ప్రసూన రవీంద్రన్ అభిప్రాయం:
01/03/2015 4:01 am
వావ్ మానసా. అద్భుతం అన్న మాట చాలా చిన్నది. ఈ కవిత చదివాక ఎంత గొప్ప అనుభూతి కలిగిందో మాటల్లో చెప్పలేను.
తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత గురించి సూర్య అభిప్రాయం:
01/03/2015 2:32 am
సర్, చాలా క్లియర్ గా తెలుగు యెంత ప్రాచీనమో తెలిపారు. థాంక్స్
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి నారాయణ గరిమెళ్ళ అభిప్రాయం:
01/02/2015 10:47 pm
హనుమంత రావు గారు,
నాకు శస్త్ర-సాంకేతిక-మరియు-వైజ్ఞానిక విషయాలను వ్యాసాలుగా వ్రాసినందుకు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు మరియు వేమూరి వెంకటేశ్వర రావు గారి మీద అమూల్యమైన గౌరవం ఉంది. ఈ మధ్య విష్ణుభొట్ల లక్ష్మన్న గారు కూడా ఇలాంటివి వ్రాస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఎప్పటి నుండో వ్రాయాలని అనుకుంటున్నాను.
ఇప్పుడు మీరు ఇంత బాగా వ్రాస్తుండటము చూసి చాలా సంతోషంగా ఉంది.
ఎంతో ఇష్టంతో ఇంత మంచి ఆర్టికల్ ని తెలుగు భాషలో వ్రాసినందుకు తెలుగు వారందరూ మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తోంది. చాలా సమగ్రమైన వ్యాసం. మీ ఓరిమికి, ఇష్టం కి, విషయములో మీ పట్టు కి చాలా ఆశ్చర్యంగాను ఆనందము గాను ఉంది.
ధన్యవాదాలు,
నారాయణ గరిమెళ్ళ.
ఆర్తి గురించి raghava అభిప్రాయం:
01/02/2015 10:45 pm
ముద్దిస్తే ఏడుపెందుకు…? 🙂
చివరకు మిగిలేది గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:
01/02/2015 5:39 pm
1995 జూలై లో ఇండియా బాపు గారితో కలిసి ప్రయాణం చెయ్యడం జరిగింది. మద్రాసు చేరుకునే ముందు బొంబాయి లో 6 గంటల విరామంలో బాపు గారితో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా తెలిసింది, బుచ్చిబాబు ఆయనకు చిన్నాన్న వరసవుతారని. పట్టలేక అడిగేశాను, ఎప్పటికైనా చివరకు మిగిలేది సినిమాగా వచ్చే అవకాశం ఉందా? అని.
నాకు ఎంతగానో నచ్చిన నవలలోని భావాలను చిత్రీకరించగలిగే సామర్ధ్యం ఆ కళాకారుడికి ఒక్కరికే ఉందని నా నమ్మకం.
చాలా సున్నితంగా చెప్పారు, ‘ఎంతో విస్తృతంగా తీసినా గానీ కనీసం 30 శాతం కూడా న్యాయం చేయలేం, ఎవరినీ మెప్పించడం అసాధ్యం’ అని. సంభాషణలు, సంఘటనలు మాత్రమే చూపించగల సినిమాలో అంతటి భావుకత ఉన్న పాత్రల చిత్రీకరణ చూపించడం, న్యాయం చెయ్యగలగడం ఎంత అసంభవమో వివరించారు. వ్యక్తుల హావభావాలు కూడా గొంతు నుండే రావాల్సిన రేడియో నాటకం గురించి వేరే చెప్పాలా? అక్కడికీ పద్మరాజు గారు చాలా జాగ్రత్త పడ్డారు. దయానిధి, అమృతం, కోమలి పాత్రలు ఫర్వాలేదు కానీ, జగన్నాధం (నండూరి సుబ్బారావు), నారయ్య పాత్రలు ఎంతమాత్రమూ సరిపోలేదు. హైస్కూలు చదువుతున్న జగన్నాధం 60 ఏళ్ళ ముసలాడి లాగాను, పనిమనిషి నారయ్య మాట తీరు సంస్కృత పండితుడి మాటల్లాను ఉన్నాయి.
నవలను పరిచయం చేయడానికి ఈ నాటకం ప్రయత్నమేమో గానీ, అంత పేరున్న నవల గురించి, విన్నవారు ‘ఇంతేనా?’ అని పెదవి విరిచే అవకాశం చాలా ఎక్కువ!
కృష్ణారావు
జాషువా – పిరదౌసి గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
01/02/2015 2:10 pm
వ్యాసం చాలా బాగుంది. జాషువా కవితాత్మను చక్కగా ఆవిష్కరించారు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
01/02/2015 1:53 pm
హనుమంతరావు గారూ:
ఎంతో బాగుంది ఈ వ్యాసం. అతి క్లిష్టమైన విషయాలను అతి సరళంగా చెప్పటం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి!
మొన్ననే ఎలన్ ట్యూరింగ్ జీవిత చరిత్ర ఆధారంగా విడుదలయిన సినిమా “The Imitation Game” చూసాను. చాలా బాగా తీసారు సినిమా. మీ వ్యాసం కూడా ఎన్నో వివరాలతో చాలా చక్కగా ఉంది.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి తఃతః అభిప్రాయం:
01/02/2015 12:22 pm
శ్రీ పరుచూరి: ఒక పాతకాలపు అందాన్ని ఈ సంకలనంతో పంచిపెట్టారు మీరు. చిన్నతనాన విజయవాడ రేడియో స్టేషన్ వరండాల్లో శివరామారావు గారిని చూసిన జ్ఞాపకం.’పడవ నడపవోయ్’ శ్రీ ముసునూరి పాడినది విన్నట్టూ గుర్తు.
నమస్కారాలతో, 2015 శుభాకాంక్షలతో-
తఃతః