మొగుడు పోయినావిడని భాగీరథీ సమానులని రాయడం తెలుగునాట ఉన్న వొక అలవాటు. వచనంగార్ని అలా సంబోధించారు కనక వచనం గారు ఒక మొగుడు పోయిన ఆవిడ అనో దిక్కుమాలినదనో అనుకోవాలా? శివుడు మొగుడైతే గంగని అలా ఎందుకంటారో మరి? అయినా గంగ అన్నా భాగీరథి అన్నా ఒక్కటే కదండీ? రెండూ కలిపేసారు. ఇది కూడా ఈశ్వరానుగ్రహమేనా? 🙂
స్టార్‌బక్స్ లో కథలు అని అనుకుని మీరు వ్రాస్తుంటే ఫరవాలేదు. కాని స్టార్‌బక్స్‌లో ఒక బారిస్టా అనుభవాలుగా వ్రాస్తుంటే మాత్రం, ఒక “స్త్రీ” గానో ఒక “పురుషుడు” గానో వ్రాస్తే బాగుంటుందేమో!
నేనొక పూల మొక్క కడ నిల్చి,
చివాలున కొమ్మ వంచి గోరానెడు నంత లోన
ఎందరొ దివ్య మూర్తులు తటాలున ఎగిరి వచ్చి,
నే కోసి ఇత్తును, నే కురులందుంచుదు, మగువా! నే నీకు మాల కూర్తు
నంచు, నా చుట్టు నర్తించుచు, సంరంభించ;
విభ్రాంతితో నేను:
వీరిలో –
ఏ రూపసి గోరుదు? ఎవ్వానిం జేరుదు? ఎవ్వానితొ భోగింతు?
ఎవ్వని గూడుదు? ఎవ్వని యందు నుందు? సర్వ సమర్ధుండెవ్వడు?
సకలము నాకు సమకూర్చగల వాడెవ్వడని, వితర్కించ;
ఇంతలో,
ఆ కొందరు,
మూడు వేలై, లక్షలై, లక్ష కోటి జనులై, లావణ్య శృంగార ధీర సుకుమార మానవులై,
లాలిత సరస మానసులై, లాహిరి విహారులై, లాఘవముగ పుష్పాపచయమునకు ఉద్యమించ,
నే భ్రమ వీడి;
హా! తెలిసెన్! నా కిపుడు! ఇది అంతయు మాయ రస మయ జగతి
ఇది ‘ఈ మాట!’
తెలుగు సాహిత్యపు తోట; ఇచట స్త్రీ పురుషులు, బహు విధ కావ్య కల్పనలు చేయుదురు;
చదువుదు నేనిట నిత్యము, చదువులలో సారమెల్ల తెలియుదు తండ్రీ! అని నా
Cartier ఘంటముతో, మనో ఫలకము పై లిఖించుకుని,
పత్రిక చదువుట కుపక్రమించి సుఖించితిని.
లైలా.
1. శృంగారం ఒక్కటే రసం. (భోజుడు)
2. శృంగారం పుష్పాలచేత, గాంధర్వంచేత, కావ్యపఠనంచేతా ఉత్తేజితం అవుతుంది అని నాట్యశాస్త్రం చెపుతున్నది.
(అలంకారశాస్త్రచరిత్ర – మహామహోపాధ్యాయ ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు)
వచనానికి ఒక జాబు గురించి okAnokaDu అభిప్రాయం:
03/04/2015 2:59 pm
మొగుడు పోయినావిడని భాగీరథీ సమానులని రాయడం తెలుగునాట ఉన్న వొక అలవాటు. వచనంగార్ని అలా సంబోధించారు కనక వచనం గారు ఒక మొగుడు పోయిన ఆవిడ అనో దిక్కుమాలినదనో అనుకోవాలా? శివుడు మొగుడైతే గంగని అలా ఎందుకంటారో మరి? అయినా గంగ అన్నా భాగీరథి అన్నా ఒక్కటే కదండీ? రెండూ కలిపేసారు. ఇది కూడా ఈశ్వరానుగ్రహమేనా? 🙂
మొత్తం మీద కడుపుబ్బ నవ్వించారు.
వచనానికి ఒక జాబు గురించి sivasankar అభిప్రాయం:
03/04/2015 12:33 pm
వంశీ గారు – మీ వ్యంగ్య రచన చాలా బాగుంది. మీనుంచి మరికొన్ని రచనలు ఈమాటలో ప్రచురించగలరని ఆశిస్తూ ఉన్నాము.
అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ గురించి Rangaiah అభిప్రాయం:
03/04/2015 12:05 pm
పరుచూరి శ్రీనివాస్ గారికి, చాల బాగా ఉందండి ఎస్. వరలక్ష్మి గారి మాటలు అభిప్రాయాలు. మీరు చేసిన సేకరణ మరియూ సంఖ్యికరణం(digitalization)ఎంతో అభినందనీయం.
with Regards.
రంగయ్య.
స్టార్‌బక్స్ కథలు: పచ్చబొట్ల కాఫీ కప్పు గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:
03/03/2015 8:53 am
స్టార్‌బక్స్ లో కథలు అని అనుకుని మీరు వ్రాస్తుంటే ఫరవాలేదు. కాని స్టార్‌బక్స్‌లో ఒక బారిస్టా అనుభవాలుగా వ్రాస్తుంటే మాత్రం, ఒక “స్త్రీ” గానో ఒక “పురుషుడు” గానో వ్రాస్తే బాగుంటుందేమో!
Esperanza is the Spanish word for “హొప్”. 🙂
మహాలయం గురించి S A Rahman. అభిప్రాయం:
03/03/2015 4:16 am
ఒక్క మాటలో చెప్పాలంటే చిన్ని కవిత చాలా ముచ్చటగా ఉంది.
బ్రౌన్ పురస్కారం 2014 గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
03/03/2015 12:12 am
చాలా మంచి నిర్ణయం. శాస్త్రి గారికీ, మీకూ అభినందనలు.
సై కిల్ గురించి lyla yerneni అభిప్రాయం:
03/02/2015 11:11 pm
బాగా రాశారు.
ఇంత భయపడి చచ్చేదాన్ని, రాత్రిపూట మిస్టరీలు ఎందుకు చదువుతానో తెలియదు. ఐనా అవే ఎక్కువ చదువుతాను. -లైలా
నెగడు చుట్టూ నాట్యం గురించి మోహన అభిప్రాయం:
03/02/2015 7:00 pm
బాగుంది! అది నేనే ఇది నేనే అది స్వాహా ఇది స్వాహా జ్ఞాపకము వచ్చినది. – మోహన
నెగడు చుట్టూ నాట్యం గురించి మోహన అభిప్రాయం:
03/02/2015 6:57 pm
నా లయానువాదము –
డడడ్డ డడడం డడడ్డ డడడం – జలోద్ధతగతిః జ/స/జ/స 12 జగతి 1886
పదమ్ము వెనుకన్ – బదమ్ము లెదుటన్
కదమ్ము తరుమన్ – గవించు కటియున్
తధింత దరిలో – తధింత యటులన్
సదీప్త మయెఁగా – శ్రమాంబు కణముల్
డడడిడ్డుం డడడిడ్డుం – అతిమోహా – స/భ/గగ 8 అనుష్టుప్పు 52
ఇగ నీ తీరున వేగ-
మ్మెగయన్, నీకగు నాగన్
సగమందున్, తగు మార్గం
బగునో నీదగు నూహల్
డడ్డం డడ్డం డడాడడ్డం – ద్యోత – మ/ర/గగ 8 అనుష్టుప్పు 17 (క్రొత్త వృత్తము)
చిచ్చుల్ చీకట్లు ద్యోతమ్ముల్
ఎచ్చోటన్ వెల్గు నాల్కల్గా
హెచ్చంగన్ లోననో, లేదా
వెచ్చంగా వెల్పలన్ మండెన్
డడ్డాడ డాడా డడ్డాడ డాడా – దేవేంద్రవజ్ర త/మ/ర/గ 10 పంక్తి 133 (క్రొత్త వృత్తము)
నీవాటగాఁడా – నీ యాట యేమో
నీవెవ్వరో ఆ – నీకేమి యౌనో
నీవగ్నియేనా – నీవింధనమ్మా
ఆవెల్మిడిన్ న-వ్యమ్మైన యాటో
విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి lyla yerneni అభిప్రాయం:
03/02/2015 12:58 pm
In Praise of ‘eemaata’ magazine