పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. శేషు మావయ్య గురించి Krishna Mohan Mochela అభిప్రాయం:

    05/01/2015 5:12 pm

    మంచి కథ మరియు కధనం. I started and continue to read till the end. A good story with good narration and ending is interesting.

  2. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:

    05/01/2015 4:52 pm

    పూర్తిగా ఆకళింపుకీ, స్పందనకీ మరి కొన్ని సార్లు చదవాలి కానీ మీ వ్యాసానికి ముందస్తు జేజేలు పలుకుతున్నాను. ప్రభుత్వ ఆజమాయిషీలో ఎటువంటి భాషా పరిశోధనా సంస్థా నెలకొల్పబడడం కానీ, మీరు సూచిస్తున్న కనీస ప్రమాణాలతో నిర్వహించబడడం కానీ కను చూపు మేరలో జరిగే పని కాదు అని ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయ, సాంస్కతిక, వైజ్ఞానిక, విద్యారంగ, భాషా సాహిత్యాల వాతావరణాలు విహంగ వీక్షణ చేసినా మనకి తెలుస్తుంది. అందు వలన ఆ ప్రయత్నం అమెరికాలోనే జరగాలనీ, ఇక్కడి నిబధ్ధత , అక్కడ ఇంకా అంతరించి పోకుండా అందుబాటు లోనే భాషా శాస్త్ర వేత్తల , పండితుల, గ్రంధాలయాలతో ప్రభుత్వేతర అనుబంధం పెట్టుకుంటేనే తెలుగు అంతర్జాతీయ భాషగా (ఏ నిర్వచనం ప్రకారం అయినా సరే) ప్రయాణం మొదలు పెడుతుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ పేరొందిన విశ్వ విద్యాలయాలలో ఆచార్య పీఠాలు అందుకు దోహదం చేసేవే కానీ దానికి అయ్యే ఖర్చు ఒక పెద్ద అడ్డంకి గా మారుతోంది. అందు వలన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. అందులో మీరు సూచించిన ప్రమాణాలకీ, నిబధ్ధతకీ, దిశా నిర్దేశానికీ , ఆశయ సాధనకీ కట్టుబడి ఉండే “ప్రైవేటు” సంస్థ ఒక ప్రత్యామ్నాయ మార్గం అని నేను అనుకుంటాను. అందులో సమస్యలు, ప్రధానంగా “గ్లేమర్” లేని కారణంగా అతి తక్కువ కాలం లోనే సన్మానాలూ, స్థాయికి దిగజారే పరిస్థితి ఉంది.

    తెలుగు భాష అంతర్జాతీయ భాష అనే “స్లోగన్” అతిగా వినపడుతున్న ఈ రోజుల్లో విశ్వ విద్యాలయాల్లో పరిశోధనా సంస్థల ఆవశ్యకత గురించి మరొక సారి మంచి వ్యాసం అందించారు.

  3. మధ్య వ్యవధిలో నీడలు గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    05/01/2015 3:37 pm

    కథ చాల చాల బాగుంంది. నిజం కదా? బతుకులు పాడయ్యేది, ఎక్కువ సార్లు ఇట్టాగే కదా?

    చిట్టచివర్న ‘హూ కేర్స్’ అనే వాక్యం లేకుంటే బాగుండు. హి కేర్స్. బయటికి చెప్పడు. దానికి ‘మేల్ షువనిజమో’ జస్ట్ అహంకారమో ఏదో అద్దొస్తుందంతే.

  4. ప్రతీక గురించి okAnokaDu అభిప్రాయం:

    05/01/2015 1:38 pm

    సమాజ జీవుల కళ్లజోళ్ళ లోంచి చూసే వారు గుర్తు పట్టగలిగే దంపతుల బొమ్మ. వారి నిజం వారిదీ, వీరి నిజం వీరిదీ

    మొత్తం కధంతా అంత బావోలేదు కానీ ఈ ఒక్క వాక్యం చాలండీ మీ కధ చదవడానికి. LOL.

  5. చేతన చేసిన పని గురించి okAnokaDu అభిప్రాయం:

    05/01/2015 1:27 pm

    అద్భుతం గా మొదలైన కధ చప్పగా ముగించారు శర్మ గారూ!!

  6. ఏం లేదు గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    05/01/2015 1:16 pm

    భలే నడిపించారు ఈ కథను. ఆత్మల్లోకి తొంగి చూశారు. 🙂

    చంద్ర గారూ, ఈమాటలో మీ కథలన్నీ చదివాను. మనసుకు చిన్న విందు, నిన్నా ఇవాళ. కొన్ని కథలు నాకేం చెబుతున్నాయో తెలీ లేదు. అన్ని కథలూ కొత్తగా, కొన్ని గొప్పగా వున్నాయి.

  7. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    04/29/2015 2:36 pm

    లైలాగారు – బాగుంది మీ కామెంటు. పోతే, మీ కామెంటులో గంగ వర్ణచిత్రం వేసారా అన్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక కథ. సైడుట్రాకు కాదుకానీ, ఎందుకు వెయ్యలేదోనని ఒక రెండు ముక్కలు చెప్పాలనిపించి… 🙂

    అసలుగా గంగ మాట వినగానే నాకు శ్రీనాథుడు గుర్తుకొస్తాడు. అవును ఆ కవిసార్వభౌముడే. ఆయన, ఆ మహానుభావుడు, ఆ మహాకవి – హరవిలాసంలో, కిరాతార్జునీయ కథావర్ణనలో (అది దాదాపు చివర్లో వస్తుంది…) ఒకానొక పద్యంలో అర్జునుడు శివుడి నెత్తిన తన ధనస్సుతో ఒక్కటిచ్చినప్పుడు – “కరకు వెండ్రుకలలో బరచు మందాకిని సుకుమార దేహంబు స్రుక్కబారె” అంటూ ఒక అద్భుతమైన, అత్యద్భుతమైన వర్ణనతో రాస్తాడు. ఆ వర్ణన చదివాక, నాకు ఆ గంగానమ్మ, ఆవిడ సుకుమార దేహం సుక్కబారిపోయిన సంగతే గుర్తుకొస్తుంది ఎప్పుడు ఆ వర్ణచిత్రం వెయ్యాలన్నా! దాంతో ఆగిపోటమే! అందువల్ల ఆ చిత్రం ఎప్పుడు వస్తుందో తెలియదు. బహుశా ఎప్పటికీ రాకపోవచ్చును…కానీ కారణం మీకు చెప్పేసాను కాబట్టి ఇప్పుడు గుండెల నిండా ఊపిరి పీల్చుకోవచ్చు..

    భవదీయుడు
    మాగంటి వంశీ

  8. మహాలయం గురించి Rahmanuddin అభిప్రాయం:

    04/29/2015 11:55 am

    నచ్చింది

  9. మహాలయం గురించి చక్రధర్ అభిప్రాయం:

    04/29/2015 10:05 am

    ఖచ్చితంగా ఆ డం డం లని ఎవరూ సాంతం చదవరు. అలా చూసి వదిలేస్తూ కింద కవితని చదువుతారు. 🙂

  10. ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    04/28/2015 1:32 am

    శ్రీ వేలూరి:

    కళ్ళు చుక్క నీరు లేకుండా అయిపోయాయి. సూటిగా స్పష్టం గా రాశారు. మీ వ్యాసం లొ వర్ణించిన సోవియట్ పరిస్థితులలో రష్యన్ గణిత శాస్త్రవేత్తలు ఎంత మహొన్నతమైన పరిశోధనలు చేశారొ చెపుతూ – Melvyn B Nathanson, Notices of American Mathematical Society, Feb 2014 లో – రాసిన ఒక ఆంగ్లవ్యాసాన్ని చదివి కదిలి పోయి ఆ వ్యాసాన్ని కొన్నాళ్ళక్రితం తెనిగించాను. తెనుగుసేత ఆంధ్ర ప్రభ ఎలక్త్రానిక్ దిన పత్రిక లో వచ్చింది. అది ఇప్పుడు వెబ్ లొ దొరకటం లేదు. ఆ వ్యాసం ‘ముందుమాట’ నుంచి కొన్ని వాక్యాలు ఈమాటకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ:

    ‘ఇతరశాస్త్రాల విషయం ఎట్లాఉన్నా గణిత శాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది.గణితశాస్త్ర అధ్యయనం ఒక ఊహాలొక విహరణం . ఈ కారణం గా సాధారణం గా గణిత శాస్త్రజ్ఞులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. అలాగే బాహ్య ప్రపంచం గూడా వీళ్ళను దూరంగా ఉంచుతుంది. అంటే రాజకీయ ఒత్తిళ్ళు గణితశాస్త్ర పరిశోధనల మీద ఉండే అవకాశం చాలా తక్కువ . అయినప్పటికీ ఆనాటి సోవియట్ గణిత శాస్త్ర వేత్తల మీద కూడా రాజకీయం తన భయానక ఆధిపత్యాన్ని చెలాయించింది. వాళ్లు నియంతృత్వ పిశాచపు కోరల్లోనే తమ ఊపిరులు పీల్చుకున్నారు. ఇతర శాస్త్ర అధ్యయనాలతొ పొలిస్తే గణిత శాస్త్ర పఠన పాఠనాలు తమ జీవికకు కనీసావసరాలు కూడా సమకూర్చలేనివని అనుభవమైనా ఆ భయంకరమైన వాతావరణం లోనే కేవలం గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే అలౌకిక ఆనందం మీది ప్రీతి తొ మాత్రమే వాళ్ళు అక్షరాలా అహర్నిశలూ శ్రమించి పరమోత్కృష్ట మైన మేథో నైశిత్యంతో తమ శాస్త్రాధ్యయనాన్ని కొనసాగించారనీ, శాస్త్ర పరిథుల్ని అబ్బుర పరచే రీతి లో విస్తరింప చేశారనీ ఈ వ్యాసం చెబుతుంది. తెలుగు నాట నేటి మన వై జ్ణానికులకూ, ఉన్నత విద్యాలయాల లోని ఉపాధ్యాయులకూ ఈ విషయాన్నిఏమాత్రమైనా ఈ అనువాదం అందజేయగలిగితే అదే పదివేలు.’

    నమస్కారాలతో –
    వాసుదేవ రావు ఎరికలపూడి