పత్రిక స్థాయి పెంచే వ్యాసం అనడం లో సందేహం లేదు. ఎన్నో చక్కని విషయాలను పంచుకొన్నందుకు రచయిత అభినందనీయులు. అంతే గాక: ‘Bounded gap problemని తెలుగులో ఏమంటే స్వయంబోధకంగా ఉంటుందా నేనూ సంపాదకుడూ తర్జనభర్జనలు పడ్డాం. చివరికి సీమితపాత సమస్య అని అన్వయించుకుని సమాధానపడ్డాం. ఇంతకంటే మంచి మాట ఉంటే చెప్పమని పాఠకులని కోరుతున్నాం.’ అని ఒక శాస్త్రీయ దృక్పథం కనబరిచినందుకు కూడా.
‘సీమితపాత సమస్య ‘ అన్న పదబంధం అర్థబోధలో కొత్త సమస్యను సృష్టిస్తుంది. మనకు గణితం లో , ఇదివరకే అనుపాతాలు (proportions) ఉన్నాయి . మామూలు వాడుకలో (పాతము అంటే పడిపోవటానికి సంబంధించిన అర్థం లో) జలపాతం , రక్తపాతం అన్న పదబంధాలు ఉన్నాయి.
ఈ గణిత సందర్భంలో పాతం పొసగడం లేదు , ఎడం / విరామం అన్న పదాలు మెరుగు అలాగే సీమిత అన్న పదం కూడా ముక్కస్య ముక్క అనువాదమే , భావానుగుణంగా నియమిత అని వ్యవహరించడం మేలు.
ఆ ప్రకారం ‘The Bounded Gap Problem ‘ ని ‘నియమిత విరామ సమస్య ‘గా వాడుక చేయవచ్చు.
ఝాంగ్ ఉవాచః
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే పాతము పరిబద్ధమైనది లేదా ‘సీమితము’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ పాతపు విలువ 70,000,000 దాటదు’
అదే పంపిణీ మీద ఈ వాక్యాన్ని తిరగరాస్తే –
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే విరామం నియమితం ’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ విరామం విలువ 70,000,000 దాటదు.
మరి కొన్ని చిల్లర విషయాలు:
1. sexy prime numbers : ఆరు ప్రధాన సంఖ్యలుగా అనువదించుకోవచ్చు. లాటిన్ లో ఆరును sex అంటారు దాని మీద శ్లేష వేసి పుట్టించిన పదం ఇది. పోతే, తెలుగులో ఆరుకు సంఖ్యా పరం కాని అర్థాలున్నాయి : అలరారు, ఇంపారు, ఒప్పారు ఆరుకు శృంగార పరమైన అర్థం కూడా ఉన్నది , కాబట్టి ఆరు ప్రధాన సంఖ్యలు అనడం సులువు ; దీనికి బహువచన రూపం సాధించడం కూడా సులువు : ఆర్లు అంటే సరి. లైంగికాలు అనడం బాగాలేదు ( రా. రా అనువాద సమస్యల్లో దీన్ని గూర్చి పెద్ద చర్చ ఉంది)
2. కచిక (palindrome) ప్రధాన సంఖ్యకి ఒక ఉదాహరణ 700666007. ఇది ఎటు నుండి చదివినా ప్రధాన సంఖ్యే!
మన వికటకవి ని మరచిపోవద్దు ; సరదాగా లకోలకోల ప్రధాన సంఖ్యలు అంటే ఎలా ఉంటుంది ?? జంబీరబీజం , లకోలకోల లాంటి పదాలతో ఒక పద్యం ఉంది తః తః గారికి గుర్తుండవచ్చు . లేదా వీటిని వికట ప్రధాన సంఖ్యలు అనవచ్చు.
3. ఒక ప్రధాన సంఖ్యలో అంకెలని ఒకటీ, ఒకటీ మినహాయించుకుంటూ పోతూన్నప్పుడు మిగిలినది ప్రధాన సంఖ్యే అయితే దానిని మినహాయింపు (deletable) ప్రధాన సంఖ్య అంటారు. ఉదా: 1987. ఎడమ పక్క నుండి వరుసగా 1, 9, 8 మినహాయించగా మిగిలిన 987, 87, 7 ప్రధాన సంఖ్యలు. కానీ , 87 (29×3) ప్రధాన సంఖ్య కాదు కదా , కావున 1997 సరైన సంఖ్య
ఆశ్చర్యం గొలిపే విషయం, గతం లో ఈ గణితవేత్త మీద వచ్చిన ఒక అద్భుత వ్యాసంలో ఇదే తప్పు కనిపించింది నాకు:
“A prime from which you can remove numbers and still have a prime is a deletable prime, such as 1987.”
ఒక ఇరవై ఏళ్ళ క్రిందట ఈనాడులో సైన్సు కాలం కోసం వారిచ్చిన విదేశీ పత్రికనుంచి ఒక వ్యాసం అనువాదం చేసి తప్పులు దిద్దమని చిత్తు ప్రతి పట్టుకొచ్చాడు ఒక స్నేహితుడు .ఇలకోడి అనే పురుగు శృంగార జీవితానికి ప్రధాన సంఖ్యలతో ముడివడి ఉంది అన్న విషయాన్ని చర్చిస్తుంది ఆ వ్యాసం:(ఇటీవల న్యూయార్కర్ లో ఈ విషయం మీద మంచి వ్యాసం వచ్చింది )
తప్పు మీద తప్పు చేస్తూ పోయిన లక్ష్మన్న గారు గుణకారఫలం అనడం విచిత్రంగా తోచింది:
(లబ్ధం అంటే సరిపోదా ?? భాగఫలం అని వినడమే గాని ఈ పదబంధం నేను వినలేదు బహుశ వారు చదువుకునే రోజుల్లో ఉండి ఉంటుంది.)
“పైన ఉదాహరించిన సంఖ్య 175,828,273 ప్రధానసంఖ్యలయిన 17,179 X 10,247 గుణకారఫలం.” “ఈ విషయాన్ని వెలికితెచ్చి, ప్రాధమికసంఖ్యల ఉపయోగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు ముగ్గురు అమెరికన్లు.ఆ ముగ్గురు, MIT లో కంప్యూటర్ సైన్సు విభాగంలో పరిశోధకులయిన Ronald Rivest, Adi Shamir, Leonard Adleman.”
లక్ష్మన్న గారు ఈ చర్చలో పై ముగ్గురిని ఉదహరించి గొప్ప మేలు చేశారు, వీరి పేరు మీద ఉన్నదే అందరికీ తెలిసిన RSA అన్న algorithm: “RSA is an algorithm used by modern computers to encrypt and decrypt messages. It is an asymmetric cryptographic algorithm. Asymmetric means that there are two different keys. This is also called public key cryptography, because one of them can be given to everyone. The other key must be kept private.”
గొప్ప వ్యాసం రాసిన రచయితకు, ప్రచురించిన సంపాదకులకు, అభిప్రాయాలు ఒసగిన పాఠకులకు తిమింగిలమంత లకోలకోల ప్రధాన సంఖ్య కనిపించు గావుత అని ఫలశ్రుతి చెప్పుకొంటూ, సందు చూసుకొని నియమితంగా విరమిస్తాను.
I have been searching for some relationship, either to a village or profession or to something else, to our Inti Peru, which is “Akshantala”. This Inti peru is very commonly found in Kurnool, Anatapur districts and Bangalore -Mysore area. I want to know whether you have any information on this Inti Peru.
వేమూరి గారి కి నామస్కారలు. తెలుగు లొ రాయుటకు software చేప్పగలరు. Mr Laxmanna while reviewing your book says you are not writing now a days. In fact, in country like US, with multi racial social structure, you must have lot of material to make your readers burst with fun. I wrote some time back two ladies of Indian origin(, dau-in-law & motherinlaw) adjusting their lives with other races family (again dau-in law & motherinlaw of other races). This idea came to me while I was watching mixes raced family at NY airport. Pl write at least in ఈమాట.
నా ప్రధాన (అభాజ్య) సంఖ్యల వ్యాసం చదివి స్పందించినవారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు.
ప్రత్యేకించి, లక్ష్మన్న గారికి, శివశంకర్ గారికి, శారద గారికి: మీరు ఇచ్చే ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.
శారద గారికి: అచ్చు తప్పుని ఎత్తి చూపినందుకు మీకు నా ధన్యవాదాలు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అచ్చు తప్పులని జయించలేకపోతున్నాను.
పినాకపాణిగారికి: నా పొరపాటే! “2 ని మినహాయించి మిగిలిన ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలే” అని ఉండాలి.
కామేశ్వరరావు గారికి: gap అంటే పాతము కంటె అంతరం బాగానే ఉండొచ్చు. మరికొన్ని సందర్భాలలో ప్రయత్నించి చూస్తాను.
“ఇలాంటి మాటలకి ఇంగ్లీషు పదాన్ని నేరుగా అనువదించాలా లేదా ఆ పదాల అసలు గుణాల ఆధారంగా తెలుగు చేయాలా అనే ప్రశ్న వేసుకొంటే, రెండో దానికే నా ఓటు.” ఈ విషయంలో మీతో నేను ఏకీభవిస్తాను. ఉదాహరణకి “సెక్సీ” ప్రధాన సంఖ్యలని “లైంగిక” ప్రధాన సంఖ్యలు అనడంలో అర్థం లేదు. వాటికి “షష్ఠ్యంతరములు” అని పేరు పెడితే బాగుంటుందేమో.
వ్యాసం చివర కొంత గణిత పరిభాష, ఒక సమీకరణం వాడవలసి వచ్చింది. నిజమే! ఆ భాగం అందరికీ అర్థం అవుతుందన్న భావనతో రాసింది కాదు.
అద్భుతమైన పరిశోధన సలిపి సోదాహరణముగా శ్రీ గణపవరపు వేంకట కవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో కవితా ప్రవృత్తులను తెలిపారు. చాలా ఆసక్తికరమైన వ్యాసము. వాఙ్మయాభ్యాసము క్లిష్టతరమైనదని అంగీకరించక తప్పదు.
YOUR PROSE IS LIKE POETRY WITH ALL TURNS, RHYMES & sweetness. I am not comparing with Parvatheesam novel or Athadu- Ame but your narration with hum our and tact reminds me them. You are gifted that way. Hope to read more from you.
I wanted to write in Telugu only but I am unable to do today.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:
07/07/2015 12:05 pm

తమ్మినేని యదుకులభూషణ్
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి A R Ramasubramanyam అభిప్రాయం:
07/07/2015 7:54 am
Your article is very interesting and informative.
I have been searching for some relationship, either to a village or profession or to something else, to our Inti Peru, which is “Akshantala”. This Inti peru is very commonly found in Kurnool, Anatapur districts and Bangalore -Mysore area. I want to know whether you have any information on this Inti Peru.
Ramasubramanyam
జనరంజని: మహానటి సావిత్రి గురించి RAJA PRASAD అభిప్రాయం:
07/07/2015 5:33 am
తెలుగు వారి గుండెల్లొ శాశ్వతమైన ముద్ర వేశారు సావిత్రి. అంకితభావం, అమాయకత్వం కలగలసిన నటి ఆమె. THIS GENERATION WILL MISS HER.
నా అమెరికా ప్రయాణం గురించి Madhava Murthy అభిప్రాయం:
07/06/2015 12:55 pm
వేమూరి గారి కి నామస్కారలు. తెలుగు లొ రాయుటకు software చేప్పగలరు. Mr Laxmanna while reviewing your book says you are not writing now a days. In fact, in country like US, with multi racial social structure, you must have lot of material to make your readers burst with fun. I wrote some time back two ladies of Indian origin(, dau-in-law & motherinlaw) adjusting their lives with other races family (again dau-in law & motherinlaw of other races). This idea came to me while I was watching mixes raced family at NY airport. Pl write at least in ఈమాట.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
07/06/2015 11:52 am
నేను పైన ఇచ్చిన ఉదాహరణలో ఒక తప్పు దొర్లింది.
(“పైన ఉదాహరించిన సంఖ్య 175,828,273 ప్రధానసంఖ్యలయిన 17,179 X 10,247 గుణకారఫలం.”)
ప్రధాన సంఖ్య 17,179 బదులుగా 17,159 అని చదువుకోగలరు.
తప్పుకు క్షంతవ్యుడను.
విష్ణుభొట్ల లక్ష్మన్న
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Rao Vemuri అభిప్రాయం:
07/06/2015 10:36 am
నా ప్రధాన (అభాజ్య) సంఖ్యల వ్యాసం చదివి స్పందించినవారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు.
ప్రత్యేకించి, లక్ష్మన్న గారికి, శివశంకర్ గారికి, శారద గారికి: మీరు ఇచ్చే ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.
శారద గారికి: అచ్చు తప్పుని ఎత్తి చూపినందుకు మీకు నా ధన్యవాదాలు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అచ్చు తప్పులని జయించలేకపోతున్నాను.
పినాకపాణిగారికి: నా పొరపాటే! “2 ని మినహాయించి మిగిలిన ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలే” అని ఉండాలి.
కామేశ్వరరావు గారికి: gap అంటే పాతము కంటె అంతరం బాగానే ఉండొచ్చు. మరికొన్ని సందర్భాలలో ప్రయత్నించి చూస్తాను.
“ఇలాంటి మాటలకి ఇంగ్లీషు పదాన్ని నేరుగా అనువదించాలా లేదా ఆ పదాల అసలు గుణాల ఆధారంగా తెలుగు చేయాలా అనే ప్రశ్న వేసుకొంటే, రెండో దానికే నా ఓటు.” ఈ విషయంలో మీతో నేను ఏకీభవిస్తాను. ఉదాహరణకి “సెక్సీ” ప్రధాన సంఖ్యలని “లైంగిక” ప్రధాన సంఖ్యలు అనడంలో అర్థం లేదు. వాటికి “షష్ఠ్యంతరములు” అని పేరు పెడితే బాగుంటుందేమో.
వ్యాసం చివర కొంత గణిత పరిభాష, ఒక సమీకరణం వాడవలసి వచ్చింది. నిజమే! ఆ భాగం అందరికీ అర్థం అవుతుందన్న భావనతో రాసింది కాదు.
అందరికీ నమస్కారం
వేమూరి
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి inndrakanti pinakapani అభిప్రాయం:
07/06/2015 6:00 am
“ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలే.”
2 ప్రధాన సంఖ్య , సరి సంఖ్య కూడా కదండీ !
నా అమెరికా ప్రయాణం గురించి Rao Vemuri అభిప్రాయం:
07/05/2015 10:59 pm
మాధవ మూర్తి గారూ
ధన్యవాదాలు. నా రచనలు చాల వరకు kinige.com లో దొరుకుతాయి. – వేమూరి
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి గన్నవరపు నరసింహ ముర్తి అభిప్రాయం:
07/05/2015 4:20 pm
అద్భుతమైన పరిశోధన సలిపి సోదాహరణముగా శ్రీ గణపవరపు వేంకట కవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో కవితా ప్రవృత్తులను తెలిపారు. చాలా ఆసక్తికరమైన వ్యాసము. వాఙ్మయాభ్యాసము క్లిష్టతరమైనదని అంగీకరించక తప్పదు.
నా అమెరికా ప్రయాణం గురించి Madhava murthy అభిప్రాయం:
07/05/2015 1:08 pm
Dear Vemuri garu,
YOUR PROSE IS LIKE POETRY WITH ALL TURNS, RHYMES & sweetness. I am not comparing with Parvatheesam novel or Athadu- Ame but your narration with hum our and tact reminds me them. You are gifted that way. Hope to read more from you.
I wanted to write in Telugu only but I am unable to do today.
Best wishes
Madhava murthy Sankarabandi