పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    07/19/2015 10:22 am

    శేషకుమార్‌గారూ, ధన్యవాదాలు.

    లైలాగారూ, వాహ్! ఈ వ్యాసానికి మీ వ్యాఖ్యతో కొత్త కాంతి వచ్చింది! ద్రోణుని గురించిన మాటలు ధృష్టద్యుమ్నుడు అన్నట్టుగా భావించడం ఎంతో సముచితంగా ఉంది.

    ఇలాంటి వ్యాఖ్యలు (కిందటి నెల వ్యాసానికి శ్రీనివాస్‌గారి వ్యాఖ్య, ఈ నెల యిదీ) నా చిరుపరిచయాలకు నిండుదనాన్ని యిస్తున్నాయి. ఒప్పుతప్పరయు రసజ్ఞులు, ఊహ తెలియంగల పాఠకోత్తములు దొరకడం ఎంతదృష్టమో!!

  2. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/19/2015 10:02 am

    On a lighter note!

    విష్ణుభొట్ల రామన్న – లక్ష్మన్న గా మేము కవలలం కావటంతో ప్రధాన సంఖ్యలలో కవలలు ఏమిటి అన్న కుతూహలంతో వ్యాసం చదివా! వ్యాసం నాకు బాగా నచ్చింది!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి తః తః అభిప్రాయం:

    07/18/2015 9:11 pm

    ద్రోణుడు ఎందుకు ఇటువంటి తిట్లు తిన్నాడు? ఆయన ఉద్యోగ ధర్మాన్ని ఉల్లంఘించిన కారణంగా. ఆధారం: మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి భారత పురాణోపన్యాసం. ద్రోణుడి దుర్మరణానికి కారణం భీష్ముడు తనకిచ్చిన ‘అపాయింట్ మెంట్ ఆర్డర్’ లోని – ఈ మాట శాస్త్రి గారిదే- ‘అస్త్రవిద్య నేర్పటమే చేయవలె గాని తను ప్రాక్టిస్ చేయగూడదన్న’ నిబంధనను పాటించక పోవటం. బ్రాహ్మణుడు యే విద్యనైనా నేర్వ వచ్చును నేర్పించ వచ్చును గాని అన్ని రకముల విద్యలనూ తను ప్రాక్టిస్ చేయకూడదని భావము. ఈ ఎక్స్ప్లనేషన్ ని ఇక్కడకు ఎక్ స్టెండ్ చేయవచ్చు.

    ఎవరు తిట్టారు? (ఊహ) ఆకాశం నుంచి భూమి మీద జరుగుతున్న యుద్దాన్ని చూస్తున్న వాళ్ళల్లో ఒక ‘పాండవ పక్షపాతి’.

    తః తః

  4. నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి lyla yerneni అభిప్రాయం:

    07/18/2015 5:58 pm

    మొదటి పద్యము తిక్కన ద్రోణ పర్వములో ఉండదగిన పద్యము. ద్రోణ పర్వము పైన థీసీస్ వ్రాసిన పండితులు ‘ఏల్చూరి’ చెప్పగలిగిన పద్యము.

    ద్రోణాచార్యులు ఈ పద్యంలో ఉన్నంత/అన్నంత నిందా వాక్యములు పడవలసిన వాడా అంటే, నాకు కాదనే అనిపిస్తుంది. ఏల్చూరి మురళీధరరావు గురుభక్తి కలవారు. సమస్యా పూరణం సందర్భంగా నైనా, ఒక గురువు పై నిందా పద్యం, తన సొంత మాటలుగా చెప్పరు- అనిపిస్తుంది. ఈ శీర్షిక లోని రెండో పద్యంలో, తన గురువుగారి ముఖ సందర్శనం కొరకేగా వారు గూగులించింది!

    మరి ఎవరు ఇలాటి మాటలు ద్రోణుని గూర్చి అనగలిగిన వారు? ఎప్పుడు అని ఉండవచ్చు? -అని ఆలోచిస్తే, ఈ మాటలు భారతం లోని ఏదో ఒక పాత్ర అన్నవి – అని తోస్తుంది. భారత యుద్ధంలో, ద్రోణుడి సైన్యాధిపత్యంలో, కొన్ని వ్యూహ రచనల తర్వాత నే అయిఉండాలి. ధర్మరాజును కాపాడటానికి, ద్రోణాచార్యుని అదుపు చేయవలసిన అవసరం పాండవులకు ఉన్నది. అది వారికి శక్యం కావటం లేదు. ఐతే, అట్టి సందర్భంలో కూడా పాండవులు తమ గురువును వారి కత్యంత అయిష్టులతో పోల్చరు. అర్జునుడు ద్రోణుడంటే చాలా భక్తి కలవాడు. ధర్మరాజు పాచికల సంగతి ఎత్తడు. భీముడు, కృష్ణుడు -మాట తూలే స్వభావం ఉన్నవారే. వారు వ్యూహాలు పన్ని, మోసాలు చెయ్యటానికి, మొహమాట పడరు. ద్రోణుడిని కడతేర్చటానికి భీముడు -అశ్వత్థామ చనిపోయాడని దొంగ అరుపు తను అరవటమే కాకుండా, ధర్మరాజుతో కూడా ద్రోణుడికి చెప్పించాడు. ఆ ఆలోచన చెప్పింది కృష్ణ భగవానుడేగా. అట్టి వారు ఆ పద్యం లోని తీరుగా ద్రోణుని గురించి ఆలోచించరు. సాత్యకి కూడా ద్రోణుని కించపరిచే ఊహ చేయడు.

    ధర్మరాజు మాటల వలన, తన పుత్రుడు అశ్వత్థామ మరణించినట్టుగా నమ్మి, యుద్ధరంగంలో మారణ కార్యక్రమం చేస్తూనే, మనసులో క్రుంగిపోయి ఉన్న ద్రోణుడితో, అప్పుడు వచ్చిన, -విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతమాది మునులు – బ్రాహ్మణుడికి నీకింత యుద్థం దేనికయ్యా, (పద్యంలో మొదటి వాక్యం) చేసిన వరకూ చాలు, ఇక విడిచి పెట్టెయ్యి. – అన్నారు కాని, ఆ మిగతా దురూక్తులన్నీ వారు పలకరు. ద్రోణుని హీనంగా తలచరు.

    ఒక్క ధృష్టద్యుమ్నుడు మాత్రమే, ద్రోణుని పట్ల చులకన, అగౌరవం, వైరం కలవాడు. ద్రోణుడిని అంతం చెయ్యటానికే జన్మించిన వాడతడు. ఇవి అతని మాటలుగా, వినిపిస్తున్నాయి. మునుల హితవు విని, యుద్ధ విరక్తుడై, ద్రోణుడు తనంత తానుగా, యోగశక్తితో తన ప్రాణం విడిచిపెట్టే ముందు, కడసారిగా దృష్టద్యుమ్నుడిని హింసించినప్పుడు, ఆ పాంచాలుడు ద్రోణుని గురించి ఇలా తలచి ఉండవచ్చు ననిపిస్తున్నది.

    (చదవదలిస్తే, ద్రోణపర్వంలో శివుడిపై చక్కని పద్యాలున్నయ్యి. నాకైతే తిక్కన రచించిన ఆ పద్యాలను మించి, ఈ మధ్యనే, ఏల్చూరి, ఈ పత్రికలోనే, శివుని మీద చెప్పిన పద్యం -అదెంతో బాగుంది.)

    నాలుగు పాదాలు గల సీసపద్యం, నలుగురు వ్యక్తులను గూర్చి చెప్పటానికి చక్కగా సరిపోయింది. విశ్వనాధ సీసపద్యం రాయటంలో అలాటి సదవకాశాలు చిక్కటం తక్కువన్నారు. నాలుగు చరణాలు సమానంగా నడపటం, సరైన పోలికలు కుదరటం కష్టమన్నారు. అది సీసపద్యం లోని దోషమన్నారు. ఆయన ‘కల్పవృక్ష రహస్యాలు’ పుస్తకంలో, ఒక సీసంలో, దశరధుడి ముగ్గురు భార్యల గురించి చెపుతూ, మొదటి రెండు పాదాల్లో, చివరి రెండు పాదాల్లో- సుమిత్రను రెండు, రెండు సార్లు చెప్పి, అలా తాను చెప్పటం, తరవాత కథలో, సుమిత్రకు ‘కవలలు’ కలుగుతారని సూచన అన్నారు. విశ్వనాథ ఏది చెపితే చెల్లుబాటు అవదు కనక! గణిత శాస్త్రజ్ఞులకు లేని సౌలభ్యాలు, సమర్థింపులు కవులకు ఉన్నాయి.

    ఈ వ్యాసము లోని రెండో పద్యము కూడా, కవి ధారాళంగా నోరూరగ చవులు పుట్ట, నుడివినందున నచ్చింది. తమి, తమన్నా, ఆతురతన్ – ఓహో ఎవ్వరీ అతివ!

    కామేశ్వరరావు గారూ, ఈ పద్య పరిచయము కూడా బాగుందండి. దేవకాంతల (సినిమా తారల) వయసు ముప్ఫైలు దాటదనటం – I love it.

    Fans of Oscar Wilde cannot help recalling the words of ‘Lady Bracknell’, from the totally wickedly humorous play ‘The importance of being Earnest’: “Thirty five is a very attractive age. London Society is full of women of the very highest birth who have, of their own free choice, remained thirty five for years.”

    In this Oscar Wilde’s writing, I kid you not, almost every sentence is quotable. And the whole delightful flimsy plot revolves around two men‘s assumed identities and pseudonyms. To watch two handsomest actors -Rupert Everett, Colin Firth, play these roles in a movie is – I have to stop my off track idle babble, before my honorable reliable reasonable editor, cuts me off.

    – Lyla

  5. మొట్టమొదటి సారాకాపు గురించి Rajashekar reddy.c అభిప్రాయం:

    07/18/2015 1:04 pm

    శర్మ గారు కృతజ్ఞతలు.

  6. నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి SeshaKumar KV అభిప్రాయం:

    07/17/2015 8:52 am

    వెదుకడానికి ఇంటర్నెట్ లో ఉపయోగించే search engine, గూగుల్ ను “ఇంచుక్” అనే ప్రత్యయం తో కలిపి “గూగులించు” అనే క్రియని సాధించి పద్యం లో ప్రయోగించడం గమ్మత్తు గా వున్నా, శ్రోతకు వెంటనే బోధ పడదు. (మిగతా పద్యం లో పదాల పోహళింపు భిన్నంగా ఉంది కాబట్టి.) గతంలో వడ్డెర చండీదాస్ గారు తమ నవలలలో “స్నానం” అనే నామవాచకానికి ఇంచుక్ ప్రత్యయం కలుపుతూ “స్నానించి ” అనే క్రియా పదాన్ని విస్తారంగా ఉపయోగిస్తూ, పాపులర్ చేయడానికి ప్రయత్నించారు. పైగా, “స్నానం చేసి” అని వాడనక్కర లేదని కూడా తేల్చేశారు. ఇలాంటి పదప్రయోగాలు తాత్కాలికమే అని చెప్పక తప్పదు.

    ఐతే, పద్యాలు రెండూ బాగున్నాయి. సీస పద్యం ఆణి ముత్యమే. కవి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి, కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించిన శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారికీ అభివందన చందనాలు.

  7. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    07/17/2015 2:40 am

    శ్రీ వేమూరి : మీరు వ్యాసాన్ని సవరించి తిరిగి రాస్తానని అన్నారు. మీ నిబద్ధతకు జోతలు. ఒక మనవి : ఇప్పుడున్న వ్యాసం లో -శాస్త్రానికి సంబంధించిన విషయాలసంగతెలా ఉన్నా – జాంగ్ లెక్కల పరీక్ష లో కాపీ కొట్టినట్లు గా తను చెప్పుకున్నాడన్న విషయాన్ని తొలగించ వలసిన అవసరం ఉన్నదని నేను అనుకుంటుంన్నాను. మీరు సంపాదకులతో కలిసి ఆలోచించండి. నా మాటలు మీకు కర్కశం గా వినపడితే మన్నించండి.
    నమస్కారాల తో
    వాసుదేవ రావు ఎరికలపూడి

  8. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి వాసుదేవ రావు ఎరికలపుడి అభిప్రాయం:

    07/16/2015 3:12 am

    “I am enjoying the mathematicians”

    Dr Yerneni: You are blessed for, academic administrators over the world without exception affirm that mathematicians as a class are cranky. I relished your scintillating notes on Guru Mitchell et al. Your refreshingly original views couched in inconveniently provocative terms do disturb writers and readers of eemaata alike. May your tribe not increase and you remain the one and only one Lyla.

    regards
    Vasudeva

  9. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    07/15/2015 11:45 am

    మాన్యతములు శ్రీమాన్ ఎన్.ఎస్.మూర్తి గారికి
    నమస్కారములతో,

    వాత్సల్యౌదార్యాలు ఉట్టిపడుతున్న మీ ప్రోత్సాహకవాక్యంతో ప్రాణం లేచివచ్చినట్లయింది. మీకు ఆదృత్యాభిమానాలకు ధన్యవాదపరశ్శతం.

    యుష్మన్నిరంతరాశీరభ్యర్థి,
    ఏల్చూరి మురళీధరరావు

  10. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    07/14/2015 5:44 pm

    ధన్యవాదాలు సాంబశివరావు గారూ! నేను 1968-70ల అప్లయిడ్ మాథ్ విద్యార్థిని. మీరు ఫిజిక్స్ విద్యార్థిగా ఉన్న రోజుల్లో మాథమాటికల్ ఫిజిక్స్ గా ఉన్న శాఖ 64 -66లలొ అనుకుంటాను అప్లయిడ్ మాథ్ గా మారి ఫిజిక్స్ నుంచి విడిపోయింది.

    వాసుదేవ రావు ఎరికలపూడి